ఆత్మస్తుతి, పరనిందలతో పాలనా ప్రస్థానాన్ని ప్రారంభించిన టీడీపీ ప్రభుత్వం వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సమాయత్తమైంది.
శాసనసభకు సమర్పించనున్న ఏపీ మంత్రి ప్రత్తిపాటి
సాక్షి, హైదరాబాద్: ఆత్మస్తుతి, పరనిందలతో పాలనా ప్రస్థానాన్ని ప్రారంభించిన టీడీపీ ప్రభుత్వం వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సమాయత్తమైంది. శుక్రవారం ఉదయం 10.10 గంటలకు వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు రాష్ట్ర శాసనసభకు బడ్జెట్‌ప్రసంగ పాఠాన్ని సమర్పించనున్నారు. వాస్తవానికి బుధవారం అసెంబ్లీలో ప్రతిపాదించిన సాధారణ బడ్జెట్‌లో ప్రభుత్వానికి సమస్యగా మారిన రుణమాఫీ మొదలు వ్యవసాయ యాంత్రీకరణ, సుస్థిర వ్యవసాయ పద్ధతుల వరకు అన్ని అంశాలనూ ప్రస్తావించినందున ఈ ప్రత్యేక బడ్జెట్ నుంచి కొత్తగా ఏమీ ఆశించలేమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.