వెంగమ్మకు సీఎం బెదిరింపులు! | CM threats to the Vengamma | Sakshi
Sakshi News home page

వెంగమ్మకు సీఎం బెదిరింపులు!

Published Sun, Aug 23 2015 2:48 AM | Last Updated on Sun, Sep 3 2017 7:56 AM

వెంగమ్మకు  సీఎం బెదిరింపులు!

వెంగమ్మకు సీఎం బెదిరింపులు!

సాక్షి ప్రతినిధి, తిరుపతి : స్విమ్స్ (శ్రీవెంకటేశ్వర వైద్య విజ్ఞానసంస్థ) డెరైక్టర్ డాక్టర్ వెంగమ్మ తనను పదవి నుంచి రిలీవ్ చేయమని చెప్పడం వెనుక పెద్దకథే నడిచినట్టు సమాచారం. నాలుగు రోజుల క్రితం జిల్లా పర్యటనకు వచ్చిన వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ రేణిగుంట ఎయిర్‌పోర్టుకు డాక్టర్ వెంగమ్మను పిలిపించుకుని పదవి నుంచి తప్పుకోవాలని హెచ్చరికలు చేసినట్టు సమాచారం. ఇంతకుమునుపే ఆమెను స్వచ్ఛందంగా పదవి నుంచి వైదొలగేలా చేసేందుకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను ప్రభుత్వం పాచికగా ప్రయోగించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే స్విమ్స్‌లోని కొన్ని పైళ్లను తీసుకెళ్లినట్టు సమాచారం. ఈ తనిఖీల్లో ఎలాంటి ఆరోపణలు, అవినీతి ఆధారాలు లభించకపోగా డెరైక్టర్ నిక్కచ్చిగా వ్యవహరించినట్టు ప్రాథమిక సమాచారం అందింది.

 రంగంలోకి బాబు
 స్విమ్స్ డెరైక్టర్ పదవి నుంచి వెంగమ్మను తప్పించి, తమకు అనుకూలమైన వారిని నియమించుకోనేందుకు వీలుగా చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగినట్టు తెలిసింది. ఇందులో భాగంగానే స్విమ్స్ డెరైక్టర్ వెంగమ్మను కుప్పానికి పిలిపించుకుని పదవి నుంచి తప్పుకోవాలని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుగుదేశం వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. పదవి నుంచి తప్పుకోకపోతే సస్పెండ్ చేస్తానని బెదిరించినట్లు విశ్వసనీయ సమాచారం. దీనివెనుక ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ హస్తం ఉన్నట్టు వినికిడి. ముఖ్యంగా లోకేష్ తమకు అనుకూలమైనవారిని తెచ్చుకునే విధంగా పావులు కదిపినట్టు సమాచారం.

ఈ నేపథ్యంలోనే వెంగమ్మ తనను పదవి నుంచి రిలీవ్ చేయాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసినట్టు తెలుస్తోంది. మూడు రోజుల క్రితమే హైదరాబాద్ వెళ్లి  వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంను కలసి లేఖ అందించారు. ఈ విషయాన్ని స్విమ్స్ వర్గాలు సైతం ధ్రువీకరించాయి. దీంతోపాటు వైద్య ఆరోగ్యశాఖామంత్రి కామినేని శ్రీనివాసులు సైతం తమ బంధువులను స్విమ్స్ డెరైక్టర్‌గా తెచ్చేందుకు పావులు కదుపతున్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement