
మద్యం బాధితులకు కామినేని పరామర్శ
విజయవాడ: కల్తీ మద్యం ఘటనలో చికిత్స పొందుతున్న బాధితులను ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ శుక్రవారం పరామర్శించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 27 మందిని డిశ్చార్జ్ చేశామని, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆయన తెలిపారు. మద్యంలో మిథైనాల్ కలపడం వల్లే ఘటన జరిగిందని కామినేని చెప్పారు. బాధితులకు ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.