minister kamineni srinivas
-
కమలం కుదేలు
సాక్షి, అమరావతిబ్యూరో : ఆనాటి భారతంలో కర్ణుడి పరిస్థితి ఈనాటి జిల్లా రాజకీయంలో బీజేపీ పరిస్థితి ఒకేలా ఉన్నాయి. నాడు శల్యుని సారథ్యం కర్ణుడిని ఎలా దెబ్బతీసిందో... నేడు టీడీపీ సాగిస్తున్న కోవర్డు ఆపరేషన్ కూడా అలాగే బీజేపీని బలహీనపరుస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉండీ... రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పటికీ నాలుగేళ్లుగా జిల్లాలో బీజేపీ బలోపేతం కాలేకపోతోంది. ఎవరైనా పార్టీని పటిష్టపరుద్దామంటే చాలు వెంటనే బహిష్కరణకు గురవ్వాల్సిందే. అలాంటి పరిస్థితిని సృష్టించడంలో మంత్రి కామినేని శ్రీనివాస్, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుల వరకూ అందరూ తలో చెయ్యి వేస్తున్నారు. టీడీపీ కోవర్టులదే పైచేయి.... సీఎం చంద్రబాబు బీజేపీ చేతితోనే ఆ పార్టీ కన్ను పొడిపిస్తున్నారు. టీడీపీ అనుకూల, వ్యతిరేకవర్గీయులుగా జిల్లాలో బీజేపీ చీలిపోయింది. అందులోనూ టీడీపీ అనుకూల వర్గీయుల మాటే వేదంగా సాగుతోంది. అందుకు ద్విముఖ వ్యూహంతో పావులు కదుపుతోంది. ఓ వైపు బీజేపీకి ప్రభుత్వ పదవుల్లో ఏమాత్రం ప్రాధాన్యం లేకుండా చేసింది. మరోవైపు బీజేపీ బలోపేతం గురించి మాట్లాడే నేతలను పొగబెట్టి పార్టీ నుంచే సాగనంపే వరకు విడిచిపెట్టడంలేదు. అందుకు కొన్ని తార్కాణాలు ఇవిగో... రాష్ట్ర ప్రభుత్వం బీజేపీకి జిల్లాలో చెప్పుకోదగ్గ నామినేటెడ్ పదవులు ఇవ్వనే లేదు. విజయవాడ కనకదుర్గ దేవస్థానం పాలకమండలి చైర్మన్ పదవిని బీజేపీ నేత మాచినేని రంగ ప్రసాద్ ఆశించారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద దేవస్థానం కావడంతో బీజేపీ కూడా పట్టుబట్టింది. అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్న ఎం.వెంకయ్యయనాయుడుకు రంగ ప్రసాద్ సన్నిహితుడు కావడం గమనార్హం. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇస్తామనే చెప్పడంతో చైర్మన్ పదవి వస్తుందని ఆయన ఆశించారు. కానీ చంద్రబాబు టీడీపీ నేత యలమంచిలి గౌరంగబాబును దుర్గగుడి దేవస్థానం చైర్మన్‌గా నియమించడంతో బీజేపీ అవాక్కయ్యింది. విజయవాడలో బీజేపీని బలోపేతం చేద్దామని వాదించి, చర్యలు చేపట్టి నగర పార్టీ అధ్యక్షుడు ఉమమహేశ్వర రాజుకు పరాభవమే మిగిలింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు నుంచి సహకారం లభించకపోవడం గమనార్హం. దీంతో ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు హరిబాబుపై విమర్శలు గుప్పించారు. ఆ వెంటనే ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించారు. అప్పటి నుంచి ఇంతవరకు బీజేపీ నగర శాఖ అధ్యక్షుడినే నియమించకపోవడం విశేషం. తద్వారా నగరంలో బీజేపీ బలోపేతం కాకుండా టీడీపీ అడ్డుకుంది. మరోవైపు బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి పూర్తిగా టీడీపీ అనుకూలుగా ముద్రపడ్డారు. రాష్ట్రంలో ఏకైక ఎంపీపీ పదవి రెండున్నరేళ్లకు ఒప్పందం.... కైకలూరు ఎంపీపీగా బీజేపీ ఎంపీటీసీ సభ్యురాలు బండి సత్యవతి ఎంపికయ్యారు. రాష్ట్రంలోనే బీజేపీకి దక్కిన ఏకైక ఎంపీపీ పదవి అదే. ఆ పదవి కూడా పూర్తి కాలం ఐదేళ్లు ఉండాలని మంత్రి కామినేని కోరుకోకపోవడం విస్మయపరుస్తోంది. రెండున్నరేళ్ల తరువాత టీడీపీకి ఎంపీపీ పదవిని విడిచిపెట్టాలని ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ రాష్ట్రంలో బీజేపీ శ్రేణులు మాత్రం ఎంపీపీ పదవిని ఐదేళ్లపాటు పార్టీకే ఉండాలని గట్టిగా వాదించాయి. అందుకు మద్దతు తెలపాల్సిన మంత్రి కామినేని టీడీపీకి వత్తాసు పలికారు. ఎంపీపీ పదవి నుంచి వైదలగేందుకు తిరస్కరించిన సత్యవతిని పార్టీ నుంచే బహిష్కరించారు. నియోజకవర్గంలో మొదటి నుంచి బీజేపీలో ఉన్నవారిని మంత్రి కామినేని పక్కనపెట్టేశారు. టీడీపీ నుంచి వచ్చినవారికే ప్రాధాన్యం ఇస్తున్నారు. దాదాపు 25 ఏళ్లుగా బీజేపీలో ఉన్న వెంపల్లి విష్ణు రావు, బండి శ్రీనివాస్, లావేటీ వీర శివాజీ తదితరులకు ప్రస్తుతం ఏమాత్రం గుర్తింపు లేదు. కానీ టీడీపీ వర్గీయులుగా ముద్రపడ్డ సామర్ల శివకృష్ణను ఏఎంసీ చైర్మన్‌గా నియమించడం గమనార్హం. మంత్రి కామినేని శల్య సారథ్యం భారతంలో శల్యుని మరిపించేలా మంత్రి కామినేని శ్రీనివాస్ జిల్లాలో బీజేపీ రథాన్ని నడుపుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి అయినప్పటికీ కామినేని శ్రీనివాస్ వ్యవహార శైలి టీడీపీ నేత మాదిరిగా ఉంటోందని ఆ పార్టీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. పార్టీ పటిష్టత, పార్టీ నేతలు, కార్యకర్తలకు పదవుల విషయంలో ఆయన సానుకూలంగా స్పందించడంలేదని పలు ఘటనలు ప్రస్తావిస్తున్నారు. స్వయంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కైకలూరు నియోజకవర్గ కేంద్రంలోని ఎంపీపీ పదవి ఉదాంతాన్నే ఉదహరిస్తున్నారు. -
ఫాతిమా విద్యార్థులకు మరో షాక్
సాక్షి, అమరావతి: ఫాతిమా వైద్యకళాశాల బాధిత విద్యార్థులకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మరో షాక్ ఇచ్చారు. ఇన్నాళ్లూ సీట్లు ఇస్తామని, అందరికీ న్యాయం చేస్తామని, ఆర్డినెన్స్ తెస్తామని, యాజమాన్యం నుంచి డబ్బులు ఇప్పిస్తామని చెప్పిన మంత్రి ఆదివారం తనను కలసిన బాధిత విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఆర్డినెన్స్ గురించి ప్రస్తావించిన విద్యార్థులతో.. నేను ఆర్డినెన్స్ తెస్తాను ఆ తర్వాత మీరు ఆర్ఎంపీ డాక్టర్లవుతారు అంటూ చెప్పేసరికే విద్యార్థులందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇన్నాళ్లూ ఆర్డినెన్స్ తెస్తాం, న్యాయం చేస్తానన్న మంత్రి ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రిని కలసిన అనంతరం బాధిత విద్యార్థులు ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. పదిహేను రోజులుగా ప్రభుత్వం ఫాతిమా విద్యార్థులకు న్యాయం చేయడానికి కేరళ తరహాలోనే ఆర్డినెన్స్ తీసుకొస్తున్నామని చెప్పింది. దీని సంగతి అడగడానికి విజయవాడలోని మంత్రి ఇంటికి బాధిత విద్యార్థులు, కొంతమంది తల్లిదండ్రులు వెళ్లి కలిశారు. ఇక్కడ మంత్రి తమను తీవ్రంగా ఆవేదన చెందేలా మాట్లాడారని వారు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా విమర్శిస్తారని తమపై అసహనం వ్యక్తం చేశారని వాపోయారు. ‘15 రోజుల కిందట వైద్య విద్యాశాఖ ఆర్డినెన్స్‌కు సంబంధించిన డ్రాఫ్ట్‌ను న్యాయశాఖ సలహా కోసమని పంపించారు. దాని సంగతి ఇప్పటికీ అతీగతీ లేదు. తాజాగా మంత్రి కామినేని దీనివల్ల ఉపయోగం లేదని చెబుతున్నారు. పైగా మాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను నిండా ముంచారు’ అని వారు పేర్కొన్నారు. -
మంత్రి కామినేనికి చేదు అనుభవం..
సాక్షి, బుట్టాయగూడెం: బుట్టాయగూడెం ప్రభుత్వాసుపత్రి నూతన భవన ప్రారంభోత్సవానికి హాజరైన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌కు చేదు అనుభవం ఎదురైంది. భవనం ప్రారంభోత్సవం సందర్భంగా స్థల దాత కరాటం చంద్రయ్య, రంగనాయకమ్మల పేర్లు శిలాఫలకంపై పెట్టకపోవడాన్ని నిరసనగా సర్పంచ్ కంగాల పోసిరత్నం, ఆమె భర్త రాము ఆధ్వర్యంలో కొందరు యువకులు భవనం ప్రారంభోత్సవాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో మంత్రి, యువకుల మధ్య తీవ్రమైన వాగ్వివాదం జరిగింది. స్థలదాత పేర్లు పెట్టాలని అప్పటివరకూ ప్రారంభోత్సవం జరగనివ్వమంటూ వారు పట్టుపట్టారు. అయితే కొన్ని నిబంధనలు ఉంటాయని, ఎవరికివారు పేర్లు రాసుకోకూడదని మంత్రి చెప్పారు. దీంతో యువకులు, మంత్రి మధ్య వాగ్వివాదం జరిగింది. తాను ఎంతో కష్టపడి వచ్చానని, తన పర్యటనకు విలువలేకుండా చేశారంటూ మంత్రి కామినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక కుక్క మనిషిని కరిసిందనే కథ చెప్పుకొచ్చారు.. ఒక సమయంలో యువకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ డీఎస్పీ ఎక్కడున్నాడంటూ మంత్రి ఊగిపోయారు. పరిస్థితి తీవ్రతరం దాల్చడంతో బీజేపీ నేత కరాటం రెడ్డినాయుడు యువకులకు సర్ధి చెప్పారు. ఆయన సమన్వయంతో గొడవ సర్ధుమణిగేలా చేయడంతో చివరకు మంత్రి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్, ఐటీడీఏ పీవో ఎమ్ఎన్ హారేంధిర ప్రసాద్, జిల్లా ఆస్పత్రి సేవల సమన్వయ అధికారి డాక్టర్ కె.శంకరరావు, జెడ్పీటీసీ కరాటం సీతాదేవి తదితరులు పాల్గొన్నారు. -
వచ్చారు... వెళ్లారు...
రాష్ట్ర మంత్రి వస్తున్నారంటే... మారుమూల పల్లెవాసుల్లో ఏదో తెలియని ఆశ. ఏమైనా ప్రకటిస్తారేమో... తమ సమస్యలు తీరుస్తారేమో... ఏవైనా వరాలు ఇస్తారేమో... ఇలా ఎవరైనా అనుకుంటారు. కానీ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాత్రం తూతూ మంత్రంగా పర్యటించారు. ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఆస్పత్రుల్లో అసౌకర్యాలను తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి ఏమీ హామీ ఇవ్వలేదు. అనారోగ్యం పాలైనవారి గురించి ఆరా తీస్తారనుకున్నా... అవేమీ ఆయన పర్యటనలో చోటు చేసుకోలేదు. జియ్యమ్మవలస/కురుపాం/గుమ్మలక్ష్మీపురం: ఏజెన్సీలోని ఆస్పత్రులను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ బుధవారం పరిశీలించారు. తొలుత ఆయన జియ్యమ్మవలసలోని పీహెచ్‌సీని పరిశీలించారు. గిరిజనుల ఆరోగ్య స్థితిగతులు తెలుసుకుంటారని అంతా భావించినా ఆయన కేవలం ఆస్పత్రులనే తనిఖీ చేశారు. అసౌకర్యాలపై వాకబు చేశారు కానీ ఏవిధమైన నిర్ణయాన్నీ ప్రకటించలేదు. ఇక్కడి పీహెచ్సీలో సిబ్బంది కొరత ఉందనీ, డాక్టర్ సమయానికి రావట్లేదని సీపీఎం నాయకులు వినతిపత్రాన్ని అందించారు. ఈ తరుణంలో నిడగల్లుగూడ గ్రామానికి చెందిన బిడ్డిక అడ్డయ్య ‘ఓట్లకోసం వస్తారు... కనీసం ఇళ్ల బిల్లులైనా మంజూరుచేయరు’ అంటూ నిష్టూరమాడగా... మంత్రి ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రశ్నలే తమకు వస్తాయనీ... గతం కంటే ఎక్కువగానే ఇచ్చామని ఆయన్ను కసరుకున్నారు. అదే గ్రామానికి చెందిన మండంగి అభిరాం(11 నెలలు) తల్లి మతి స్థిమితం లేక పిల్లవాడిని విడిచిపెట్టేస్తే మండంగి సుమతి, వెంకటరావు దంపతులు ఆ బాబును పెంచుకుంటున్నారు. రోడ్డు పక్కనే ఇల్లు ఉండడంతో వారిదగ్గరకు వెళ్లి బాబుకు అంగన్వాడీ సరుకులు అందుతున్నాయా అని ప్రశ్నించారు. ఎందుకు అనారోగ్యంగా ఉన్నాడని అడిగారు. అయితే ఆయనేమైనా సాయం చేస్తారేమోనని ఆశపడినా ఆయన వారి సమాధానం వినకుండానే వెళ్లిపోయారు. మంత్రి వస్తారని... తమ సమస్యలు చెప్పుకుందామనీ అనుకున్నా... ఆ అవకాశం రాలేదని కిరిగేషు, రావాడ గిరిజనులు తెలిపారు. గిరిజనాభ్యుదయసంఘ అధ్యక్షుడు ఆరిక సింహాచలం మాత్రం గిరిజన గ్రామాల్లోని సమస్యలపై ఓ వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలోనే కురుపాం ఆస్పత్రి దయనీయం రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉన్న 1400 పీహెచ్‌సీల్లో అత్యంత దయనీయమైనది కురుపాం ఆస్పత్రేనని... ఏజెన్సీనుంచి రోగులు బారులు తీరుతున్నా సౌకర్యాలు లేక పోవడం బాధాకరమని మంత్రి వ్యాఖ్యానించారు. కురుపాం సీహెచ్‌సీలో రోగుల వద్దకు వెళ్లి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీసారు. దీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి కేంద్ర మంత్రిగా పనిచేసినా ఈ ఆస్పత్రిని పట్టించుకోకపోవడం శోచనీయమని పరోక్షంగా వైరిచర్ల కిశోర చంద్రదేవ్‌ను ఉద్దేశించి అన్నారు. ఈ ఆస్పత్రిలో అవసరమైన వైద్యులు లేకుండా అనవసరమైన విభాగాలకు వైద్యులు ఉన్నారని తెలిపారు. త్వరలోనే ఆసుపత్రిలో లేబర్‌రూమ్, చిన్నపిల్లల వైద్యులు, గైనిక్ వైద్యులను నియమించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆస్పత్రిలో నలుగురు వైద్యులున్నా షిఫ్ట్ డూటీలతో అత్యవసర సమయాల్లో అందుబాటులో ఉండటంలేదని, వైద్యులకు క్వార్టర్స్ ఉన్నా అందులో ఉండట్లేదని మంత్రికి ఫిర్యాదు చేశారు. వెంటనే ఉన్న ఐటీడీఏ పీఓ లక్ష్మీషాను వారం రోజుల్లోగా ఆస్పత్రి క్వార్టర్స్‌ను సద్వినియోగంలోకి తేవాలని సూచించారు. డాక్టర్ సస్పెన్షన్‌కు ఆదేశం నిరుపయోగంగా ఉన్న క్వార్టర్స్ పునరుద్ధరిస్తే స్థానికంగా ఉంటారా అని మంత్రి కామినేని కురుపాం సీహెచ్‌సీ డాక్టర్ గౌరీశంకరరావును ప్రశ్నించగా తాము ఉండలేమని నేరుగా చెప్పడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి వెంటనే ఆయన్ను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. చిత్తశుద్ధితో పనిచేయకుంటే సెలవుపై వెళ్లి ప్రైవేటు వైద్యం చేసుకోండని హెచ్చరించారు. మలేరియా కేసులు ఎక్కువే... గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరి భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన మంత్రి ఓపీ వివరాలు, మలేరియా కేసులు, ఆస్పత్రిలో సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన భద్రగిరి పీవో కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఏ పరిధిలో సుమారు 83 వేల కేసులు నమోదైతే 250 పాజిటివ్‌గా గుర్తించామనీ, పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో సుమారు 81 వేల కేసులు నమోదవ్వగా 1200 పాజిటివ్‌గా గుర్తించామన్నారు. ఆసుపత్రుల్లో 24 గంటల పాటు రోగులకు వైద్య సేవలందించాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై చర్చిస్తున్నట్లు చెప్పారు. ఏజెన్సీలో 80 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారనీ, దానిని అధిగమించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామనీ చెప్పారు. ఈయన వెంట పార్వతీపురం ఐటీడీఏ పీవో లక్ష్మీషా, డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌వో రవికుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పెద్దింటి జగన్మోహనరావు, పార్వతీపురం ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, కురుపాం బీజేపీ ఇన్చార్జ్ నిమ్మక జయరాజు, మాజి ఎమ్మెల్యే వీ.టి.జనార్థన్థాట్రాజ్ స్థానిక అధికారులు పాల్గొన్నారు. -
మొక్కుబడి పర్యటన!
వచ్చారు.. వెళ్లారు అన్నట్టుసాగిన మంత్రి కామినేని మన్యం టూర్ మారుమూల పీహెచ్‌సీలు, సబ్సెంటర్లను తనిఖీ చేయని వైనం రహదారి పక్క గ్రామాలకే పరిమితం.. మందులు, సిబ్బంది ఖాళీలపై దృష్టిసారించని వైద్య మంత్రి మన్యం పర్యటనకు వైద్యశాఖ మంత్రి వస్తున్నారంటే తమ ఆరోగ్యాలు గురించి పట్టించుకుంటారని ఆశించిన గిరిజనులకు నిరాశే మిగిలింది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఏజెన్సీలో మంగళవారం పర్యటించగా.. అది మొక్కుబడిగానే సాగింది. పర్యటన షెడ్యూల్ మేరకు ఉన్న మారుమూల గ్రామాలను, కొండ ప్రాంతాల్లో కాకుండా కేవలం రహదారి పక్కనున్న గ్రామాలను సందర్శించి మమ అనిపించారు. కుసిమి గ్రామానికి వెళ్లిన మంత్రి మంచినీటి బావిని మాత్రమే పరిశీలించారు. సబ్‌సెంటర్‌ను తనిఖీ చేయలేదు. అక్కడికి కొద్ది దూరంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని సైతం సందర్శించలేదు. ఖాళీగా ఉన్న వైద్య సిబ్బంది పోస్టులు, మందుల గురించి కనీసం ఆరా తీయలేదు. సీతంపేట: మంత్రి కామినేని శ్రీనివాస్ మన్యం పర్యటన మొక్కుబడిగానే సాగింది. గిరిజనులకు అందుతున్న వైద్య సేవలపై కనీసం దృష్టిసారించలేదు. మారుమూలన ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు ఎలా ఉన్నాయి, రోజువారి ఓపీ ఎలా ఉంది, వైద్య సిబ్బంది పనితీరు, ఖాళీలు, మందులు ఉన్నాయా? లేదా అనేది పరిశీలించాల్సి ఉన్నప్పటికీ అవేవి చూడకుండా కొద్ది సేపు అక్కడ ఉన్న గిరిజనులతో మాట్లాడి వెళ్లిపోయారు. హైరిస్క్ గ్రామాలైన దోనుబాయి, మర్రిపాడు ప్రాంతాల్లో పర్యటిస్తే ప్రజా సమస్యలు తెలిసేవి. అలా కాకుండా గ్రామాల్లోని వీధుల్లో తిరిగి.. ఒకరిద్దరు గిరిజనులతో మాట్లాడి పర్యటనను ముగించారనే విమర్శలు స్థానికుల నుంచి వ్యక్తమయ్యాయి. పర్యటన సాగింది ఇలా... మల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను కామినేని సందర్శించి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. తల్లిదండ్రులను వ్యాధుల పట్ల చైతన్యం చేయాలని కోరారు. పాత అలవాట్లకు స్వస్తి పలికి ఇళ్లల్లో దోమలనివారణా మందును స్ప్రేయింగ్ చేయించుకునే విధంగా చూడాలన్నారు. అనంతరం జక్కరవలస గ్రామాన్ని సందర్శించారు. అక్కడ మంచినీటి వసతిసౌకర్యాలు పరిశీలించారు. మండ గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని, వీధులను పరిశీలించారు. కిరప గ్రామానికి వెళ్లి అక్కడ గిరిజనులతో మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని కార్యక్రమాలను మీ కోసం చేస్తుందన్నారు. వైద్యపరమైన సమస్యలు ఉంటే తెలియజేయాలన్నారు. వైద్యాధికారి నరేష్ కుమార్ బాగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. మంచి నీటి సమస్య ఉందని సర్పంచ్ గోపాల్‌తో పాటు పలువురు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం పెదరామ గ్రామానికి మంత్రి వెళ్లగా గ్యాస్ స్టౌలు పంపిణీ చేయలేదని మహిళలు ఫిర్యాదు చేశారు. అలాగే వివిధ సమస్యలను ఎమ్మెల్యే కళావతితో పాటు గిరిజనులు వివరించారు. దేవనాపురంలో మంత్రి పర్యటించినప్పటికీ వైద్య పరమైన విషయాలను ఏం మాట్లాడకుండానే వెళ్లిపోయారు. సీతంపేట సీహెచ్‌సీని సందర్శించిన కామినేని ఎక్స్‌రే మిషన్, జనరేటర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్ఆర్సీ, బర్త్‌వెయిటింగ్ గదిని పరిశీలించారు. అనంతరం రేగులగూడ, వెంపలగూడ, సోమగండి తదితర గ్రామాలను సందర్శించినప్పటికీ ఎలాంటి హామీలు ఇవ్వలేదు. వైద్య సిబ్బంది పనితీరు బాగుందని చెప్పడం స్థానికులను విస్మయం కలిగించింది. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ కె.ధనుంజయరెడ్డి, ఐటీడీఏ పీవో లోతేటి శివశంకర్, ఆర్డీవో గున్నయ్య, ఎంపీపీ ఎస్.లక్ష్మి, జెడ్పీటీసీ సభ్యుడు రాజబాబు, ఎంపీటీసీ సభ్యులు బి.జయలక్ష్మి, బి.దమయంతి, శశికళ సర్పంచ్ విజయకుమారి, మలేరియా నివారణా శాఖ జేడీ ఏడీవీ లక్ష్మి, వైద్యాఆరోగ్యశాఖ జేడీ సావిత్రి, డీఎంహెచ్ ఎస్.తిరుపతిరావు, అదనపు డీఎంహెచ్‌వో మెండ ప్రవీణ్, డిప్యూటీ డీఎంహెచ్‌వో నరేష్కుమార్, ఈఈ అశోక్, డీఈ సింహాచలం, జేఈ రవికుమార్, ఆర్డబ్ల్యూఎస్ డీఈ మల్లికార్జునరా వు, జేఈ మూర్తి, జీసీసీ మేనేజర్ లిల్లీపుష్పనాథం ఉన్నారు. వైద్యులు నిబద్ధతతో పని చేయాలి గిరిజన ప్రాంతాల్లో వైద్యులు నిబద్ధతతో పనిచేయాలని వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో సబ్‌ప్లాన్ మండలాలకు చెందిన వైద్యాధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనజీవనానికి దూరంగా కొండ ప్రాంతాల్లో ఉంటున్న గిరిజనులకు ఎంత సేవైనా చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లోతేటి శివశంకర్ ఆసరా వంటి పథకాలు వినూత్న రీతిలో ప్రవేశపెట్టి ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. ఇటువంటి అధికారి సేవలు వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజనుల్లో కమ్యూనికేషన్ లోపం ఉందని దీని కారణంగా చాపరాయిలో 22 రోజుల్లో 16 మంది మృతి చెందారన్నారు. ఇటువంటి సంఘటనలు ఎక్కడా జరగకూడదనే ఉద్దేశంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ఏజెన్సీ గ్రామాల్లో పర్యటిస్తున్నట్టు చెప్పారు. ఏజెన్సీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న వైద్యాధికారులకు జీతం రూ. 40 వేలు మాత్రమే చెల్లిస్తున్నారని.. దీన్ని పెంచాలని మర్రిపాడు వైద్యాధికారి చంద్రమౌళి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కాంట్రాక్ట్ డాక్టర్లను రెగ్యులర్ చేయాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో ఈఎన్‌వీ నరేష్కుమార్ కోరారు. -
మళ్లీ మెరిసిన అమ్మాయిలు
-
మళ్లీ మెరిసిన అమ్మాయిలు
నీట్–2017 రాష్ట్ర స్థాయి ర్యాంకుల్లోనూ ప్రతిభ... ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ కోసం ఏపీ ర్యాంకులు విడుదల సాక్షి, అమరావతి: జాతీయ స్థాయిలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ కోసం 2017 మే 7న నీట్ ప్రవేశ పరీక్ష జరిగినప్పటి నుంచి రాష్ట్ర స్థాయి ర్యాంకుల కోసం ఎదురు చూసిన ఆంధ్రప్రదేశ్ అభ్యర్థుల ఉత్కంఠకు తెరపడింది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆదివారం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో వైస్‌చాన్స్‌లర్ టి.రవిరాజు, రిజిస్ట్రార్ డా.అప్పలనాయుడుతో కలసి రాష్ట్ర స్థాయి ర్యాంకులు విడుదల చేశారు. 2017–18 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం 65 వేల మంది పైచిలుకు అభ్యర్థులు నీట్ ప్రవేశ పరీక్ష రాయగా, 32,292 మంది అర్హత సాధించారు. అంటే 50 శాతం మంది అర్హత సాధించినట్టు స్పష్టమైంది. జాతీయ స్థాయిలో 14వ ర్యాంకు సాధించిన వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన నర్రెడ్డి మన్వితకు రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు దక్కింది. మన్విత నీట్లో 685 మార్కులు (99.99844 పర్సెంటైల్) సాధించింది. 678 మార్కులతో జాతీయ స్థాయిలో 36వ ర్యాంకు సాధించిన పావులూరి సాయి శ్వేత రాష్ట్ర స్థాయిలో రెండవ ర్యాంకును సొంతం చేసుకుంది. 675 మార్కులు సాధించిన బాలాంత్రపు ఫణిశ్రీ లాస్యకు మూడవ ర్యాంకు దక్కింది. టాప్ టెన్‌లో కూడా ఐదుగురు అమ్మాయిలు ర్యాంకులు దక్కించుకోవడం గమనార్హం. నేడు దరఖాస్తులకు నోటిఫికేషన్ నేడు (సోమవారం) ఎంబీబీఎస్ సీట్ల భర్తీ ప్రక్రియకు సంబంధించి దరఖాస్తుల ఆహ్వానానికి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీ డా.రవిరాజు, రిజిస్ట్రార్ అప్పలనాయుడు విలేకరుల సమావేశంలో తెలిపారు. నోటిఫికేషన్‌ను బట్టి ఆన్లైన్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆ తర్వాత వెబ్ ఆప్షన్లకు తారీఖులు ఇస్తామని, జూలై 4వ వారంలో మొదటి విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో తొలివిడత కౌన్సెలింగ్ జులై 30తో పూర్తి చేసి ఆగస్ట్ 1 నుంచి తరగతులు ప్రారంభిస్తామన్నారు. అనంతరం కౌన్సెలింగ్ ప్రక్రియ సైతం ఆగస్ట్ 30లోగా పూర్తి చేసి సెప్టెంబర్ 1నుంచి తరగతులు ఉంటాయని, ఆ తర్వాత అడ్మిషన్లు జరగవని స్పష్టం చేశారు. ర్యాంకుల్లో స్వల్ప మార్పులు జరగొచ్చు తాజాగా విడుదల చేసిన రాష్ట్ర స్థాయి ర్యాంకులే తుది ర్యాంకులు కావని, కొద్దిగా మార్పులు జరిగే అవకాశమున్నట్టు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికారులు చెప్పారు. ప్రస్తుతానికి ఏపీ నుంచి పరీక్ష రాసిన అభ్యర్థుల వివరాలు మాత్రమే తీసి మార్కుల ఆధారంగా ర్యాంకులు కేటాయించారు. ఇదిలా ఉండగా నాన్లో కల్ కోటా కింద తెలంగాణ అభ్యర్థులెవరికైనా ఇంతకంటే మంచి మార్కులు వచ్చి, ఇక్కడ చేరాలనుకుంటే తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో కొద్దిగా మార్పులు చోటుచేసుకుంటాయి. కాబట్టి కచ్చితమైన ర్యాంకులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తర్వాతే తెలిసే అవకాశమున్నట్టు చెప్పారు. కాగా, తెలంగాణలో సుమారు 44 వేల మందికి పైగా నీట్ ప్రవేశ పరీక్ష రాయగా, 27,075 మంది అర్హత సాధించినట్టు అధికారులు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర స్థాయి ర్యాంకుల జాబితాను ఆ రాష్ట్రానికి సీడీలో పంపినట్లు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికారులు చెప్పారు. నేడు ర్యాంకులు ప్రకటించే అవకాశం ఉంది. -
కొండల్లో ఉండే వారికి రోడ్లు, నీళ్లంటే ఎలా?
- చాపరాయిలో ఎవరూ జ్వరాలతో చనిపోలేదు - కలుషిత నీరు, మూఢనమ్మకాల వల్లే మరణించారు - గిరిజనుల మరణాలపై మంత్రి కామినేని వివాదాస్పద వ్యాఖ్యలు సాక్షి, అమరావతి: కొండల్లో ఉండే వారికి రోడ్లు, నీళ్లు అందించాలంటే ఎలా? అని మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రశ్నించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల మరణాలపై మంగళవారం వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీలోని చాపరాయిలో దాదాపు 60 కుటుంబాలున్నాయి. వారంతా ఎక్కడో కొండల్లో దూరంగా ఉంటున్నారు. వాళ్ల కోసం నీళ్లు, రోడ్లు, కరెంటు.. ఇలా అన్ని వసతులూ అందించాలంటే ఎలా?..’ అని మంత్రి ప్రశ్నించారు. ‘ఆ ఊళ్లో ఎవరూ జ్వరాలతో చనిపోలేదు. ఆవు మృతి చెందడంతో.. ఆ కళేబరం నుంచి వచ్చిన నీళ్లు తాగడం, చేతబడి వంటి మూఢనమ్మకాల వల్లే చనిపోయారు. అంతేగానీ మలేరియా జ్వరాలతో కాదు. ఇప్పటివరకూ ఒక్క మలేరియా కేసు మాత్రమే నమోదైంది..’ అంటూ వివరణ ఇచ్చారు. గిరిజన ప్రాంతాల్లో రొటేషన్ ప్రాతిపదికన వైద్యుల్ని నియమిస్తామని చెప్పుకొచ్చారు. కనీస మౌలిక వసతుల్లేవు.. ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామాల్లో కనీస మౌలి క వసతుల్లేవని, తక్షణమే వారికి తాగునీరు, రోడ్లు, విద్యుత్ సౌకర్యం వంటి సదుపాయా లు కల్పించాల్సిన అవసరముందని సీఎస్ దినేశ్‌కుమార్ పేర్కొన్నారు. గిరిజనుల మర ణాలపై నిర్వహించిన సమీక్షలో సీఎస్ మాట్లాడుతూ.. ఏజెన్సీలో మౌలిక సదుపా యాల కల్పనకు నెలలోగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఇవ్వాలని ఐటీడీఏ పీవోలను ఆదేశించారు. వర్షాకాలంలో అంటువ్యాధులు రాకుండా చర్యలు తీసుకో వాలని, సంచార వైద్యశాలలు, మందులను అందుబాటులో ఉంచాలని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాల కొండయ్య మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతా ల్లోని వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయాల్సి ఉందన్నారు. వివిధ నెట్వర్క్ ఏజెన్సీలతో మాట్లాడి పూర్తి స్థాయి లో నెట్వర్క్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్ చెప్పారు. -
రేపు మంత్రి కామినేని రాక
అనంతపురం అర్బన్ : ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఈ నెల 23న జిల్లాకు విచ్చేస్తున్నారు. ఉదయం 9.45 గంటలకు హిందూపురం చేరుకుని ఎంసీహెచ్ భవనం ప్రారంభిస్తారు. అనంతరం ధర్మవరంలోని ముదిగుబ్బ మండలం మొలకవేములకు మధ్యాహ్నం 1.30 గంటలకు చేరుకుని పీహెచ్సీ భవన నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. సాయంత్రం 4 గంటలకు తాడిమర్రికి చేరుకుని మండలం కేంద్రంలో పీహెచ్‌జీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడి నుంచి బెంగుళూరుకి వెళ్తారు. -
వివాస్పదంగా మారిన మంత్రి కామినేని తీరు
-
వివాదస్పద వ్యాఖ్యలతో దుమారం
ఎస్కేయూ : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఎస్కేయూ పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివాదస్పద వ్యాఖ్యలతో దుమారం చెలరేగింది. ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు తిరుమల రెడ్డి వామపక్ష విద్యార్థి సంఘాలు అస్థిత్వం కోల్పోతున్నాయని వ్యాఖ్యానించడం తీవ్ర చర్చకు దారి తీసింది. అక్కడే ఉన్న వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు వాగ్వాదానికి దిగారు. నేరుగా విద్యార్థి సంఘాల ఎన్నికల్లో వామపక్ష విద్యార్థి సంఘాలు గెలుపొందాయని గట్టిగా నిలదీశారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. ఇటుకలపల్లి సీఐ రాజేంద్ర నాథ్ యాదవ్ కలుగచేసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకవచ్చారు. -
కార్యరూపం దాల్చని మంత్రి కామినేని హామీ
‘నీట్’ రాయాలంటే విజయవాడ వెళ్లాల్సిందే చిత్తూరు :రాయలసీమ పరిధిలోని చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో బైపీసీ చదువుతున్న విద్యార్థులకు తిరుపతిలో నీట్ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఈ ఏడాది ఫిబ్రవరి 20న హామీ ఇచ్చారు. ఈ హామీతో రాయలసీమలోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తిరుపతికి పరీక్ష కేంద్రం వస్తుందని అప్పట్లో ఆశించారు. అయితే ప్రస్తుతం పరీక్షలు సమీపిస్తున్నా తిరుపతిలో పరీక్ష కేంద్రం ఏర్పాటుపై మంత్రి కామినేని నుంచి స్పందన లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘నీట్’కు విద్యార్థులు నమోదు చేసుకున్న వివరాల్లో ఏవైనా తప్పులుంటే సరిదిద్దుకోవాలని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మార్చి 7న నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో తిరుపతి పరీక్ష కేంద్రాన్ని చూపకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తిరుపతిలోనే ఎయిమ్స్, ఏపీపీఎస్సీ, జిప్‌మార్ పరీక్షలు ఎయిమ్స్, ఏపీపీఎస్సీ, జిప్మర్ తదితర పోటీ పరీక్షలు తిరుపతిలో కొంతకాలంగా నిర్వహిస్తున్నారు. నీట్ పరీక్షను మాత్రం తిరుపతిలో నిర్వహించడంలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ‘నీట్’ కేంద్రాలు విజయవాడ, విశాఖపట్నంలలో నిర్వహిస్తే తమ పిల్లలు అంత దూరం వెళ్లి పరీక్షలు ఎలా రాయగలరని తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు. పరీక్ష కేంద్రం మార్పులు, విద్యార్థుల వివరాల పొరపాట్లను వెబ్సైట్లో సరిదిద్దుకునేందుకు ఈ నెల 12వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు అవకాశం ఉందని ‘నీట్’ జాయింట్ సెక్రటరీ నోటిఫికేషన్లో తెలియజేశారు. ఆ గడువు ముగిసేలోగా ఉన్నతాధికారులు స్పందించి తిరుపతిలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. -
ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్!
డాక్టర్ నుంచి మంత్రి వరకు అదే భాష్యం ఈఎన్టీ ఆస్పత్రిలో బాలుడి మృతి వ్యవహారం కేసు నీరుగార్చేందుకు తీవ్ర ప్రయత్నం విశాఖపట్నం : ఆపరేషన్ సక్సెస్.. బట్ పేషెంట్ డెడ్! అన్నట్టుగా ఉంది వైద్యులు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రుల తీరు. ఆపరేషన్ సక్సెస్ అంటే రోగి ప్రాణాలతో బయటపడడం. కానీ విశాఖలోని ఈఎన్టీ ఆస్పత్రి వైద్యులు, వైద్యారోగ్యశాఖ అమాత్యుడు సరికొత్త భాష్యం చెబుతున్నారు. రోగి చనిపోయినా శస్త్రచికిత్స విజయవంతం అయినట్టే! వైద్యుడు ఆపరేషన్ బాగానే చేసినా మత్తు మోతాదు లోపం వల్ల మరణించడం తమకు సంబంధం లేదన్నట్టు తేల్చేస్తున్నారు. విశాఖలోని ప్రభుత్వ ఈఎన్టీ ఆస్పత్రిలో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ వికటించి మూడేళ్ల జయశ్రీకర్ అనే బాలుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. మూడు నెలల క్రితం ఇదే తరహాలో మరో బాలుడు కూడా కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స వికటించి మృత్యువాత పడ్డాడు. ఇలా చిన్నారులు వరుసగా చనిపోతుంటే సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకోకుండా, లోపాలను సరిచేయకుండా సమర్థిస్తూ ప్రకటనలివ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడు నెలల క్రితం ఓ చిన్నారి మరణించినప్పుడే ఉన్నతాధికారులు గాని, మంత్రి గాని సీరియస్‌గా స్పందించి ఉంటే నాలుగు రోజుల క్రితం ఘటన పునరావృతం అయ్యేది కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో జరిగిన ఘటనపై మిన్నకుండి పోవడం వల్లే జయశ్రీకర్ శస్త్రచికిత్సలో బాధ్యతారాహిత్యం మరోసారి చోటుచేసుకుందని అంటున్నారు. బాధ్యులను వెనకేసుకొచ్చిన మంత్రి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ వికటించి జయశ్రీకర్ మృత్యువాత పడిన ఘటనను ‘సాక్షి’లో ప్రముఖంగా ప్రచురించడంతో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ స్పందించి విచారణకు వైద్యుల బృందంతో ఒక కమిటీని వేశారు. మరోవైపు శనివారం వైద్యారోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఈఎన్టీ ఆస్పత్రిని సందర్శించారు. వైద్యులతో బాలుడి మృతికి దారితీసిన పరిస్థితులను ఆరా తీశారు. బాలుడి ఆపరేషన్ సక్సెస్ అయిందని, కానీ గుండె పనిచేయకపోవడం (కార్డియాక్ అరెస్ట్)తో చనిపోయాడని బాధ్యులైన వైద్యులను వెనకేసుకొచ్చారు. శస్త్రచికిత్స కోసం మత్తు మందు ఇచ్చిన వైద్యుని పనితీరుపై పరోక్షంగా అనుమానం వ్యక్తం చేశారు. వైద్యుల తీరు మారకపోతే రాష్ట్రంలోనే తొలిసారిగా విశాఖలో ఏర్పాటైన కాక్లియర్ ఇంప్లాంట్ యూనిట్ రద్దయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇకపై ఈ శస్త్రచికిత్స వికటించి ఒక్క మరణం కూడా సంభవించరాదని స్పష్టం చేశారు. మంత్రి స్పందన చూసిన వారు బాలుడి మృతి కేసును నీరుగార్చడానికేనని వ్యాఖ్యానిస్తున్నారు. ఇలావుండగా ఈఎన్టీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రఘునాథబాబు ఈ నెల 21 వరకు హైదరాబాద్‌లో జరుగుతున్న పరీక్షలకు ఎగ్జామినర్‌గా నియమితులు కావడంతో అక్కడకు వెళ్లారు. ఇన్చార్జి సూపరింటెండెంట్ బాధ్యతలను బాలుడికి శస్త్రచికిత్స చేసిన వైద్యుల్లో ఒకరైన కృష్ణకిశోర్‌కు అప్పగించారు. బాలుడి మృతిపై మంత్రి కామినేని ఆరా పెదవాల్తేరు (విశాఖ తూర్పు) : ఈఎన్టీ ఆసుపత్రిలో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ తరువాత బాలుడు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు ఆరా తీశారు. శనివారం ఆయన ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి బాలుడి మృతికి గల కారణాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోనే ప్రథమంగా ఇక్కడి ఈఎన్టీ ఆసుపత్రిలో కాక్లియర్ ఇంప్లాంట్ యూనిట్ కేంద్ర ప్రభుత్వం నెలకొల్పిందన్నారు. ఇప్పటి వరకు ఈ ఆసుపత్రిలో 13 వరకు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు నిర్వహించారన్నారు. దురదృష్టవశాత్తు మూడు రోజుల క్రితం ఓ బాలుడు సర్జరీ అయిన తరువాత మృతి చెందారన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతుందన్నారు. ఈ ఆస్పత్రిలో మరిన్ని సదుపాయాలను కల్పిస్తామని తెలిపారు. మరో ఇద్దరు ప్రొఫెసర్లు, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లను కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాంట్రాక్ట్ పద్ధతిపై ఆడియో గ్రాఫర్, నర్సర్లు, ఇతర ఖాళీల భర్తీకి చర్యలు చేపడతామన్నారు. ఆసుపత్రి కావాల్సిన ఇతర సదుపాయాల కల్పనకు సుమారు రూ.2 కోట్లను వెచ్చిస్తామని వెల్లడించారు. -
చదివింది ఎలక్ట్రోపతి.. చేసేది అల్లోపతి!
నకిలీ వైద్యుడి లీలలు ఊరుకో పేరు.. ఒక్కొక్క చోట ఒక్కో డిగ్రీ ఆరోగ్య మంత్రితో పరిచయం అందుకే పట్టించుకోని వైద్యాధికారులు సాక్షి ప్రతినిధి, ఏలూరు : డాక్టర్ వేమూరి రాధాకృష్ణ చౌదరి.. డాక్టర్ కృష్ణ చౌదరి.. డాక్టర్ చౌదరి.. ఆయన అసలు పేరు ఏమిటో, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు గానీ.. ఒక్కో చోట ఒక్కో పేరుతో ఆసుపత్రి తెరుస్తుంటారు. ప్రతిచోట అతని పేరు పక్కన ఉండే డిగ్రీ, రిజిస్టర్ నంబర్ మారుతుంటాయి. తన నకిలీ బాగోతం బయటపడగానే మరో పేరుతో మరో చోట ఆసుపత్రి తెరుచుకుంటుంది. జిల్లాలో ఒక నకిలీ వైద్యుడు సాగిస్తున్న భాగోతమిది. ప్రతిచోల ఆసుపత్రి ప్రారంభానికి ప్రముఖులను పిలుస్తుండటంతో అధికారులు కూడా అతని జోలికి వెళ్లడం లేదు. తాజాగా పాలకొల్లులో ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ఏకంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని పిలవడంతో ఆయన పలుకుబడి అర్థమై వైద్యశాఖ అధికారులు ఆతని జోలికి వెళ్లడం లేదు. అతను పూర్తిగా నకిలీ సర్టిఫికెట్లతో వైద్యం చేస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఇతనిపై ఆరోగ్య శాఖ అధికారికి ఫిర్యాదులు అందినా ఇప్పటివరకూ స్పందించిన దాఖలాలు లేవు. నకి’లీలలు’ ఇలా.. ఆయన తాళ్లపూడి, ఆచంట, తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో ఆసుపత్రులు నిర్వహించినపుడు ఎండీ జనరల్ మెడిసిన్‌గా ప్రచారం చేసుకున్నారు. ఇతడు ఎలక్ట్రోపతి (విద్యుత్ ఆధారిత వైద్యం) చదివినట్టు వైద్య వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తాళ్లపూడిలో తాను ఏర్పాటు చేసిన ఆసుపత్రికి అనుబంధంగా ల్యాబ్, మందుల షాపు ఇప్పిస్తానని కొందరి నుంచి సొమ్ములు తీసుకుని మోసం చేయడంతో బాధితులు అతనిపై ఫిర్యాదు చేశారు. తాజాగా పాలకొల్లులో ఎండీ ఆల్టర్నేటివ్ మెడిసిన్‌గా చెప్పుకుంటూ ఆసుపత్రి తెరిచారు. అయితే ఆయన చేస్తున్నదంతా అల్లోపతి (ఇంగ్లిష్) వైద్యం కావడం గమనార్హం. ప్రతిచోట ఆసుపత్రి పెట్టినప్పుడు తనతోపాటు ఒక ఎంబీబీఎస్ చదివిన వైద్యుడి పేరును చేర్చుకుని ఈ దందా నడుపుతున్నారు. ఎవరైనా తనిఖీలకు వస్తే ఎంబీబీఎస్ డాక్టర్‌ను చూపిస్తున్నట్టు సమాచారం. అతని సర్టిఫికెట్లు అన్నీ బోగస్ అనే ప్రచారం ఉంది. ఒక్కోచోట ఒక్కో రిజిస్టర్ నంబర్‌తో చలామణి అవుతున్నారు. ఒకచోట డాక్టర్ చౌదరి పేరుతో.. మరోచోట రాధాకృష్ణచౌదరి, ఇంకోచోట కృష్ణ చౌదరి పేరుతో ఆసుపత్రులు ప్రారంభిస్తున్నట్టు సమాచారం. పాలకొల్లులో డాక్టర్ వేమూరి కృష్ణచౌదరి పేరితో సంపూర్ణ ఆరోగ్య హాస్పిటల్ ప్రారంభించారు. గతంలో ఆచంటలో ఆసుపత్రి నడుపుతుండగా ఆయనపై ఆరోపణలు రావడంతో జిల్లా వైద్యాధికారులు తనిఖీ చేసి ఆసుపత్రిని మూసివేశారుఽ.గత ఏడాది మార్చి 4వ తేదీన పాలకొల్లులో కరూర్ వైశ్యాబ్యాంక్ పక్కన ఒక కాంప్లెక్స్‌ను అద్దెకు తీసుకుని సంపూర్ణ ఆరోగ్య హాస్పిటల్ ఏర్పాటు చేసి సాక్షాత్తు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో ప్రారంభింప చేశారు. డాక్టర్ వేమూరి కృష్ణచౌదరి కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తిగా చెబుతున్నారు. జిల్లా వైద్యాధికారులు ఆచంటలోని ఆసుపత్రిని మూయించి వేసిన తరువాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో.. పాలకొల్లులో సూపర్ స్పెషాలటీ ఆసుపత్రిని నెలకొల్పారని వైద్య వర్గాలు చెబుతున్నాయి. డాక్టర్ వేమూరి కృష్ణచౌదరి ఎండీ, ఈహెచ్, జనరల్ మెడిసిన్ (ఏఎంసీ) రిజిస్టర్ నంబర్ 462గా బోర్డుపై ఆయన ముద్రించారు. ఆసుపత్రి నెలకొల్పే ముందు పాలకొల్లులో ఓ రిటైర్డు ఉద్యోగితో మంతనాలు జరిపి ఆయనతో సుమారు రూ.40 లక్షల వరకు పెట్టుబడి పెట్టించినట్టు భోగట్టా. ఈ ఆసుపత్రి ప్రారంభం అయిన నాటినుంచి ఆసుపత్రిలో అనేక ఘటనలు చోటు చేసుకున్నాయని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. డాక్టర్ వేమూరి కృష్ణచౌదరి వైద్యం కోసం వచ్చిన మహిళలతో పాటు ఆసుపత్రిలో పనిచేసిన నర్సులతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో వారం రోజుల క్రితం వారి కుటుంబ సభ్యులు ఘర్షణకు దిగగా, వారికి సర్ధిచెప్పి పంపినట్టు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. డాక్టర్ వేమూరిని నమ్మి పెట్టుబడి పెట్టిన రిటైర్డు ఉద్యోగి తలపట్టుకుంటున్నట్టు సమాచారం. ప్రస్తుతం సూపర్ స్పెషాలటీ ఆసుపత్రిలో డాక్టర్ వేమూరి తప్ప ఇతర వైద్యులు, ఆధునిక పరికరాలు లేవు. ఆసుపత్రి ఏర్పాటు చేసిన భవనానికి అద్దె నిమిత్తం నెలకు రూ.లక్ష చెల్లించాల్సి ఉంది. నాలుగు నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో భవన యజమాని ఖాళీ చేయాలని చెప్పినట్టు తెలుస్తోంది. డాక్టర్ వేమూరి వైద్య పట్టా నకిలీదని ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో పలుచోట్ల ఇదేవిధంగా ఆసుపత్రులు తెరచి చాలామందిని మోసగించినట్టు పలువురు వైద్యులు, సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఈ విషయమై డీఎంహెచ్‌వో డాక్టర్ కె.కోటేశ్వరి మాత్రం తాము తనిఖీలు నిర్వహించినపుడు ఆయుర్వేదం సర్టిఫికెట్ చూపించారని, అతని ఆసుపత్రిలో ఎంబీబీఎస్ డాక్టర్ ఉండటంతో చర్యలు తీసుకోలేదని చెబుతున్నారు. ఈ వ్యవహారంపై మరోసారి తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అసలు గుట్టువిప్పుతారా లేక మిన్నకుండిపోతారా అనేది చర్చనీయాంశంగా మారింది. -
వైద్యరంగంలో మార్పులు రావాలి
చిన్న ఆవుటపల్లి (గన్నవరం రూరల్) : మెడికల్ గ్రాడ్యుయేట్ల వైద్య సమర్థతను పెంచేందుకు మార్పులు రావాలని మంత్రి కామినేని శ్రీనివాస్ ఆకాంక్షించారు. శనివారం డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆప్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఆప్టిమైజింగ్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ కాంపిటెన్సీ ఎస్ఎస్మెంట్ నేషనల్ సెమినార్ ఒమేగా–16ను ఆయన ప్రారంభించారు. ఈ సెమినార్లో దేశంలోని పలు యూనివర్సిటీలకు చెందిన వైస్ చాన్సలర్లు, ప్రొఫెసర్లు, వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సెమినార్ రికమండేషన్లను ప్రభుత్వానికి పంపాలని కోరారు. ప్రస్తుతం నడుస్తున్న కాంపిటెన్సీ అసెస్మెంట్లో మార్పుల కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఈ సెమినార్ల వల్ల సమర్థమైన వైద్యులు తయారవుతారన్నారు. ప్రభుత్వపరంగా అందరికీ వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆస్పత్రుల్లో ప్రసవాల శాతం నూరు శాతానికి చేరుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో 1400 ఆస్పత్రుల్లో ఉచిత రోగ నిర్ధారణ కేంద్రాలు పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ సెమినార్ల వల్ల వైద్యరంగంలో చేపట్టబోయే నూతన ఆవిష్కరణలకు ఆలోచనలు వస్తాయని, మరిన్ని జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఉదయం నుంచి నిపుణుల ప్రసంగాలు కొనసాగాయి. ప్రొఫెసర్ ఐవీ రావు, రామనారాయణ్, సుధాకర్ నాయక్, సేతు రామన్, అనంత కృష్ణన్, బాల సుబ్రమనియన్, జి.ఈశ్వర్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ రావిరాజ్, కళాశాల డైరెక్టర్ జనరల్ డాక్టర్ సి.నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ మూర్తి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్వీ కృష్ణారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్యశ్రీకి నిధులివ్వకుండా రోగులకు ముప్పుతిప్పలు
-
ఆరోగ్యం హరీ
⇒ పథకం అమలుకు నిధులివ్వకుండా రోగుల ప్రాణాలతో చెలగాటం ⇒ రూ. 910.77 కోట్లు అడిగితే.. బడ్జెట్ కేటాయింపులు రూ.500 కోట్లే ⇒ పాత బకాయిలే రూ. 250 కోట్లు.. మిగిలిన రూ. 250 కోట్లతో ⇒ చికిత్సలు ఎలాగో చెప్పాల్సింది ప్రభుత్వ పెద్దలే ⇒ మొత్తం రూ. 500 కోట్లకుపైగా బకాయిలు చెల్లిస్తేనే సేవలందిస్తాం ⇒ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన నెట్వర్క్ ఆసుపత్రులు ⇒ సర్కారు దగ్గర నిధుల్లేవు.. ఇష్టమైతే చేయండి, లేదంటే మానేయండి: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి స్పష్టీకరణ ⇒ ముఖ్యమంత్రి వద్దే తేల్చుకోవాలని ‘ఆశా’ ప్రతినిధుల నిర్ణయం ⇒ సానుకూల స్పందన రాకుంటే పథకం నుంచి వైదొలగాలని యోచన ⇒ వైద్యసేవ వ్యయంపై సర్కారు పరిమితి.. రోగులకు ముప్పుతిప్పలు సాక్షి, అమరావతి రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పాతరేస్తోంది. పేద రోగుల పాలిట సంజీవని లాంటి పథకాన్ని క్రమంగా కనుమరుగు చేసేందుకు పన్నాగాలు పన్నుతోంది. శంకుస్థాపనలు, శిలాఫలకాలు, ప్రత్యేక విమానాల్లో విదేశీ యాత్రలకు ప్రజల సొమ్మును మంచినీళ్లలా ఖర్చు పెడుతున్న ప్రభుత్వ పెద్దలకు బక్క ప్రాణాల ఆరోగ్యమంటే లెక్కలేకుండా పోతోంది. ఆరోగ్యశ్రీ(ఎన్టీఆర్ వైద్యసేవ) పథకం అమలుకు సరిపడా నిధులివ్వకుండా పేదల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. పథకం అమలుకు రూ.910.77 కోట్లు కావాలని అధికారులు ప్రతిపాదిస్తే ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది అక్షరాలా రూ.500 కోట్లే. బకాయిలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లించకపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రులు రోగులకు వైద్య సేవలందించేందుకు నిరాకరిస్తున్నాయి. ‘మా దగ్గర నిధులు లేవు. మీకు ఇష్టమైతేనే ఆరోగ్యశ్రీ కింద రోగులకు వైద్యం చేయండి. లేదంటే మానెయ్యండి’ అని సాక్షాత్తూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రే తేల్చిచెప్పడం గమనార్హం. ఈ పథకం కింద నిధుల వ్యయంపై ప్రభుత్వం పరిమితి విధించింది. రోగులకు చికిత్సకు అనుమతులు ఇవ్వకుండా జాప్యం చేస్తోంది. సకాలంలో వైద్యం అందక రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఆరోగ్యశ్రీ కేసులు స్వీకరించం... ఎన్టీఆర్ వైద్యసేవ పథకం కింద ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు భారీగా పేరుకుపోయాయి. బకాయిలు చెల్లిస్తేగానీ రోగులకు వైద్య సేవలు అందించలేమని నెట్వర్క్ ఆసుపత్రులు తేల్చిచెప్పాయి. ఈ మేరకు రెండు రోజుల క్రితమే ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి. బకాయిల చెల్లింపులపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో జరిపిన చర్చలు విఫలమయ్యాయని ఆశా(ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్) ప్రతినిధులు పేర్కొన్నారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలుస్తామని, అక్కడో తాడేపేడో తేల్చుకుంటామని వారు మంత్రి కామినేనితో అన్నట్లు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 200 వరకూ ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్‌మెంట్‌లో ఉన్నాయి. మరో 150 వరకూ ప్రభుత్వ హాస్పిటళ్లు ఉన్నాయి. ఈ మొత్తం ఆసుపత్రులకు కలిపి రూ.500 కోట్లకుపైగానే బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్లు సమాచారం. సర్కారు ఆసుపత్రుల్లో వైద్యులు ఇప్పటికే ఆరోగ్యశ్రీ కేసులను స్వీకరించడం లేదు. వారంలోగా బకాయిలను పూర్తిగా చెల్లిస్తేనే ఈ పథకం కింద రోగులకు వైద్యం అందిస్తామని, లేదంటే నిలిపివేస్తామని నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు స్పష్టం చేశాయి. చిన్న చిన్న నర్సింగ్‌హోంలు వ్యాపారం లేక కొద్దో గొప్పో కేసులను స్వీకరిస్తున్నాయి. పెద్ద పెద్ద రోగాలకు చికిత్స చేయాల్సిన ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ కేసులపై ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి రూ.910.77 కోట్లు కావాలంటూ అధికారులు సమర్పించిన బడ్జెట్ ప్రతిపాదన ప్యాకేజీల పెంపునకు మంత్రి విముఖత ‘‘మా దగ్గర నిధులు లేవు. మీకు ఇష్టమైతేనే ఆరోగ్యశ్రీ కింద రోగులకు వైద్యం చేయండి. లేదంటే మానెయ్యండి’’ అని మంత్రి కామినేని శ్రీనివాస్ తేల్చిచెప్పినట్లు ‘ఆశా’ ప్రతినిధులు వెల్లడించారు. కరెంటు బిల్లుల నుంచి సిబ్బంది వేతనాల వరకూ ఆసుపత్రుల నిర్వహణ వ్యయం విపరీతంగా పెరిగిందని, ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద వివిధ చికిత్సలకు ప్రభుత్వం ఇస్తున్న సొమ్ము చాలా తక్కువ ఉందని, 2012లో 12 శాతం పెంచారని, ఆ తర్వాత పెంచలేదని, ఆరోగ్యశ్రీ ప్యాకేజీలు పెంచాలని ప్రతినిధులు కోరగా మంత్రి విముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. వారం రోజుల్లో ముఖ్యమంత్రిని కలిసి పరిస్థితిని వివరించాలని, సానుకూల స్పందన రాకపోతే ఎన్టీఆర్ వైద్యసేవల పథకం నుంచి వైదొలగాలని కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులు నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. రూ.250 కోట్లు సరిపోతాయా? టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్యసేవగా మార్చడంతోపాటు ప్రీమియంను రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు పెంచారు. ప్యాకేజీల్లో 938 జబ్బులు ఉండగా, కొత్తగా మరో 100 చేర్చారు. దీంతో ఆరోగ్యశ్రీ కింద వైద్యం పొందాల్సిన జబ్బుల సంఖ్య 1,038కి చేరింది. దీంతో ఈ పథకానికి ఏటా అదనంగా రూ.200 కోట్లు అవసరం. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం అమలుకు 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.910.77 కోట్లు కావాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బకాయిలు రూ.250 కోట్లు ఉన్నాయి. కానీ, ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రూ.500 కోట్లే కేటాయించింది. పాత బకాయిలు పోను మిగిలింది రూ.250 కోట్లే. ఈ నిధులు ఏ మూలకూ సరిపోని పరిస్థితి. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికే ప్రభుత్వం బడ్జెట్లో సరిపడా నిధులు కేటాయించలేదని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. చికిత్స అందక రోగుల దైన్యం ఆరోగ్యశ్రీ కింద రోగుల నమోదు ప్రక్రియలో వేగం మందగించింది. అధికారులు రకరకాల కొర్రీలతో వేధిస్తున్నారు. 2010 వరకూ ఆరోగ్యశ్రీ పరిధిలో రోజూ 2 వేలకుపైగా శస్త్రచికిత్సలు జరిగేవి. ప్రభుత్వం నిత్యం గరిష్టంగా రూ.3 కోట్లు వ్యయం చేసేది. ప్రస్తుతం రోగుల నమోదు గణనీయంగా పడిపోయింది. రోజుకు 250 మందికి కూడా చికిత్సల కోసం అనుమతులు రావడం లేదు. ఎన్టీఆర్ వైద్యసేవ వెబ్సైట్ ప్రకారం... 2016 అక్టోబర్ 31న చికిత్సలు చేయించుకున్న వారి సంఖ్య 254 మాత్రమే. అంటే ప్రైవేటు, ప్రభుత్వ రంగంలో కలిపి 300 వరకూ నెట్వర్క్ ఆసుపత్రులుండగా.. ఆస్పత్రికొకరు చొప్పున కూడా నమోదు కాలేదంటే పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు. ప్రభుత్వం ఈ పథకం కింద నిధుల వినియోగానికి కోత వేస్తోంది. రోజుకు రూ.70 లక్షలు కూడా ఖర్చు చేయడం లేదు. నిధుల వినియోగంపై ప్రభుత్వం పరిమితి విధించింది. దీంతో రోగులకు వైద్య చికిత్సలకు గాను అనుమతులివ్వడంలో విపరీతమైన జాప్యం జరుగుతోంది. ఎన్టీఆర్ వైద్యసేవ పథకంలో నెలకొన్న పరిణామాలను ట్రస్ట్ సీఈఓ పలుమార్లు ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. క్షతగాత్రులు అర్హులు కాదట! ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద చికిత్స అందక రోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. నరాల (న్యూరో), గుండె జబ్బులు, మూత్రపిండాలు, కాలేయం వంటి జబ్బులకు ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్సలు లేక, నెట్వర్క్ ఆసుపత్రులు స్పందించక రోగులు పడే యాతన అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ప్రమాదాల్లో క్షతగాత్రులుగా మారిన వారి పరిస్థితి మరింత దారుణం. భారతదేశంలో అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్‌లోనే. రాష్ట్రంలో రోజూ 1,400కు పైగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాద బాధితులుఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందడానికి అర్హులు కారని ప్రైవేట్ ఆసుపత్రులు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్సల కోసం నిత్యం 2 వేల మందికిపైగా వస్తుండగా.. వీరిలో కనీసం 300 మందికి కూడా ప్రభుత్వం నుంచి అనుమతులు దక్కడం లేదు. -
సేవకు ప్రతిరూపం నర్సింగ్ వృత్తి
వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ నెల్లూరు(అర్బన్): నర్సింగ్ వృత్తి సేవకు ప్రతిరూపమని రాష్ట్ర వైద్య , ఆరోగ్యశాఖామంత్రి కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. ది ట్రెయిన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(టీఎన్‌ఏఐ) రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నర్సింగ్ సేవలపై తొలి రాష్ట్ర స్థాయి కాన్ఫరెన్స్ స్థానిక అచ్యుత సుబ్రహ్మణ్యం కల్యాణమండపంలో శుక్రవారం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి కామినేని మాట్లాడూతూ డాక్టర్ రోగిని ఐదు నిమిషాలు మాత్రమే పరిశీలిస్తాడన్నారు. తరువాత 24 గంటల పాటు అడ్మిట్ అయిన రోగిని కంటికి రెప్పలా చూడాల్సిన బాధ్యత నర్సులపైనే ఉందన్నారు. నర్సింగ్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వ చర్యల వల్ల 28శాతం ఓపీ పెరిగిందన్నారు.నాణ్యమైన వైద్య సేవలందించేందుకు తాము కృషి చేస్తామన్నారు. నర్సింగ్ అసోసియేషన్ కోసం స్థలం మంజూరు చేసేందుకు సీఎం చంద్రబాబుతో మాట్లాడతానని అసోసియేషన్ నాయకులకు హామీ ఇచ్చారు. ఈ సభలో నర్సింగ్ సేవలకు సంబందించిన సావనీర్‌ను ఆవిష్కరించారు. అనంతరం నర్సింగ్ సేవలు, సమస్యలు గురించి వక్తలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌ఏఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వలి, డా.ఇందిర, నర్సింగ్ డెప్యూటీ డైరెక్టర్ వేదమణి, రిజిస్ట్రార్ రోజారాణి, డీఎం అండ్ హెచ్ఓ డా.వరసుందరం, బీపేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి, నిర్వాహకులు ప్రభుదాస్, పద్మావతి, ఝాన్సిలక్ష్మీబాయి, మాధురి, సుశీల, బొల్లినేని, నారాయణ, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. రొట్టెల పండుగ ఏర్పాట్ల పరిశీలన అనంతరం మంత్రి శ్రీనివాస్ బారాషహీద్ దర్గా వద్ద జరుగుతున్న రొట్టెల పండుగ ఏర్పాట్లను పరిశీలించారు. కార్పొరేషన్, రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూ.6 కోట్లతో అభివృద్ధి పనులు జరగడం సంతోషకరమన్నారు. కేంద్రం నుంచి మంత్రి వెంకయ్యనాయుడు ఇక్కడి అభివృద్ది పనులకు నిధులు విడుదల చేయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. -
'డెంగ్యూ, మలేరియాపై అప్రమత్తత అవసరం'
- రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ - అర్బన్ ప్రాంతాల్లో ప్రచార వాహనాలు ప్రారంభం విజయవాడ (లబ్బీ పేట) : రాష్ట్రంలో ప్రజలకు డెంగ్యూ, మలేరియా వ్యాధులపై పూర్తి అవగాహన కలిగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. అందులో భాగంగా ప్రజలు చేయాల్సిన, చెయ్యకూడని చర్యలను తెలిపేందుకు క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని అర్బన్ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు ప్రవేశపెట్టిన ప్రచార వాహనాలను మంత్రి కామినేని శ్రీనివాస్ నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో 242 వాహనాలు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తాయన్నారు. ప్రతి లక్ష మంది జనాభాకు ఒక వాహనం చొప్పున ఏర్పాటు చేశామని ప్రకటించారు. అందులో భాగంగా కృష్ణా జిల్లాలో 22 వాహనాలను కేటాయించామని, వాటిలో విజయవాడ పరిధిలో 14, ఇతర పట్టణాల్లో 8 పర్యటిస్తాయని తెలిపారు. రక్తంలో ప్లేట్లెట్స్ తగ్గిన కేసులను డెంగ్యూగా ప్రచారం చేస్తున్నారని, అది సరికాదని పేర్కొన్నారు. డెంగ్యూ లక్షణాలతో ఉన్న రోగులకు సరైన చికిత్స అందించి నయం చేయొచ్చన్నారు. జిల్లాలో 102 కేసులు నమోదవగా, విజయవాడలో 26, మచిలీపట్నంలో 15 మందిని గుర్తించి చికిత్స చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో అవగాహన కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించామని పేర్కొన్నారు. ప్రయివేటు ఆస్పత్రిల్లో డెంగ్యూ లక్షణాలతో చేరిన రోగుల వివరాలు ప్రభుత్వాస్పత్రికి తప్పనిసరిగా తెలపాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రుల్లో ఎలీజ టెస్ట్‌లు నిర్వహిస్తున్నామన్నారు. తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మేయర్ కోనేరు శ్రీధర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఆర్.నాగమల్లేశ్వరి, అదనపు డీఎం అండ్ హెచ్‌వొ డాక్టర్ టీవీఎస్ఎన్ శాస్త్రి పాల్గొన్నారు. -
పోలీసులకు కామినేని ప్రశంసలు
విజయవాడ: పాత ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు కిడ్నాప్ కేసును పోలీసులు 36 గంటల్లో ఛేదించారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. ఆయన శనివారం ఆస్పత్రిని సందర్శించారు. అనంతరం కామినేని మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. తల్లి ఒడికి చేరిన బాబు ఆరోగ్యం బాగానే ఉందన్నారు. ఈ కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని కామినేని స్పష్టం చేశారు. కిడ్నాప్ ఘటనలో ఆస్పత్రి సిబ్బంది ప్రమేయం ఉంటే వారిని ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగిస్తామని చెప్పారు. కేసు ఛేదనలో పోలీసుల పాత్ర అమోఘమని మంత్రి ప్రశంసించారు. అన్ని ప్రభుత్ ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. మరోవైపు విజయవాడ సీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ శిశువు కిడ్నాప్ కేసులో అనేక ఆరోపణలు వస్తున్నాయని, పూర్తిస్థాయిలో విచారణ చేపట్టామన్నారు. డబ్బులకు బాబును అమ్మారన్న కోణంలో కూడా విచారణ జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కేసులో ప్రజలు తమకు పూర్తిగా సహకరించారని సీపీ పేర్కొన్నారు. చదవండి.... (బెజవాడ శిశువు మిస్సింగ్ కథ సుఖాంతం) -
గొల్లపూడిలో ఆరోగ్య శాఖ కార్యాలయాలు ప్రారంభం
విజయవాడ: గొల్లపూడిలోని వైద్య, ఆరోగ్య శాఖ హెచ్ఓడీ కార్యాలయాలను ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో బాలుడి అపహరణ ఘటన దురదృష్టకరమన్నారు. శిశువు ఆచూకీ కోసం 6 బృందాలు గాలింపు చేపట్టాయని తెలిపారు. ఈ ఘటనలో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఉందని తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆసుపత్రిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఇప్పటికే టెండర్లు పిలిచామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆర్ఎఫ్డీ విధానం అమలులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. తల్లి, శిశువుకు ప్రత్యేక ట్యాగ్లు ఇస్తామన్నారు, దీనివల్ల తల్లి కాకుండా ఎవరైనా శిశువును తీసుకెళ్తే అలారం మోగేలా వ్యవస్థను ప్రవేశపెడతున్నామన్నారు. -
మంత్రి బాబు భజన తప్ప ఏమి చేయరు
-
అమరావతికి ఎయిర్ అంబులెన్స్ సేవలు
కేంద్రానికి మంత్రి కామినేని వినతి సాక్షి, న్యూఢిల్లీ: ఎయిర్ అంబులెన్స్ సేవలను రాష్ట్ర కొత్త రాజధాని అమరావతి పరిధిలో అందుబాటులోకి తేవాలని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కేంద్రప్రభుత్వాన్ని కోరారు. ఆయన బుధవారం ఢిల్లీలో కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజుతో సమావేశమై ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. రైల్వేశాఖ కృష్ణా పుష్కరాలకు ప్రాధాన్యమివ్వాలని ఆయన కేంద్ర రైల్వేమంత్రి సురేశ్ ప్రభును కలసి విన్నవించారు. వివిధ రాష్ట్రాల నుంచి కృష్ణా పుష్కరాలకొచ్చే భక్తులు, యాత్రికుల సౌకర్యార్థం ఏపీ ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనల్ని గుర్తుచేశారు. ధర్మవరంలో నిర్మించిన రైల్వే ఫ్లైఓవర్ ప్రారంభానికి రావాలంటూ సురేశ్‌ప్రభును ఆహ్వానించారు. కొవ్వూరు-భద్రాచలం రైల్వేలైన్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. ఏపీనుంచి రాజ్యసభకు ఎన్నికైనందున ఎంపీలాడ్స్ నిధులనుంచి 13 జిల్లాలకు అంబులెన్స్‌లను ఏర్పాటు చేస్తానని రైల్వేమంత్రి హామీ ఇచ్చారని శ్రీనివాస్ తెలిపారు. -
ప్రభుత్వ వైద్యులకు మంత్రి హెచ్చరిక
ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసు చేయడం మానకపోతే తీవ్ర చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ హెచ్చరించారు. వారికి మొదటి హెచ్చరికగా మూడు ఇంక్రిమెంట్లు కోత విధిస్తామని, అప్పటికీ పద్ధతి మార్చుకోకపోతే ఉద్యోగాల నుంచి తొలగింపు కూడా తప్పదని ఆయన అన్నారు. ఇక వైద్య ఆరోగ్యశాఖలో బదిలీలకు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. కౌన్సెలింగ్‌కు ఈనెల 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. -
‘అనంత’ను పారిశ్రామిక వాడగా మారుస్తాం
అనంతపురం అర్బన్: ‘అనంత’ని పారిశ్రామిక వాడగా మారుస్తామని జిల్లా ఇన్చార్జి మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి పేర్కొన్నారు. నవ నిర్మాణ దీక్షలో భాగంగా సోమవారం స్థానిక వైద్య కళాశాల ఆడిటోరియంలో పారిశ్రామిక, సేవారంగంలో ప్రగతి- భవిష్యత్ ప్రణాళిక అంశంపై సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రులు కామినేని శ్రీనివాస్, పల్లెరఘునాథ్‌రెడ్డిలు మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా 1400 డాక్టర్ పోస్టుల భర్తీ చేశామన్నారు. జిల్లాను పారిశ్రామిక వాడగా తీర్చిదిద్ధేందుకు చర్యలు ప్రారంభమయ్యాయన్నారు. ఇప్పటికే కస్టమ్స్ అండ్ ఎక్సైజ్, బెల్, ఎయిర్‌బస్, రాగమయూరి, తదితర కంపెనీలు జిల్లాలో పరిశ్రమలు స్థాపిస్తునాయన్నారు. ఇందుకు అవసరమైన భూమిని కేటాయించామన్నారు. రూ.150 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు కానుందన్నారు. ఆర్థిక, సామాజిక, పారిశ్రామికంగా ఎదగాలంటే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలన్నారు. సదస్సులో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, జడ్పీ చైర్మన్ చమన్, మేయర్ స్వరూప, కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ రాజశేఖర్‌బాబు, జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతం, తదితరులు పాల్గొన్నారు. -
పేలవంగా హార్టీకల్చర్ షో
► భారీగా స్టాల్స్ అద్దెలు... సౌకర్యాలు నిల్ ► కానరాని ఇంటర్నేషనల్ సంస్థలు ► కేవలం ఐదు రాష్ట్రాల నుంచే ఎగ్జిబిటర్ల రాక విజయవాడ: లయోలా కళాశాలలో ఏర్పాటైన ఉద్యానవన ఎగ్జిబిషన్లో స్టాల్స్ అద్దెలు ఎక్కడా లేనంత భారీగా వసూలు చేశారు. మూడు రోజులు నిర్వహించిన ఎగ్జిబిషన్లో స్టాల్స్ ఏర్పాటు చేసుకునేందుకు సౌకర్యాలు ఏర్పాటు చేయటంలో నిర్వాహకులు పూర్తిగా విఫలమయ్యారు. దాంతో ప్రభుత్వం ఆర్బాటంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి ఉద్యానవన ఉత్పత్తుల మామిడి ప్రదర్శన పేలవంగా కొనసాగింది. సీఎం చంద్రబాబు ఈ ఎగ్జిబిషన్‌ను సోమవారం ప్రారంభించారు. ప్రారంభోత్సవం నాడు 300 మంది మాత్రమే హాజరయ్యారు. మంగళవారం సందర్శకులు నామమాత్రంగానే వచ్చారు. ఎగ్జిబిషన్ నిర్వహణను కేంద్ర ప్రభుత్వ రంగసంస్థ అయిన (సీఐఐ) కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్‌కి అప్పగించి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది. స్టాల్స్ నిర్వాహకులకు సీఐఐ సరైన ఏర్పాట్లు చేయలేకపోయింది. భారీగా అద్దెలు మాత్రం వసూలు చేశారని పలువురు ఫిర్యాదు చేశారు. ఏసీ స్టాల్స్‌కు రూ.45వేలు అద్దె వసూలు చేశారు. దాదాపు 150 ఏసీ స్టాల్స్ ద్వారా రూ.65.50 లక్షల అద్దె వసూలు చేశారు. అదే విధంగా సాధారణ స్టాల్స్ 50 ఏర్పాటు చేశారు. వీటికి ఒక్కొకదానికి రూ.20వేల చొప్పున అద్దె వసూలు చేశారు. మొదటి రోజు ఏసీ స్టాల్స్‌లో ఏసీలు పని చేయలేదు. స్టాల్స్ యజమానులకు, సిబ్బందికి భోజన వసతి, లావెట్రీలు కూడా ఏర్పాటు చేయలేదు. దాంతో స్టాల్స్ నిర్వాహకులు, సందర్శకులు, రైతులు నానా అగచాట్లు పడ్డారు. హైదరాబాద్ హైటెక్‌లో జరిగే ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్లో విజయవాడ కంటే తక్కువగా స్టాల్‌కు రూ.30వేల మాత్ర మే అద్దె వసూలు చేసేవారని వివిధ కంపెనీల నిర్వాహకులు చెబుతున్నారు. బెంగళూరులో జరిగే ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్లో కూడా స్టాల్‌కు రూ.32 వేలు అద్దె తీసుకున్నారని, ఇక్కడ భారీగా వ సూలు చేశారని వాపోయారు. మహా రాష్ట్ర, ఢిల్లీ, హార్యానా, గుజరాత్, తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వ్యవసాయ పరికరాలు తయారు చేసే కంపెనీలు స్టాల్స్ ఏర్పాటు చేశాయి. వీటిలో అధికంగా మన రాష్ట్రానికి చెందిన వారే ఉన్నారు. డ్రిప్ ఇరిగేషన్, రెయిన్‌గన్స్, ప్లాస్టిక్ షీట్స్, పాలీహౌస్ తదితరాలు తయారు చేసే కంపెనీలు తమ వస్తువులను ప్రదర్శించాయి. అంతర్జాతీయ స్థాయిలో కంపెనీల సామగ్రి రాకపోవటంతో రైతులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొరియా, జపాన్, తైవాన్, చైనా తదితర దేశాల కంపెనీల వస్తువులు ఇక్కడ ప్రదర్శిస్తే బాగుండేదని రైతులు పేర్కొన్నారు. ఆర్గానిక్ పంటలపై దృష్టి సారించండి గుణదల : ఉద్యాన పంటలు పడించే రైతులు ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా మెరుగైన దిగుబడులు సాధించడంతోపాటు ఆరోగ్యవంతమైన పంటలను అందించిన వారవుతారని రాష్ర్ట వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. బుధవారం మామిడి ప్రదర్శన ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రైతులు నూతన విధానాలను అందిపుచ్చుకుని మెరుగైన ఫలితాలు సాధించాలని పేర్కొన్నారు. రాష్ర్టంలోని అన్ని ప్రాంతాల్లో ఫుడ్ ఫ్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వ్యవసాయ, ఉద్యానశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని మరింత వృద్ధిలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని, దేశంలోనే ఉద్యాన పంటల సాగులో బొప్పాయి, మిరప, ఆయిల్ ఫామ్ మొదటి స్థానంలో ఉన్నాయని, మామిడి, టమాట పంటలు రెండో స్థానంలో ఉన్నాయని, అన్ని రకాల ఉద్యాన పంటల్లో దేశంలో మొదటి స్థానం సాధించటానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మామిడి మేళాలో ప్రదరించిన రైతులకు అవార్డు, సర్టిఫికెట్, రూ.5 వేల నగదు బహుమతులను అందించారు. -
రేపు ఎంసెట్ మెడికల్ ఫలితాలు
హైదరాబాద్ : ఏపీ ఎంసెట్ మెడికల్ ఎంట్రెన్స్ ఫలితాలను శనివారం విడుదల చేయనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. నీట్ వాయిదా వేయడంతో ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదలకు మార్గం సులబం కావడంతో రేపు ఫలితాలను విడుదల చేయనున్నారు. విజయవాడలో ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫలితాలను విడుదల చేస్తారని ఆయన తెలిపారు. -
మంత్రి కామినేని... రాజీనామా చేసి గెలువు
వైఎస్సార్ సీపీ నేత డీఎన్నార్ సవాల్ కైకలూరు : కైకలూరు బీజేపీ ఎమ్మెల్యే, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేసి తనపై పోటీ చేయాలని కైకలూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్ ) సవాల్ విసిరారు. కామినేని గెలిస్తే తాను ఇక రాజకీయాల్లో ఉండనన్నారు. నియోజకవర్గ ప్రజలు నీటి కోసం అల్లాడుతుంటే ఆందోళన చేసినందుకు తనపై మంత్రి చేసినవిమర్శలకు స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం గురువారం నిర్వహించారు. స్వప్రయోజనాల కోసం తాను షాపింగ్ కాంప్లెక్సు కడుతున్నానని విమర్శిస్తూ, తాను రాజకీయాలు చేస్తే పరిస్థితి వేరుగా ఉంటుందని మంత్రి బెదిరింపు దోరణిలో వ్యవహరించారన్నారు. ఇది ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. మంత్రి నియోజకవర్గంలోని చింతపాడు కొల్లేటి గ్రామ ప్రజలను సమీప సరిహద్దు పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇబ్బంది పెడుతుంటే మౌనం వహించడం వెనుక మత లబేంటనీ ప్రశ్నించారు. మంత్రి బెదిరింపులకు భయపడేవారెవరూ లేరని ఘటుగా చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు నిమ్మగడ్డ భిక్షాలు, రాష్ట్ర పార్టీ బీసీ సెల్ కార్యదర్శి పోసిన పాపారావుగౌడ్. జిల్లా కార్యద ర్శి బొడ్డు నోబుల్, మండవల్లి ఎంపీపీ సాక జసింతా పాల్గొన్నారు. -
ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్ ఫలితాలు విడుదల
- విశాఖలో ఏపీ ఎంసెట్ 2016 ఫలితాలు విడుదల - ఇంజినీరింగ్ ఫలితాలు మాత్రమే విడుదల - సుప్రీంకోర్టు తీర్పుతో మెడిసిన్ ఫలితాలు నిలిపివేత - సుప్రీంకోర్టు తీర్పుపై అధ్యయనం చేశాకే మెడిసిన్ ఫలితాలు విడుదల - విశాఖలో విడుదల చేసిన ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం: జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ ఎంసెట్-2016 ఫలితాలను సోమవారం రాత్రి విడుదల చేశారు. అయితే ఇంజినీరింగ్ ఫలితాలను మాత్రమే విడుదల చేసినట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. 'నీట్'పై సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పు నేపథ్యంలో ఫలితాలు విడుదలలో జాప్యం ఏర్పడినట్టు ఆయన చెప్పారు. సీడీల రూపంలో ఇంజినీరింగ్ ఫలితాలను విడుదల చేశారు. ఇప్పుడు ఇంజినీరింగ్ ఫలితాలను మాత్రమే విడుదల చేస్తున్నామని తెలిపారు. సుప్రీం తీర్పుతో మెడిసిన్ ఫలితాలను నిలిపివేసినట్టు చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పుపై అధ్యయనం చేశాకే మెడిసిన్ ఫలితాలను విడుదల చేస్తామని మంత్రి గంటా తెలిపారు. ఈ ఫలితాలను ఏయూ వర్సిటీ ప్లాటినం జూబ్లీ హాలులో ఏపీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్, ప్రత్తిపాటి పుల్లారావు విశాఖపట్నంలో విడుదల చేశారు. ఎంసెట్ పరీక్షకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 2,78,392 మంది హాజరుకాగా వారిలో 1,79,642 మంది ఇంజనీరింగ్, 98,750 మంది మెడిసిన్ అభ్యర్థులున్నారు. ఎంసెట్ కమిటీ ముందుగా ప్రకటించిన తేదీ కంటే ఏడు రోజులు ముందే ఫలితాల విడుదలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఎంసెట్ ఫలితాలు విడుదల చేసిన అరగంటకు విద్యార్థి నమోదు చేసుకున్న సెల్ నంబర్‌కు ర్యాంక్‌ల సమాచారం అందుతుందని ఎంసెట్ చైర్మన్ వి.ఎస్.ఎస్.కుమార్ చెప్పారు. ఎంసెట్ ఫలితాలను www.sakshieducation.com వెబ్సైట్ నుంచి తెలుసుకోవచ్చు. -
మిత్ర ధర్మాన్ని మరచిన తమ్ముళ్లు
వెంకటగిరి: బీజేపీ, టీడీపీలు మిత్రపక్షాలు. అయితే జన్మభూమి కార్యక్రమాల్లో కమలదళం కనిపించకపోవడం, బీజేపీ కార్యక్రమాల్లో తెలుగు తమ్ముళ్లు జాడలేకపోవడం వంటి కారణాలు వారిలో మైత్రీబంధం ఏ మాత్రం ఉందో ప్రజలు గమనిస్తున్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఉచితంగా అందించే రోగనిర్ధారణ పరీక్షలు తెలియజేసీ భారీ ఫ్లెక్సీలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఫొటో లేకపోవడంతో పలువురు విస్తుపోతున్నారు. దీనికి కారణం మంత్రి కమళదళానికి చెందిన నాయకుడు కావడమేనా అనే స్థానికులు చర్చించుకుంటున్నారు. మిత్రపక్షం అంటూనే ఈ వివక్ష ఏమిటని ప్రశ్నిస్తున్నారు. -
టీడీపీ తొక్కేస్తోంది
బీజేపీ కార్యవర్గ సమావేశంలో పలువురు నాయకుల ఆగ్రహం సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తమను తొక్కేస్తోందని, మిత్రపక్షంగా ఉన్నా ఎదగనీయకుండా రాజకీయం చేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో సోమవారం జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పలువురు నేతలు మాట్లాడారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇస్తే దాన్ని వ్యతిరేకించి జైళ్లకు వెళ్లాం. ఇప్పుడు అవే రిజర్వేషన్లకు అనుకూలంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతుంటే ఏవిధంగా సమర్థిస్తామని యువమోర్చా నేతలు నిలదీశారు. కేంద్రం నిధులు ఇవ్వడం లేదంటూ అసెంబ్లీలో అధికార పార్టీ తీర్మానం చేసి, దుమ్మెత్తిపోస్తున్నా మనం ఏమీ చేయలేకపోతున్నామని ఆక్రోశించారు. కార్యకర్తలు అడిగే చిన్నచిన్న పనులు కూడా చేసిపెట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా నియోజకవర్గంలో బీజేపీ నాయకులు కొద్దిగా ఎదిగితే టీడీపీ నాయకులు తొక్కేస్తున్నారని ఆరోపించారు. గ్రామాల్లో వేస్తున్న జన్మభూమి కమిటీల్లో బీజేపీ కార్యకర్తలకు స్థానం కల్పించారా? అని ప్రశ్నించారు. తలెత్తుకోలేకపోతున్నాం: కామినేని కేంద్రంలో టీడీపీ నేతలకు పదవులు ఇవ్వనప్పుడు రాష్ట్రంలో బీజేపీ నేతలకు ఎందుకివ్వాలని చంద్రబాబు ప్రశ్నిస్తుంటే తాను తలెత్తుకోలేకపోతున్నానని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పినట్లు సమాచారం. దేవాలయ కమిటీల్లోనూ ఒకటి కంటే ఎక్కువ పోస్టులను బీజేపీకి ఇవ్వవద్దని టీడీపీ నేతలు పట్టుబడుతుండటం వల్ల న్యాయం చేయలేకపోతున్నానని మంత్రి మాణిక్యాలరావు వివరించారు. పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎమ్మెల్సీ సోము వీర్రాజు నేతలకు సూచిం చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, పార్టీ నేతలు విష్ణుకుమార్ రాజు, ఆకుల సత్యనారాయణ, కృష్ణంరాజు, కన్నా లక్ష్మీనారాయణ, కంతేటి సత్యనారాయణ రాజు, పురందేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
ఔనా! నిజమేనా?
వచ్చే నెల 7 నుంచి విమ్స్ ఓపీలట! అసెంబ్లీలో ఆరోగ్యమంత్రి కొత్త మాట వైద్యులు లేరు.. సిబ్బంది లేరు పరికరాలు, సౌకర్యాల జాడే లేదు సేవల ప్రారంభంపై సందేహాలు విశాఖపట్నం: విశాఖ ప్రజలు ఎంతగానో, ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వచ్చే నెల నుంచే వైద్య సేవలు ప్రారంభం! నమ్మలేకపోతున్నారా? అసాధ్యం అంటున్నారా? అసెంబ్లీ సాక్షిగా ఆరోగ్యమంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పాక కూడా నమ్మలేమంటరా? నిజం! గౌరవనీయ మంత్రి బుధవారం అసెంబ్లీలో ఈ ప్రకటన చేశారు కాబట్టి నమ్మాల్సిందే. విమ్స్‌లో ఓపీ సేవలు ఏప్రిల్ 7 నుంచి ప్రారంభిస్తామని, ప్రయివేటు పరం చేయబోమని ఆరోగ్యమంత్రి కామినేని ప్రకటించారు. కొత్తేముంది?: ఆరోగ్యమంత్రి కామినేని శ్రీనివాస్, ఇతర మంత్రులు వీలు చిక్కినప్పుడు, విశాఖ వచ్చినప్పుడు చేస్తున్న విమ్స్ గురించి ప్రకటనలు కుమ్మరిస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. గోడమీద రాతలా వచ్చే నెలలోనే విమ్స్‌ను ప్రారంభిస్తామని వీరు ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నారు. అలా ఎన్నో గడచిపోయాయి.దీంతో జనం నమ్మడం మానేశారు. విమ్స్ అసలు ప్రారంభమవుతుందా? అన్న సందేహానికి వచ్చేశారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి హయాంలో కట్టిన భవనాలు తప్ప అదనపు నిర్మాణాలు చేపట్టలేదు. అవీ శిథిలావస్థకు చేరుకున్నాయి. విలువైన వస్తువులు, సామగ్రి దొంగల పాలవుతున్నాయి. చెట్లు, తుప్పలు బలిసిపోయి చిట్టడవిని తలపిస్తున్నాయి. ఇక సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. కేజీహెచ్ వైద్యులను విమ్స్‌కు పంపుతామని ఆరోగ్య మంత్రి అంటే అక్కడికి వెళ్లబోమని డాక్టర్లు తెగేసి చెప్పేశారు. వారి స్థానంలో ఎవరినీ నియమించలేదు. ఇతర సిబ్బంది కొరత ఉంది. పరికరాలు లేవు. ఇన్ని లోపాలుండగా వచ్చేనెల ఓపీ ఎలా ప్రారంభిస్తారో అంతుపట్టడం లేదు. అప్పటికి ఇంకా నెల వ్యవధి కూడా లేదు. భవనాలు, వైద్యులు, సిబ్బంది, పరికరాలు.. ఇవన్నీ ఎలా సిద్ధం చేస్తారో అర్ధం కావడం లేదు. ఎన్నో ప్రకటనలు: ఆసుపత్రి పరిస్థితి ఇలా ఉండగా, మరోవైపు అధికారులు, ఆమాత్యులు ప్రకటనలు మాత్రం గుప్పిస్తున్నారు. గత నవంబరులో విశాఖ వచ్చిన అప్పటి వైద్య విద్య సంచాలకుడు (డీఎంఈ) వెంకటేష్ విమ్స్‌ను జనవరిలో అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. జనవరిలో జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు ఫిబ్రవరిలో ప్రారంభిస్తామన్నారు. ఇక వైద్య ఆరోగ్యమంత్రి కామినేని విశాఖ వచ్చినప్పుడల్లా ‘త్వరలోనే విమ్స్ సేవలు’ అంటూ ప్రకటించి వెళ్లిపోతున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఓపీ ఎలా సాధ్యమో ఏలినవారికే తెలియాలి. డెప్యూటేషన్‌పై తీసుకున్న వైద్యులతో ముందు ఓపీ ప్రారంభిస్తారా? అన్న అంశంపై స్పష్టత రావాలి. -
కొల్లేరు సమస్యలను పార్లమెంటులో చర్చిస్తాం
మంత్రి కామినేని శ్రీనివాస్ కైకలూరు : కొల్లేరు సమస్యలను పార్లమెంటులో చర్చకు తెచ్చేలా ప్రయత్నిస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. సోమవారం స్థానిక మత్స్య శాఖ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సుప్రీం కోర్టు పరిధిలో కొల్లేరు అంశం ఉండడంతో అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. కొల్లేరు ఆపరేషన్ సమయంలో కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో 14 వేల ఎకరాల జిరాయితీ పట్టా భూముల్లో చేపల చెరువులను ధ్వంసం చేశారన్నారు. ఆ సమయంలో రైతులకు ఎటువంటి నష్టపరిహారం చెల్లించలేదని చెప్పారు. ముందుగా పట్టా భూములను తిరిగి పంపిణీ చే యాలని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్‌ను కోరామని తెలిపారు. వీటితో పాటు రెండు జిల్లాల్లో 136 సొసైటీలకు చెందిన 30 ఎకరాలు, కృష్ణా జిల్లాలో కొల్లేరు ఆపరేషన్ సమయంలో అదనంగా ధ్వంసం చేసిన 7500 ఎకరాలను పంపిణీ చేయాలని ఆదివారం రాజమండ్రి సభకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లామన్నారు. కొల్లేరు అభయారణ్యానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా సుప్రీంకోర్టు నియమించిన సాధికారిత కమిటీ ఆమోదించాల్సి ఉందన్నారు. కైకలూరు మండలం పందిరిపల్లిగూడెం వద్ద పెద్దింట్లమ్మ వారధి నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి కామినేని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, జెడ్పీటీసీ సభ్యురాలు బొమ్మనబోయిన విజయలక్ష్మి, ఎంపీపీ బండి సత్యవతి పాల్గొన్నారు. -
అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవయవాల మార్పిడి
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రులను అవయవ మార్పిడి నైపుణ్య కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఏపీని వైద్యఆరోగ్య రంగంలో ఉన్నత స్ధానంలో నిలబెట్టడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. సీఆర్డీఏ పరిధిలోని మణిపాల్ ఆసుపత్రిలో తొలి కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స చేసిన వైద్య నిపుణుల జట్టును కామినేని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో తొలి దశలో భాగంగా అవయవాల మార్పిడికి ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఏపీలో 120 మానవ అవయవాల హార్వెస్టింగ్ పూర్తి అయ్యిందని ఇందులో 30 అవయవాలను బాధితులకు అమర్చినట్లు ఆయన వెల్లడించారు. జీవన్ దాన్ ద్వారా అవయవదానం కార్యక్రమాన్ని ప్రజలకు అందించాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు తెలిపారు. 500 మంది డాక్టర్స్, 1000 మంది నర్స్‌లు, 16 మంది ఆసుపత్రి అడ్మిన్ స్టేటర్స్ను కాంట్రాక్ట్ ప్రాతిపదికనా ప్రభుత్వం నియామకాలు చేపట్టడానికి జీవో జారీ చేశామన్నారు. త్వరలోనే ఈ పోస్ట్‌ల భర్తీకు నియామకాలు పూర్తి అవుతాయని మంత్రి తెలిపారు. బ్రెయిన్ డెడ్ అయిన మనిషి తన అవయవాలను దానం ఇస్తే 5 గురు బాధితులకు కొత్త జీవితం లభిస్తుందన్నారు. ఏపీలో ఎయిమ్స్‌ను నిర్మించి ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని మంత్రి కామినేని పేర్కొన్నారు. -
'జికా వైరస్‌ను ఎదుర్కొనేందుకు చర్యలు'
హైదరాబాద్: రాష్ట్రంలో జికా వైరస్ తలెత్తకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టినట్టు రాష్ర్ట వైద్య ఆరోగ్యాశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో తన నివాసంలో మాట్లాడుతూ... పగటి పూట కుట్టే దోమ ద్వారా డెంగ్యూ తరహాలో ఈ వైరస్ వ్యాపిస్తుందని చెప్పారు. విమానాశ్రయాల్లో ప్రయాణికులకు ఈ వైరస్ వ్యాప్తిపై అవగాహన కల్పించడంతో పాటు... వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తించేలా పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. గర్భిణీ స్త్రీలు విదేశీ ప్రయాణాలు చేయడం ఆరోగ్యకరం కాదన్నారు. గర్భిణీలో గులియన్ బారీ సిండ్రోమ్ వంటి నాడీ సంబంధ సమస్యలు కనిపించినా.. ప్రసవాల్లో తల చిన్నగా శిశువు జన్మించినా అత్యవసర చికిత్సనందించాలని కామినేని తెలిపారు. ఈ సమావేశంలో వైద్యా ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, కమిషనర్ కెవీ సత్యనారాయణలు పాల్గొన్నారు. -
మార్చురీ ముడుపులపై విచారణకు ఆదేశం
విశాఖ మెడికల్: శవ పరీక్షల (పోస్టుమార్టం) కోసం ప్రభుత్వ వైద్యులు ముడుపులు తీసుకుంటున్నారని వచ్చిన ఆరోపణపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు విచారణకు ఆదేశించారు. కేజీహెచ్‌లో నెలలోపు పిల్లల సంరక్షణ కోసం రూ.38 లక్షల వ్యయంతో ఎన్ఐసీయూ మొదటి అంతస్తులో నూతనంగా నిర్మించిన నవజాత శిశువుల ప్రత్యేక వైద్య విభాగం (ఎన్‌ఎస్‌ఐసీయూ)ను మంత్రి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసూతి వార్డును ఎంపీ హరిబాబు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌తో కలసి సందర్శించారు. ఆస్పత్రిలో అందుతున్న సేవల గురించి ప్రసూతి మహిళలతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జననీ సురక్ష పథకం కింద చికిత్స పొందుతున్న తల్లులకు మంత్రి భోజన పథకాన్ని ప్రారంభించారు. ‘మనుషులేనా వీళ్లు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాన్ని మీడియా ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లి.. కేజీహెచ్ ఫోరెన్సిక్ విభాగం వైద్యులు పోస్టుమార్టం కోసం రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు ముడుపులు తీసుకుంటున్నారని చెప్పడంతో ఆయన తీవ్రంగా స్పందించారు. ముడుపులు తీసుకొనే వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ అవినీతి వ్యవహారంపై 24 గంటల్లోగా సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్, వైద్య కళాశాల ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. రాష్ట్రంలో త్వరలో వెయ్యి నర్సు పోస్టుల భర్తీ చేస్తామని, అందులో విశాఖ కింగ్‌జార్జి ఆస్పత్రికి కూడా కొందరిని కేటాయిస్తామన్నారు. కేజీహెచ్‌లో నర్సు పోస్టులు తీవ్ర కొరత ఉండడం వాస్తవమేనని, ఆర్థిక శాఖ ఆమోదం లభించిన వెంటనే ఈ కొరతను త్వరలో తీరుస్తామన్నారు. కేజీహెచ్‌లో రూ.85 కోట్లతో నిర్మించనున్న సర్జికల్ అంకాలజీ స్పెషాల్టీ బ్లాక్ (సీఎస్ఆర్) నిర్మాణానికి సంబంధించి టెండర్లను గురువారం తెరిచినట్లు తెలిపారు. విమ్స్ ఆస్పత్రిని త్వరలో ప్రారంభిస్తామన్నారు. వైద్య పరికరాల కొనుగోలుకు సంబంధించి టెండర్లు పిలిచామని, సిబ్బంది నియామకానికి సంబంధించి రెండు రోజుల క్రితమే వివిధ వైద్య విభాగాల నుంచి డెప్యుటేషన్లపై వచ్చేందుకు జీవోను విడుదల చేశామన్నారు. వైద్యులు లేని ఏజెన్సీ ప్రాంతంలో హెల్త్ ఏటీఎం పేరుతో గిరిజనులకు మందుల పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్మధుసూదనబాబు, ఏఎంసీ ప్రిన్సిపాల్ ఎస్.వి.కుమార్, విమ్స్ ఓఎస్డీ డాక్టర్ పి.వి.సుధాకర్, డెప్యూటీ సూపరింటెండెంట్లు ఉదయ్‌కుమార్, వైస్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరెడ్డి, ప్రసూతి,పిల్లల వార్డుల విభాగాధిపతులు శారదాబాయ్, పద్మలత ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ తదితరులు పాల్గొన్నారు. -
బేబీ ఫ్యాక్టరీలు బోలెడు!
► పిల్లల అమ్మకాల వ్యవహారంలో వెలుగు చూస్తున్న వాస్తవాలు ► ఫ్లాట్ తనిఖీ చేసిన ఏపీ వైద్య ఆరోగ్యశాఖ, ఐసీడీఎస్ అధికారులు ► విచారణ జరపాల్సిందిగా పోలీస్ కమిషనర్‌కు ఏపీ మంత్రి కామినేని ఆదేశం ► బండారం బయటపడటంతో పరారైన నిర్వాహకులు సాక్షి, విశాఖపట్నం: కడుపు పండించుకోవాలని తపించే తల్లిదండ్రులకు వలవేసి.. పేద మహిళల గర్భమే పెట్టుబడిగా.. పసికందుల వ్యాపారం నిర్వహిస్తున్న ముఠా కార్యకలాపాలు విశాఖ నగరంలోని అనేక ప్రాంతాల్లో సాగిస్తున్నట్లు తెలుస్తోంది. పసి పిల్లలను విక్రయిస్తున్న దారుణ ఉదంతాన్ని ‘విశాఖ తీరాన బేబీ ఫ్యాక్టరీ’ అన్న శీర్షికతో ‘సాక్షి’ బట్టబయలు చేయడంతో డొంకంతా కదులుతోంది. నగరంలో ఇటువంటి వ్యాపారం ఆరు ఫ్లాట్లలో జరుగుతున్నట్లు సమాచారం అందింది. అవి కూడా బీచ్‌రోడ్డు పరిసరాల్లోనే ఉన్నట్లు స్థానికుల ద్వారా తెలిసింది. వెలుగు చూస్తున్న వాస్తవాలు ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన అపార్ట్మెంట్లోని 101వ ఫ్లాట్‌లో 2011 నుంచీ చిన్న పిల్లల విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో ఫ్లాట్ యజమానురాలికి కూడా సంబంధం ఉన్నట్లు భావిస్తున్నారు. బ్రోకర్ వెంకట్, నర్సు సుజాతలతో పాటు మరో బ్రోకర్ కీలక పాత్రధారులుగా వ్యవహరిస్తున్నారు. కృత్రిమ అండాలను పేద మహిళల గర్భంలో ప్రవేశపెట్టినప్పటి నుంచి వారిని అద్దె ఫ్లాట్లలోనే ఉంచి ప్రసవం అయిన తర్వాత పసికందులను తీసుకుని, మహిళలను పంపివేస్తున్నట్లు చెబుతున్నారు. ఇదే అపార్ట్మెంట్లో 103వ ఫ్లాట్‌ను కూడా అద్దెకు తీసుకుని కొన్నాళ్లు సరోగసి తల్లులను ఉంచారని, అయితే అనుమానం వచ్చిన ఫ్లాట్ యజమానులు ఖాళీ చేయించారని ఇరుగుపొరుగు చెప్పారు. ఆరు నెలలుగా పలువురు గర్భిణులు వరండాల్లో తిరుగుతుంటే అనుమానం వచ్చి ఇలా ఎవరుబడితే వారు వస్తే కుదరదని నిర్వాహకులను హెచ్చరించి, ఫ్లాట్ ఖాళీ చేయించారని అధికారుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం. ఈ అపార్ట్మెంటుకు వెల్ఫేర్ అసోసియేషన్ లేదు. దీంతో ఎవరు వచ్చినా, ఎవరు వెళ్లినా పట్టించుకునే వారు లేకపోవడంతో ఈ ముఠా కార్యకలాపాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఫ్లాట్ యజమానురాలు విజయలక్ష్మి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా. ఆమె కుమారుడు విదేశాల్లో ఉంటున్నాడని తెలిసింది. అతను నగరానికి వచ్చినప్పడు మాత్రం నెల రోజుల పాటు ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు లేకుండా జాగ్రత్తపడుతుంటారని అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. గుర్తింపు రద్దుకు సిఫార్సు చేస్తాం.. కైకలూరు: విశాఖ తీరంలో పిల్లల అమ్మకాలపై ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించారు. గురువారం కృష్ణాజిల్లా కలిదిండి మండలం తాడినాడ గ్రామానికి వచ్చిన మంత్రి ‘సాక్షి’తో మాట్లాడారు. ఇలాంటి ఐవీఎఫ్ సెంటర్ల గుర్తింపును రద్దుచేయాలని రాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌కు సిఫారసు చేస్తామని తెలిపారు. సుమోటోగా కేసు సాక్షి కథనంపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ విభాగం (ఏపీ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్) స్పందించింది. సుమోటోగా కేసు నమోదుకు ఆదేశించింది. పిల్లల విక్రయాలతో సంబంధమున్న ఆస్పత్రులు, సంస్థలు, ఏజెంట్లపై తక్షణమే కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని విశాఖ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసింది. ఈ నెల 7వ తేదీలోపు తమకు నివేదిక సమర్పించాల ని కమిషన్ సభ్యులు ఎస్.బాలరాజు, ఎస్.మురళీధర్‌రెడ్డి, ఎం.సుమిత్రలు ఆదేశించారు. కదిలిన యంత్రాంగం అసాధారణ రీతిలో పసికందులను విక్రయిస్తున్న ముఠా వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం స్పందించింది. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ విశాఖ సీపీ అమిత్గార్గ్తో గురువారం ఫోన్లో మాట్లాడారు. దీనిపై విచారణ జరిపి దోషులను పట్టుకోవాలని ఆదేశించారు. జిల్లా అదనపు డీఎంహెచ్‌వో పి.ఎస్.సూర్యనారాయణ, ఉమెన్ హెల్త్ ఆఫీసర్ చంద్రలేఖ, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ లైజన్ ఆఫీసర్ నాగమణి, శిశు గృహ ప్రత్యేక దత్తత స్వచ్ఛంద సంస్థ సభ్యురాలు పద్మలు ‘బేబీ ఫ్యాక్టరీ’ నడుపుతున్న అపార్ట్‌మెంట్‌ను తనిఖీ చేశారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. అపార్ట్మెంట్ వ్యవహారాలు చూస్తున్న ఓ లాయర్‌తో, చుట్టుపక్కల వారితో మాట్లాడామని, నివేదికను జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్‌కు అందించామని సూర్యనారాయణ ‘సాక్షి’కి వెల్లడించారు. అయితే పత్రికలో తమ బండారం బయటపడటంతో అప్పటికే ఫ్లాట్‌కు తాళం వేసి నిర్వాహకులు పరారయ్యారు. -
మంత్రి కామినేనితో విభేదించిన బీజేపీ, టీడీపీ సభ్యులు
సాక్షి, హైదరాబాద్: మంత్రులు ఏం చెప్పినా అధికారపక్ష సభ్యులు సహజంగా విభేదించరు. కానీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో సొంత పార్టీ సభ్యులు విష్ణుకుమార్‌రాజు, ఆకుల సత్యనారాయణతో పాటు పలువురు టీడీపీ సభ్యులూ విభేదించారు. సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో.. ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో సిబ్బంది కొరత లేదని, సమస్యలూ లేవని మంత్రి సమాధానం ఇచ్చారు. మంత్రి వాస్తవాలు మాట్లాడితే బాగుంటుందని, ప్రైవేట్ కళాశాలల్లో తనిఖీలప్పుడు అద్దె డాక్టర్లను తీసుకొస్తారని బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్‌రాజు అన్నారు. డీమ్డ్ యూనివర్సిటీ పేరుతో ‘గీతమ్’లో ఒక్కో సీటు రూ. కోటికి అమ్ముతారని, ప్రభుత్వం నుంచి స్థలం, రాయితీలు పొంది వ్యాపారం చేసుకోవడం తప్పని గట్టిగా చెప్పారు. బీజేపీకి చెందిన మరో సభ్యుడు ఆకుల సత్యనారాయణ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు టీడీపీ సభ్యులూ.. ఆసుపత్రుల్లో సమస్యలను ఏకరువు పెట్టారు. అందరూ విభేదించడంతో మంత్రి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
మద్యం బాధితులకు కామినేని పరామర్శ
విజయవాడ: కల్తీ మద్యం ఘటనలో చికిత్స పొందుతున్న బాధితులను ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ శుక్రవారం పరామర్శించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 27 మందిని డిశ్చార్జ్ చేశామని, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆయన తెలిపారు. మద్యంలో మిథైనాల్ కలపడం వల్లే ఘటన జరిగిందని కామినేని చెప్పారు. బాధితులకు ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
రిమ్స్‌లో కామినేని సమీక్షా సమావేశం
వైఎస్సార్ జిల్లా : కడప రిమ్స్ ఆసుపత్రిని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ సోమవారం సందర్శించి డాక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆసుపత్రి రేడియాలజీ విభాగంలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్‌ను, కార్డియాలజీ విభాగంలో మరో యూనిట్‌ను ప్రారంభించారు. ప్రభుత్వ డాక్టర్లు కార్పొరేట్ ఆసుపత్రులలో పనిచేయటానకి వీల్లేదని, అలా చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామాన్నారు. రిమ్స్ ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగుపర్చడానికి చర్యలు తీసుకుంటామని కామినేని తెలిపారు. -
దివిసీమను వణికిస్తున్న డెంగీ
చల్లపల్లి : దివిసీమను ప్రజలను డెంగీ జ్వరాలు వణికిస్తున్నాయి. మూడు నెలల క్రితం చల్లపల్లి మండలం కొత్తమాజేరులో బయట పడిన ఈ జ్వరాలు, ఇటీవల మోపిదేవి, నాగాయలంక మండలం గణపేశ్వరానికి విస్తరించాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ డెంగీ కేసులు లేవని చెప్పడంతో ఎందుకొచ్చిన తలనొప్పి అనుకున్న వైద్య, ఆరోగ్యశాఖాధికారులు వీటిని డెంగీ కేసులుగా గుర్తించడం లేదు. వణకుతున్న ప్రజలు చల్లపల్లి మండలం కొత్తమాజేరులో మూడు నెలల క్రితం డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ గ్రామంలో సుమారు 50 మందికి డెంగీ జ్వరాలు వ్యాపించాయి. డెంగీ, విషజ్వరాల వల్ల మొత్తం 20 మంది చనిపోయారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్ కొత్తమాజేరు పర్యటన, మచిలీపట్నంలో ధర్నాతో కంగుతిన్న రాష్ట్ర మంత్రులు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డెంగీ జ్వరాలు వల్ల ఎవరూ చనిపోలేదని చెప్పుకొచ్చారు. డెంగీ, విషజ్వరాలు లేనపుడు రెండు నెలల నుంచి ఈగ్రామంలో వైద్యశిబిరం ఎందుకు నిర్వహిస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు, గ్రామస్తుల ప్రశ్నలకు ఎవరిదగ్గరా సమాధానం లేదు. ఇప్పటికీ ఈ గ్రామంలో విషజ్వరాల కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దాసేస్తున్నారు స్వయంగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని దివిసీమలో డెంగీ జ్వరాలు వల్ల ఎవరూ చనిపోలేదని ప్రకటించడంతో వైద్య, ఆరోగ్యశాఖాధికారులు డెంగీ కేసులను దాసేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వేరే గ్రామాలకు చెందిన కొంతమంది విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు వైద్యశాలల్లో డెంగీ జ్వరాలతో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, మంత్రులు స్పందించి బేషజాలకు పోకుండా డెంగీ జ్వరాలు విస్తరించకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. విస్తరిస్తున్న డెంగీ నాలుగు రోజుల క్రితం మోపిదేవి పంచాయతీ పరిధిలోని వికలాంగుల కాలనీలో నడకుదిటి కృష్ణకుమారి (45) మరణించిన విషయం విదితమే. తాజాగా నాగాయలంక మండలం గణపేశ్వరానికి డెంగీ జ్వరాలు విస్తరించాయి. గ్రామంలో సర్పంచ్ దాసి జీవరత్నం, మరో విద్యార్థిని దాసి మంజూషతోపాటు కూతాటి రంగారావు, చాట్రగడ్డ దానియేల్‌కు డెంగీ జ్వరాలు ఉన్నట్టు వైద్యపరీక్షలో తేలింది. దీంతో గ్రామస్తులు మరింత భయాందోళనలకు గురవుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది దివిసీమలో డెంగీ జ్వరాలు విస్తరిస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. -
విభజనతో నష్టపోయింది వైద్య విభాగమే
వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ గుడివాడ టౌన్ : రాష్ట్ర విభజనలో భారీగా నష్టపోయింది వైద్యవిభాగమే అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. ఆదివారం కృృష్ణాజిల్లా గుడివాడలోని ఐఎంఏ హాలులో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యాన జరిగిన కృృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల రీజినల్ కౌన్సిల్ సమావేశాన్ని మంత్రి ప్రారంభించారు. కామినే ని మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి కూడా ప్రజలకు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తోందని చెప్పారు. గతంలో ఏర్పాటు చేసిన ఆరోగ్యశ్రీ పథకం పర్యవేక్షణ లోపం వలన లబ్ధిదారులకు చేరుకోలేదని, అందుకే దానిలో మార్పులు తెచ్చామన్నారు. 500 మంది వైద్యుల నియామకం ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు త్వరలోనే 500 మంది వైద్యులను నియమిస్తున్నామన్నారు. ప్రతి ఏరియా ఆస్పత్రిలో గైనకాలజిస్ట్, ఎనస్తీషియన్, సర్జన్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎలుకల దాడి దురద ృష్టకరం.. తప్పు ఎవరు చేసినా తలవంపులు వైద్యశాఖదే అని మంత్రి కామినేని అన్నారు. గుంటూరులో ఎలుకల దాడిలో పసికందు వృతిచెందిన విషయాన్ని తీవ్రంగా ఖండించడమే కాక శాశ్వత పరిష్కారానికి మార్గం కనుగొంటున్నామని చెప్పారు. ఒకరినో, ఇద్దరినో బలిచేయడం వలన సమస్య పరిష్కారం కాదని, ప్రజలు సైతం జాగ్రత్తలు తీసుకుని మెరుగైన వైద్యం పొందాలని సూచించారు. ఇప్పటికే అన్ని సేవలను ఆన్లైన్ చేశామని తద్వారా లంచగొండితనాన్ని రూపుమాపవచ్చని పేర్కొన్నారు. స్టాఫ్ నర్సులకు ట్యాబ్‌లు అందజేశామని వాటి ద్వారా తల్లీపిల్లల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేస్తూ వారికి మెరుగైన సేవలందిస్తారని తెలిపారు. ఆస్పత్రుల రిజిస్ట్రేషన్ల రెన్యువల్స్‌కు సంబంధించి ఫైర్ ఆఫీసర్ల ఎన్ఓసీల విధానంలో మార్పులు తెచ్చేందుకు రెండు మూడు రోజుల్లో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, కార్యదర్శి రహ్మాన్, ఐఎంఏ గుడివాడ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ పొట్లూరి గంగాధరరావు, అధ్యక్ష, కార్యదర్శులు భవానీశంకర్, మాగంటి శ్రీనివాస్, డి.ఆర్.కె.ప్రసాద్, వంశీక ృష్ణ, సి.ఆర్.ప్రసాదరావు, బి.సుబ్బారావు, అశోక్, సోమూరి వెంకట్రావు, వల్లూరుపల్లి సుబ్రహ్మణ్యేశ్వరరావు, నాలుగు జిల్లాలకు చెందిన సుమారు 400 మంది వైద్యులు పాల్గొన్నారు. -
మంత్రిగారు సిగ్గుతో తల దించుకున్నారట..!
(సాక్షి వెబ్ ప్రత్యేకం) ఆరోగ్యశాఖ మంత్రి సిగ్గుతో తలదించుకున్నారట. ప్రభుత్వ ఆస్పత్రిలో పసి పిల్లలతో పాటు ఎలుకలు కూడా ఉన్నందుకు.. అందులో ఒక ఎలుక సరదాగా ఓ పసికందును కొరికినందుకు.. ఆ పసికందు చనిపోయినందుకు.. మంత్రిగారు సిగ్గుతో తలదించుకున్నారట. ఇది నిన్న ఉదయం మాట. ఆస్పత్రిలో మంత్రిగారి, అధికారుల హడావుడి.. బిలబిలలాడుతూ తిరిగేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించేశారు. విచారణ కమిటీ కూడా వేశారు. నర్సుల సస్పెన్షన్ .. సూపరింటెండెంట్, మరో వైద్యుడి బదిలీ జరిగిపోయింది. అక్కడితో ప్రభుత్వం బాధ్యత తీరిపోయింది. పసికందు ప్రాణాల వెల సస్పెన్షన్, బదిలీ .. అంతే ఇంకేమీ లేదు. విచారణ కమిటీ ఏం చెప్పింది.. ఎలుకలు ఏవో సరదాగా కొరికాయి.. కానీ పసికందు చావుకు అవి కారణం కాదు. పుట్టుకతోనే లోపాలున్న ఆ శిశువుకు వారం రోజులుగా వైద్యం అందుతోందట. వెంటిలేటర్‌పైన పసికందును ఉంచామని కూడా చెప్పారు. అసలు సమస్య ఇక్కడే.. వెంటిలేటర్ పై చికిత్స.. అంటే ఐసీయూ ట్రీట్ మెంట్.. ఐసీయూలో ఎలుకలు.. ఇదేదో జనరల్ వార్డులో జరిగిన ఘటన కాదు.. ఆశతో ఆస్పత్రికి వచ్చిన పేద ప్రజలకు వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. సింగపూర్ చేస్తాం.. జపాన్‌లాగా మార్చేస్తాం.. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గం.. ఈ మధ్య ప్రభుత్వ పెద్దలు పదే పదే వల్లె వేస్తున్న స్లోగన్స్ కదా! ఇదే ఘటన సింగపూర్లోనో, జపాన్లోనో జరిగితే ఏమయ్యేది? వార్డు బాయ్ నుంచి ప్రభుత్వ నేతల వరకు బోనులో నిలబడాల్సి వచ్చేది. కటకటాలు లెక్కించక తప్పేది కాదు.. భారీ నష్ట పరిహారం సరేసరి... మనం మసిపూసి మారేడు కాయ చేయడంలో గోల్డ్ మెడలిస్టులం కదా! పసికందు మరణానికి మాది బాధ్యత కాదు.. అలా పుట్టడమే వాడి తప్పు అనేంతటి నివేదిక తయారు. ఒక్క క్షణం నిజమే అనుకుందాం.. మరి ప్రభుత్వ ఆస్పత్రిలో ఎలుకల సంగతేమిటి మంత్రిగారూ? ఇది కూడా పసికందు చేసుకున్న పాపమేనా.. తనతోపాటు ఎలుకల్ని కూడా తెచ్చుకున్నాడా! సరదాగా ఆడుకోవడానికి. ఆ సరదాగా తీర్చుకుంటుండగా సరదాగా ఎలుక ఒకసారి కాదు.. రెండుసార్లు కొరికింది! మరి అదే నిజమైతే సస్పెన్షన్లు బదిలీలు ఎందుకో.. పసికందు ప్రాణం పోయిన తర్వాత.. ఎలుకలు పట్టేవాళ్లని పిలిపించారట. వాళ్లు కొద్దిగా కష్టపడి ఓ 50 ఎలుకల్ని పట్టుకున్నారట. ఇంకొద్దిగా శ్రమిస్తే బొరియల్లో దాక్కున్న ఎలుకలు కూడా దొరుకుతాయి కూడా. సరే.. గుంటూరు ఆస్పత్రిలో ఎలుకల్ని పట్టుకొని పసికందులు సరదాగా ఆడుకోకుండా కట్టడి చేశారు ప్రభుత్వ పెద్దలు.. మరి మిగతా ఆస్పత్రుల మాటేమిటో.. ఎలుకలకి ప్రభుత్వ ఆస్ప్రతిలో చికిత్స పొందుతున్న పసికూనలంటే పక్షపాతం.. అక్కడే సరదాగా ఆడుకుంటాయి. ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల జోలికి వెళ్లకుండా.. ఎలుకల పక్షపాతం నశించాలి అని గొడవ చేయాలేమో. ఎలుకలే కాదు.. పందికొక్కులు, పందులు, కుక్కలలాంటివి కూడా మన ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరదాగా ఆడుకుంటాయి. అప్పుడప్పుడు నోట కరుచుకుని బయటకు తీసుకుపోయి సరదాగా ఆడుకుంటాయి. పిల్లులు కూడా తమ హాజరు వేయించుకుంటాయి. దోమలు సహజీవనమే చేస్తాయి. విరిగిపోయిన మంచాలు, కనిపించని పరుపులు, ఊగిపోయే సీలింగ్ ఫ్యాన్లు, పెచ్చులూడే పై కప్పులు, దొరకని మందులు, అందుబాటులో లేని వైద్యసిబ్బంది.. ప్రభుత్వ ఆస్పత్రుల గురించి ఎప్పుడు రాసినా అందుబాటులో ఉండే పదాలు.. అక్షర సత్యాలు. ప్రాథమిక వైద్యం అందుబాటులో ఉండదు.. మెరుగైన వైద్యం.. అబ్బే కనుచూపు మేరలో కనపడదు.. తెల్లకోట్లు, తెల్లగౌన్లు మెరుపులా మెరిసి మాయమవుతాయి. సెలైన్ స్టాండ్ బదులు నిలువునా నిలబడ్డ మనిషి దర్శనమిస్తాడు. ఆపరేషన్ జరగాలంటే కనీసం 3 నెలలు ఆగాలి. ఈలోపు ఆ మనిషి బతికుంటే పీక్కు తినడానికి ఎలుకలు, పందికొక్కులు రెడీ. ఒక్కో బెడ్‌ను పంచుకునే ఇద్దరు ముగ్గురు బాలింతలు.. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటే ఆస్పత్రి గచ్చపై పొర్లుదండాలు పెడుతూ పడుకోవాల్సిందే. అయినా వైద్య రంగానికి మనం వేలకోట్లు కేటాయిస్తూనే ఉంటాం. ఆ డబ్బు ఎక్కడికి వెళుతుందో తెలియదు. హాస్పిటల్లో మాత్రం ఎలుకలు తిరుగుతూనే ఉంటాయి. పసికందుల్ని కొరుక్కు తింటూనే ఉంటాయి. పల్లె నిద్ర, హాస్టల్ నిద్రల్లాగ ఈమధ్య హాస్పిటల్ నిద్ర ... ఇలా నిద్రపోయిన ప్రముఖుల దరిదాపుల్లోకి ఎలుకలు మాత్రం రావు. బహుశా ముందురోజే ఎలుకల్ని బంధించేసి ఉంటారు. పదుల సంఖ్యలో ఎలుకల్ని బంధించి పట్టుకెళ్తున్న దృశ్యం నిజంగానే సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం. రేప్పొద్దున్న ఎలుకలు పట్టే కాంట్రాక్టు ప్రకటన వెలువడినా ఆశ్యర్యపడాల్సిన పనిలేదు. ఆ కాంట్రాక్టు కూడా అస్మదీయులకే వెళ్తుందనేది వేరే విషయం. ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులకు కావాల్సింది ఎలుకలు పట్టేవారు. లేకపోతే మంత్రిగారు మరోసారి సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. -
వెంగమ్మకు సీఎం బెదిరింపులు!
సాక్షి ప్రతినిధి, తిరుపతి : స్విమ్స్ (శ్రీవెంకటేశ్వర వైద్య విజ్ఞానసంస్థ) డెరైక్టర్ డాక్టర్ వెంగమ్మ తనను పదవి నుంచి రిలీవ్ చేయమని చెప్పడం వెనుక పెద్దకథే నడిచినట్టు సమాచారం. నాలుగు రోజుల క్రితం జిల్లా పర్యటనకు వచ్చిన వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ రేణిగుంట ఎయిర్‌పోర్టుకు డాక్టర్ వెంగమ్మను పిలిపించుకుని పదవి నుంచి తప్పుకోవాలని హెచ్చరికలు చేసినట్టు సమాచారం. ఇంతకుమునుపే ఆమెను స్వచ్ఛందంగా పదవి నుంచి వైదొలగేలా చేసేందుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను ప్రభుత్వం పాచికగా ప్రయోగించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే స్విమ్స్‌లోని కొన్ని పైళ్లను తీసుకెళ్లినట్టు సమాచారం. ఈ తనిఖీల్లో ఎలాంటి ఆరోపణలు, అవినీతి ఆధారాలు లభించకపోగా డెరైక్టర్ నిక్కచ్చిగా వ్యవహరించినట్టు ప్రాథమిక సమాచారం అందింది. రంగంలోకి బాబు స్విమ్స్ డెరైక్టర్ పదవి నుంచి వెంగమ్మను తప్పించి, తమకు అనుకూలమైన వారిని నియమించుకోనేందుకు వీలుగా చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగినట్టు తెలిసింది. ఇందులో భాగంగానే స్విమ్స్ డెరైక్టర్ వెంగమ్మను కుప్పానికి పిలిపించుకుని పదవి నుంచి తప్పుకోవాలని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుగుదేశం వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. పదవి నుంచి తప్పుకోకపోతే సస్పెండ్ చేస్తానని బెదిరించినట్లు విశ్వసనీయ సమాచారం. దీనివెనుక ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ హస్తం ఉన్నట్టు వినికిడి. ముఖ్యంగా లోకేష్ తమకు అనుకూలమైనవారిని తెచ్చుకునే విధంగా పావులు కదిపినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే వెంగమ్మ తనను పదవి నుంచి రిలీవ్ చేయాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసినట్టు తెలుస్తోంది. మూడు రోజుల క్రితమే హైదరాబాద్ వెళ్లి వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంను కలసి లేఖ అందించారు. ఈ విషయాన్ని స్విమ్స్ వర్గాలు సైతం ధ్రువీకరించాయి. దీంతోపాటు వైద్య ఆరోగ్యశాఖామంత్రి కామినేని శ్రీనివాసులు సైతం తమ బంధువులను స్విమ్స్ డెరైక్టర్‌గా తెచ్చేందుకు పావులు కదుపతున్నట్టు సమాచారం. -
సిగ్గుపడుతున్నా!
- వైద్యుల నిర్లక్ష్యంపై మంత్రి వ్యాఖ్య - డీఎంహెచ్ఓ, డీసీహెచ్‌ఎస్‌పై ఆగ్రహం - రాష్ట్రంలోనే ‘అనంత’లో అధ్వానంగా వైద్య సేవలు అనంతపురం మెడికల్ : ‘ఏందండీ ఇదీ.. జిల్లాలో వైద్య పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఏం చేస్తున్నారు. పొద్దున్నే పేపర్లు చూస్తే ఓ మంత్రిగా సిగ్గుపడాల్సి వస్తోంది. రాష్ట్రంలోనే అనంతపురం జిల్లాలో వైద్య సేవలు అధ్వానంగా ఉన్నాయి’ అంటూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. శుక్రవారం నగరంలోని మునిసిపల్ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ క్రమంలో జిల్లాలో రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి మీడియా మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఆయన కంగుతిన్నారు. మీరు డాక్టర్ అని నాకనిపించడం లేదు ఇటీవల ఉరవకొండలో పాముకాటుకు గురై ఒకే కుటుంబానికి చెందిన వారు మృత్యువాత పడడంపై డీసీహెచ్ఎస్ సత్యనారాయణపై మంత్రి సీరియస్ అయ్యారు. ‘ఏ పాము కాటేసింద’ని మంత్రి ప్రశ్నించగా.. నాగుపాము మాదిరిగా ఉంది అంటూ సమాధానమిచ్చారు. దీంతో ‘ఏందయ్యా నువ్వు చెప్పేది. వాళ్లు చంపేసిన పామును కూడా తెచ్చారంట కదా? కళ్ల ముందు పాము ఉంటే నాగుపాము మాదిరిగా ఉందని చెప్పడమేంటి? దీన్ని బట్టి మీరసలు డాక్టరేనా అని అనుమానం వస్తుంది. ఆ రోజు పాము కాటుతో ఆస్పత్రికి వస్తే ఎందుకు ఇంజెక్షన్ చేయలేదు. పేషెంట్ రాగానే టెస్ట్ డోస్ చేసి ఇంజక్షన్ చేయాలని తెలీదా? ప్రాణాలతో ఆడుకుంటారా? డ్యూటీ డాక్టర్(తులసి)పై ఏం చర్యలు తీసుకున్నారు.. అంటూ ప్రశ్నించారు. ఇదే విషయమై వైద్యవిధాన పరిషత్ అధికారి సోమరాజుకు మంత్రి ఫోన్ చేసి ‘ఉరవకొండలో పాముకాటుతో వస్తే చికిత్స చేయకుండా..వెళ్లిపొమ్మన్నారట! తక్షణం ఆమెపై చర్యలు తీసుకోండి అని ఆదేశించారు. డీసీహెచ్ఎస్లో ఏం జరుగుతోందో నివేదిక కావాలి. విచారణ చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ క్రమంలో ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి కలుగజేసుకుని ధర్మవరంలో ఏరియా ఆస్పత్రి ఉందని, అయితే ప్రతి కేసును అనంతపురానికి రెఫర్ చేస్తున్నారని మంత్రి దృష్టికి తెచ్చారు. డీఎంహెచ్‌ఓపై ఆగ్రహం : జననీ శిశు సురక్ష (జేఎస్కే) కింద విడుదలవుతున్న నిధులను వైద్యులు, సిబ్బంది కాజేస్తున్న ఘటనలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంహెచ్ఓ ప్రభుదాస్‌ను పిలిపించి ‘ఇంత జరుగుతుంటే మీరేం చేస్తున్నారు. అసలు మీకు బాధ్యత లేదా? బాలింతల కోసం మంజూరు చేస్తున్న డబ్బులను తినేస్తున్నా ఎందుకింత నిర్లక్ష్యమని మండిపడ్డారు. నిధులు కాజేసిన వాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, కేవలం హైదరాబాద్‌కు లేఖ రాశామని చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లగా అసలేం జరుగుతోందో చెప్పండని ప్రశ్నించారు. గార్లదిన్నె పీహెచ్సీలో రూ.3 లక్షలను ఒక సీనియర్ అసిస్టెంట్ ఫోర్జరీ సంతకాలతో డ్రా చేసినట్లు డీఎంహెచ్ఓ చెప్పడంతో ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అడిగారు. డీఎంహెచ్ఓ బిక్కమొహం వేయడంతో అక్కడే ఉన్న కలెక్టర్‌తో తక్షణం ఆమెను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ప్రత్యేక దృష్టి పెట్టండి వైద్య ఆరోగ్యశాఖకు, 108 సర్వీసెస్‌కు మధ్య కో ఆర్డినేషన్ లేదు. ఫలితంగా చాలా మంది క్షతగాత్రులను ఆరోగ్యశ్రీ రెఫరల్ ఆస్పత్రులకు తీసుకెళ్లకుండా కమిషన్లకు కక్కుర్తి పడి ప్రైవేట్ ఆస్పత్రులకు తీసుకెళ్తున్నారని తెలుసుకున్న మంత్రి.. ‘ఏందయ్యా ఇది.. అందరి ముందు మేం దోషులుగా ఉండాలా? అంటూ డీఎంహెచ్ఓను ప్రశ్నించారు. ఆస్పత్రులు గానీ, వాటి విధానాలు గానీ ఏమీ బాగాలేవని, ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ కోన శశిధర్‌ను ఆదేశించారు. సమావేశంలో మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యేలు వరదాపురం సూరి, ఈరన్న, పార్థసారధి, ఎమ్మెల్సీలు శమంతకమణి, తిప్పేస్వామి, జెడ్పీ చైర్మన్ చమన్, అనంతపురం మేయర్ స్వరూప పాల్గొన్నారు. -
సామాజిక సేవ అదృష్టం
కేంద్ర మంత్రి సుజనాచౌదరి నరసింగపాలెం (ఆగిరిపల్లి) : సామాజిక సేవ చేయాలంటే అదృష్టం ఉండాలని కేంద్ర మంత్రి సుజనాచౌదరి అన్నారు. ఆగిరిపల్లి మండలం నరసింగపాలెం శివారు తోటపల్లిలోని హీల్ ప్యారడైజ్‌లో సిద్థార్థ కళాశాల పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని శనివారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. అనాథల సేవకు హీల్ సంస్థను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రభుత్వాలతోపాటు తమ సుజనా ఫౌండేషన్ ద్వారా కూడా సహకారం అందిస్తానని చెప్పారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. వృత్తివిద్యా కేంద్రాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ పీహెచ్సీ వైద్యుడిని వారానికి ఒకసారి హీల్‌కు వచ్చి వైద్య పరీక్షలు చేసేలా కృషి చేస్తానన్నారు. సంస్థకు తన వంతు సాయంగా రూ.లక్ష చెక్కును సంస్థ చైర్మన్ పిన్నమనేని ధనప్రకాశ్కు అందజేశారు. ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) తన వంతు సాయంగా రూ.1 లక్షను అందజేస్తున్నట్లు ప్రకటించారు. టీడీపీ వైద్యవిభాగం నాయకులు సీఎల్ వెంకట్రావు రూ.లక్షను అందజేశారు. వైద్యశిబిరంలో వెయ్యి మందికి పైగా రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, నూజివీడు టీడీపీ ఇన్చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, కాపా శ్రీనివాసరావు, తోటపల్లి సర్పంచి ఆరేపల్లి శ్రీనివాసరావు, హీల్ నిర్వాహకులు మలినేని రంగప్రసాద్, వైద్యులు అమ్మన్నా, సూరపనేని శరత్, కోనేరు విజయ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. కామినేనికి ఆర్ఎంపీల వినతిపత్రం నరసింగపాలెం (ఆగిరిపల్లి): తమకు ప్రభుత్వ గుర్తింపు వచ్చేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి కామినేని శ్రీనివాస్‌కు ఆర్ఎంపీలు శనివారం వినతిపత్రాన్ని అందజేశారు. టీఎల్సీపీయూ జాతీయ అధ్యక్షులు సీఎల్ వెంకట్రావు, రాష్ట్ర అధ్యక్షులు జీఎన్జీ మూర్తి, మండల అధ్యక్షులు కె.రవిశంకర్ తదితరులు మంత్రిని కలిశారు. మంత్రి మాట్లాడుతూ ఆర్ఎంపీల ప్రభుత్వ గుర్తింపుపై రెండు రోజల క్రితం జీవో విడుదలైందని, మ్యానిఫెస్టో ప్రకారం వీరికి పరీక్షలను నిర్వహించి గుర్తింపు పత్రాలు ఇస్తామని తెలిపారు. సుజనా చౌద రి దృష్టికి కొల్లేరు సమస్యలు కైకలూరు : కొల్లేరు సమస్యలను కేంద్ర మంత్రి సుజనా చౌదరి దృష్టికి తీసుకెళ్లామని మాజీ ఎమ్మెల్యే, కైకలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి జయమంగళ వెంకటరమణ తెలిపారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ విజయవాడలో సుజనాచౌదరిని కలిశానని చెప్పారు. కొల్లేరు ఆపరేషన్ సమయంలో ధ్వంసం చేసిన 7,500 ఎకరాల భూములను తిరిగి పంపిణీ చేయాలని, కైకలూరు నియోజవర్గానికి సాగు, తాగు నీటికి చర్యలు తీసుకోవాలని కోరామని వివరించారు. -
ప్రభుత్వాస్పత్రుల్లో మందుల కొరత లేదు..
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ సత్తెనపల్లి : రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యశాలల్లో ఎక్కడా మందుల కొరత లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ చెప్పారు. సత్తెనపల్లిలో వంద పడకల వైద్యశాలకు రూ.4.20 కోట్లతో నిర్మించనున్న అదనపు భవన నిర్మాణానికి ఆయన మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభకు వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్, స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షత వహించారు. మంత్రి కామినేని మాట్లాడుతూ కుక్కకాటు, పాముకాటుకు సైతం అన్ని మందులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఏ మందులు ఎక్కువగా అవసరమవుతున్నాయి..? పంపిణీ ఎలా ఉంది..? ఏ ఏ జబ్బులు ఎక్కువగా వస్తున్నాయో తెలుసుకునేందుకు ఈ-ఔషధిని ప్రారంభించినట్లు తెలిపారు. తల్లీపిల్లల మరణాల నివారణకు 440 మంది పోస్టు గ్రాడ్యుయేట్లను తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 అంబులెన్స్‌లు కొనుగోలు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అదనపు భవనాల నిర్మాణం, మరమ్మతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి 140 వైద్యశాలలకు నాబార్డు నిధులు కేటాయించామన్నారు. నరసరావుపేట వైద్యశాలకు అత్యధికంగా రూ.23కోట్లు మంజూరు చేసినట్లు చెప్పా రు. రాష్ట్రంలో నాలుగు వేల మంది నర్సుల కొరత ఉందని చెప్పారు. ప్రస్తుతం పీహెచ్‌సీలకు 540 మంది డాక్టర్లను తీసుకున్నట్లు వివరించారు. అనంతరం అదనపు భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. సభలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు , జిల్లా వైద్య శాఖ అధికారిణి డాక్టర్ పద్మజారాణి, వైద్య విధాన పరిషత్ జిల్లా కో ఆర్డినేటర్ జి.శ్రీదేవిలు మాట్లాడారు. కార్యక్రమంలో ఏరియా వైద్యశాల సూపరిండెంట్డాక్టర్ మంత్రు నాయక్, స్థానిక వైద్యులు తదితరులు పాల్గొన్నారు. -
ఆటపాకలో హైటెన్షన్
చింతమనేని రాకతో ఉద్రిక్తత మంత్రి కామినేనితో కలిసి చెరువు గట్టు పరిశీలన పక్షులు, ప్రజలు రెండూ ముఖ్యమని వెల్లడి సమస్య పరిష్కారానికి హామీ కైకలూరు : ఆటపాక పక్షుల విహార కేంద్రం వద్ద ఆదివారం హైటెన్షన్ నడిచింది. సమీప పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని కోమటిలంక ప్రజలకు ఆటపాక పక్షుల కేంద్రం చెరువుగట్టు నడక మార్గంగా ఉంది. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ చింతమనేని ప్రభాకర్ గత నెల 29న చెరువుగట్టు రోడ్డు నిర్మాణం చేయాలని గ్రామస్తులను ఆదేశించారు. దీంతో రోడ్డు పనులను అటవీ అధికారులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం కైకలూరు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే చింతమనేని, మంత్రి కామినేని శ్రీనివాస్‌ను వెంటబెట్టుకుని ఆటపాక తీసుకువెళ్లారు. పక్షుల కేంద్రం గట్టు పరిశీలన... ఆటపాక పక్షుల కేంద్రం వద్ద మంత్రి, ఎమ్మెల్యే వస్తున్నారని సమాచారం అందుకున్న కోమటిలంక గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. వచ్చీరాగానే టపాసులు పేల్చారు. దీంతో మంత్రి సీరియస్ అయ్యారు. విదేశాల నుంచి వచ్చే పక్షులకు ఈ కేంద్రం విడిదిగా ఉందన్నారు. టపాసులు పేల్చడం వల్ల అవి చెల్లాచెదురవుతాయని మందలించారు. అక్కడ నుంచి ద్విచక్ర వాహనాలపై మంత్రి కామినేని, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని పక్షుల కేంద్రం గట్టును పరిశీలించారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఆకాశం మేఘావృతం కావడంతో వాహనాలు తిరిగి వచ్చే అవకాశం ఉండదని వెనక్కి వచ్చేశారు. అన్నా.. నువ్వే ఏదో ఒకటి చేయాలి చింతమనేని ప్రభాకర్ మంత్రి కామినేనితో ‘అన్నా.. నా నియోజకవర్గ పరిధిలోని కోమటిలంక ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు.. నువ్వే ఏదో ఒకటి చేయాలి’ అని కోరారు. పత్రికా సోదరులు కూడా మానవతాదృకృథంతో వ్యహరించాలన్నారు. వర్షం వస్తే రోడ్డు బురదకయ్యగా మారుతోందని, విద్యార్థులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.కామినేని స్పందిస్తూ.. దేశ వ్యాప్తంగా పర్యాటకులు వచ్చే ఏకైక పర్యాటక ప్రాంతం ఆటపాక పక్షుల కేంద్రమన్నారు. దురదృష్టవశాత్తూ ఈ రోడ్డు అటవీశాఖ అభయారణ్య పరిధిలో ఉందన్నారు. అటవీ చట్టాలను గౌరవించాలి... అటవీ చట్టాలను ప్రతి ఒక్కరూ గౌర వించాలని మంత్రి చెప్పారు. కోమటిలంక గ్రామస్తుల ఇబ్బందులు వాస్తవమేనని, అటవీ అధికారుల వాదనలోనూ వాస్తవముందన్నారు. ఆటపాకలోని 300 ఎకరాల చెరువు పక్షులకు ఆశ్రయమిస్తోందని, దీనిని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. పక్షులు, ప్రజలు రెండూ ముఖ్యమని ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, కోమటిలంక గ్రామ పెద్దలు పాల్గొన్నారు. -
అలా చేస్తేవారిని బ్లాక్ లిస్ట్‌లో పెడతాం:కామినేని
-
అధికార అండతో బరితెగింపు
♦ కైకలూరు టౌన్హాల్లో పేకాట శిబిరం ♦ అనుమతులు లేకుండా నిర్వహణ ♦ పోలీసుల దాడిలో 9 మంది అరెస్టు ♦ గతంలోనే క్లబ్బుల ఏర్పాటును వ్యతిరేకించిన ఎమ్మెల్యే నాని కైకలూరు : అధికారం అండ.. ప్రజాప్రతినిధుల భరోసాతో పట్టపగలే పేకాట శిబిరాన్ని తెరిచేశారు. నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన కైకలూరు టౌన్హాల్లో బుధవారం పేకాట ఆడడానికి ప్రయత్నిస్తున్న తొమ్మిది మందిని కైకలూరు సీఐ జె.మురళీకృష్ణ ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకున్నారు. వారం రోజులుగా ఈ తంతు జరుగుతున్నా పోలీసులకు తెలియదనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టౌన్‌హాల్ పూర్వం క్లబ్‌గా ఉండేది. తదనంతరం లెసైన్సును రద్దు చేశారు. 2014 ప్రారంభంలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) గుడివాడ, కైకలూరులో క్లబ్‌లు తెరిస్తే ఆందోళన చేస్తానని చెప్పడంతో అప్పట్లో నాయకులు ఆ యోచన విరమించుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంపీ మాగంటి బాబుల వద్ద ప్రధాన అనుచరులుగా పేరుగడించిన కొందరు బడా వ్యాపారులు ఎట్టి పరిస్థితుల్లోనూ టౌన్‌హాలులో పేకాట ఆడతామని శపథం చేశారు. దీంతో ముందుగానే అక్కడ జనరేటర్‌ను ఏర్పాటు చేశారు. వారం రోజుల కిందట టౌన్‌హాలును శుభ్రం చేయించి, పేకాట కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వారం రోజులుగా రాత్రి వేళల్లో పేకాట ఆడుతున్నారు. బుధవారం కూడా వాహనాలతో టౌన్‌హాలుకు చేరుకున్నారు. వారం రోజుల తర్వాత విషయం తెలుసుకున్న పోలీసులు ముందుగా నలుగురు రాగా ఎవరూ లెక్కచేయలేదు. బయటి పట్టణాల్లో పేకాటకు వెళ్లాల్సి వస్తోందని, కొంచెం సహకరించండని సదరు వ్యక్తులు బతిమలాడటం కనిపించింది. పోలీసుల ముందే దర్జాగా... టౌన్‌హాలులో పేకాట నిర్వహణకు ఎటువంటి అనుమతులు లేవు. సీఐ జె.మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఎట్టకేలకు నాలుగు మండలాల నుంచి వచ్చిన పోలీసులు టౌన్‌హాలులో పేక ముక్కల బాక్సులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మీద రూ.1800 నగదు లభించిందని చెప్పారు. తమ బైకులు, కార్లలోనే పోలీసులతో కలసి స్టేషన్‌కు వెళ్లిన పేకాటరాయుళ్లు అనంతరం బెయిల్‌పై ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ ఘటనపై గుడివాడ డీఎస్పీ అంకినీడు ప్రసాద్‌ను వివరణ కోరగా టౌన్‌హాలులో పేకాడుతున్న విషయం తెలిసిన తర్వాత స్థానిక సీఐని అప్రమత్తం చేశామన్నారు. సీఐ మురళీకృష్ణను పేకాట శిబిరంపై వివరణ కోరగా పోలీసులు పుష్కరాల విధుల్లో ఉండటం వల్ల అడ్డుకోవడం ఆలస్యమైందన్నారు. ఎట్టిపరిస్థితుల్లో పేకాటను సాగనివ్వబోమని చెప్పారు. టౌన్‌హాలు వద్ద పోలీసులను గస్తీ పెడుతున్నట్లు తెలిపారు. -
12 నుంచి ఎంసెట్-ఏసీ కౌన్సెలింగ్
అందుబాటులో సుమారు 665 సీట్లు సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల(ఆగస్టు) 12 నుంచి ప్రైవేటు కళాశాలల్లో ఉన్న యాజమాన్య కోటా((వైద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష(ఎంసెట్)-కళాశాలల అసోసియేషన్(ఏసీ)) సీట్లకు కౌన్సెలింగ్ జరగనుంది. ఈ మేరకు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ షెడ్యూల్ ఖరారు చేసింది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని సీట్లతో పాటు ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఉన్న కన్వీనర్ కోటా సీట్లకు ఆగస్ట్ 5న కౌన్సెలింగ్ మొదలై 11న ముగుస్తుంది. అనంతరం 12 నుంచి ప్రైవేటు కళాశాలల్లో ఉన్న 35 శాతం యాజమాన్యకోటా సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఈ ఏడాది యాజమాన్యకోటా సీట్లకు ప్రత్యేక ప్రవేశ పరీక్ష(ఎంసెట్-ఏసీ) నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని ప్రైవేటు కళాశాలల్లో మొత్తం 1900 సీట్లున్నాయి. వీటిలో 35 శాతం అంటే సుమారు 665 సీట్లు యాజమాన్యకోటా కింద భర్తీ చేస్తారు.కాగా యాజమాన్య కోటా కింద భర్తీచేసుకొని ఎన్నారై కోటా కింద మారిస్తే ఊరుకోమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ హెచ్చరించారు. ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. -
మాటలకే పరిమితమైన హామీ
♦ మూడు నెలలు గడుస్తున్నా ఖరారు కాని స్థలసేకరణ ♦ వెద్యశాల ఏర్పాటుపై కేంద్ర మంత్రి, రాష్ర్ట మంత్రి చెరొక మాట ♦ ఉదయగిరికి 50 పడకల ఆస్పత్రి అందని ద్రాక్షేనా? ఉదయగిరి: ‘‘ఉదయగిరి నాకు రాజకీయ జన్మనిచ్చిన ప్రాంతం.. ఇక్కడి ప్రజల రుణం తీర్చుకోవడమే నా ప్రధాన విధి. ఈ ప్రాంతానికి ఏదో చేయాలని నా తపన. మాటలు చెప్పడం నాకు చేతకాదు.. పనిచేయడానికే ప్రాధాన్యమిస్తా. ఏడాదిలోపు 50 పడకల ఆస్పత్రిని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతా’’ అంటూ కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఫిబ్రవరి 8న ఆస్పత్రి శంకుస్థాపన సభలో హామీ ఇచ్చారు. నేడు ఈ మాటలు నీటి మూటలేనని తేటతెల్లమైంది. శంకుస్థాపన చేసి మూడు నెలలు గడుస్తున్నా స్థల సేకరణ విషయంలో స్పష్టత రాలేదు. మొదటిగా గండిపాళెం రోడ్డులో వైద్యశాల కోసం శంకుస్థాపన చేశారు.. నెల తర్వాత ఆస్పత్రి ఇక్కడ నిర్మించడం లేదంటూ స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో నిర్మిస్తున్నామని స్వయానా వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రకటించారు. ‘ఉదయగిరిలో సరైన వైద్యసదుపాయాలు లేవు. ఏ చిన్న ప్రమాదం జరిగినా మెరుగైన వైద్యసదుపాయాలకు నెల్లూరు, కడపకు వెళ్లాల్సిందే. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఉదయగిరిలో వంద పడకల ఆస్పత్రిని నిర్మిస్తాం’ అని ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు హామీ ఇచ్చారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడితో కలిసి నాబార్డు ద్వారా ఆస్పత్రికి రూ. 6.3 కోట్లు నిధులు మంజూరు చేయించారు. కానీ అదికాస్తా 50 పడకల ఆస్పత్రిగా మారింది. ఇప్పటి వరకూ స్థల సేకరణపైనే అధికారులు సరైన నిర్ణయం తీసుకోలేదు, టెండర్లనూ ఆలస్యంగా ప్రారంభించారు.. మరి ఏడాదిలోపు ఆస్పత్రిని ఎలా నిర్మిస్తారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం స్థల సేకరణలో స్పష్టతనిచ్చి, టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి 50 పడకల ఆస్పత్రిని త్వరగా నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. -
మోదీని విమర్శించే స్థాయి కాంగ్రెస్‌కు లేదు
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కైకలూరు : ప్రజలతో ఛీకొట్టించుకుని కనీసం డిపాజిట్లు కూడా దక్కని కాంగ్రెస్ పార్టీకి ప్రధాని నరేంద్రమోదీని విమర్శించే స్థాయి లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ చెప్పారు. కృష్ణాజిల్లా కైకలూరులో ఆదివారం జరిగిన జన్మభూమి ముగింపు సభకు ఆయన హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ.. బీజేపీపై విమర్శలు చేస్తున్న ఏపీసీసీ అధ్యక్షుడికి కనీసం డిపాజిట్లు కూడా రాలేదనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. వైఎస్ జగన్ రైతులకు అన్యాయం జరిగిందని అంటున్నారని, సీఎం చంద్రబాబు తగిన న్యాయం చేస్తారని వివరించారు. ఈ నెల 9న చంద్రబాబు చేతుల మీదుగా ఈ-ఔషధం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 1400 మంది డాక్టర్ల నియామకం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు మందులు లేవంటే సంబంధిత డాక్టర్లను సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు), మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ ఎంసెట్ ఏసీ ఫలితాలు విడుదల
విజయవాడలో ఫలితాలు విడుదల చేసిన మంత్రి కామినేని విజయవాడ (లబ్బీపేట): ఏపీలో తొలిసారిగా ప్రైవేటు వైద్య కళాశాలల్లోని యాజమాన్య కోటా (బి కేటగిరీ) సీట్ల భర్తీకోసం నిర్వహించిన ఎంసెట్ ఎ.సి.(అసోసియేటెడ్ కాలేజెస్) 2015 ప్రవేశ పరీక్ష ఫలితాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో గురువారం విడుదల చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ యాజమాన్య కోటా సీట్ల ప్రవేశ పరీక్ష పారదర్శకంగా నిర్వహించామన్నారు. ఈ పరీక్షలో వచ్చిన మార్కులకు ఇంటర్మీడియెట్ మార్కులు కలిపిన తర్వాత మెరిట్ అభ్యర్థులకు కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశం కల్పిస్తామన్నారు. ఎంబీబీఎస్‌లో 700, బీడీఎస్‌లో 387 సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. తొలిసారి జరిగిన ఈ ప్రవేశ పరీక్షలో తంగెళ్ల ఆదర్శవర్ధన్ 153 మార్కులతో ఫస్ట్ ర్యాంకు, అమ్మిరెడ్డి వెంకట శివకృష్ణారెడ్డి 145 మార్కులతో రెండో ర్యాంకు, సాయిగోపాల కూరపాటి 144 మార్కులతో మూడో ర్యాంకు సాధించారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో హెల్త్ వర్సిటీ వీసీ డా. టి.రవిరాజు, రిజిస్ట్రార్ డా.ఎస్.బాబూలాల్, ఎంసెట్ ఏసీ కన్వీనర్ కొడాలి జయరమేశ్ పాల్గొన్నారు. రేవంత్ చేసింది సరైంది కాదు నామినేటెడ్ ఎమ్మెల్యేకు ముడుపులిచ్చిన రేవంత్‌రెడ్డి చర్య ప్రోత్సహించేది కాదని మంత్రి కామినేని చెప్పారు. ప్రజలు ఒక పార్టీకి, ఒక వ్యక్తికి ఓట్లేసి గెలిపించాక మరో పార్టీలో చేరడం సరికాదన్నారు. మ్యాగీ నూడుల్స్ విషయంలో ప్రభుత్వం శాంపిల్స్ సేకరించిందని, ఫలితాల ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. -
అనంత సస్యశ్యామలమే లక్ష్యం
మోడీ ఏడాది పాలన స్ఫూర్తిదాయకం కాంగ్రెస్ వాళ్లు ఇప్పటికీ బుద్ధి తెచ్చుకోకపోవడం దురదృష్టం జనకల్యాణ పర్వ ప్రచార సభలో మంత్రి కామినేని శ్రీనివాస్ అనంతపురం కల్చరల్ : కరువు జిల్లాను సస్యశ్యామలం చేయడానికి తన వంతు కృషి చేస్తానని జిల్లా ఇన్చార్జి మంత్రి కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కమ్మభవన్ వేదికగా జన కల్యాణ పర్వ ప్రచార సభ జరిగింది. బీజేపీ జిల్లా అధ్యక్షులు అంకాళ్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్‌తో పాటు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పార్థసారధి, ఎన్టీ చౌదరి, సందిరెడ్డి శ్రీనివాసులు తదితరులు విశిష్ట అతిథులుగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి ఏడాది పాలనలో ప్రతి వర్గానికి లబ్ధి చేకూర్చే పథకాలను ప్రవేశపెట్టి అందరికి చేరువయ్యారని కొనియాడారు. దేశ ప్రజలే కాకుండా అనేక దేశ, విదేశ సర్వేలు మోడీ పాలనకు మంచి మార్కులు వేశాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో దేశం భ్రష్టు పట్టిపోయినా ప్రజలు చీత్కరించుకుని డిపాజిట్లు కోల్పోయేలా చేసినా ఇంకా బీజేపీని విమర్శిస్తుండడం వారి దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు. మహిళలు, వృద్ధులకు, యువతకు, బాలికలకు ఇలా ప్రతి వర్గం సంక్షేమం దృష్టిలో ఉంచుకుని చేపడుతున్న పలు పథకాలను ప్రజల వద్దకు చేరేలా చేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో మరే పార్టీకి లేనంత ప్రజాధరణ బీజేపీకి ఉందని అతిపెద్ద పార్టీగా అవతరించడమే అందుకు నిదర్శనమన్నారు. ప్రత్యేక హోదా గురించి ప్రస్తావిస్తూ అధికారం కోల్పోయిన రఘువీరారెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నాడని నవ్యాంధ్ర ప్రదేశ్‌కు బీజేపీ ఎంతగానో సహకరిస్తోందన్నారు. పలువురు పార్టీలో చేరిక మంత్రి అనంత పర్యటన సందర్భంగా పలువురు ఆ పార్టీలో చేరారు. హరీష్ రెడ్డి, నాగేంద్ర తదితరులను బీజేపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసి ఒంటిరిగా అధికారంలోని వద్దామని ఈ సందర్భంగగా పలువురు నేతలు పేర్కొనడం విశేషం. కార్యక్రమంలో ఆపార్టీ నేతలు వేంకటేశ్వరరెడ్డి, జగన్మోహన్, సుదాకరరెడ్డి, డాక్టర సోమయాజులు, బిజెవైఎం విష్ణువర్ధన్‌రెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తలదించుకునే స్థితిలో వైద్యసేవలు
వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ రాయదుర్గం టౌన్ : రాష్ట్రంలో ప్రభుత్వ రంగ వైద్యసేవల పరిస్థితి సిగ్గుతో తలదించుకునేలా ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. వైద్య రంగాన్ని మెరుగుపరిచేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. స్థానిక కమ్యూనిటీ వైద్యశాలలో రూ.3.82 కోట్ల నాబార్డు నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు బుధవారం ఆయనతోపాటు ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు శంకుస్థాపన, భూమిపూజ చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. వెనుకబడిన రాయలసీమ అభివృద్ధి కోసం చేయాల్సిందే ఎంతో ఉందన్నారు. మాతాశిశు మరణాల సంఖ్య దక్షిణ భారత దేశంలోనే అధికంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందజేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో 1412 మంది వైద్యులను వివిధ విభాగాల్లో నియమించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆస్పత్రులను అభివృద్ధి, భవనాల మరమ్మతు, మందులు, వైద్యుల కొరత నివారణ, తదితర అంశాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. పెలైట్ ప్రాజెక్ట్ ద్వారా అనంతపురం జిల్లాలోని హిందూపురం, రాయదుర్గం ప్రభుత్వాస్పత్రుల్లో 35 రకాల డయాగ్నసిస్ పరీక్షల కోసం ప్రత్యేక ల్యాబ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. త్వరలో దీనిని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సహకారంతో రాష్ట్రానికి రూ.350 కోట్ల నాబార్డు నిధులు సాధించుకున్నామన్నారు. ఇందులో అనంతపురం జిల్లాకే రూ.47 కోట్లు కేటాయించమన్నారు. సరిహద్దు ప్రాంతాలైన రాయదుర్గం, కణేకల్లులోని సీహెచ్‌సీలో అభివృద్ధి పనులకు రూ.6 కోట్ల నిధులు కేటాయించామన్నారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు త్వరలో రాయదుర్గం ఆస్పత్రికి గైనకాలజిస్ట్, అనేస్తీషియా డాక్టర్, చిన్న పిల్లల వైద్యున్ని నియామకానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి కాన్పూ ప్రభుత్వాస్పత్రుల్లోనే జరిగే విధంగా చూస్తామన్నారు. ఆయన తన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. ఎమ్మెల్సీలు గేయానంద్, మెట్టు గోవిందరెడ్డి, మునిసిపల్ చైర్మన్ రాజశేఖర్, వైస్ చైర్మన్ కడ్డిపుడి మహబూబ్‌బాష, డీఎహెచ్‌ఓ ప్రభుదాస్, జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం, డీసీహెచ్ఎస్ సత్యనారాయణ, ఏజేసీ ఖాజామొహిద్దీన్, కమిషనర్ రామచంద్రరావు పాల్గొన్నారు. -
బీజేపీ నేతల్లో నైరాశ్యం..!
నామినేటెడ్ పదవులు దక్కని వైనం సొంత మంత్రుల శాఖల్లోనూ అవమానం అసంతృప్తిలో జిల్లా నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లే యత్నం నేడు బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం విజయవాడ : అటు కేంద్రంలో అధికారంలోనూ, ఇటు రాష్ట్రంలో అధికార పార్టీకి మిత్రపక్షంగా ఉన్నా తమకు న్యాయం జరగట్లేదని బీజేపీ జిల్లా నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు దాటినా జిల్లాలో ఒక్క నామినేటెడ్ పదవైనా దక్కకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ జెండాను మోయడానికే తమను ఉపయోగిస్తున్నారంటున్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో సోమవారం జరిగే పార్టీ వ్యవస్థాపక దినోత్సవానికి వస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు దృష్టికి సమస్య తీసుకెళ్లాలని యోచిస్తున్నారు. మంత్రుల శాఖల్లోనూ అవమానం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, దేవాదాయశాఖ మంత్రి పి.మాణిక్యాలరావు బీజేపీకి చెందినవారే. నూతనంగా ఏర్పడిన విజయవాడ ప్రభుత్వాస్పత్రి కమిటీలో గానీ, దసరా ఉత్సవాల సమయంలో దుర్గగుడి ఉత్సవ కమిటీలో గానీ బీజేపీ నేతలకు అవకాశం దక్కలేదు. పార్టీకి చెందిన మంత్రులు తమ సొంత శాఖల్లో కూడా బీజేపీ నేతలకు అవకాశం కల్పించకపోవడంపై పార్టీ శ్రేణులను విస్మయానికి గురిచేస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేల సిఫారసులను మాత్రమే మంత్రులు ఆమోదిస్తున్నారు తప్ప బీజేపీ సీనియర్ నేతలు చెప్పిన మాటల్ని లెక్కచేయడం లేదని బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. అండగా నిలబడరేం..? సత్యనారాయణపురం సీతారామ కల్యాణమండపం వివాదం విషయంలో కూడా తాము రోడ్డెక్కి టీడీపీ ఎమ్మెల్యే తీరును ఎండగట్టినా బీజేపీ మంత్రులు స్పందించకపోవడంపై వారు ఆగ్రహంతో ఉన్నారు. దుర్గగుడి చైర్మన్ పదవిని బీజేపీకి ఇస్తారంటూ గతంలో ప్రచారం జరిగిందే తప్ప ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. అలాగే, దేవాలయాల కమిటీల్లోనూ, మార్కెట్ యార్డుల కమిటీల్లోనూ తమకు అవకాశాలు కల్పించాలని బీజేపీ నేతలు కోరడమే తప్ప రాష్ర్ట ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. దీనిపై మంత్రులు స్పందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. మిత్రధర్మమంటూ నోరు మూసేస్తున్నారు.. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది. విపక్షాలతో కలిసి టీడీపీ నేతల్ని ఎండగట్టేందుకు స్థానిక బీజేపీ నేతలు సిద్ధమైనప్పుడల్లా మిత్రధర్మమంటూ సీనియర్లు నోరు నొక్కుతున్నారని, దీంతో తప్పని పరిస్థితుల్లో అవమానాలు దిగమింగి పనిచేయాల్సి వస్తోందని బీజేపీ కార్యకర్తలు కొందరు చెబుతున్నారు. సభ్యత్వ నమోదు, ప్రముఖులు వచ్చినప్పుడు సమావేశాలకు ఆహ్వానించడమే తప్ప ఇతర విషయాల్లో క్యాడర్‌కు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదనేది మరికొందరి వాదన. దీంతో క్యాడర్ చేజారి పోతుందేమోనన్న భయం జిల్లా, నగర నేతల్లో వ్యక్తమవుతోంది. జిల్లా నేతలు పట్టించుకోకపోవడంతో రాష్ట్ర అధ్యక్షుడు సమస్య వివరించాలని, అక్కడి నుంచి కూడా సరైన స్పందన రాకపోతే జాతీయ పార్టీ దృష్టికి తీసుకువెళ్లాలని స్థానిక నాయకులు భావిస్తున్నారు. తాము మాత్రమే మిత్రధర్మం పాటిస్తే సరిపోదని, టీడీపీ నేతలు కూడా పాటించాలని, ఆ దిశగా రాష్ట్ర పార్టీ చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. -
పట్టిసీమ నీళ్లు రప్పించడం సులువు కాదు: మంత్రి కామినేని
బి.కొత్తకోట (చిత్తూరు): రాయలసీమకు పట్టిసీమ నీటిని రప్పించడంసులువైంది కాదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. ఆదివారం మధ్యాహ్నం చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రభుత్వం పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు, అక్కడి నుంచి రాయలసీమకు నీటిని మళ్లించాలని అనుకుంటోందన్నారు. ఇది తేలికైన విషయం కాదని అయినప్పటికీ ముఖ్యమంత్రి ఈ పనులు పూర్తి చేయించేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. రాయలసీమలో దుర్భిక్ష పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, ఈ ప్రాంతానికి నీటిని అందించే విషయంలో రాజకీయాలు పక్కనపెట్టి అందరూ సహకరించాలని కోరారు. ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించినా ప్యాకేజీ పేరుతో ఆందోళనలు చేయడం అర్థరహితమని విమర్శించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 700 వైద్యుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆస్పత్రుల్లో మందుల కొరత లేదన్నారు. ఒడిశా కంటే ఏపీలోనే అత్యధిక మాతాశిశు మరణాలు సంభవిస్తున్నాయని, ఇది సిగ్గుపడాల్సిన విషయమన్నారు. -
ఇంతలోనే ఎంత మార్పు..!
‘ఆస్పత్రి నిద్ర’లో కామినేని వ్యవహార శైలి మార్పు వైద్యులను పాజిటివ్‌గా చూపాలని మీడియాను కోరిన వైనం ప్రచారం కోసమే మంత్రి హడావుడి అంటూ విమర్శలు లబ్బీపేట : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ‘ఆస్పత్రి నిద్ర’ అంతా షోగా మారింది. ఆస్పత్రుల్లో మార్పు కోసమే ఈ కార్యక్రమం చేపట్టానని మంత్రి చెప్పారు. అయితే, వైద్య సేవల్లో మార్పు ఏమోగానీ.. మంత్రి వ్యవహరశైలిలో మాత్రం కచ్చితంగా మార్పు వచ్చింది. ప్రభుత్వాస్పత్రులకు వెళ్లగానే అక్కడి వైద్యులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ... వైద్య రంగం భ్రస్టు పట్టిందని మండిపడే మంత్రి... ఇందుకు విరుద్ధంగా ‘ఆస్పత్రినిద్ర’లో వైద్యులు, వైద్య సేవల విషయంలో సానుకూలంగా వ్యవహరించాలని మీడియాను కోరడమే ఇందుకు నిదర్శనం. పదే పదే నెగిటివ్‌గా చూపించడం వల్ల ప్రయోజనం లేదని, పాజిటివ్‌గా స్పందిస్తే, అదే స్ఫూర్తితో మరింత మెరుగైన సేవలు అందించగలరని మంత్రి కామినేని పేర్కొన్నారు. ‘ఆస్పత్రి నిద్ర’ కొనసాగిందిలా.. ఆదివారం రాత్రి 9.10 గంటలకు ప్రభుత్వాస్పత్రికి వచ్చిన మంత్రి క్యాజువాలిటీని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత డయోగ్నోస్టిక్ బ్లాక్‌లో ఎగ్జామినర్ల కోసం ఏర్పాటుచేసిన గదిలో నిద్రకు ఉపక్రమించారు. సోమవారం ఉదయం ఆరు గంటలకు నిద్రలేచిన మంత్రి కొద్దిసేపు దినపత్రికలు చదివారు. తమ సమస్యలపై ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన వినతిపత్రాలు స్వీకరించారు. ఏడు గంటల సమయంలో ఆస్పత్రిలో సిద్ధం చేసిన వేడి నీటితో స్నానం చేసి, ఆల్పాహారం తీసుకున్నారు. 7.15 గంటలకు ఆస్పత్రిలోని వార్డుల పరిశీలన ప్రారంభించారు. క్యాజువాలిటీ, అక్యుట్మెడికేర్, మెడికల్, ఆర్ధోపెడిక్ వార్డులను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. మంత్రి వస్తున్నట్లు ముందుగానే తెలియడంతో వార్డులోని పడకలపై కొత్త బెడ్షీట్లు వేయడంతోపాటు ఎక్కడా పారిశుధ్య సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తాను వచ్చినప్పుడు మాత్రమే కాదని, రోజూ శానినేషన్ ఇలాగే ఉండాలని అధికారులకు మంత్రి చెప్పారు. ఏసీ గదిలో ఉంటే సమస్యలు ఎలా తెలుస్తాయి.. ఆస్పత్రి వార్డులో గానీ, కనీసం ప్రొఫెసర్ల గదిలో గానీ మంత్రి నిద్రకు ఉపక్రమిస్తే రోగుల ఇబ్బందులు తెలుస్తాయని, గెస్ట్‌లు, ఎగ్జామినర్ల కోసం నిర్మించిన ఏసీ గదిలో ఉంటే సమస్యలు ఎలా కనిపిస్తాయనే విమర్శలు వినిపిస్తున్నారు. వార్డులో రోగుల మధ్య గంటసేపైనా ఉంటే దోమల పోటు, గాలిలేక ఉక్కపోతతో అల్లాడుతున్న వైనం అర్థమయ్యేదని కొందరు సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. ఆస్పత్రికి సమీపంలోనే మంత్రి ఇల్లు ఉందని, రోజూ ఉదయం వచ్చి తనిఖీలు చేసి ఆస్పత్రిలో మార్పు తీసుకురావొచ్చని, ఇక్కడికి వచ్చి ఏసీ గదిలో నిద్రకు ఉపక్రమిస్తే ఫలితం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మంత్రి ‘ఆస్పత్రి నిద్ర’ కారణంగా సిబ్బంది అంతా ఆయన చుట్టూ హడావుడిగా ఉండటంతో పలువురు రోగులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రచారార్భటమే! :‘ఆస్పత్రి నిద్ర’ప్రచారార్భటమేనని, ప్రయోజనం ఏమీ లేదనే వాదన వినిపిస్తోంది. మంత్రి వైఖరి కూడా ఇందుకు బలాన్నిస్తోంది. ఆదివారం రాత్రి ఆస్పత్రికి వచ్చిన వెంటనే ప్రెస్‌మీట్ పెట్టిన మంత్రి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు వార్డులు పరిశీలిస్తానని తెలిపారు. ఉదయం మీడియా ప్రతినిధులు ఆస్పత్రికి చేరుకున్న తర్వాతే వార్డుల పరిశీలన ప్రారంభించిన మంత్రి, మీడియా వాళ్లు వార్డుల నుంచి బయటకు రాగానే మంత్రి సైతం వచ్చేశారు. దీంతో మంత్రి ప్రచారానికే పెద్దపీట వేశారనే విమర్శలకు బలం చేకూరినట్టయింది. -
‘హెల్త్ స్కీమ్’ సేవలపై వీడిన సందిగ్ధం
ఆషా ప్రతినిధులతో మంత్రి కామినేని చర్చలు విజయవాడ: ఉద్యోగులకు నగదు రహిత సేవల విషయంలో 4 నెలలుగా నెలకొన్న సందిగ్ధతకు ఎట్టకేలకు తెరపడింది. మెడికల్ ఇల్నెస్ కేసులకు సంబంధించి ప్యాకేజీతో నిమిత్తం లేకుండా.. ఖర్చు మొత్తం చెల్లించడంతో పాటు కొన్ని అభ్యంతరకరమైన ప్యాకేజీలను సడలించేందుకు 3 నెలల్లో చర్యలు తీసుకుంటానని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆషా(ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్) ప్రతినిధులకు హామీ ఇచ్చారు. దీంతో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్)పై సేవలు అందించేందుకు ఆస్పత్రి యాజమాన్యాలు సుముఖత వ్యక్తం చేశాయి. ఈహెచ్ఎస్ సేవలపై చర్చించేందుకు ఆషా ప్రతినిధులు డాక్టర్ పి.వి. రమణమూర్తి, డాక్టర్ పి.రమేష్‌బాబు, డాక్టర్ విశ్వేశ్వరరావు, డాక్టర్ మొవ్వ పద్మ ఆదివారం విజయవాడలో మంత్రితో సమావేశమయ్యారు. ఈహెచ్ఎస్ సేవలందించేందుకు తమ అభ్యంతరాలను తెలియజేశారు. మెడికల్ ఇల్నెస్ సేవలను ముందుగా నిర్ణయించిన ప్యాకేజీతో చేయలేమని, కొన్ని ప్యాకేజీలు తక్కువగా ఉండడంతో ఆస్పత్రులు ముందుకు రాని విషయాన్ని తేల్చి చెప్పారు. కాగా, ఉద్యోగ సంఘాలతో ఈ నెల 25న చర్చించడంతోపాటు 26న ఆషా ప్రతినిధులను సీఎం వద్దకు తీసుకెళ్లి చర్చించనున్నట్టు కామినేని శ్రీనివాస్ విలేకరులకు తెలిపారు. ఆషా ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. -
సీను మారేనా..!
నేడు ప్రభుత్వాస్పత్రిలో మంత్రి కామినేని ‘ఆస్పత్రి నిద్ర’ ఏసీ గదిని సిద్ధం చేసిన అధికారులు రోగుల ఇబ్బందులను తెలుసుకునే అవకాశం సమస్యల పరిష్కరానికి చొరవ చూపాల్సిన అవసరం ఉంది లబ్బీపేట : ‘ఆస్పత్రి నిద్ర’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆదివారం రాత్రి నగరంలోని ప్రభుత్వాస్పత్రిలో నిద్రించనున్నారు. ఇందుకు సంబంధించి ఆస్పత్రి అధికారులు డయాగ్నొస్టిక్ బ్లాక్‌లో ఒక గదిని సిద్ధంచేశారు. మంత్రి రాత్రి వేళ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులకు అందుతున్న వైద్య సేవలు పరిశీలిస్తారని తెలిసింది. దీంతో ప్రభుత్వాస్పత్రిలో దీర్ఘకాలంగా నెలకొన్న సమస్యలు మంత్రి దృష్టికి వచ్చే అవకాశం ఉంది. అయితే, ఇప్పటికే ఆస్పత్రి సమస్యలపై పలుమార్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని, కనీసం ‘ఆస్పత్రి నిద్ర’ తర్వాత అయినా వాటికి పరిష్కారం చూపాలని పలువురు వైద్యులు కోరుతున్నారు. డాక్టర్ గారూ.. వీటిపై దృష్టిపెట్టండి.. ఆస్పత్రిలో రేడియోగ్రాఫర్లు, సీటీ స్కానింగ్ టెక్నీషియన్ల కొరత తీవ్రంగా ఉంది. దీనివల్ల రాత్రి 8 గంటల తర్వాత సీటీ స్కానింగ్ యంత్రం నిలిచిపోతుంది. మధ్నాహ్నం 12 గంటలు దాటితే రక్త పరీక్షల కోసం ప్రయివేటు ల్యాబ్‌లను ఆశ్రయించాల్సి వస్తోంది. కడుపు నొప్పితో బాధపడేవారికి ఆల్ట్రా సౌండ్ స్కాన్ చేయాల్సి వచ్చినా ప్రయివేటు సెంటర్లకు పరుగులు తీయాల్సిందే. రాత్రి వేళ ఒక్కోసారి ఈసీజీ తీసేందుకు కూడా సిబ్బంది అందుబాటులో ఉండటం లేదు. రెండు, మూడు వార్డులకు ఒకే స్టాఫ్ నర్సు విధులు నిర్వహిస్తుంటారు. అర్ధరాత్రి వేళ రోగులకు ఎమైనా అయితే పరుగులు పెట్టాల్సిందే. రేడియోగ్రాఫర్లను నియమించాలని, సీటీ టెక్నిషియన్లను అపాయింట్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులకు రెండు సంవత్సరాలుగా లేఖలు రాసినా పట్టించుకోవడం లేదు. నాలుగు నెలల క్రితం ప్రభుత్వాస్పత్రికి డిజిటల్ ఎక్స్‌రే మిషన్ వచ్చినా, రేడియోగ్రాఫర్ లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. కొత్త, పాత ఆస్పత్రుల్లో ఒక్కరే రేడియోగ్రాఫర్ ఉండటంతో సమస్య తలెత్తింది. ప్రభుత్వాస్పత్రిలో ఉన్న రెండు లిఫ్ట్‌లు నాలుగు నెలలుగా పనిచేయడంలేదు. దీంతో రోగులు పై అంతస్తులకు వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు.పలు వార్డుల్లో, ప్రొఫెసర్ల గదుల్లో పైకప్పు శ్లాబ్ పెచ్చులూడి పడుతున్నాయి. ఆస్పత్రిలోని రెండు ఆపరేషన్లు రెండేళ్లుగా మూతపడి ఉన్నాయి. ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరిగిన కొద్దీ థియేటర్లు పెరగాల్సి ఉండగా, ఇక్కడ మూతపడటంతో ఆపరేషన్లు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ విషయాన్ని ఏడు నెలల క్రితం జరిగిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో మంత్రి దృష్టికి అధికారులు తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. డ్రెయినేజీలు, రోడ్లు అధ్వానంగా మారాయి. వర్షం వస్తే ఆస్పత్రి ప్రాంగణం జలమయంగా మారుతోంది. మంత్రి ఈ విషయాలపై దృష్టి సారిస్తే రోగులకు మెరుగైన వైద్యం అందే అవకాశం ఉంది. -
ఫిబ్రవరిలో రిమ్స్‌కు డీఎంఈ
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని ఒంగోలు సెంట్రల్: ‘రిమ్స్‌కే రోగమెచ్చింది’ అనే శీర్షికన బుధవారం ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఇంట అల్పాహారం స్వీకరించిన అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ రిమ్స్ సమస్యలపై ఫిబ్రవరి మొదటి వారంలో డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, జిల్లా కలెక్టర్లు రిమ్స్‌ను సందర్శించి సమస్యలపై అధ్యయనం చేస్తారన్నారు. ఆర్థిక, ఆర్థికేతర అంశాలపై నివేదిక అందిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్వైన్‌ఫ్లూకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందన్నారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక వైద్య బృందాన్ని రాష్ట్రానికి పంపించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ కేసులు 24 నమోదు అయ్యాయని, 2 మరణాలు సంభవించాయన్నారు. దీని నివారణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అన్ని వైద్యశాలల్లో ఐసొలేషన్ వార్డులు, మందులు, మాస్కులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్వైన్‌ఫ్లూపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ‘సాక్షి’పై రిమ్స్ డెరైక్టర్ ఆక్రోశం సాక్షి ప్రచురించిన కథనంపై రిమ్స్ డెరైక్టర్ ఆక్రోశం వెళ్లగక్కారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ను కలిసిన అనంతరం మాట్లాడుతూ ‘మంత్రి వచ్చినప్పుడే రాయాలా’ అని మండి పడ్డారు. ‘మంత్రికి రిమ్స్ సమస్యలు తెలిస్తేనే కదా పరిష్కరించేది’ అని సాక్షి విలేకరి అనడంతో తాను వెళ్లిపోయిన తర్వాత రిమ్స్‌కు వైద్య ప్రొఫెసర్లు ఎవరూ రారని తెలిపారు. రిమ్స్ అదనపు ఆర్ఎంఓ సుబ్బారావు కూడా అసహనం వ్యక్తం చేశారు. స్వైన్‌ఫ్లూపై వైద్యశాఖ అవగాహన కార్యక్రమాలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్వైన్‌ఫ్లూపై నగరంలోని పలు కూడళ్లు, ఆర్టీసీ బస్టాండ్, రైల్వేస్టేషన్, మురికి వాడలు, విద్యాసంస్థల్లో స్వైన్ ఫ్లూ వ్యాధి లక్షణాలు, వ్యాధి నివారణపై బుధవారం అవగాహన కల్పించారు. సమస్యపై సాక్షి విలేకరి మంగళవారం పత్రికా విలేకరుల సమావేశంలో ప్రశ్నించడంతో డీఎంహెచ్ఓ డాక్టర్ జె. యాస్మిన్ చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో బి. శ్రీనివాసరావు, పద్మజ, హెల్త్ ఎడ్యుకేటర్లు సుమతి, శ్రీదేవి, కృష్ణారావు పాల్గొన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తాం కె.బిట్రగుంట(జరుగుమల్లి) : ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లు, తాగునీరు, కరెంటు, తదితర సదుపాయాలు కల్పిస్తామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని కె.బిట్రగుంట గ్రామంలో నిర్మించిన కేజీబీవీ పాఠశాలను మంత్రులు బుధవారం ప్రారంభించారు. మంత్రి గంటా మాట్లాడుతూ కేజీబీవీ ఆహ్లాదకరంగా ఉందన్నారు. ప్రహరీ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. బాలికలకు స్కూలు బ్యాగ్‌లు పంపిణీ చేశారు. మంత్రులు పి.మాణిక్యాలరావు, పత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ, శిద్దా రాఘవరావు, పల్లె రఘనాథరెడ్డి, రావెళ్ల కిషోర్‌బాబు, ఎంపీ అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, డాక్టర్ స్వామి, కదిరి బాబూరావు, ఏలూరి సాంబశివరావు, కరణం బలరామకృష్ణమూర్తి, కలెక్టర్ విజయకుమార్, సబ్‌కలెక్టర్ మల్లికార్జున, సినీ నటుడు అశోక్‌కుమార్, ఎంపీపీ పోటు పద్మావతి, జెడ్పీటీసీ గాలి పద్మావతి, సర్పంచి ఏలూరి రాంబాబు, కేజీబీవీ ఎస్వో ఎన్.స్రవంతి, అధికారులు పాల్గొన్నారు. -
జిల్లాకు పాకిన స్వైన్‌ఫ్లూ
అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ హెల్ప్‌లైన్ నంబరు ఏర్పాటు రాష్ట్ర మంత్రి, కమిషనరు ఆరా హైదరాబాద్‌ను వణికిస్తున్న స్వైన్‌ఫ్లూ జిల్లాకు కూడా వ్యాపించింది. పుంగనూరులో ఓ వ్యక్తి స్వైన్‌ఫ్లూ బారినపడి బెంగళూరులోని ఓ వైద్యశాలలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా తిరుపతిలోని 71 ఏళ్ల వృద్ధురాలికి స్వైన్‌ఫ్లూ సోకిందని మంగళవారం నిర్ధారణ అయింది. రుయాలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తికి స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్టు గుర్తించిన వైద్యులు పరీక్షల నిమిత్తం బుధవారం శాంపిల్స్‌ను హైదరాబాద్‌కు పంపారు. మరో ముగ్గురు అనుమానంతో రుయాలో చేరారు. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, కుటుంబ సంక్షేమశాఖ రాష్ట్ర కమిషనరు అగర్వాల్ డీఎంఅండ్‌హెచ్‌వో కోటీశ్వరితో ఫోన్లో ఆరా తీశారు. మరోవైపు స్వైన్‌ఫ్లూ నుంచి ప్రజల్ని అప్రమత్తం చేయడానికి వైద్యారోగ్యశాఖ 24 గంటలూ పనిచేసే హెల్ప్‌లైన్ నంబర్‌ను బుధవారం ప్రారంభించింది. ఎలాంటి సమస్య ఉన్నా 9849902379 నంబరుకు ఫోన్ చేయాలని అధికారులు పేర్కొన్నారు. చిత్తూరు (అర్బన్)/తిరుపతి కార్పొరేషన్: మొన్న పుంగనూరు వాసి, నిన్న తిరుపతికి చెందిన వృద్ధురాలికి స్వైన్ ఫ్లూ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. బుధవారం మరో వ్యక్తి లక్షణాలున్నట్టు తెలియడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. భద్రాచలం పర్యటనతోనేనా? తిరుపతిలో స్వైన్‌ఫ్లూ బారిన పడ్డ వృద్ధురాలు రెండు వారాల క్రితం భద్రాచలం విహారయాత్రకు వెళ్లారు. ఆమెతో పాటు 40 మంది కూడా టూర్ ఏజెన్సీ ద్వారా వెళ్లిన వారిలో ఉన్నారు. ఆమెకు స్వైన్‌ఫ్లూ లక్షణాలు గుర్తించిన ఆమె కుమారుడు (ప్రైవేటు ఆసుపత్రి నిర్వాహకుడు) తన ఆస్పత్రిలోనే చికిత చేశాడు. మెరుగుపడకపోవడంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి పరిస్థితిని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అయితే టూర్‌కు వెళ్లిన 40మందిలో ఎవరికైనా స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్నాయా? లేదా? అని తెలుసుకోడానికి చర్యలు ప్రారంభించారు. వృద్ధురాలి కుటుంబంలోని 17 మందికి కూడా వైద్య పరీక్షలు చేశారు. వీళ్లందరి ఆరోగ్య పరిస్థితిపై ఓ వైద్య బృందం ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది. స్వైన్‌ఫ్లూ లక్షణాలు శీతాకాలంలో మంచు ఎక్కువగా పడుతున్నప్పుడు హెచ్1,ఎన్1 అనే వైరస్ వల్ల స్వైన్ ఫ్లూ వ్యాపిస్తుంది. సాధారణంగా మామూలు ఫ్లూ (వైరస్) లాగా శరీరంలోకి ప్రవేశిస్తుంది. జలుబు, దగ్గు, జ్వరం తలనొప్పి, భయంకరమైన ఒల్లు నొప్పులు పట్టి పీడిస్తాయి. ఆయాసం ఎక్కువగా ఉండి ఇబ్బందికరంగా మారుతుంది. ఈ లక్షణాలు ఉంటే స్వైన్ ఫ్లూగా అనుమానించాల్సి ఉంటుంది. వీరు తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి వైద్య సేవలు పొందాలి. ఈ లక్షణాలు వుంటే ఆ వ్యక్తి గొంతు నుంచి స్వాబ్ కలెక్ట్ చేసి హైదరాబాద్‌లోని ఐపీఎం ఇన్స్టిట్యూట్కి పంపిస్తారు. అక్కడ ఆధునిక పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ చేసి, స్వైన్ ఫ్లూ వైరస్‌ను గుర్తిస్తారు. సకాలంలో వైరస్‌ను గుర్తించకపోతే అది లివర్‌పై దాడిచేసి, శరీరంలోని మిగిలిన అవయవాలను చిన్నాభిన్నం చేస్తుంది. చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్త చిన్న పిల్లలూ, వృద్ధులకు వ్యాధి నిరోధిక శక్తి తక్కువగా ఉంటుంది. మంచు ఎక్కువగా కురుస్తూ, గాలిలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు స్వైన్ ఫ్లూ కారక వైరస్ వ్యాపిస్తుంది. మధుమేహం (షుగర్), హెచ్ఐవి సోకిన వారు ముందుజాగ్రత్తలు తీసుకుని ఈ వైరస్ బారినుంచి తప్పించుకోవచ్చు. ఏసీ బస్సులు, రైళ్లలో ప్రయాణం చేయవద్దని, సంతలు, జాతరలు, తిరునాళ్లు ఉన్న చోట్ల గుంపులు ఉన్న చో టికి వెళ్లకూడదు. ఏసీ సినిమా హాళ్లలోకి మాస్కులు లేకుండా వెళ్లకూడదని వైద్యులు చెబుతున్నారు. నివారణ మార్గాలు స్వైన్‌ఫ్లూ వ్యాధి అనుమానితులకు దూరంగా ఉండటం, ఫ్లూ ఉన్న వారు విధిగా ఎన్-95 మాస్కులు ధరించాలి. తుమ్మినా, దగ్గినా, ముక్కు చీదిన ప్రతిసారీ చేతులను సబ్బుతో శుభ్రపరుచుకోవాల్సి ఉంది. గుంపులుగా ఉన్న చోటకు వెళ్లకూడదు. వాతావరణంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న ప్రదేశాల్లో ఎక్కువ సమయం గడపాలి. సాధారణంగా 28 నుంచి 30 సెల్సియస్ డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలుంటే గాలిలోనే వైరస్ నశిస్తాయి. భయపడాల్సిన పనిలేదు స్వైన్ ఫ్లూ వైరస్ సోకినంత మాత్రాన భయపడాల్సిన పనిలేదు. లక్షణాలను ముందుగానే పసిగట్టి వైద్యుల పర్యవేక్షణలో వైద్య సేవలు పొందితే వారంలోగా వ్యాధిని నయం చేసుకోవచ్చు. సాధారణ వైరస్లలో స్వైన్ ఫ్లూ వైరస్ కూడా ఒక్కటి మాత్రమే. కాకుంటే వ్యాధి నిరోధక శక్తి అతితక్కువగా ఉన్న వ్యక్తులకు మాత్రమే ఇది సోకుతుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం. తిరుమల సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో ఉండటం, చెట్లు అధిక సంఖ్యలో ఉండటం వల్ల ఈప్రాంతంలో స్వైన్‌ఫ్లూ వంటి వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు అతి తక్కువ. అదేవిధంగా తిరుపతిలో అధిక ఉష్ణాగ్రత ఉండడం వల్ల కూడా వైరస్ వ్యాప్తి తక్కువే. - జి. రమేష్, ప్రొఫెసర్ అందుబాటులో వైద్య సేవలు తిరుపతి రుయా ఆసుపత్రిలో పది పడకల ప్రత్యేక వార్డు, నాలుగు బెడ్లు, వెంటి లేటర్లతో కూడిన ఒక ప్రత్యేక ఐసీయూ విభాగాన్ని సిద్దంగా ఉంచాం. స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఎవరైనా వస్తే వారికి వైద్య సేవలు అందించేందుకు అన్ని విధాలా ఏర్పాట్లు చేశాం. టామ్ ఫ్లూ మందు బిల్లలు 100, టెస్టింగ్ కిట్లు 50 చొప్పున సిద్ధంగా ఉన్నాయి. మాస్కుల కొరత ఉంది. జిల్లా వైద్యాధికారులకు సమాచారం అందించాం. ఎవరైనా పై లక్షణాలు కనిపిస్తే తక్షణమే రుయాలోని ఐడీహెచ్ విభాగం, స్వైన్ ఫ్లూ వార్డులో వైద్య సేవలు పొందాలి. - కయ్యల చంద్రయ్య, సివిల్‌సర్జన్, ఆర్ఎంవో, రుయా ఆసుపత్రి తిరుపతి. -
నగరంలో ఈ-వైద్యం
రాష్ట్రంలోనే తొలిసారిగా 12వ డివిజన్లో ఏర్పాటు నేడు ప్రారంభించనున్న మంత్రి కామినేని శ్రీనివాస్ 30 రోగాలకు ఆన్లైన్లోనే చికిత్స మందులు కూడా ఉచితంగా పంపిణీ విజయవాడ సెంట్రల్ : అక్కడ డాక్టర్లు ఉండరు. కానీ, రోగులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఆన్లైన్లోనే రోగాన్ని గుర్తించి మందులు పంపిణీ చేస్తారు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా... జాతీయ పట్టణ ఆరోగ్య పథకం ద్వారా ఈ-వైద్య విధానాన్ని రాష్ట్రంలోనే తొలిసారిగా నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. పటమట ఎన్ఎస్ఎం స్కూల్ ఏరియాలోని 12వ డివిజన్ అంబేద్కర్ కమ్యూనిటీ హాలులో ఏర్పాటుచేసిన ఈ-వైద్య ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆదివారం ప్రారంభించనున్నారు. నగరపాలక సంస్థలో దీన్ని పెలైట్ ప్రాజెక్ట్‌గా ఎంపికచేశారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు.. ఈ-వైద్య కేంద్రం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పని చేస్తుందని నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఇక్బాల్ ‘సాక్షి’కి తెలిపారు. పెలైట్ ప్రాజెక్ట్‌గా విజయవాడలో ఈ కేంద్రాన్ని ప్రభుత్వం ఎంపిక చేసిందని చెప్పారు. పనితీరును బేరీజు వేసి మరిన్ని ఈ-వైద్యం కేంద్రాలను ఏర్పాటుచేసే అవకాశం ఉందని వివరించారు. ఇక్కడకు వచ్చే రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించేందుకు నిష్ణాతులైన వైద్యులు ఆన్లైన్లో అందుబాటులో ఉంటారని ఆయన చెప్పారు. ఇలా పనిచేస్తుంది... ఈ-కేంద్రంలో ఆన్లైన్ విధానంలోనే రోగులకు వైద్యసేవలు అందిస్తారు. ఇక్కడ క్వాలిఫైడ్ ఏఎన్ఎం ఉంటారు. ఆన్లైన్లో జనరల్ ఫిజీషియన్ ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు.ఈ కేంద్రానికి వచ్చే రోగుల పేరు, చిరునామా, ఆధార్ కార్డు నంబర్ అంతా కంప్యూటర్ ద్వారా ఆన్లైన్లో ఉన్న వైద్యులకు పంపిస్తారు.కంప్యూటర్ స్క్రీన్ ద్వారా తన వ్యాధిని వైద్యుడుకి రోగి వివరించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ 30 రకాల వైద్యపరీక్షలు నిర్వహించేందుకు వీలుగా అత్యాధునిక వైద్య పరికరాలను అందుబాటులో ఉంచారు. రోగులను సిబ్బంది, ఏఎన్ఎంలు పరీక్ష చేసి బీపీ, పల్స్, ఈసీజీ రిపోర్టలను ఆన్లైన్లో పెడతారు. ఏఎన్ఎంల నివేదిక ఆధారంగా ఆన్లైన్లో ఉన్న వైద్యులు రోగి వ్యాధిని నిర్ధారిస్తారు. రోగికి వచ్చిన వ్యాధి లక్షణాల ఆధారంగా స్పెషలిస్ట్‌లు పరిశీలిస్తారు. వ్యాధి నివారణకు ఏ మందులు వాడాలో ఆన్లైన్లోనే సూచిస్తారు. వైద్యుల సూచన మేరకు రోగులకు ఏఎన్ఎం ఉచితంగా మందులు పంపిణీ చేస్తారు. -
కుక్క కరిస్తే గుంటూరు పంపిస్తారా?
పభుత్వాస్పత్రి వైద్యులపై మంత్రి కామినేని సీరియస్ బాధ్యులను సస్పెండ్ చేస్తాం విద్యాధరపురం కబేళా రోడ్డులోని రోటరీనగర్‌లో ఆదివారం ఉదయం ఐదేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడిచేసి గాయ పరిచాయి. ఆ బాలుడిని తల్లిదండ్రులు ప్రభుత్వాస్పత్రికి తీసుకురాగా, వ్యాక్సిన్ లేదని గుంటూరుకు రెఫర్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆస్పత్రికి వచ్చి వైద్యులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వ్యాక్సిన్ లేకపోతే మేమేం చేయగలమని డెప్యూటీ ఆర్ఎంవో సమాధానమిచ్చారు. లబ్బీపేట : ‘కుక్క కరిచి ఆస్పత్రికి వచ్చిన బాలుడికి టీకా వేయమంటే గుంటూరు వెళ్లమంటారా.. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా.. ఇక ఉపేక్షించేది లేదు, తక్షణమే బాధ్యులైన వైద్యుడిని సస్పెండ్ చేస్తా. ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తా’ అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పర్యటించినా, తాను తనిఖీలు చేసినా వైద్యులు, సిబ్బందిలో మార్పు రావడం లేదంటూ ఆసహనం వ్యక్తం చేశారు. ఈ సమయంలో వైద్యులు వివరణ ఇస్తుండగా, అవేమి పట్టించుకోకుండా ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల ప్రకారం.. నగరంలోని కబేళా ప్రాంతానికి చెందిన ఐదేళ్ల చిన్నారి శ్యామ్ కుక్కకాటుకు గురవడంతో ఉదయం 7.24 గంటల సమయంలో ప్రభుత్వాస్పత్రి క్యాజువాలిటీకి తీసుకొచ్చారు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న వైద్యుడు బాలుడిని పరీక్షించి ఏఆర్వీ, టీటీ ఇవ్వడంతో పాటు, యాంటిబయోటిక్ ఇచ్చారు. చిన్న వయస్సు కావడంతో ఇమ్యునోగ్లోబలిన్ ఇంజక్షన్ ఇస్తే మంచిదని తమ వద్దకు లేవని చెపుతూ, గుంటూరు ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఈ విషయం ఆస్పత్రి సమీపంలోని ఓ ఇంట్లో ఉన్న వైద్య ఆరోగ్యశాఖమంత్రి కామినేని శ్రీనివాస్ దృష్టికి వెళ్లడంతో ఆయన తక్షణమే ఆస్పత్రికి చేరుకున్నారు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న వైద్యుడిపై విరుచుకుపడ్డారు. ఎన్నిసార్లు చెప్పినా మీ తీరులో మార్పు రావడం లేదంటూ అసహనం వ్యక్తం చేయడంతో పాటు, వెంటనే సంబంధిత వైద్యుడ్ని సస్పెండ్ చేసేందుకు సిఫార్సు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఊపేక్షించేది లేదని, నిర్లక్ష్యం వహిస్తే వేటే అనే సంకేతాల వైద్యులు, సిబ్బందికి వెళ్లేలా మంత్రి ఆయన వ్యవహరించారు. కాగా మంత్రి స్వయంగా ఆదేశించడంతో బాలుడికి అవసరమైన ఇమ్యునోగ్లోబలిన్ కోసం గుంటూరు సీడీఎస్‌లో ప్రయత్నించారు. అక్కడ కూడా లేకపోవడంతో మచిలీపట్నంలోని ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న ఒక్క ఇంజక్షన్ తీసుకొచ్చి బాలుడికి చేశారు. డీఎంఈకి నివేదిక కుక్కకాటు వాక్సిన్ వేయడంలో నిర్లక్ష్యం వహిం చిన వైద్యుడిని సస్పెండ్ చేయాలంటూ మంత్రి ఆదేశించిన నేపథ్యంలో జరిగిన విషయాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యు.సూర్యకుమారి రాష్ట్ర వైద్య విద్యా సంచాలకునికి వివరించినట్లు సమాచారం. ఆయన ఆదేశాల ఆధారంగా వైద్యుడిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాగా ప్రాథమికంగా వైద్యుడు తప్పులేదని, ప్రభుత్వం నుంచి ఇంజక్షన్ల సరఫరా లేకనే సమస్య తలెత్తినట్లు నిర్ధారించి నివేదికను ఉన్నతాధికారులకు పంపినట్లు సమాచారం. కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు భవానీపురం : విద్యాధరపురం కబేళా రోడ్‌లోని రోటరీన గర్‌లో కుక్కల మూకుమ్మడి దాడిలో ఒక బాలుడు తీవ్రగాయాలపాల య్యాడు. స్థానిక విద్యార్థి చొరవతో బాలుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఆది వారం ఉదయం సుమారు 6.30 గంటల సమయంలో జరిగిన ఈ సంఘటన నగరవ్యాప్తంగా కలకలంరేపింది. కుక్కల స్వైర విహారం చేస్తున్నా కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒళ్లంతా రక్తంతో ఉన్న కుమారుడిని చూసి తల్లిదండ్రులు భోరున విలపించారు. వివరాలిలా ఉన్నాయి. భవానీపురం చర్చి సెంటర్లోని కొబ్బరి బొండాల విక్రయదారుని వద్ద పనిచేసే గుడిసె పౌల్‌రాజు, మరియమ్మ దంపతులు రోటరీనగర్‌లో నివాసం ఉంటున్నారు. వారికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. చిన్నవాడైన శ్యామ్(5) లేబర్‌కాలనీలోని జీఎన్నార్ ఎలిమెంటరీ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. పౌల్‌రాజు ఇంటిలోని మరుగుదొడ్డి పాడైపోవడంతో గత కొన్ని రోజులుగా కుటుంబ సభ్యులు బహిర్భూమికి బయటకు వెళుతున్నారు. ఈ క్రమం లో ఆదివారం ఉద యం 6.30 గం టల ప్రాంతంలో శ్యామ్ ఒంటరిగా ఇంటికి సమీపంలోని ఖాళీ ప్రదేశానికి బహిర్భూమికి వెళ్లాడు. దీంతో స్థానికంగా ఉండే 5 కుక్కలు ఒక్కసారిగా ఆ బాలుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. దీంతో భయపడిపోయిన బాలు డు ఏడ్వటం ప్రారంభించాడు. పక్కనే ఉన్న సాంఘిక సంక్షేమ హాస్టల్లోని ఎం.రాధాకృష్ణ అనే విద్యార్ధి చూసి కేకలు వేసేసరికి కుక్కలు ఆ బాలుడిని కొద్ది దూరం ఈడ్చుకువెళ్లి మళ్లీ కరవడం ప్రారంభించాయి. దీంతో రాధాకృష్ణ దూరం నుంచి రాళ్లు విసరడంతో బాలుడి వదిలేసి వెళ్లిపోయాయి. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు వచ్చి బాలుడిని 108లో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాలుడి కుటుం బాన్ని సీపీఎం నగర కార్యదర్శి సిహెచ్. బాబూరావు, కార్పొరేటర్ బట్టిపాటి సంధ్యారాణి, బట్టిపాటి శివ పరామర్శించారు. కొద్ది సేపుంటే చీల్చి చెండాడేవి బాలుడిపై కుక్కల దాడిని చూస్తుంటే సినిమాలో భయానక సన్నివేశంలా ఉంది. నేను చూడకపోతే బాలుడిని చీల్చి చెండాడేవి. హాస్టల్లో ఉండగా పిల్లవాడి ఏడుపు వినిపించి బయటకు వచ్చి చూశాను. అప్పటికే ఐదు కుక్కలు ఇష్టం వచ్చినట్లు బాలుడిని కరుస్తున్నాయి. నన్ను చూసి బాలుడిని ఈడ్చుకుంటూ పక్కనే ఉన్న ఖాళీ స్ధలంలోకి తీసుకువెళ్లి పడేశాయి. ఒక కుక్క బాలుడి గుండెలపెకైక్కి మెడపై కొరుకుతుంది, వెంటనే రాళ్లు తీసుకుని విసిరేసేసరికి పారిపోయాయి. ఆ సంఘటన తలుచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆ బాలుడు ఎలా భరించాడో భగవంతుడికే తెలియాలి. బయటకు వెళ్లాలంటే భయంగా ఉంది. - ఎం. రాధాకృష్ణ, ప్రత్యక్ష సాక్షి, కేబీఎన్ కళాశాల విద్యార్థి మందు లేనిదే ఏం చేస్తాం కుక్కకాటుకు గురైన వారికి అయిన గాయాన్ని బట్టి ఏఆర్వీ వాక్సిన్‌తో పాటు, మరింత రక్షణ కోసం ఇమ్యునోగ్లోబలిన్ ఇంజక్షన్ ఇస్తాం. ఆ ఇంజక్షన్లు ప్రభుత్వాస్పత్రిలో 20 రోజుల కిందట అయిపోయాయి. సెంట్రల్ డ్రగ్స్‌స్టోర్‌కు ఇండెట్ పెట్టినా స్టాకు లేకపోవడంతో రాలేదు. స్థానికంగా కొనాలని ప్రయత్నించినా హోల్‌సేల్ డీలర్ల వద్ద అందుబాటులో లేవు. ఇలాంటి పరిస్థితుల్లో బాలుడి మెడకు గాయమైనందున గుంటూరులో అందుబాటులో ఉంటే చేస్తారనే ఉద్దేశంతో రిఫర్ చేశారు. అంతేకానీ ఎఆర్వీ ఇవ్వడంలో ఆలస్యం చేయలేదు. బాలుడు వచ్చిన వెంటనే ఏఆర్‌వి, టీటీ, ఓవెరాన్ ఇచ్చారు. - డాక్టర్ ఐ.రమేష్, డిప్యూటీ ఆర్ఎంఓ