chaparai
-
గిరిజనులను మనుషులుగా గుర్తించని ప్రభుత్వం
గుర్తేడు మండల కేంద్రం ఏర్పాటు కృషి పీహెచ్‌సీల్లో వైద్య సదుపాయాలు మెరుగుపరచాలి అన్న వస్తున్నాడు.. చీకట్లు తొలగిపోతాయి.. చాపరాయి మృతుల కుటుంబాలకు జగన్ ఆర్థిక సహాయం బాధిత కుటుంబాలకు అందజేసిన కన్నబాబు, రాజేశ్వరి, అనంతబాబు రంపచోడవరం/మారేడుమిల్లి : కనీస వైద్య సదుపాయాలు లేక గిరిజనులు అల్లాడుతున్నారని, ప్రభుత్వం వారిని మనుషులుగా గుర్తించడం లేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. వరుసగా మరణాలు సంభవిస్తున్నా పీహెచ్‌సీల్లో వైద్య సదుపాయాలను మెరుగుపరచడంలో అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. చాపరాయి గ్రామాన్ని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సందర్శించినప్పుడు బాధిత కుటుంబాలకు ప్రకటించిన ఆర్థిక సాయాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు, ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ శుక్రవారం అందజేశారు. కన్నబాబు మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ సాయం అందజేసినట్టు తెలిపారు. ఎప్పటి నుంచో గుర్తేడు మండల కేంద్రం ఏర్పాటుకు గిరిజనులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వం మండల కేంద్రం ఏర్పాటు చేయకపోతే వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చేస్తామన్నారు. గుర్తేడు పీహెచ్‌సీల్లో అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. రెండు రోజులు క్రితం అంబులెన్స్ లేకపోవడంతో ఒకరు మృతి చెందారని ఆరోపించారు. పాతకోట గ్రామంలో అనారోగ్యంతో గిరిజనులు మృతి చెందుతున్నారని ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ. 2వేలు పింఛన్, పిల్లలను బడికి పంపితే రూ.1000 వంటి తొమ్మిది పథకాల అమలుతో పేదలకు మేలు జరుగుతుందన్నారు. గిరిజనులకు పక్కా ఇళ్లు, రోడ్డు నిర్మాణాలు చేస్తామన్నారు. చాపరాయి బాధిత కుటుంబాలకు మంత్రి పంపిణీ చేసిన చెక్కులు వారి అకౌంట్లో వచ్చే నెల వరకు పడనప్పుడు ఎందుకు హడవిడిగా ఇచ్చారని ఆరోపించారు. చాపరాయి బాధిత కుటుంబాలకు రూ. 10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వై.రామవరానికి చెందిన కర్రా వెంకటలక్ష్మి మాట్లాడుతూ ఐటీడీఏలో చెక్కుల పంపిణీకి పిలిచి మంత్రి నక్కా ఆనందబాబు దారుణంగా మాట్లాడారన్నారు. మీరు మాట్లాడకండి అంటూ బయటకు వెళ్లండి అంటూ బెదిరింపు దోరణిలో మాట్లాడరని ఇదేనా గిరిజనులకు ఇచ్చే మర్యాద అని విమర్శించారు. సర్పంచ్ మరిగెల నర్సమ్మ మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తే చెక్‌పవర్ రద్దు చేస్తామని, 16 కేసులు పెడతామని బెదిరిస్తున్నారని తెలిపారు. ఇలాంటి వాటిని లెక్కచేసే పరిస్థితి లేదన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొమ్మిశెట్టి బాలకృష్ణ, జెడ్పీటీసీలు సత్తి సత్యనారాయణరెడ్డి, పల్లాల రమణమ్మ, మండల కన్వీనర్లు జల్లేపల్లి రామన్నదొర, నండూరి గంగాధరరావు, పార్టీ నాయకులు చంటి, గంగరాజు, బాలాజీబాబు, రామాంజనేయులు, సర్పంచ్ బాబురావు తదితరులు పాల్గొన్నారు. -
సరిగా స్పందించలేదు: సీఎం ఆగ్రహం
గరగపర్రు, చాపరాయి ఘటనలపై సాక్షి, అమరావతి : గరగపర్రు, చాపరాయి గ్రామాల్లో చోటుచేసుకున్న ఘటనలపై అధికారులు, పార్టీ ఎమ్మెల్యేలు సరిగా స్పందించలేదని ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోలేకపోతే ఎలాగని ప్రశ్నించారు. ఉండవల్లిలోని తన నివాసంలో సోమవారం తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. చాపరాయిలో సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడం వల్ల గిరిజనులు మృత్యువాతపడ్డారని, కొంచెం అప్రమత్తంగా ఉంటే ఇబ్బంది కాదన్నారు. తాను జోక్యం చేసుకున్న తర్వాత గానీ రెండు గ్రామాల్లో సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. నంద్యాల ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని, ఇందుకు అందరూ పనిచేయాలని సూచించారు. అన్ని జిల్లాల్లోనూ పత్రికల్లో వ్యతిరేక వార్తలు వస్తున్నాయని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. విశాఖ భూముల కుంభకోణంపై అయ్యన్నపాత్రుడు, ఎంపీలు జేసీ దివాకర్‌రెడ్డి, కేశినేని నానిలు చేసిన కామెంట్లను పరోక్షంగా ప్రస్తావించారు. నేతలందరూ ఇష్టానుసారం చేసిన కామెంట్ల జాబితాను బయటకు తీయిస్తానని చెప్పి ఇకపై ఇలాంటి కామెంట్లు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. -
దట్టమైన అడవిలో...
- మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో విపక్ష నేత జగన్ పర్యటన - చాపరాయి జ్వరాల బాధితులకు ఓదార్పు సాక్షి ప్రతినిధి, కాకినాడ: మావోయిస్టులకు పెట్టని కోట.. దట్టమైన అడవులు.. దుర్భేద్యమై న కొండలు.. ప్రమాదకరమైన లోయలు.. రాళ్లతో కూడిన ఎగుడు దిగుడు దారి.. ఏకధాటిగా కురుస్తున్న వర్షం.. ఇదంతా చూస్తే వెన్నులో వణుకు పుట్టక మానదు. అటువంటి తూర్పు కనుమల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించారు. తూర్పు గోదావరి జిల్లా వై.రామవరం మండలం చాపరాయిలో విషజ్వరాల బారిన పడ్డ గిరిజనులను స్వయంగా పరామర్శించి, వారి కష్టాలను తెలుసుకునేందుకు వచ్చారు. గిరిపుత్రుల వెతలు విని జగన్ చలించిపోయారు. వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. రంపచోడవరం నుంచి చాపరాయి చాపరాయిని సందర్శించేందుకు జగన్ శుక్రవారం రాత్రే రంపచోడవరం చేరుకున్నారు. శనివారం ఉదయమే ఆ గ్రామానికి బయలుదేరారు. తొలుత రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చాపరాయి గిరిజనులను పరామర్శించారు. అనంతరం మారేడుమిల్లి మీదుగా అడవిబాట పట్టారు. దట్టమైన అడవిలో ఆయన పర్యటన సాగింది. దారి పొడవునా గిరిజనులను కలుసుకుని మాట్లాడారు. ఎక్కడికక్కడ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కడారికోటలో పెద్ద ఎత్తున తరలివచ్చిన గిరిజనులనుద్దేశించి ప్రసంగించారు. తరువాత ఘాట్‌రోడ్డులో వర్షంలోనే గంటపాటు ప్రయాణించి చాపరాయికి చేరుకున్నారు. బురదమయమైన రహదారిలో వాహనం ఎక్కడ జారిపోతుందో తెలియని ప్రమాదకర పరిస్థితుల్లో ఆయన ప్రయాణం సాగించారు. -
వినపడలేదా... గిరిజన వేదన
సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం - ముఖ్యమంత్రికి పేదవాడంటే కోపం - విష జ్వరాలతో 17 మంది చనిపోవడం బాధాకరం - అధైర్యపడొద్దు.. అన్నివిధాలా తోడుగా ఉంటా.. - చాపరాయి గ్రామస్తులకు జగన్ భరోసా... ఏజెన్సీలో పర్యటన సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘‘చంద్రబాబుకు పేదవాడంటే కోపం. మానవత్వం లేని ఆయన పాలనలో పేదలకు ఒరిగింది శూన్యం. మన బాధలను వినిపిస్తే చంద్రబాబుకు కొద్దోగొప్పో బుద్ధి జ్ఞానం వస్తాయేమో చూద్దాం. గడ్డి పెడితే ఆయనలో మానవత్వం వస్తుందేమో ఆశిద్దాం. చాపరాయి గ్రామంలో 17 మంది విష జ్వరాల బారిన పడి చనిపోవడం బాధాకరం. మళ్లీ ఇలాంటి మరణాలు సంభవించకుండా, సమస్యలు పరిష్కారమయ్యేలా మనమంతా కలిసి పోరాటం చేద్దాం. ఎవరూ అధైర్యపడొద్దు. మీకు అన్ని విధాలా అండగా ఉంటా’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గిరిజనులకు భరోసా కల్పించారు. ఆయన శనివారం తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీలో పర్యటించారు. విష జ్వరాలతో గిరిజనులు మృత్యువాత పడ్డ చాపరాయి గ్రామాన్ని సందర్శించారు. అంతకుముందు కడారికోటలో గిరిజనులతో మాట్లాడారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. వారికి పార్టీ తరపున ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. గిరిపుత్రుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తామని చెప్పారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఫొటోతోపాటు తన ఫొటో కూడా పెట్టుకునేలా అందరికీ మంచి చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే... ‘‘మన నియోజకవర్గంలో దాదాపు సంవత్సరం కాలంలోనే ఎంతోమంది చనిపోయారు. కాళ్ల వాపు వ్యాధితోపాటు మలేరియా జ్వరాలు, విష జ్వరాల బారిన పడి 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదేసమయంలో మరో 57 మంది తల్లీబిడ్డలు చనిపోయారు. రక్త హీనత(ఎనీమియా)తో అడవి బిడ్డలు పిట్టల్లా రాలిపోతున్నారు. నేను సంవత్సర కాలంలోనే మూడోసారి ఈ ప్రాంతానికి వచ్చాను. ప్రతిపక్ష నేత ఏజెన్సీ కి వస్తున్నాడని తెలియగానే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, అధికారులు గిరిజనుల సమస్యలపై మాట్లాడుతుంటారు. జగన్ తిరిగి వెళ్లిపోయిన తర్వాత ఇక్కడ ఏమైనా జరిగిందా? అని చూస్తే ఏమీ జరగదు. మళ్లీ ఏదైనా ఘటన జరిగితే జగన్ వస్తాడేమో అన్న భయంతో ఏదేదో మాట్లాడుతారు. ఏదేదో చేస్తామని చెబుతారు. బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు చాపరాయిలో మే 29 నుంచి జూన్ 25వ తేదీ వరకు 17 మంది చనిపోయారు. దాదాపు 35 మంది అనారోగ్యం పాలై చికిత్స కోసం ఆసుపత్రుల్లో చేరారు. ఇంత ఘోరం జరుగుతుంటే ప్రభుత్వ పెద్దలు, మంత్రులు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. అనారోగ్యం పాలైన గిరిజనులు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చికిత్స పొందుతున్నా మంత్రులకు తెలియకపోవడం విడ్డూరంగా ఉంది. బాధిత గిరిజనులకు వైద్య సేవలందించాల్సిన ఏఎన్ఎంలను ఇష్టానుసారంగా బదిలీ చేస్తున్నారు. గ్రామాల్లో 108, 104 అంబులెన్స్‌లు ఎక్కడా కనిపించడం లేదు. ఏజెన్సీలో 11 మండలాలు ఉండే కేవలం 7 అంబులెన్స్‌లు మాత్రమే ఉండడం దారుణం. అవైనా సక్రమంగా పనిచేస్తున్నాయా? అంటే అదీ లేదు. రోడ్డు లేదు.. నీరు లేదు చాపరాయి గ్రామానికి రోడ్డు లేదు. తాగడానికి మంచినీరు లేదు. ఒక్కటి కూడా పక్కా ఇల్లు లేదు. చేయడానికి కూలీ పని లేదు. ఉపాధి హామీ పని లేదు. రేషన్ సరుకుల కోసం 14 కిలోమీటర్లు నడవాలి. తెచ్చుకోవడానికి డబ్బు లేదు. విద్యుత్ సౌకర్యం లేదు. అంబులెన్స్ రాదు. ఆస్పత్రికి వెళ్లాలంటే 34 కిలోమీటర్లు నడవాలి. కొత్త పింఛన్లు, రేషన్ కార్డులు వచ్చాయని గ్రామసభలో ప్రకటించి ఇవ్వడం లేదు. ఐటీడీఏ చేయాల్సిన పనులను కూడా ఓ పద్ధతి ప్రకారం నీరుగార్చేస్తున్నారు. చనిపోయినవారికి రూ.5 లక్షలు ఇస్తామని చెప్పారు. మంత్రులు వచ్చినప్పుడు అడుగుతారని నోర్లు మూయిస్తున్నారు. గ్రామంలో ఆర్వో ప్లాంట్ పెడితే ఈ మరణాలు సంభవించవు. ఇలా చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి రాదు. గిరిజనులకు మంచి చేయాలన్న తపన కూడా లేదు. ఈ గ్రామంలో 350 మంది ఉంటే పాఠశాలను ఎత్తివేశారు. పౌష్టికాహారం లేక చిన్నపిల్లల్లో రక్తహీనత ఏజెన్సీలో రోడ్లు లేక, బస్సులు రాక గిరిజనులు కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లి బియ్యం తెచ్చుకోవాల్సి వస్తోంది. రేషన్ దుకాణాల్లో ఇచ్చేదే చాలీచాలని బియ్యం. ఆ దుకాణాల్లో సబ్బులు కొనుక్కుంటేనే బియ్యం ఇస్తారట! ఇదెక్కడి న్యాయం? గిరిజన సహకార సంఘాల్లో పనిచేసే వారికి కూడా జీతాలు ఇవ్వడం లేదు. పౌష్టికాహారం లేక చిన్నపిల్లల్లో రక్తహీనత పెరిగిపోతోంది. రంపచోడవరం ఆసుపత్రిలో పిల్లలకు రక్తాన్ని ఎక్కిస్తున్నారు. వారి శరీరంలో ఉంటున్న రక్తం కేవలం 4 శాతమే. జీతాలు ఇవ్వకపోతే ఎవరు పనిచేస్తారు? రోగులు ఆసుపత్రులకు వెళితే అక్కడ వైద్యులు ఉండడం లేదు. ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం మూడేళ్లుగా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఏజెన్సీ ప్రాంతంలో పని చేయడానికి డాక్టర్లు ఇష్టపడడం లేదని మంత్రులు చెబుతున్నారు. డాక్టర్లు ఇక్కడికి రావడానికి సిద్ధంగానే ఉన్నారు. ప్రభుత్వమే నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు పెట్టి, వైద్యులను ఎంపిక చేయడానికి సిద్ధంగా లేదు. కాంట్రాక్టు పద్ధతిలో డాక్టర్లను తీసుకొస్తున్నారు. వారికి మూడు నెలలకోసారి, నాలుగు నెలలకోసారి ఒక నెల జీతం ఇస్తున్నారు. కాంట్రాక్ట్ నర్సులకు కూడా సక్రమంగా జీతాలు ఇవ్వడం లేదు. జీతాలు ఇవ్వకపోతే ఎవరు పనిచేస్తారు? బాధితులకు తోడుగా ఎవరు నిలుస్తారు? ఇలాంటి విషమ పరిస్థితుల్లో రోగులు ఎలా బతుకుతారో ప్రభుత్వమే చెప్పాలి. గిరిజన సలహా మండలిని పక్కనపెట్టారు గిరిజన ప్రాంతాల్లో నీళ్లుండవు, రోడ్లు ఉండవు, పట్టించుకునే నాథుడే ఉండడు. ఐటీడీఏ నిధుల వినియోగాన్ని గిరిజన సలహా మండలి పర్యవేక్షించాల్సింది ఉంటుంది. గిరిజన సలహా మండలి అనేది చట్టప్రకారం వచ్చిన హక్కు. గిరిజన ప్రాంతాల నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు ఈ మండలిలో సభ్యులుగా ఉంటారు. రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల నుంచి గెలిచినవారంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అనే కారణంతో ముఖ్యమంత్రి చంద్రబాబు మూడేళ్లుగా గిరిజన సలహా మండలిని నియమించడం లేదు. ఫలితంగా ఐటీడీఎ నిధులను ఎలా ఖర్చు చేస్తున్నారు అని అడిగే నాథుడు లేకుండా పోయాడు. ప్రభుత్వం గిరిజన సలహా మండలిని నియమించి ఉంటే గిరిపత్రులకు ఎంతో మేలు జరిగేది. గిరిజనులకు ప్రయోజనం చేకూర్చాలన్న ఆలోచన ముఖ్యమంత్రి చంద్రబాబులో ఏ కోశానా లేదు. చంద్రబాబుకు పేదవాడు అంటే కోపం. ఆయన హయాంలో ఏ ఒక్క పేదవాడీకి మేలు జరగలేదు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే పేదలు బాగుపడ్డారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ కింద కేవలం రూ.35 వేలు మాత్రమే ఇస్తోంది. మిగిలిన రూ.65 వేల పరిస్థితి ఏమిటి? అని అడిగితే.. ఇళ్లు, ఆస్తులు అమ్ముకోండి అని చెబుతోంది. ప్రభుత్వ నిర్వాకం వల్ల పేద విద్యార్థులు అర్ధాంతరంగా చదువులు మానేయాల్సిన దుస్థితి దాపురించింది’’ అని జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. -
తాగునీటి కాలుష్యం వల్లే చాపరాయి మరణాలు
జేసీ ఎ.మల్లికార్జున రంపచోడవరం: తాగునీరు కలుషితం కావడం వల్లే చాపరాయి గ్రామంలో 16 మంది మృతి చెందినట్టు పరిశోధనలో తేలినట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు. రంపచోడవరం ఐటీడీఏ సమావేశ మందిరంలో పీఓ దినేష్‌కుమార్‌తో కలిసి గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాపరాయి గ్రామంలోని వాగులో ఆవు చనిపోయిందని, దాంతో ఆనీరు కలుషితం అయ్యిందన్నారు. ఆనీటిని తాగడం వల్లే 16 మంది అనారోగ్యం పాలై మరణించారని తెలిపారు. గిరిజన కుటుంబాల్లో ఆహారపు అలవాట్లు, తాగునీటి వినియోగంపై చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇప్పటి వరకు ఆ గ్రామంలో 275 వాటర్ ఫిల్టర్లను అందజేశామన్నారు. మరో 275 ఫిల్టర్లను త్వరలో అందిచేందుకు చర్యలు చేపట్టామన్నారు. రెండు ఐటీడీఏల పరిధిలో ‘చంద్రన్న సంచార వైద్యసేవ’లను మరింత పటిష్టం చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఏజెన్సీలో సమాచార వ్యవస్థ అందుబాటులో లేని మారుమూల గ్రామాల్లో ఈశాట్, శాటిలైట్ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకువచ్చి స్థానిక గిరిజన యువకుల ద్వారా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకునేలా కలెక్టర్ కార్యాచరణ రూపొందిస్తున్నారని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఏజెన్సీలో నెలకొన్న పరిస్థితుల దృష్టా ్య అధికారులెవరూ సెలవులు పెట్టవద్దన్నారు. డివిజనల్ పంచాయతీ అధికారులు, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ టీములను నియమించి పారిశుద్ధ ్య కార్యక్రమాలు క్రమం తప్పకుండా జరిగేలా చూస్తామన్నారు. అన్ని ఆశ్రమ పాఠశాలల్లో దోమల నిర్మూలకు కిటికీలకు దోమల మెష్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. డీసీహెచ్ఎస్ జి.రమేష్‌కిషోర్, డీఎంహెచ్ఓ కె.చంద్రయ్య, ఈఈ పీకే నాగేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రాజేశ్వరరావు, డీఎల్పీఓ రాజ్యలక్ష్మి,డీఎంఓ జోగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. -
కొండల్లో ఉండే వారికి రోడ్లు, నీళ్లంటే ఎలా?
- చాపరాయిలో ఎవరూ జ్వరాలతో చనిపోలేదు - కలుషిత నీరు, మూఢనమ్మకాల వల్లే మరణించారు - గిరిజనుల మరణాలపై మంత్రి కామినేని వివాదాస్పద వ్యాఖ్యలు సాక్షి, అమరావతి: కొండల్లో ఉండే వారికి రోడ్లు, నీళ్లు అందించాలంటే ఎలా? అని మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రశ్నించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల మరణాలపై మంగళవారం వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీలోని చాపరాయిలో దాదాపు 60 కుటుంబాలున్నాయి. వారంతా ఎక్కడో కొండల్లో దూరంగా ఉంటున్నారు. వాళ్ల కోసం నీళ్లు, రోడ్లు, కరెంటు.. ఇలా అన్ని వసతులూ అందించాలంటే ఎలా?..’ అని మంత్రి ప్రశ్నించారు. ‘ఆ ఊళ్లో ఎవరూ జ్వరాలతో చనిపోలేదు. ఆవు మృతి చెందడంతో.. ఆ కళేబరం నుంచి వచ్చిన నీళ్లు తాగడం, చేతబడి వంటి మూఢనమ్మకాల వల్లే చనిపోయారు. అంతేగానీ మలేరియా జ్వరాలతో కాదు. ఇప్పటివరకూ ఒక్క మలేరియా కేసు మాత్రమే నమోదైంది..’ అంటూ వివరణ ఇచ్చారు. గిరిజన ప్రాంతాల్లో రొటేషన్ ప్రాతిపదికన వైద్యుల్ని నియమిస్తామని చెప్పుకొచ్చారు. కనీస మౌలిక వసతుల్లేవు.. ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామాల్లో కనీస మౌలి క వసతుల్లేవని, తక్షణమే వారికి తాగునీరు, రోడ్లు, విద్యుత్ సౌకర్యం వంటి సదుపాయా లు కల్పించాల్సిన అవసరముందని సీఎస్ దినేశ్‌కుమార్ పేర్కొన్నారు. గిరిజనుల మర ణాలపై నిర్వహించిన సమీక్షలో సీఎస్ మాట్లాడుతూ.. ఏజెన్సీలో మౌలిక సదుపా యాల కల్పనకు నెలలోగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఇవ్వాలని ఐటీడీఏ పీవోలను ఆదేశించారు. వర్షాకాలంలో అంటువ్యాధులు రాకుండా చర్యలు తీసుకో వాలని, సంచార వైద్యశాలలు, మందులను అందుబాటులో ఉంచాలని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాల కొండయ్య మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతా ల్లోని వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయాల్సి ఉందన్నారు. వివిధ నెట్వర్క్ ఏజెన్సీలతో మాట్లాడి పూర్తి స్థాయి లో నెట్వర్క్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్ చెప్పారు. -
చాపరాయిలో కలెక్టర్ పర్యటన
మారేడుమిల్లి : వై.రామవరం మండలం బొడ్డగండి పంచాయతీ పరిధిలోని చాపరాయి గ్రామంలో అనారోగ్య పరిస్థితులను చక్కదిద్దేందుకు పక్కాగా చర్యలు చేపట్టామని, వైద్య బృందాలు అక్కడే ఉండి వైద్య సేవలు అందిస్తున్నాయని కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. మంగళవారం కలెక్టర్ బొడ్డగండి, చాపరాయి పరిసరాల గ్రామాల్లో మంగళవారం పర్యటించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న మరో ఏడుగురిని రంపచోడవరం ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. జీసీసీ నుంచి ఉచితంగా అందిస్తున్న నిత్యావసర సరుకుల పంపిణీని పరిశీలించారు. వీధుల్లోని తాగునీటి బోరుబావుల పనితీరును స్వయంగా పరిశీలించారు. వైద్యసేవలపై ఆరా తీశారు. గత ఆదివారం 32 మంది గిరిజనులను మెరుగైన వైద్య సేవల కోసం రంపచోడవరం తరలించామని, అందులో నలుగురు చిన్నారులను కాకినాడ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించామని తెలిపారు. గ్రామస్తులతో మాట్లాడుతూ నెల రోజుల వ్యవధిలో అనారోగ్యాలు సంభవిస్తున్నా ఆ సమాచారాన్ని అధికారులకు తెలపకుండా గోప్యంగా ఎందుకు ఉంచారని ప్రశ్నించారు. అక్కడ పనిచేసే ఆశా వర్కర్‌ను, వార్డు మెంబర్ నీలంరెడ్డిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి రోడ్డు మంజూరు చేస్తామని అన్నారు. రక్షిత జలాలు అందించేందుకు చర్యలు చేపడతామన్నారు. మృతుల కుటుంబాలకు రూ.ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. పీవో దినేష్‌కుమార్, జోడేశ్వరరావు, ఏడీఎం ఆండాళ్, హెచ్‌వో పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కొండకోనల్లో మృత్యుఘోష
- పచ్చని పల్లెపై విషజ్వరాల పడగ - శవాలదిబ్బగా మారుతున్న చాపరాయి - మూడు వారాల వ్యవధిలో 16 మంది గిరిజనుల మృతి - ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషాదం కొండకోనల్లోని పదిలంగా ఒదిగిపోయిన ఓ పచ్చని పల్లెలో మృత్యుఘోష మార్మోగింది. విషజ్వరాలు, వాంతులు, విరేచనాలతో బాధపడుతూ.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా పదహారు మంది అడవి బిడ్డల ప్రాణాలు.. మూడు వారాల వ్యవధిలో గాలిలో కలిసిపోయాయి. ఇంత జరుగుతున్నా ఇన్ని రోజులుగా వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది కానీ, ఇతర శాఖల సిబ్బంది కనీసంగా కూడా ఆ గ్రామాన్ని సందర్శించలేదు. ఫలితంగా ఇన్ని వరుస మరణాలు సంభవిస్తున్న విషయం వెలుగులోకి రాలేదు. శనివారం రాత్రి ఈ మరణాల విషయం వెలుగులోకి రావడంతో ప్రభుత్వ యంత్రాంగం ఆ గ్రామం.. చాపరాయికి హడావుడిగా పరుగు తీసింది. రంపచోడవరం : కొండల మధ్య ఉన్న ఆ పచ్చని పల్లె శవాల దిబ్బగా మారింది. మూడు వారాల వ్యవధిలో 16 మంది గిరిజనులు ఆ గ్రామంలో మృత్యువాత పడ్డారు. రోజుకు ఇద్దరు ముగ్గురు గిరిజనులు విషజ్వరాల బారిన పడి మరణిస్తున్నా.. వారి దుస్థితిని గుర్తించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమవడంతో.. ఆ విషాదం బాహ్య ప్రపంచానికి తెలియని పరిస్థితి. దీంతో ఆ గిరిజనుల మరణ వేదన వారు నిత్యం తిరుగాడే కొండల్లో కలిసిపోయింది. వై.రామవరం మండలం ఎగువ ప్రాంతం బొడ్డగండి పంచాయతీ చాపరాయి గ్రామంలోని గిరిజనులు ఈ నెల ఒకటో తేదీ నుంచి విషజ్వరాలు, వాంతులు, విరేచనాల బారిన పడి మరణిస్తున్నారు. అరవై కుటుంబాలు ఉన్న ఈ గ్రామంలోని గిరిజనులు వైద్య సేవలు పొందాలంటే 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుర్తేడు పీహెచ్‌సీకి వెళ్లాలి. అంత దూరం రోడ్డు సదుపాయం లేకపోవడంతో కాలినడకే వారికి శరణ్యం. అనారోగ్యం బారిన పడిన వారు నడవలేని స్థితిలో ఆ పీహెచ్‌సీకి కూడా వెళ్లలేకపోయారు. గ్రామంలోనే నాటు వైద్యాన్ని ఆశ్రయించారు. ఎవరో చేతబడి చేశారని భావించారు. ఫలితంగా అప్పటి నుంచీ ఈ నెల 21 వరకూ గ్రామంలో 16 మంది మృత్యువాత పడ్డారు. వరుసగా గ్రామస్తులు మరణిస్తున్నా.. ఒక్కరు కూడా గుర్తేడు పీహెచ్‌సీకి వచ్చి వైద్యసేవలు పొందలేదు. చావు తరుముకొస్తున్నా గ్రామంలోనే ఉండిపోయారు. శనివారం సాయంత్రం గ్రామానికి చెందిన ఒకరిద్దరు మారేడుమిల్లి సంతకు రావడంతో ఈ విషయం ఎట్టకేలకు వెలుగులోకి వచ్చింది. విషయం ఐటీడీఏ పీవో ఏఎస్ దినేష్‌కుమార్ దృష్టికి వెళ్లింది. వెంటనే స్పందించిన ఆయన మారేడుమిల్లికి 70 కిలోమీటర్ల దూరంలోని చాపరాయి గ్రామానికి హుటాహుటిన ఏజెన్సీ వైద్య, ఆరోగ్య శాఖ అధికారితోపాటు వైద్యులను, ఇద్దరు తహసీల్దార్లను పంపించారు. అక్కడ అనారోగ్యంతో ఉన్న గిరిజనులకు ప్రథమ చికిత్స అందించారు. చాపరాయి గ్రామంలో అనారోగ్యంతో ఉన్నవారిలో 22 మందిని అంబులెన్సులలో రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి, ఎనిమిది మందిని మారేడుమిల్లి పీహెచ్‌సీకి తరలించారు. ఆస్పత్రికి వచ్చిన చాపరాయి గ్రామస్తుడు చాదల భూమిరెడ్డి మాట్లాడుతూ జ్వరాల కారణంగానే గ్రామంలో మరణాలు సంభవించినట్లు తెలిపారు. తొంగిచూడని క్షేత్రస్థాయి సిబ్బంది క్షేత్రస్థాయిలో పని చేయాల్సిన వైద్య, ఆరోగ్య శాఖలోని ఏఎన్ఎంలు, ఎంపీహెచ్డబ్ల్యూలు, పర్యవేక్షణ అధికారులు గడచిన నెల రోజులుగా చాపరాయి గ్రామంవైపు కనీసంగా కూడా తొంగి చూడలేదు. గ్రామంలో 16 మంది గిరిజనులు మరణించినా విషయం తెలియలేదంటేనే వైద్య, ఆరోగ్య శాఖ పనితీరు ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆయా పీహెచ్‌సీల్లోని వైద్య సిబ్బంది తమ పరిధిలోని గ్రామాలను సందర్శించి జ్వరాల కేసులుంటే రక్తపరీక్షలు నిర్వహించి పీహెచ్సీ పంపించాలి. కానీ చాపరాయి గ్రామం నుంచి ఒక్క గిరిజనుడిని కూడా వైద్యం కోసం పీహెచ్‌సీకి పంపిన దాఖాలాలు లేవు. కనీసం గ్రామాన్ని సందర్శించి జ్వరాల తీవ్రతను ఉన్నతాధికారుల దృష్టికి తీసువెళ్తే వైద్య బృందాలను పంపించి మరణాలను తగ్గించే ప్రయత్నం జరిగేది. జగన్ దృష్టికి చాపరాయి మరణాలు మారేడుమిల్లి / వై.రామవరం : చాపరాయిలో 16 మంది గిరిజనులు మృత్యువాత పడిన ఘటనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్టు ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి తెలిపారు. మృతి చెందిన 16 మంది గిరిజన కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చాపరాయి గ్రామాన్ని ఆమె ఆదివారం సందర్శించారు. గిరిజనుల మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత గిరిజనులకు అధికారులు అందిస్తున్న వైద్య సదుపాయలను పర్యవేక్షించారు. అనారోగ్యంతో బాధపడుతున్న మిగిలిన గిరిజనులను 108 అంబులెన్స్‌లో తరలించారు. వ్యాధులు తగ్గేవరకూ గ్రామంలో వైద్య శిబిరం కొనసాగించాలని అన్నారు. అన్నివిధాలా ఆదుకుంటాం మారేడుమిల్లి : చాపరాయి బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని కలెక్టర్ కార్తికేయ మిశ్రా అన్నారు. మారేడుమిల్లి పీహెచ్సీలో చికిత్స పొందుతున్న పల్లాల చిన్నమ్మ, పల్లాల పండురెడ్డి, అందాల పొట్టమ్మ, అందాల సంతోష్, అందాల సన్యాసరెడ్డి, అందాల సావిత్రి, పల్లాల చిట్టమ్మ, పల్లాల చిన్నారెడ్డిలను ఆయన ఆదివారం సాయంత్రం పరామర్శించారు. వ్యాధులకు గల కారణాలను త్వరితగతిన నిర్ధారించాలని అధికారులను ఆదేశించారు. వారి రక్తాన్ని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌లకు పంపామన్నారు. సోమవారంలోగా పరిస్థితి మొత్తం అదుపులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ నయీం ఆస్మీ, డాక్టర్ ఉదయశ్రీ తదితరులు పాల్గొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా : రాజప్ప రంపచోడవరం : తూర్పు గోదావరి జిల్లా వై.రామవరం మండలం చాపరాయి గ్రామానికి చెందిన గిరిజనులను ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతున్న గిరిజనులను ఆదివారం రాత్రి ఆయన పరామర్శించారు. చనిపోయినవారి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని ప్రకటించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందజేస్తామని తెలిపారు. చాపరాయి గ్రామానికి రోడ్డు సదుపాయం, మంచినీరు సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ఏజెన్సీలోని కొన్ని గ్రామాలకు శాటిౖలైట్ ఫోన్లు సమకూర్చనున్నట్లు తెలిపారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే శీతంశెట్టి వెంకటేశ్వరరావు, సర్పంచ్ వై.నిరంజనీదేవి తదితరులున్నారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమే.. చాపరాయి మరణాలపై కన్నబాబు కాకినాడ : ఏజెన్సీలో గిరిజనులు విషజ్వరాలతో మృతి చెందడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు విమర్శించారు. చాపరాయి గ్రామంలో 16 మంది గిరిజనులు మృతి చెందిన ఘటన నేపథ్యంలో ఆయన ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. చాపరాయిలో గిరిజనుల మృతి విషయాన్ని పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లానన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారన్నారు. త్వరలోనే బాధిత కుటుంబాల పరామర్శకు జగన్ రానున్నారని చెప్పారు. ఈలోగా బాధితులను పరామర్శించి భరోసా కల్పించాల్సిందిగా జగన్ ఆదేశించడంతో సోమవారం చాపరాయి వెళ్తున్నామని చెప్పారు. వై.రామవరం మండల ఎగువ ప్రాంతంలో కనీస సదుపాయాలు లేక, వైద్యం అందడంలేదని, ఇదే అమాయకులైన గిరిజనుల మరణాలకు కారణమైందని ధ్వజమెత్తారు. రాష్ట్రమంతా ఫైబర్‌గ్రిడ్ ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి ఇంటి యజమానితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడతానని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి గిరిజనుల మరణాలు 20 రోజుల వరకూ వెళ్లకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఏజెన్సీలో పదుల సంఖ్యలో నవజాత శిశువులు, గర్భిణుల మరణాలు సంభవించినప్పటికీ సకాలంలో సరైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అదేవిధంగా కాళ్ళవాపు వ్యాధితో గిరిజనులు మృతి చెందినా కూడా ముఖ్యమంత్రి కన్నెత్తి చూసిన పాపాన పోలేదన్నారు. ఇప్పుడు 16 మంది మృతి చెందితే పరిహారం ప్రకటించి చేతులు దులుపుకోవడం సరైనది కాదని కన్నబాబు విమర్శించారు. -
చాపరాయి హాయి..హాయి...
చాపరాయి,జలపాతం,విశాఖపట్నం,chaparai,waterfall,visakhapatnam డుంబ్రిగుడ :వాతావరణంతో సంబంధం లేకుండా చాపరాయి పర్యాటకులను ఆకట్టుకుంటోంది. జలజలపారే జలపాతం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా ఉండటంతో పర్యాటక ప్రియులు నిత్యం సందర్శిస్తుంటారు.