polluted water
-
తెల్లవారితే కూడు దక్కక.. పొద్దు వాలితే గూడు లేక.. బతకు ‘వ్యర్థ’మేనా?
తెల్లవారితే కూడు దక్కక.. పొద్దు వాలితే గూడు చిక్కక బాధలు మోసే అభాగ్యులకు వ్యర్థాలే జీవనాధారంగా మారుతున్నాయి. పిడికెడు మెతుకుల కోసం పేగులు మెలిపెట్టే దుర్వాసన వెదజల్లుతున్న మురుగునీటిలో వస్తువుల కోసం అన్వేషిస్తున్నఈ వ్యక్తి చిత్రాన్ని విశాఖ కాన్వెంట్ జంక్షన్ వద్ద సాక్షి కెమెరా క్లిక్ మనిపించింది.– పీఎల్ మోహన్‌రావు, సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
భద్రాచలం ప్రజలకు ఒణుకు పుటిస్తున్నగోదావరి నది
-
‘తుంగభద్ర’ కలుషితం .. ప్రమాదకర స్థాయిలో కాలుష్యం!
సాక్షి, అమరావతి : తుంగే పానే.. గంగే స్నానే అన్నది ఆర్యోక్తి. గంగా నదిలో స్నానంచేస్తే ఎంత పుణ్యం వస్తుందో తుంగభద్ర నీటిని తాగితే అంతే పుణ్యం వస్తుందన్నది దీని అర్థం. కానీ.. ఇప్పుడు తుంగభద్ర నదీ జలాలను శుద్ధిచేయకుండా నేరుగా తాగితే పుణ్యం మాట ఏమోగానీ వ్యాధుల బారినపడే ప్రమాదం అధికంగా ఉందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నివేదిక తేల్చిచెబుతోంది. కర్ణాటక పరిధిలో తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతంలో నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోని మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థ జలాలు, వ్యర్థాలను యథేచ్ఛగా నదిలోకి వదిలేయడంవల్ల నదీ జలాలు కలుషితమయ్యాయి. జాతీయ ప్రమాణాల ప్రకారం లీటర్ నీటికి బీఓడీ (బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్) రెండు మిల్లీగ్రాములలోపు ఉండాలి. కానీ.. కర్ణాటక పరిధిలోని తుంగభద్ర జలాల్లో లీటర్ నీటికి గరిష్టంగా 7 మిల్లీగ్రాముల నుంచి కనిష్టంగా 6.2 మిల్లీగ్రాములు ఉండటాన్ని బట్టి చూస్తే కాలుష్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. రాష్ట్ర పరిధిలో మంత్రాలయం, బావపురం మధ్య తుంగభద్ర జలాల్లో లీటర్ నీటికి బీఓడీ గరిష్టంగా 6.2 మిల్లీ గ్రాముల నుంచి కనిష్టంగా 3 మిల్లీ గ్రాములు ఉండటం గమనార్హం. నాడు స్వచ్ఛతకు.. నేడు కాలుష్యానికి.. కర్ణాటక పరిధిలోని పశ్చిమ కనుమల్లో కుద్రేముఖ్ పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి 1,196 మీటర్ల ఎత్తులో తుంగ ఒకవైపు.. భద్ర మరోవైపు జని్మంచి.. 147 కి.మీ. దూరం తుంగ నది, 171 కి.మీ. దూరం భద్ర నది పయనించాక కూడలి వద్ద రెండు నదులూ సంగమించి.. ఒకటిగా 547 కి.మీ. దూరం ప్రవహించి తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్కు సమీపంలో గొందిమల్ల వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. నిజానికి... కృష్ణాకు ప్రధాన ఉపనది అయిన తుంగభద్ర ఒకప్పుడు స్వచ్ఛతకు పెట్టింది పేరు. కర్ణాటక పరిధిలోని తుంగభద్ర పరివాహక ప్రాంతంలో నది పరిసర ప్రాంతాల్లోని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థ జలాలు, ఇతర వ్యర్థాలను యథేచ్ఛగా వదిలేయడంవల్ల కాలుష్య కాసారంగా మారింది. గతేడాది నవంబర్‌లో తుంగభద్ర జలాల స్వచ్ఛతపై సీడబ్ల్యూసీ, సీపీసీబీ సంయుక్తంగా అధ్యయనం చేసి నవంబర్‌లో కేంద్ర జల్‌శక్తి శాఖకు నివేదిక ఇచ్చాయి. ప్రమాదకర స్థాయిలో కాలుష్యం.. - కర్ణాటకలో శివమొగ్గ వద్ద తుంగ నదీ జలాల్లో లీటర్ నీటికి 6 మిల్లీగ్రాముల బీఓడీ ఉన్నట్లు సీడబ్ల్యూసీ–సీపీసీబీ తేల్చాయి. - కర్ణాటక పరిధిలోని భద్రావతి నుంచి హోలెహొన్నూరు వరకూ భద్ర నదీ జలాల్లో లీటర్ నీటికి 7 మిల్లీగ్రాముల బీఓడీ ఉన్నట్లు అవి గుర్తించాయి. - తుంగ, భద్ర కలిసి తుంగభద్రగా రూపాంతరం చెందే ప్రాంతం కూడలి నుంచి మైలార, ఉల్లనూరు నుంచి హొకినేహళ్లి వరకూ నదీ జలాల్లో లీటర్ నీటికి బీఓడీ 6.2 మిల్లీగ్రాములు ఉంది. - కర్ణాటకలో వ్యర్థాలతో కలుషితమైన ఈ జలాలు రాష్ట్రంలోకి ప్రవేశించాక మంత్రాలయం నుంచి బావపురం మధ్య ప్రాంతంలోనూ లీటర్ నీటికి బీఓడీ గరిష్టంగా 6.2 మిల్లీగ్రాముల నుంచి కనిష్టంగా 3 మిల్లీగ్రాములు ఉంది. - తుంగభద్ర నదిలో కాలుష్య ప్రభావం అధికంగా ఉన్న శివమొగ్గ, భద్రావతి–హోలెహొన్నూరు, కూడలి–మైలార, ఉల్లనూరు–హోకినేహళ్లి ప్రాంతాల్లో మురుగు, పారిశ్రామిక వ్యర్థ జలాలను శుద్ధిచేశాకే నదిలోకి వదలాలని కేంద్రానికి సీడబ్ల్యూసీ–సీపీసీబీ నివేదిక ఇచ్చింది. -
ముషీరాబాద్ చేపల మార్కెట్ కాలనీలో కలుషిత నీటి సరఫరా
-
బస్తీల వాసుల పాలిట శాపంగా కలుషిత జలాలు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు బస్తీల వాసులకు కలుషిత జలాలు శాపంగా పరిణమిస్తున్నాయి. గతంలో భోలక్‌పూర్.. ఇటీవల మాదాపూర్ వడ్డెర బస్తీ.. మంగళవారం ముషీరాబాద్ చేపల మార్కెట్ ప్రాంతంలో కలుషిత జలాల కారణంగా పలువురు బస్తీవాసులు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రుల పాలయ్యారు. ఆయా ప్రాంతాల్లో అతిసారం ప్రబలడం కలవరం సృష్టిస్తోంది. మరుగుదొడ్లు, అపరిశుభ్ర పరిసరాలు, గుంతల్లో నల్లా లేని కనెక్షన్లతో పాటు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన పురాతన తాగునీటి పైప్లైన్లు ఏదో ఒకచోట తరచూ ఈ పరిస్థితికి కారణమవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పాత నగరంతో పాటు ప్రధాన నగరంలో సుమారు రెండువేల కిలోమీటర్ల పరిధిలో పురాతన పైప్లైన్లు ఉన్నట్లు జలమండలి వర్గాలు చెబుతున్నాయి. వీటి స్థానంలో తక్షణం డక్టైల్ ఐరన్ (డీఐ), మైల్డ్‌స్టీల్ (ఎంఎస్) పైప్లైన్లు ఏర్పాటు చేసి పైప్‌లైన్ లీకేజీల కారణంగా ఏర్పడుతున్న కలుషిత జలాల సమస్యను పరిష్కరించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పురాతన పైప్లైన్ల మార్పుతోనే పరిష్కారం.. ► మహానగరం పరిధిలో సుమారు 9 వేల కిలోమీటర్ల పరిధిలో మంచినీటి సరఫరా పైప్‌లైన్ వ్యవస్థ అందుబాటులో ఉంది. ఇందులో పాతనగరం, ప్రధాన నగరం పరిధిలో సుమారు 2 వేల కిలోమీటర్ల పరిధిలో వివిధ సామర్థ్యాలున్న పురాతన పైప్ లైన్లున్నాయి. వీటికి తరచూ లీకేజీలు ఏర్పడడం, పక్కనే మురుగు నీటి పైప్లైన్లు, నాలాలుండడంతో తరచూ మురుగు నీరు లీకేజీ ఏర్పడిన తాగునీటి పైప్లైన్లలోకి చేరి శుద్ధి చేసిన తాగునీరు కలుషితమవుతోంది. ► ఈ నీటిని తాగిన వారు ఆస్పత్రుల పాలవుతున్నారు. వీటిని తక్షణం మార్చితేనే కలుషిత జలాల సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ప్రధానంగా ముషీరాబాద్, చార్మినార్, బహదూర్‌పురా, సికింద్రాబాద్, కార్వాన్ తదితర నియోజకవర్గాల పరిధిలోనే పురాతన పైప్లైన్లు అత్యధికంగా ఉన్నట్లు జలమండలి వర్గాలు చెబుతున్నాయి. వీటిని మార్చేందుకు సుమారు రూ.1500 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. ఇవీ కారణమే.. ► పలు బస్తీల్లో ఇళ్ల ముందున్న కనెక్షన్లు గుంతల్లో ఏర్పాటు చేసినవే ఉన్నాయి. వీటికి చాలా ప్రాంతాల్లో నల్లాలు లేవు. ఇవన్నీ మరుగుదొడ్లు, దుస్తులు, వంట పాత్రలు శుభ్రం చేసుకునే ప్రదేశాలకు ఆనుకొని ఉన్నాయి. దీంతో ఈ మురుగు నీరు నల్లా గుంతల్లోకి చేరుతోంది. ► మంచినీటి సరఫరా జరిగిన అనంతరం ఈ మురుగు నీరు ఆయా కనెక్షన్లలోకి రివర్స్ వెళుతోంది. తిరిగి తాగునీటి సరఫరా జరిగిన సమయంలో నల్లా నీటితో పాటు ఈ మురుగు నీరు వస్తోంది. ఈ నీటిని తాగిన వారు అస్వస్థతకు గురవుతున్నట్లు వడ్డెర బస్తీలో జలమండలి క్షేత్రస్థాయి పర్యటనలో తేలింది. ► మహానగరం పరిధిలోని సుమారు 1470 మురికి వాడలున్నాయి. పలు బస్తీల్లో కనెక్షన్లకు నల్లాలు లేని చోట జలమండలి జీఐ పైప్లైన్లతో తక్షణం నల్లా కనెక్షన్లను కొంత ఎత్తున.. పబ్లిక్ నల్లా తరహాలో ఏర్పాటు చేయాలి. దీంతో కలుషిత ముప్పు తప్పుతుందని నిపుణులు సూచిస్తున్నారు. (క్లిక్: జీవో 111ను ఎత్తేస్తున్నాం.. కేబినెట్ కీలక నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్) జలమండలి మేనేజర్, వర్క్ఇన్స్పెక్టర్ సస్పెన్షన్ ముషీరాబాద్ చేపల మార్కెట్లో కలుషిత జలాల కలకలం నేపథ్యంలో జలమండలి ఎండీ దానకిశోర్ సీరియస్ అయ్యారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన మేనేజర్, వర్క్ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేశారు. ఈ ప్రాంతంలో కలుషిత జలాల సమస్యను అరికట్టేందుకు నూతన పైప్‌లైన్ వర్క్ మంజూరు చేసి నెల రోజులు గడుస్తున్నా పనులు మొదలు పెట్టనందుకు వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. సుమారు రూ.4.2 లక్షలతో కొత్త పైప్‌లైన్‌ను మంజూరు చేసినట్లు ఎండీ తెలిపారు. (చదవండి: కేసీఆర్ కీలక నిర్ణయం.. నెరవేరనున్న 26 ఏళ్ల కల) -
వామ్మో.. ఆ నీళ్లు తాగితే డైరక్ట్ దవాఖానానే..
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ను ఆనుకొని ఉన్న పలు పారిశ్రామిక వాడల్లో భూగర్భజలం తీవ్రంగా కలుషితమైంది. పలు పరిశ్రమలు విడుదల చేస్తున్న పారిశ్రామిక వ్యర్థజలాలను నాలాలు, బహిరంగ ప్రదేశాలు, వట్టిపోయిన బోరుబావుల్లో వదిలివేస్తున్నారు. దీంతో భూగర్భ జలాల్లో భారలోహాలు, నైట్రేట్లు, పాస్ఫరస్ తదితర మూలకాల ఉనికి కనిపించినట్లు జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ) ప్రాథమిక అధ్యయనంలో తేలింది. పూర్తిస్థాయి నివేదిక ఈ ఏడాది డిసెంబరు చివరి నాటికి సిద్ధమవుతుందని ఆ సంస్థ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. భూగర్భ జల కాలుష్యానికి ప్రధాన కారణాలివే.. ► మహానగరం పరిధిలోని 13 పారిశ్రామికవాడల పరిధిలోని 160 ప్రదేశాల నుంచి భూగర్భజలాలు, చెరువుల నీటి నమూనాలను ఇటీవల ఎన్జీఆర్ఐ (జాతీయ భూ¿ౌతిక పరిశోధన సంస్థ) సేకరించి ప్రాథమికంగా పరీక్షలు నిర్వహించింది. ► ప్రధానంగా నాచారం, ఉప్పల్, మల్లాపూర్, చర్లపల్లి, కాటేదాన్, ఖాజీపల్లి, బాలానగర్, సనత్‌నగర్, జీడిమెట్ల, బొంతపల్లి, పటాన్చెరువు, బొల్లారం, పాశమైలారం పారిశ్రామికవాడల పరిధిలో నీటి నమూనాల్లో కరిగిన ఘన పదార్థాలు, నైట్రేట్లు, పాస్ఫరస్ అధికంగా ఉండడంతోపాటు భార లోహాల ఉనికి బయటపడింది. ► పలు రసాయన, బల్‌్కడ్రగ్, ఫార్మా పరిశ్రమల నుంచి బహిరంగ ప్రదేశాలు, సమీప చెరువులు, నాలాలు, మూసీలోకి దశాబ్దాలుగా పారిశ్రామిక వ్యర్థజలాలు చేరడం. ఈ జలాలు క్రమంగా భూగర్భజలాల్లోకి చేరుతున్నాయి. ► రోజువారీగా గ్రేటర్లో 1400 మిలియన్ లీటర్ల వ్యర్థజలాలు ఉత్పన్నమౌతున్నాయి. ఇందులో 700 మిలియన్ లీటర్ల నీటినే శుద్ధిచేసి మూసీలోకి వదిలిపెడుతున్నారు. ► మిగతా 700 మిలియన్ లీటర్ల జలాలు ఎలాంటి శుద్ధి ప్రక్రియ నిర్వహించకుండానే మూసీలో కలుస్తున్నాయి. ► ఇందులో సుమారు 350 మిలియన్ లీటర్ల మేర పారిశ్రామిక వ్యర్థజలాలున్నాయి. ఈ నీరు క్రమంగా భూగర్భజలాల్లోకి చేరుతుండడంతో భూగర్భజలాలు గరళంగా మారాయి. భూగర్భజలాల్లో ఉన్నమూలకాలు, భారలోహాలివే.. సోడియం, క్యాల్షియం, మెగీ్నీషియం, సెలీనియం, బోరాన్, అల్యూమినియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, నికెల్, ఆర్సెనిక్, జింక్, లెడ్, నైట్రేట్, పాస్ఫరస్. ప్రస్తుతం నగరంలో పలు ప్రాంతాల్లో భూగర్భ జలశాఖ నెలవారీగా భూగర్భ జలమట్టాలను లెక్కిస్తోంది. ఇక నుంచి ఆయా ప్రాంతాల్లో బోరుబావులు తవ్వి భూగర్భజలాల నాణ్యత ను ఎన్జీఆర్ఐ సౌజన్యంతో పరిశీలించనుంది. ఈ వివరాలను జీఐఎస్ మ్యాపుల్లో పొందుపరిచి భూగర్భజలశాఖ వెబ్సైట్లో అందరికీ లభ్య మయ్యేలా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలున్నట్లు ఆ శాఖ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ఈ ఏడాది డిసెంబరు నాటికి నగరంలో పారి శ్రామిక వాడలతోపాటు ఇతర ప్రాంతాల్లో భూ గర్భజలాల నాణ్యతపై పూర్తిస్థాయి నివేదికను ఎన్జీఆర్ఐ సిద్ధం చేయనుందని వెల్లడించాయి. -
కలుషితం.. నదీజలం
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాలను తడిపి సిరులు కురిపించే నదీ జలాలు స్వచ్ఛమైనవి కావా? వీటిల్లో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుందా? దిద్దుబాటు చర్యలు చేపట్టకుంటే ఆరోగ్య సమస్యలు తప్పవా? అనే ప్రశ్నలకు అవుననే హెచ్చరిస్తోంది కేంద్ర జల్‌శక్తి శాఖ. గోదావరి, కృష్ణా, పెన్నా, కుందూ, నాగావళి, మానేరు, కిన్నెరసాని తదితర నదుల్లో బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్(బీవోడీ), డిసాల్వ్డ్ ఆక్సిజన్(డీవో), క్షార స్వభావం (పీహెచ్) ప్రమాదకర స్థాయికి చేరిందని తాజా నివేదిక తేల్చింది. ఈ నదుల్లోని నీటిలో కోలి బ్యాక్టీరియా,కరిగిన ఘన పదార్థాల(టీడీఎస్) శాతం ప్రమాదకరంగా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇతర నదులతో పోల్చితే వంశధారలో కాలుష్య ప్రభావం కాస్త తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. దేశవ్యాప్తంగా 323 నదుల్లో కాలుష్య ప్రభావంపై కేంద్ర పర్యావరణ నియంత్రణ మండలి(సీపీసీబీ), అన్ని రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్లు(పీసీబీ), కేంద్ర జల్ శక్తి శాఖ సంయుక్తంగా అధ్యయనం నిర్వహించాయి. సీపీసీబీ ప్రకారం నీటి స్వచ్ఛత ప్రమాణాలు ఇవీ.. - మనుషులు తాగడానికి వినియోగించే నీటిలో కోలి బ్యాక్టీరియా ఎంపీఎన్ (మోస్ట్ పాపులర్ నంబర్) వంద మిల్లీ లీటర్లకు 50 లోపు ఉండాలి. పీహెచ్ శాతం 6.5 వరకు ఉండవచ్చు. లీటర్ నీటికి డీవో ఆరు మిల్లీ గ్రాములు, బీవోడీ 2 మిల్లీ గ్రాముల వరకు ఉండవచ్చు. - మనుషులు స్నానానికి వినియోగించే నీటిలో కోలి బ్యాక్టీరియా ఎంపీఎన్ వంద మిల్లీలీటర్లకు 500 వరకు ఉండవచ్చు. పీహెచ్ 6.5 శాతం వరకు ఉండవచ్చు. లీటర్ నీటికి డీవో 5 మిల్లీగ్రాములు, బీవోడీ మూడు మిల్లీ గ్రాముల వరకు ఉండవచ్చు. - అడవి జంతువులు తాగడానికి, చేపల జీవనం, పెంపకానికి వినియోగించే నీటిలో పీహెచ్ 6.5 శాతం, డీవో లీటర్ నీటికి నాలుగు మిల్లీ గ్రాముల దాకా ఉండవచ్చు. కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం... - గోదావరి, కృష్ణా, పెన్నా, తుంగభద్ర, నాగావళి, కుందూ, మానేరు, కిన్నెరసానిలో కాలుష్య తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరినట్లు తాజా సర్వేలో వెల్లడైంది. - తెలుగు రాష్ట్రాల్లో ప్రవహించే నదుల్లో కోలి బ్యాక్టీరియా మోతాదు పరిమితి దాటింది. డీవో, బీవోడీ, పీహెచ్ శాతం కూడా అధికంగా ఉంది. శుద్ధి చేయకుండా నదీ జలాలను తాగితే మూత్రపిండాలు, శ్వాసకోస సంబంధ వ్యాధుల బారినపడే ప్రమాదం ఉంది. - తెలుగు రాష్ట్రాల్లో అన్ని నదులతో పోల్చితే తుంగభద్రలో కాలుష్య తీవ్రత అధికంగా ఉంది. తుంగభద్ర జలాల్లో ఘన వ్యర్థాలు ఒక లీటర్ నీటిలో గరిష్టంగా 347 మిల్లీగ్రాములున్నాయి. ఇష్టారాజ్యంగా గనుల తవ్వకం, పారిశ్రామిక వ్యర్థాలు, మురుగు నీరు చేరడమే దీనికి ప్రధాన కారణం. - కుందూ నదిలో కోలి బ్యాక్టీరియా వంద మిల్లీ లీటర్లకు గరిష్టంగా 900(టి.కోలి 800, ఎఫ్.కోలి 100) ఉండటం గమనార్హం. - వంశధార నదీ జలాల్లో పీహెచ్, డీవో, బీవోడీ, టి.కోలి, ఎఫ్.కోలి, టీడీఎస్ శాతం ఇతర నదులతో పోల్చితే కాస్త తక్కువగా ఉన్నప్పటికీ శుద్ధి చేయకుండా తాగడం శ్రేయస్కరం కాదు. - నదీ జలాల్లో కాలుష్య తీవ్రత వల్ల వన్యప్రాణులు మృత్యువాత పడుతున్నాయి. మత్స్య సంపద కూడా అంతరిస్తోంది. కాలుష్యానికి ప్రధాన కారణాలు - పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీటిని నదుల్లోకి పెద్ద ఎత్తున వదలడం. - విచ్చలవిడిగా గనుల తవ్వకం. ఏం జరుగుతుంది? పరిస్థితులు ఇలాగే కొనసాగితే నదీ జలాలు స్నానానికి కూడా పనికి రావు శుద్ధి చేయని నదీ జలాలను తాగితే ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది -
కలుషిత నీరు కలకలం
బెజ్జంకి(సిద్దిపేట) : కలుషిత నీరు తాగి మండలంలోని తోటపల్లిలో 50 మంది అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం సాయంత్రం నుంచి గ్రామానికి చెందిన పలువురు వాంతులు, విరేచనాలకు గురయ్యారు. వీరందరిని కరీంనగర్, సిద్దిపేట ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. కొందరు గ్రామంలోని ప్రభుత్వాస్పత్రితో పాటు, బెజ్జంకిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్స పొందారు. ఇందులో 25 మంది కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం 20 మంది కరీంనగర్‌లోని ప్రభుత్వాస్పత్రి, ఇద్దరు ప్రతిమా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి ఇద్దరిని తరలించగా రాజయ్య అనే వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో హైదరాబాద్ ఆస్పత్రికి తరలించనున్నట్లు వైద్యులు తెలిపారు. గ్రామంలో పర్యటించిన డీఎంహెచ్ఓ.. వివరాలు తెలుసుకున్న మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ల ఆదేశాలతో గజ్వేల్ సీఎం పర్యటన ఏర్పాట్లలో ఉన్న సిద్దిపేట డీఎంఅండ్‌హెచ్‌ఓ అమర్‌సింగ్ నాయక్, గడా హెల్త్ ప్రత్యేకాధికారి కాశీనాథ్ హుటాహుటిన గ్రామానికి వచ్చి చికిత్స పొదుతున్న రోగులను, గ్రామానికి నీరు సరఫరా చేసే బావిని పరిశీలించారు. జెడ్పీటీసీ తన్నీరు శరత్‌రావు, అధికారులు గ్రామంలో పర్యటించారు. నీటి సరఫరా నిలిపివేయించారు. ప్రతీ ఇంటికీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులను పంపిణీకి ఏర్పాట్లు చేశారు. గ్రామ పంచాయతీ వద్ద ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. గ్రామంలో ఆర్డబ్ల్యూఎస్ డీఈ జానకి, తహసీల్దార్ నాగజ్యోతి, ఎంపీడీఓ శ్రీనివాస్, ఏఈ సాయి, హుస్నాబాద్ వైద్యులు, రెవెన్యు సిబ్బంది, కార్యదర్శులు పర్యటించారు. గేట్‌వాల్వ్ వద్దే కలుషితం..? గ్రామంలోకి వెళ్లే రోడ్డు పక్కన మంచి నీటి పైప్‌కు ఉన్న గేట్ వాల్వ్ వద్ద కొన్ని రోజులు నీరు లీకవుతోందని స్థానికులు తెలిపారు. దానిని బాగు చేయకపోవడంతో అది ఓ మురుగు గుంతలా మారింది. అక్కడ కలుషితమైన నీరు పైపుల్లోకి వెళ్లడంతో గ్రామమంతా సరఫరా అయ్యాయన్న అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. సరఫరా అయిన తాగునీటి నమూనాలను అధికారులు సేకరించి ల్యాబ్‌కు పంపించారు. క్లోరినేషన్ లేకపోవడంతోనే.. తాగు నీరు సరఫరా అయ్యే బావిలో క్లోరినేషన్ చేయకపోవడం, పైప్లైన్ల లీకేజీ కారణంగా నీరు కలుషితం అయి ఉంటుంది. ప్రజలు నీటిని వేడి చేసి చల్లార్చి తాగాలి. పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. - అమర్‌సింగ్ నాయక్, డీఎంహెచ్ఓ ఆదివారం నుంచి వాంతులు.. ఆదివారం వాంతులు, విరేచనాలు అయ్యాయి. మొదట బెజ్జంకిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందిన. మా ఊరిలోని ప్రభుత్వాస్పత్రిలో మందులు ఇస్తున్నారని తెలిసి ఇక్కడికి వచ్చి చేరిన. ఇప్పుడు కొంత నయంగా ఉంది. - ఎన్నం రాజేశ్వరి, తోటపల్లి -
పొగతాగడం హానికరం..మరి ఆ నీటి సంగతి..?
సాక్షి, న్యూఢిల్లీ : గంగా నది కాలుష్యంపై గ్రీన్ ట్రిబ్యునల్ తీవ్రంగా స్పందించింది. సిగరెట్లు తాగడం ఆరోగ్యానికి హానికరమైతే కాలుష్య జలాల్లో మునిగితే వచ్చే ప్రతికూల పర్యవసానాలపై ప్రజలను ఎందుకు హెచ్చరించరని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ప్రశ్నించింది. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ నుంచి యూపీలోని ఉన్నావ్ వరకూ నదీ జలాలు తాగేందుకు, స్నానం చేసేందుకు ఎంతమాత్రం పనికిరావని ఎన్జీటీ చైర్పర్సన్ ఏకే గోయల్ నేతృత్వంలోని బెంచ్ ఆందోళన వ్యక్తం చేసింది. కలుషిత గంగా నీరు ఆరోగ్యంపై చూపే దుష్ర్పభావాల గురించి తెలియని ప్రజలు వాటిని తాగడం, స్నానం చేయడం చేస్తున్నారని పేర్కొంది. గంగా జలాలను పవిత్రంగా భావించే ప్రజలు కలుషిత నీటిని సేవించకుండా వారికి అవగాహన కల్పించాల్సి ఉందని గోయల్ అన్నారు. ప్రతి వంద కిలోమీటర్లకు గంగా నదీ జలాలు ప్రజలు సేవించేందుకు అనుకూలంగా ఉన్నాయా లేదా అనేది తెలుపుతూ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని గ్రీన్ ట్రిబ్యునల్ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగ (ఎన్ఎంసీజీ)ను ఆదేశించింది. గంగా నదీ జలాలు ఎక్కడెక్కడ తాగేందుకు, స్నానం చేసేందుకు అనువుగా ఉన్నాయో తెలుపుతూ తమ వెబ్సైట్లో రెండు వారాల్లోగా మ్యాప్‌ను ఏర్పాటు చేయాలని ట్రిబ్యునల్ ఎన్ఎంసీజీ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలిని కోరింది. -
జలమే గరళమై..
ఆ ఊళ్లో ఓ చేదబావి లేదు.. ఓ చేతిపంపూ లేదు.. తాగుదామంటూ గుక్కెడు మంచినీళ్లు కరువు.. గ్రామస్తులకు వ్యవసాయ బావే దిక్కు.. అన్ని అవసరాలకు అవే నీళ్లు.. ఆ జలం కలుషితమై.. ఆపై గరళమై జనం ప్రాణాలను కాటేసింది. తాంసి మండలం అట్నంగూడలో కలుషిత నీటి కారణంగా అతిసారం ప్రబలింది. వాంతులు, విరేచనాలతో ఇద్దరు మృతి చెందారు. మరో 11 మంది తీవ్ర అస్వస్థతతో ఆదిలాబాద్ రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. తాంసి(బోథ్): ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం గిరిగాం గ్రామ పంచాయతీ పరిధి అట్నంగూడలో అతిసారం ప్రబలింది. కలుషిత నీరుతాగి వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గుపై ఓ విద్యార్థిని, మరో వృద్ధురాలు మృతిచెందారు. 11 మంది అస్వస్థతకు గురై జిల్లా కేంద్రంలోని రి మ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రా మంలో తాగునీటి బావి లేదు. దీంతో గ్రామ స మీపంలో ఉన్న వ్యవసాయ బావిలోని కలుషిత నీటిని తాగుతున్నారు. ఈ కారణంగానే అస్వస్థత కు గురైనట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. మూ డు రోజుల క్రితం ఇదే గ్రామానికి చెందిన త లాండె బాపురావు(60) వాంతులు, విరేచనాలతో మృతి చెందాడు. అతడు అనారోగ్యంతో మృతి చెందినట్లు భావించారు. ఇదే క్రమంలో మంగళవారం గ్రామానికి చెందిన దుర్వ సుజాత(19), దుర్వ గంగుబాయి(60) వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని కుటుం బసభ్యులు రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా, సు జాత మార్గంమధ్యలో చనిపోయింది. గంగుబాయి ఆసుపత్రి చికిత్స పొందూతు మృతిచెం దింది. సుజాత మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. గ్రామంలో వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న తలండె జంగుబాయి(40), దుర్వ నిర్మలబాయి(45), పెందుర్ సీమ్(22), మడావి లక్ష్మి(26), అనక కౌసల్యబాయి(55)తో పాటు 11 మందిని ఆటోలు, 108ల ద్వా రా రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. జంగుబాయి పరిస్థితి కొంత విషమంగా ఉండడంతో అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నట్లు స్థానిక వై ద్య సిబ్బంది తెలిపారు. గ్రామంలో కనీసం బోరుబావి కూడా లేదని, దీంతో గ్రామ సమీపాన గల వ్యవసాయ బావి నీళ్లు తాగుతున్నామని గ్రామస్తులు తెలిపారు. వర్షాకాలంలో కలుషిత బావినీరు తాగడంతోనే అతిసారం ప్రబలిందని ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. అతిసారంతో ఇద్దరు మృతి చెందిన వెంటనే తాంసి, భీంపూర్ పీహెచ్‌సీల వై ద్యులు, సిబ్బంది గ్రామంలో తిరుగుతూ అతి సారం లక్షణాలున్నవారికి చికిత్స అందిస్తున్నారు. -
రూ.10 లక్షల పరిహారం చెల్లించాలి
కొరిటెపాడు(గుంటూరు): ‘‘గుంటూరులో డయేరియా ప్రబలి అనేక మంది పేదలు మృత్యువాత పడ్డారు. ఒక్కో కుటుంబానికి తక్షణమే రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి. అలాగే మున్సిపల్ శాఖా మంత్రి పి.నారాయణను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలి’’ అంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బి.కృష్ణయ్య డిమాండ్ చేశారు. స్థానిక బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు అధ్యక్షతన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కృష్ణయ్య మాట్లాడుతూ నీరు కలుషితం కాకుండా చూడకపోవడం వల్లే ఈ మరణాలు సంభవించాయని స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఇప్పటికి 25 మంది వరకు మృతి చెందారని ఆరోపించారు. ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. బాధితులకు వైద్యం అందడంలోనూ ఆలస్యం జరుగుతుందనీ, అనుభవం ఉన్న వైద్యులతో చికిత్స అందించాలని కోరారు. వైఎస్సార్ సీపీ, జనసేన మద్దతు మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ సమావేశానికి వైఎస్సార్ సీపీ, జనసేన పార్టీలు కూడా మద్దతు తెలిపాయన్నారు. గుంటూరుకు కూతవేటు దూరంలోనే ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం ఆయన పరిపాలనా తీరుకు నిదర్శనమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై నైతిక బాధ్యత వహిస్తూ చంద్రన్న బీమాతో సంబంధంలేకుండా ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో ఈ నెల 22న రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జీఎంసీ కార్యాలయం ముట్టడికి పిలుపునిస్తున్నట్లు చెప్పారు. సీపీఐ నగర కార్యదర్శి మాల్యాద్రి మాట్లాడుతూ నగరంలోని మిగిలిన ప్రాంతాలకు డయేరియా వ్యాపించకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. ఇండియన్ ముస్లిం లీగ్ నాయకుడు బషీర్ మాట్లాడుతూ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కాంగ్రెస్ నాయకుడు సురేష్, ముస్లిం హక్కుల జేఏసీ నాయకుడు ఖలీల్‌తో పాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు నాగేశ్వరరావు, అక్బర్, అరుణ్, సిహెచ్.వాసు, నళినీకాంత్, వెంకటేశ్వర్లు, రమేష్, అరుణ, అమీర్‌వలి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. మృతులకు సంతాప సూచికంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. పలు తీర్మానాలు ఆమోదం అనంతరం మృతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, మృతుల సంఖ్యను ఖచ్చితంగా తేల్చాలని, యుద్ధ ప్రాతిపదికన పైపులైన్లు మార్చాలని, యూజీడీ పనులు సత్వరమే పూర్తి చేయాలని, డిమాండ్ల సాధన కోసం సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రం, బుధవారం మృతులకు సంతాపం తెలుపుతూ రెండు నిమిషాల మౌనం పాటించడం, 22న జీఎంసీ కార్యాలయం ముట్టడి చేపట్టాలని తీర్మానాలు చేసి ఏకగ్రీవంగా ఆమోదించారు. -
గొంతులో గరళం
గుంటూరు నగరవాసులు కలుషిత జలాలతోనే గొంతు తడుపుకోవాల్సి వస్తోంది. నగరంలో చేపట్టిన భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ (యూజీడీ) పనుల పేరుతో రోడ్లను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. తాగునీటి పైపులైన్లు పగిలినా పట్టించుకోవడం లేదు. చాలా వరకు పైపులైన్లు డ్రెయిన్లకు సమీపంలోనే ఉన్నాయి. పైపులైన్లు దెబ్బతినడంతో తాగునీటిలోకి మురుగు చేరి కలుషితమవుతోంది. ఫలితంగా తాగునీటిలో ప్రమాదకర ఈకోలి బ్యాక్టీరియా ఉందని తేలింది. ఈ బ్యాక్టీరియా కారణంగానే నగరంలో డయేరియా ప్రబలిందని వైద్యాధికారులు నిర్ధారించారు. సాక్షి, గుంటూరు: రాజధాని నగరంగా రూపాంతరం చెందుతున్న గుంటూరుకు అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) మంజూరైందనగానే నగర ప్రజలు ఎంతో ఆనందించారు. అయితే యూజీడీ పనులు జరుగుతున్న తీరుతో ఆందోళన చెందుతున్నారు. రోడ్లను ఇష్టారాజ్యంగా తవ్వి, పైపులైనులు వేసిన అనంతరం జరిగా పూడ్చకపోవడంతో నగరం మొత్తం గుంతలమయంగా మారింది. యూజీడీ పనుల కోసం చేపట్టిన తవ్వకాల వల్ల భూమిలోని తాగునీటి పైపులైన్లు దెబ్బతిన్నాయి. ఫలితంగా తాగునీటిలోకి మురుగు చేరింది. దీంతో నీటిలో ప్రమాదకర ఈకోలి బ్యాక్టీరియా వృద్ధి చెందింది. ఈ బ్యాక్టీరియా కారణంగానే నగరంలో డయేరియా వ్యాధి ప్రబలి తొమ్మిది మందిని బలితీసుకుంది. నిబంధనలు బేఖాతరు నిబంధనల ప్రకారం రోడ్డును తవ్వి యూజీడీ పైపులైను వేసి మ్యాన్‌హోల్, ఇన్స్పెక్షన్ చాంబర్లను నిర్మించిన 15 రోజుల్లో రోడ్డును మళ్లీ పునర్నిర్మించాలి. అయితే నిబంధనల మేరకు రోడ్డును పునర్నిర్మించడంలేదు. యూజీడీ పనులు నిర్వహిస్తున్న పబ్లిక్ హెల్త్ అధికారులు, మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులకు మధ్య సమన్వయం కరువైంది. అనేక ప్రాంతాల్లో యూజీడీ కోసం తవ్విన చోట వాటర్ పైపులైనులు పగిలిపోయాయి. అపార్టుమెంట్లు, ఇళ్లకు వెళ్లే పైపులైనులు ధ్వంసమవుతున్నా వాటిని బాగు చేయించిన దాఖలాలు లేవు. దీనిపై కార్పొరేషన్ ఇంజినీరింగ్ అధికారులకు ప్రజలు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. సీఎం కార్యాలయానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నట్లు సమాచారం. ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యం యూజీడీ పనుల వల్ల నగరంలో మంచినీటి పైపులైనులు లీకవడం, కొన్ని చోట్ల పగిలిపోయి మురుగునీరు అందులో చేరడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. నగరంలో ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ మంచినీటి పైపులైనులు ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో పనిచేసే ఇంజినీరింగ్ అధికారులకే తెలియదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఆనందపేట, సంగడిగుంట వంటి ప్రాంతాల్లో కలుషిత నీరు తాగి వందల మంది ప్రజలు డయేరియా బారిన పడ్డారు. అయితే ఆప్రాంతంలో యూజీడీ పనులు జరగలేదని, దాని వల్ల లీకులు ఏర్పడ్డాయనేది వాస్తవం కాదని ఇంజినీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. పొన్నూరు రోడ్డులో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ కోసం తవ్విన చోట వాటర్ పైపులైనుకు లీకేజీ (ఇన్సెట్) పరిశీలిస్తున్న కార్మికుడు అయితే నగరంలోని మిగతా ప్రాంతాల్లో యూజీడీ పనుల వల్ల మంచినీటి పైపులైనులు లీకవుతున్న ఘటనలపై మాత్రం స్పందించడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని గుజ్జనగుండ్ల, విద్యానగర్, పట్టాభిపురం, నల్లచెరువు, చంద్రబాబునాయుడు కాలనీ, కంకరగుంట, సంపత్‌నగర్ వంటి ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే డయేరియా కేసులు నమోదవుతున్నాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే మరి కొందరు వ్యాధి బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. ఆందోళనలో నగర ప్రజలు గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో పైపులైనులు లీకై మురుగునీరు చేరింది. దీంతో తాగునీరు కలుషితమైంది. ఆ నీటిలో ప్రమాదకర ఈకోలి బ్యాక్టీరియా చేరింది. ఈ బ్యాక్టీరియా కారణంగా వందల మంది ప్రజలు డయేరియా బారిన పడ్డారని డీఎంహెచ్ఓ జొన్నలగడ్డ యాస్మిన్ పేర్కొన్నారు. తమ ప్రాంతాల్లో సైతం యూజీడీపనుల వల్ల పైపులైనులు లీకవడం, పగిలిపోవడం వంటి ఘటనలు చోటు చేసుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులను యూజీడీ పనులపై ప్రశ్నిస్తే తమకు సంబంధం లేదంటూ సమాధానం చెబుతున్నారని నగరప్రజలు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి నగరంలో జరుగుతున్న యూజీడీ పనులపై పూర్తి స్థాయిలో సమీక్షించి మంచినీటి పైపులైనులు ఉన్నప్రాంతాల్లో తవ్వకాలు జరుపకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. కలెక్టర్ సమీక్షస్తున్నా.. నగరంలో రెండేళ్ల క్రితం మొదలైన యూజీడీ పనులు అస్తవ్యస్తంగా సాగుతున్నాయి. పనులతీరుఐ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయితే ఈ పనులు నిర్వహించే సంస్థకు ప్రభుత్వ పెద్దల అండదండలు ఉండటంతో వారు ఎవరినీ లెక్క చేయడం లేదని తెలుస్తోంది. కొద్దికాలంగా కలెక్టర్ కోన శశిధర్ ప్రతి వారం యూజీడీ పనులపై సమీక్షలు నిర్వహిస్తున్నా పరిస్థితిలో పెద్దగా మార్పు రావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. -
తాగునీరు కలుషితం..50 మందికి అస్వస్థత
నగరంపాలెం(గుంటూరు): గుంటూరు నగరంలో తాగునీరు కలుషితమై 50 మంది అస్వస్థతకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. నగరపాలక సంస్థ పరిధిలోని సంగడిగుంట లాంచెస్టర్ రోడ్డు పరిసర ప్రాంతాల్లోని మంత్రివారి వీధి, చిటికెల వారి వీధీ, రెడ్ల బజారు తదితర ప్రాంతాల్లోని వార్డులతో పాటు ఆనందపేట, పొన్నూరు రోడ్డులో పలువురు ఆదివారం విరోచనాలు, వాంతులతో గుంటూరు జీజీహెచ్, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరారు. శనివారం ఉదయం వచ్చిన మంచినీరు తాగటం వలన అస్వస్థతకు గురైనట్లు పలువురు బాధితులు తెలుపుతున్నారు. ఆదివారం ఉదయం నీళ్ల విరోచనాలు, వాంతులు అవటంతో నీరిసించి అస్వస్థతతో 20 నుంచి 25 మంది వరకు సంగడిగుంట లాంచెస్టర్ రోడ్డులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. వీరిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మురుగునీటి కాల్వ మీద నుంచే మంచి నీరు సరఫరా అవుతుండడంతో అక్కడక్కడ లీకులు వలన నీరు కలుషితం అవుతుందన్నారు. విషయం తెలుసుకున్న నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనూరాధ, ఇంజనీరింగ్, ప్రజారోగ్యశాఖ అధికారులను క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరపాలక సంస్థ ఎంహెచ్వో డాక్టర్ శోభారాణి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు లక్ష్మయ్య బాధితులు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్ళి వివరాలు సేకరించారు. కమిషనర్ ఆదేశంతో సంగడిగుంటలోని వడ్డేగూడెం మున్సిపల్ పాఠశాలలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. -
సరూర నగర్ చెరువులో విషపు నురగ
-
కొండల్లో ఉండే వారికి రోడ్లు, నీళ్లంటే ఎలా?
- చాపరాయిలో ఎవరూ జ్వరాలతో చనిపోలేదు - కలుషిత నీరు, మూఢనమ్మకాల వల్లే మరణించారు - గిరిజనుల మరణాలపై మంత్రి కామినేని వివాదాస్పద వ్యాఖ్యలు సాక్షి, అమరావతి: కొండల్లో ఉండే వారికి రోడ్లు, నీళ్లు అందించాలంటే ఎలా? అని మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రశ్నించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల మరణాలపై మంగళవారం వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీలోని చాపరాయిలో దాదాపు 60 కుటుంబాలున్నాయి. వారంతా ఎక్కడో కొండల్లో దూరంగా ఉంటున్నారు. వాళ్ల కోసం నీళ్లు, రోడ్లు, కరెంటు.. ఇలా అన్ని వసతులూ అందించాలంటే ఎలా?..’ అని మంత్రి ప్రశ్నించారు. ‘ఆ ఊళ్లో ఎవరూ జ్వరాలతో చనిపోలేదు. ఆవు మృతి చెందడంతో.. ఆ కళేబరం నుంచి వచ్చిన నీళ్లు తాగడం, చేతబడి వంటి మూఢనమ్మకాల వల్లే చనిపోయారు. అంతేగానీ మలేరియా జ్వరాలతో కాదు. ఇప్పటివరకూ ఒక్క మలేరియా కేసు మాత్రమే నమోదైంది..’ అంటూ వివరణ ఇచ్చారు. గిరిజన ప్రాంతాల్లో రొటేషన్ ప్రాతిపదికన వైద్యుల్ని నియమిస్తామని చెప్పుకొచ్చారు. కనీస మౌలిక వసతుల్లేవు.. ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామాల్లో కనీస మౌలి క వసతుల్లేవని, తక్షణమే వారికి తాగునీరు, రోడ్లు, విద్యుత్ సౌకర్యం వంటి సదుపాయా లు కల్పించాల్సిన అవసరముందని సీఎస్ దినేశ్‌కుమార్ పేర్కొన్నారు. గిరిజనుల మర ణాలపై నిర్వహించిన సమీక్షలో సీఎస్ మాట్లాడుతూ.. ఏజెన్సీలో మౌలిక సదుపా యాల కల్పనకు నెలలోగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఇవ్వాలని ఐటీడీఏ పీవోలను ఆదేశించారు. వర్షాకాలంలో అంటువ్యాధులు రాకుండా చర్యలు తీసుకో వాలని, సంచార వైద్యశాలలు, మందులను అందుబాటులో ఉంచాలని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాల కొండయ్య మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతా ల్లోని వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయాల్సి ఉందన్నారు. వివిధ నెట్వర్క్ ఏజెన్సీలతో మాట్లాడి పూర్తి స్థాయి లో నెట్వర్క్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్ చెప్పారు. -
జూపాడుబంగ్లాలో అతిసారం
-30మందికి పైగా అస్వస్థత -గ్రామంలో పర్యటించిన జిల్లా వైద్యాధికారిణి మీనాక్షిమహాదేవన్ -తాగునీటి కలుషితంపై ఆరా జూపాడుబంగ్లా: మండలకేంద్రం జూపాడుబంగ్లాలో అతిసారం ప్రబలింది. కలుషిత తాగునీటి సరఫరాతో గ్రామంలోని నీలిపల్లెపేట, సిద్దేశ్వరంపేట, సంతగేట్‌కాలనీ, కాసానగర్, క్వార్టర్స్ తదితర ప్రాంతాలకు చెందిన 30 మంది సోమవారం ఉదయం వాంతులు, విరేచనలు చేసుకున్నారు. గ్రామంలోని ముస్లిం కాలనీలో ఉండే ఓవర్‌హెడ్ ట్యాంకును సరిగ్గా శుభ్రం చేయకపోవడమే ఈపరిస్థితికి కారణమని గ్రామస్తులు వాపోతున్నారు. దీనికితోడు చాలా రోజులుగా నీలిపల్లెపేట కాలనీలో మురుగునీటి కాల్వలు శుభ్రం చేయడం లేదు. కాలువ గుండా ఉన్న తాగునీటి పైపులు లీకై నీరు కలుషితమై ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ కాలనీలో ఐదురోజుల క్రితం ఒకరిద్దరు అతిసారం బారిన పడ్డారు. సోమవారం ఒక్కసారిగా పదుల సంఖ్యలో అస్వస్థతకు గురికావడంతో చికిత్స కోసం వచ్చిన వారితో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి కిటికిటలాడింది. డాక్టర్ రంగారెడ్డి బాధితులకు సెలెన్‌బాటిళ్లు ఎక్కించి ప్రాథమిక చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని మెరుగైన చికిత్సకోసం 108లో నందికొట్కూరుకు తరలించారు. అతిసారం ప్రబలిన విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారిణి మీనాక్షిమహాదేవన్ జూపాడుబంగ్లా ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి చేరుకొని బాధితులతో మాట్లాడారు. తర్వాత గ్రామానికెళ్లి సమస్యపై ఆరాతీశారు. తాగునీటి ట్యాంకును శుభ్రం చేయకపోవటంతోనే అతిసారం ప్రబలినట్లు వైద్యాధికారిణి తెలిపారు. తాగునీటి కలుషితంపై డీఈ ఆరా: గ్రామంలో తాగునీటి కలుషితంతో వాంతులు, విరేచనాలు ప్రబలిన విషయాన్ని తెలుసుకున్న తాగునీటిశాఖ డీఈ రవికుమార్‌రెడ్డి, ఏఈ మహమ్మద్‌హుసేన్, ఈఓపీఆర్డీ మహమ్మద్‌హనీఫ్ ముస్లిం కాలనీలోని తాగునీటి ట్యాంకును పరిశీలించారు. వెంటనే శుభ్రం చేయించారు. ఇదిలా ఉంటే నీటిని పరీక్ష చేయగా తాగునీరు కలుషితం కాలేదని తేలిందని డీఈ చెప్పడం గమనార్హం. -
100 మంది విద్యార్థినులకు అస్వస్థత
తిరుపతి: కలుషిత నీరు తాగి వంద మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాల బాలికల వసతి గృహంలో కలుషిత నీరు తాగి శుక్రవారం 100 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని రుయా, స్విమ్స్, కేంద్రీయ ఆస్పత్రులకు తరలించారు. కాగా నలుగురు విద్యార్థినుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
కలుషిత నీరు: 26 మందికి అస్వస్థత
మహబూబ్‌నగర్ : కలుషిత నీరు తాగి 26 మంది విద్యార్థులు అస్వస్థత గురైయ్యారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్‌లోని వీపనగండ్ల కస్తుర్భాగాంధీ పాఠశాలలో బుధవారం జరిగింది. పాఠశాలలోని ట్యాంక్ లో నిల్వ చేసిన మంచినీటి తాగిన విద్యార్థుల్లో 26 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ట్యాంక్‌ను శుబ్రపరచకపోవడం వల్లనే ఈ సంఘటన జరిగిందని విద్యార్థుల తల్లి దండ్రులు ఆరోపిస్తున్నారు. -
కలుషితనీరు తాగి 138 మందికి అస్వస్థత
చిలకలగూడ రైల్వేక్వార్టర్స్ కలుషిత నీరు తాగి 138 మంది అస్వస్థతకు గురయ్యారు. కలుషిత నీరు తాగిన వీరికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఇందులో 40 మంది చిన్నారులు కూడా ఉన్నారు. పరిస్థితి విషమంగా ఉండటంతో బాధితులను మెట్టుగూడ రైల్వే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనాస్థలాన్ని రైల్వే అధికారులు పరిశీలించారు. -
15 మంది విద్యార్థినులకు అస్వస్థత
హసన్‌పర్తి(వరంగల్): కలుషిత నీటి వినియోగంతో 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా హసన్‌పర్తి మండలం కోమటిపల్లిలో సోమవారం వెలుగుచూసింది. స్థానికంగా ఉన్న ఎస్సీ స్టడీ సర్కిల్లో గ్రూప్ 2 కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థినులు కలుషిత నీటితో స్నానం చేయడంతో... అస్వస్థతకు గురయ్యారు. స్టడీ సర్కిల్లో 30 మంది విద్యార్థినులు ఉండగా.. అందులో 15 మంది విద్యార్థినులకు చర్మం మీద పొక్కులు, దురద, బెందులు ఏర్పడ్డాయి. దీంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. -
కలుషిత నీరు తాగితే కైలాసానికే
♦ 45 గ్రామాల గిరిజనులకు చెలమ నీరే శరణ్యం ♦ తాగునీటి సదుపాయాలు శూన్యం ♦ మంజూరు కాని మంచినీటి పథకాలు అక్కడి గిరిజనులు విషంతో సమానమైన కలుషిత నీటిని తాగాల్సి వస్తోంది. ఆ నీటిని తాగితే ప్రమాదకరమైన రోగాలు, కొన్ని సందర్భాల్లో మరణాలు కూడా సంభవిస్తాయని తెలిసినా దాహం తీర్చుకునేందుకు మరో దారిలేక ఆ నీటినే తాగుతున్నారు. వేసవిలో కాలువలు ఎండిపోవడం వల్ల గిరిజనులు చెలమలు తీస్తారు. ఆ నీటిలో ఆకులు పడి కుళ్లిపోయి కలుషితంగా మారుతుంది. మరో గత్యంతరం లేక సుమారు 45 గ్రామాల్లో ఆదివాసీలు ఇలా చెలమల్లో కలుషిత నీటినే సేవిస్తున్నారు. తాగునీటి పథకాల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు పంపినా ఇంతవరకు వాటికి మోక్షం కలగలేదు. కొయ్యూరు: మండలంలోని పలు గిరి గ్రామాల్లో తాగునీటి సదుపాయాలు లేక గిరిజనులు కలుషిత నీటిని తాగి రోగాలబారిన పడుతున్నారు. వేసవి వస్తే కాలువలు, గెడ్డల్లో నీరు ఇంకిపోతుంది. నీటి నిల్వలు ఉన్నచోట చెలమలు తీస్తారు. దానిలో ఎండిన ఆకులు, చెత్త పడుతుంది. అవి రోజుల తరబడి నిలిచిపోయి కుళ్లిపోవడంతో నీరు కలుషితమవుతుంది. గిరిజనులకు తాగునీటి వసతులు లేక ఆ నీటిని తెచ్చుకుని తాగేందుకు, వంటకు వినియోగిస్తారు. కొన్ని సందర్భాల్లో ఈ నీటిని తాగిన తర్వాత వాంతులు, విరేచనాలు పట్టుకుంటాయి. సమయానికి వైద్యం అందకుంటే ప్రాణాలు పోయే పరిస్థితులు కూడా నెలకొంటాయి. గతంలో కలుషిత నీటిని తాగి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎం.భీమవరం పంచాయతీ పరిధిలోని కాకులమామిడి, జ్యోతులమామిడి, పుట్టకోట, పెదలంక, కొత్తూరు, బొబ్బిలికొండ, మైనకోట, బుగ్గురాయి గ్రామాల్లోని ప్రజలకు తాగునీటి సదుపాయాలు లేకపోవడంతో కలుషిత నీరే వారికి ఆధారం. ఆయా గ్రామాలకు రహదారి లేకపోవడంతో బోర్లు వేసేందుకు రిగ్గులు వచ్చే అవకాశం లేదు. యూ.చీడిపాలెం పంచాయతీ పరిధిలోని నక్కలమెట్ట, డబ్బలంక, నీలవరం,గంగవరం,పాలసముద్రం, మర్రిపాకలు, ఈదులబంద, సంగమవలస, ఎండకోట, గొంధికోట, రేవులకోట, రేవులకోట కంఠారం, జెర్రిగొంధితో పాటు బూదరాళ్ల పంచాయతీలో 15 గ్రామాల్లోని ఆదివాసీలు చెలమ నీటిని తాగుతున్నారు. వర్షాకాలంలో కాలువలో బురదనీటిని తాగాల్సిన పరిస్థితి. ప్రతిపాదనలతో కాలయాపన మండలంలో 168 గ్రామాల్లో తాగునీటి పథకాలను నిర్మించేందుకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధంచేశారు. రెండేళ్లు కావొస్తున్నా ఇంతవరకు ఒక్కటీ మంజూరు కాలేదు. దీంతో గిరిజనులకు తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. కొన్ని చోట్ల బావులు తవ్వినా నిరుపయోగంగా ఉన్నాయి. గ్రావిటీ పథకం ద్వారా నీటిని సరఫరా చేసేందుకు వీలున్నా ఆదిశగా అధికారులు చర్యలు చేపట్టడం లేదు. మరగబెట్టకుంటే మరణమే.. ఇక్కడ కాలువ నుంచి తీసుకు వస్తున్న కలుషిత నీటిని ఇంటి వద్ద మరగబెట్టుకుని తాగుతాం. తెచ్చిన నీటిని మరగబెట్టకుండా తాగితే వెంటనే వాం తులు, విరేచనాలు పట్టుకుంటాయి. ఈ ప్రాంతంలో నీరు కలుషితంగా మారింది. రక్షిత నీరు అందించాలని కోరినా ఫలితం లేకపోయింది. -వి.అప్పారావు, జ్యోతులమామిడి వేసవిలో ఇబ్బందే ప్రస్తుతం కాస్తున్న ఎండలకు కాలువలో నీరు క్రమేపీ ఎండిపోతోంది. కొన్నిరోజుల్లో ఉన్న నీరు కూడా దొరకని పరిస్థితి నెలకొంటుంది. గుక్కెడు నీటికి ఎన్నో పాట్లు పడుతున్నాం. మరోదారిలేక కలుషిత నీటిని తాగాల్సివస్తోంది. - కె.కేశవరావు, కాకులమామిడి -
డయేరియాతో 30 మంది ఆస్పత్రిపాలు
విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం చిన్నదోర్జలో డయేరియా విజృంభించింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు గ్రామానికి చెందిన సుమారు 30 మంది అస్వస్థతకు గురికాగా వారిని మూడు అంబులెన్సుల్లో కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. గ్రామంలో మొత్తం 60 కుటుంబాలు ఉన్నాయి. ఊట నీరుని తాగునీరుగా వినియోగిస్తున్నారు. ఇది కలుషితం కావడం వల్లే డయేరియాకు దారితీసిందని సమాచారం. -
కలుషిత నీటితో 20 మందికి అస్వస్థత
రక్షిత మంచినీటి పథకంలో భాగంగా సరఫరా అవుతున్న నీరు కలుషితం కావటంతో ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. ఖమ్మం జిల్లా వైరా మండలం గండగలపాడులో ఈ ఘటన చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం గ్రామంలో సరఫరా అయిన నీటిని తాగి ఒకే వీధికి చెందిన దాదాపు ఇరవై మంది వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. వారందరినీ వైరా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, పీహెచ్సీ సిబ్బంది గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. -
కళేబరం ఉన్న నీటితో వంటలు: హాస్టల్లో ఆకలి కేకలు
రాజాం (శ్రీకాకుళం జిల్లా): శ్రీకాకుళం జిల్లా రాజాం బస్డాండ్ వెనుక ఉన్న బీసీ బాలికల పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో విద్యార్థినులు నాలుగు రోజులుగా ఆకలితో అలమటిస్తున్నారు. హాస్టల్ నిర్వాహకులు వంట వండకపోవడంతో విద్యార్థినులు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం రోడ్డెక్కారు. హాస్టల్లో వంట వండటానికి పక్కనున్న బావి నుంచి నీళ్లు ఉపయోగించేవారు. నాలుగు రోజుల క్రితం బావిలో ఓ పిల్లి పడి చనిపోయింది. దాంతో పాటు మోటారు పాడైంది. అయితే మోటారును బాగుచేసినా నీటిలో ఉన్న పిల్లి కళేబరం అలానే ఉంది. నీటిని శుద్ధి చేయకపోవడంతో వాటితోనే వండిన వంటలు.. దుర్వాసన వచ్చాయి. దీంతో పిల్లలు తినలేక పోతున్నారు. నీటిని శుద్ధిచేసి మంచినీటితో వండితేనే తింటామని భీష్మించారు. దాంతో ఆగ్రహించిన వార్డెన్ వంట వండేది లేదని తేల్చిచెప్పడంతో అప్పటినుంచి డబ్బున్న వాళ్లు హోటళ్లలో తింటుండగా డబ్బులు లేనివారు ఆకలితో పస్తులున్నారు. ఈ విషయం తెలిసిన విద్యార్థి సంఘాల నేతలు సోమవారం మధ్యాహ్నం హాస్టల్ విద్యార్థినులతో పట్టణంలో ర్యాలీ నిర్వహించి తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఉన్నతాధికారులు పరిస్థితిని విచారించి చర్యలు తీసుకుటామని హామీ ఇచ్చారు. -
కలుషిత నీరు తాగి అస్వస్థత
యాలాల (రంగారెడ్డి) : కలుషిత నీరు తాగి 20 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా యాలాల మండలం కమాల్‌పూర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి నీరు సరఫరా చేసే నీటి ట్యాంక్ అపరిశుభ్రంగా ఉండటం వల్లే ఇలా జరిగి ఉంటుందని స్థానికులు అంటున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు గ్రామంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు.