గొల్లపూడిలో ఆరోగ్య శాఖ కార్యాలయాలు ప్రారంభం
Published Fri, Jul 15 2016 11:43 AM | Last Updated on Fri, Jul 12 2019 3:29 PM
విజయవాడ: గొల్లపూడిలోని వైద్య, ఆరోగ్య శాఖ హెచ్‌ఓడీ కార్యాలయాలను ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో బాలుడి అపహరణ ఘటన దురదృష్టకరమన్నారు. శిశువు ఆచూకీ కోసం 6 బృందాలు గాలింపు చేపట్టాయని తెలిపారు. ఈ ఘటనలో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఉందని తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆసుపత్రిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఇప్పటికే టెండర్లు పిలిచామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆర్ఎఫ్‌డీ విధానం అమలులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. తల్లి, శిశువుకు ప్రత్యేక ట్యాగ్‌లు ఇస్తామన్నారు, దీనివల్ల తల్లి కాకుండా ఎవరైనా శిశువును తీసుకెళ్తే అలారం మోగేలా వ్యవస్థను ప్రవేశపెడతున్నామన్నారు.
Advertisement
Advertisement