ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: విషజ్వరాలు విజృంభిస్తున్నా యి. రఘునాధపాలెం మండలంలో రాంక్యాతండా పం చాయతీ బద్యాతండాలో సుమారు 15 మందికిపైగా విష జ్వరాలతో బాధపడుతూ ఖమ్మంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇటీవల వరుసగా వారం రోజుల పాటు ముసురుతో కూడిన వర్షం కురవడంతో గ్రామంలో మురుగు నీరు నిలిచి దోమలు వృద్ధి చెందా యి. దీంతో విష జ్వరాలు వ్యాపిస్తున్నాయని స్థానికులు అంటున్నారు. జ్వరంతో పాటు కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నామని బాధితులు అంటున్నారు.
తాగునీరు కూడా కలుషితం అవుతోందని గ్రామస్తులు అంటున్నా రు. గ్రామంలో భూక్యా సైదులు జ్వరంతో బాధపడుతుం డగా తావిర్యా బద్రియా అనేవ్యక్తులు కీళ్ల నొప్పులతో బాధపడుతూ మంచంలోనే ఉన్నారు. మరో 10 మందిపైగా జ్వరాలతో బాధపడుతూ ఖమ్మంలోని ప్రైవే ట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బద్యాతండాతో పాటు పంగిడి పంచాయతీలోని మూలగూడెంలో సైతం అనేక మంది విష జ్వరాలతో బాధపడుతున్నారు.
విజృంభిస్తున్న విష జ్వరాలు
Published Mon, Aug 5 2013 6:02 AM | Last Updated on Fri, Sep 1 2017 9:40 PM