
మిత్ర ధర్మాన్ని మరచిన తమ్ముళ్లు
వెంకటగిరి: బీజేపీ, టీడీపీలు మిత్రపక్షాలు. అయితే జన్మభూమి కార్యక్రమాల్లో కమలదళం కనిపించకపోవడం, బీజేపీ కార్యక్రమాల్లో తెలుగు తమ్ముళ్లు జాడలేకపోవడం వంటి కారణాలు వారిలో మైత్రీబంధం ఏ మాత్రం ఉందో ప్రజలు గమనిస్తున్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఉచితంగా అందించే రోగనిర్ధారణ పరీక్షలు తెలియజేసీ భారీ ఫ్లెక్సీలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఫొటో లేకపోవడంతో పలువురు విస్తుపోతున్నారు. దీనికి కారణం మంత్రి కమళదళానికి చెందిన నాయకుడు కావడమేనా అనే స్థానికులు చర్చించుకుంటున్నారు. మిత్రపక్షం అంటూనే ఈ వివక్ష ఏమిటని ప్రశ్నిస్తున్నారు.