
మంత్రి కామినేని... రాజీనామా చేసి గెలువు
వైఎస్సార్ సీపీ నేత డీఎన్నార్ సవాల్
కైకలూరు : కైకలూరు బీజేపీ ఎమ్మెల్యే, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేసి తనపై పోటీ చేయాలని కైకలూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్ ) సవాల్ విసిరారు. కామినేని గెలిస్తే తాను ఇక రాజకీయాల్లో ఉండనన్నారు. నియోజకవర్గ ప్రజలు నీటి కోసం అల్లాడుతుంటే ఆందోళన చేసినందుకు తనపై మంత్రి చేసినవిమర్శలకు స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం గురువారం నిర్వహించారు. స్వప్రయోజనాల కోసం తాను షాపింగ్ కాంప్లెక్సు కడుతున్నానని విమర్శిస్తూ, తాను రాజకీయాలు చేస్తే పరిస్థితి వేరుగా ఉంటుందని మంత్రి బెదిరింపు దోరణిలో వ్యవహరించారన్నారు. ఇది ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు.
మంత్రి నియోజకవర్గంలోని చింతపాడు కొల్లేటి గ్రామ ప్రజలను సమీప సరిహద్దు పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇబ్బంది పెడుతుంటే మౌనం వహించడం వెనుక మత లబేంటనీ ప్రశ్నించారు. మంత్రి బెదిరింపులకు భయపడేవారెవరూ లేరని ఘటుగా చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు నిమ్మగడ్డ భిక్షాలు, రాష్ట్ర పార్టీ బీసీ సెల్ కార్యదర్శి పోసిన పాపారావుగౌడ్. జిల్లా కార్యద ర్శి బొడ్డు నోబుల్, మండవల్లి ఎంపీపీ సాక జసింతా పాల్గొన్నారు.