కొండల్లో ఉండే వారికి రోడ్లు, నీళ్లంటే ఎలా?
కొండల్లో ఉండే వారికి రోడ్లు, నీళ్లంటే ఎలా?
Published Wed, Jun 28 2017 1:58 AM | Last Updated on Tue, Sep 5 2017 2:36 PM
- చాపరాయిలో ఎవరూ జ్వరాలతో చనిపోలేదు
- కలుషిత నీరు, మూఢనమ్మకాల వల్లే మరణించారు
- గిరిజనుల మరణాలపై మంత్రి కామినేని వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: కొండల్లో ఉండే వారికి రోడ్లు, నీళ్లు అందించాలంటే ఎలా? అని మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రశ్నించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల మరణాలపై మంగళవారం వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీలోని చాపరాయిలో దాదాపు 60 కుటుంబాలున్నాయి. వారంతా ఎక్కడో కొండల్లో దూరంగా ఉంటున్నారు. వాళ్ల కోసం నీళ్లు, రోడ్లు, కరెంటు.. ఇలా అన్ని వసతులూ అందించాలంటే ఎలా?..’ అని మంత్రి ప్రశ్నించారు. ‘ఆ ఊళ్లో ఎవరూ జ్వరాలతో చనిపోలేదు. ఆవు మృతి చెందడంతో.. ఆ కళేబరం నుంచి వచ్చిన నీళ్లు తాగడం, చేతబడి వంటి మూఢనమ్మకాల వల్లే చనిపోయారు. అంతేగానీ మలేరియా జ్వరాలతో కాదు. ఇప్పటివరకూ ఒక్క మలేరియా కేసు మాత్రమే నమోదైంది..’ అంటూ వివరణ ఇచ్చారు. గిరిజన ప్రాంతాల్లో రొటేషన్ ప్రాతిపదికన వైద్యుల్ని నియమిస్తామని చెప్పుకొచ్చారు.
కనీస మౌలిక వసతుల్లేవు..
ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామాల్లో కనీస మౌలి క వసతుల్లేవని, తక్షణమే వారికి తాగునీరు, రోడ్లు, విద్యుత్ సౌకర్యం వంటి సదుపాయా లు కల్పించాల్సిన అవసరముందని సీఎస్ దినేశ్‌కుమార్ పేర్కొన్నారు. గిరిజనుల మర ణాలపై నిర్వహించిన సమీక్షలో సీఎస్ మాట్లాడుతూ.. ఏజెన్సీలో మౌలిక సదుపా యాల కల్పనకు నెలలోగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఇవ్వాలని ఐటీడీఏ పీవోలను ఆదేశించారు. వర్షాకాలంలో అంటువ్యాధులు రాకుండా చర్యలు తీసుకో వాలని, సంచార వైద్యశాలలు, మందులను అందుబాటులో ఉంచాలని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాల కొండయ్య మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతా ల్లోని వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయాల్సి ఉందన్నారు. వివిధ నెట్‌వర్క్ ఏజెన్సీలతో మాట్లాడి పూర్తి స్థాయి లో నెట్‌వర్క్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్ చెప్పారు.
Advertisement