
ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్ ఫలితాలు విడుదల
- విశాఖలో ఏపీ ఎంసెట్ 2016 ఫలితాలు విడుదల
- ఇంజినీరింగ్ ఫలితాలు మాత్రమే విడుదల
- సుప్రీంకోర్టు తీర్పుతో మెడిసిన్ ఫలితాలు నిలిపివేత
- సుప్రీంకోర్టు తీర్పుపై అధ్యయనం చేశాకే మెడిసిన్ ఫలితాలు విడుదల
- విశాఖలో విడుదల చేసిన ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు
విశాఖపట్నం: జేఎన్‌టీయూ కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ ఎంసెట్-2016 ఫలితాలను సోమవారం రాత్రి విడుదల చేశారు. అయితే ఇంజినీరింగ్ ఫలితాలను మాత్రమే విడుదల చేసినట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. 'నీట్'పై సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పు నేపథ్యంలో ఫలితాలు విడుదలలో జాప్యం ఏర్పడినట్టు ఆయన చెప్పారు. సీడీల రూపంలో ఇంజినీరింగ్ ఫలితాలను విడుదల చేశారు. ఇప్పుడు ఇంజినీరింగ్ ఫలితాలను మాత్రమే విడుదల చేస్తున్నామని తెలిపారు. సుప్రీం తీర్పుతో మెడిసిన్ ఫలితాలను నిలిపివేసినట్టు చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పుపై అధ్యయనం చేశాకే మెడిసిన్ ఫలితాలను విడుదల చేస్తామని మంత్రి గంటా తెలిపారు.
ఈ ఫలితాలను ఏయూ వర్సిటీ ప్లాటినం జూబ్లీ హాలులో ఏపీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్, ప్రత్తిపాటి పుల్లారావు విశాఖపట్నంలో విడుదల చేశారు. ఎంసెట్ పరీక్షకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 2,78,392 మంది హాజరుకాగా వారిలో 1,79,642 మంది ఇంజనీరింగ్, 98,750 మంది మెడిసిన్ అభ్యర్థులున్నారు. ఎంసెట్ కమిటీ ముందుగా ప్రకటించిన తేదీ కంటే ఏడు రోజులు ముందే ఫలితాల విడుదలకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
అయితే ఎంసెట్ ఫలితాలు విడుదల చేసిన అరగంటకు విద్యార్థి నమోదు చేసుకున్న సెల్ నంబర్‌కు ర్యాంక్‌ల సమాచారం అందుతుందని ఎంసెట్ చైర్మన్ వి.ఎస్.ఎస్.కుమార్ చెప్పారు. ఎంసెట్ ఫలితాలను www.sakshieducation.com వెబ్‌సైట్ నుంచి తెలుసుకోవచ్చు.