వైఎస్సార్ జిల్లా : కడప రిమ్స్ ఆసుపత్రిని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ సోమవారం సందర్శించి డాక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆసుపత్రి రేడియాలజీ విభాగంలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్‌ను, కార్డియాలజీ విభాగంలో మరో యూనిట్‌ను ప్రారంభించారు. ప్రభుత్వ డాక్టర్‌లు కార్పొరేట్ ఆసుపత్రులలో పనిచేయటానకి వీల్లేదని, అలా చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామాన్నారు. రిమ్స్ ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగుపర్చడానికి చర్యలు తీసుకుంటామని కామినేని తెలిపారు.