అందుబాటులో సుమారు 665 సీట్లు
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల(ఆగస్టు) 12 నుంచి ప్రైవేటు కళాశాలల్లో ఉన్న యాజమాన్య కోటా((వైద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష(ఎంసెట్)-కళాశాలల అసోసియేషన్(ఏసీ)) సీట్లకు కౌన్సెలింగ్ జరగనుంది. ఈ మేరకు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ షెడ్యూల్ ఖరారు చేసింది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని సీట్లతో పాటు ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఉన్న కన్వీనర్ కోటా సీట్లకు ఆగస్ట్ 5న కౌన్సెలింగ్ మొదలై 11న ముగుస్తుంది. అనంతరం 12 నుంచి ప్రైవేటు కళాశాలల్లో ఉన్న 35 శాతం యాజమాన్యకోటా సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
ఈ ఏడాది యాజమాన్యకోటా సీట్లకు ప్రత్యేక ప్రవేశ పరీక్ష(ఎంసెట్-ఏసీ) నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని ప్రైవేటు కళాశాలల్లో మొత్తం 1900 సీట్లున్నాయి. వీటిలో 35 శాతం అంటే సుమారు 665 సీట్లు యాజమాన్యకోటా కింద భర్తీ చేస్తారు.కాగా యాజమాన్య కోటా కింద భర్తీచేసుకొని ఎన్నారై కోటా కింద మారిస్తే ఊరుకోమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ హెచ్చరించారు. ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు.
12 నుంచి ఎంసెట్-ఏసీ కౌన్సెలింగ్
Published Tue, Jul 28 2015 4:08 AM | Last Updated on Sun, Sep 3 2017 6:16 AM
Advertisement
Advertisement