
ఏసీ రూముల్లో కూర్చొని ప్రకటనలా?
హైదరాబాద్ : రైతు రుణమాఫీ గురించి ఏసీ రూముల్లో కూర్చొని ప్రకటన చేస్తే సరిపోదని.. గ్రౌండ్ లెవల్లో పరిస్థితిని చూడాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ప్రభుత్వానికి సూచించారు. రైతులకు బ్యాంకులు నోటీసులు ఇస్తున్నాయని.. అన్నదాతల ఆత్మహత్యలు మొదలయాయ్యని ఆయన శుక్రవారం శాసనమండలిలో ప్రస్తావించారు.
తాను ప్రభుత్వంపై నిందలు వేయడానికి చెప్పడం లేదని.. వాస్తవ పరిస్థితి సభ దృష్టికి తెస్తున్నానని తెలిపారు. దేవుడి కంటే రైతే ఎక్కువ అన్న వ్యవసాయ మంత్రి పుల్లారావు వ్యాఖ్యలను రామచంద్రయ్య ఎద్దేవా చేశారు. ఎద్దు వెనుక కాదు.. శవాల వెనుక ఈ ప్రభుత్వం వస్తుందని ఆయన అన్నారు.