ప్రభుత్వ వైద్యులకు మంత్రి హెచ్చరిక
ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసు చేయడం మానకపోతే తీవ్ర చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ హెచ్చరించారు. వారికి మొదటి హెచ్చరికగా మూడు ఇంక్రిమెంట్లు కోత విధిస్తామని, అప్పటికీ పద్ధతి మార్చుకోకపోతే ఉద్యోగాల నుంచి తొలగింపు కూడా తప్పదని ఆయన అన్నారు.
ఇక వైద్య ఆరోగ్యశాఖలో బదిలీలకు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. కౌన్సెలింగ్‌కు ఈనెల 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు.