రక్షిత మంచినీటి పథకంలో భాగంగా సరఫరా అవుతున్న నీరు కలుషితం కావటంతో ప్రజలు అస్వస్థతకు గురయ్యారు.
రక్షిత మంచినీటి పథకంలో భాగంగా సరఫరా అవుతున్న నీరు కలుషితం కావటంతో ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. ఖమ్మం జిల్లా వైరా మండలం గండగలపాడులో ఈ ఘటన చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం గ్రామంలో సరఫరా అయిన నీటిని తాగి ఒకే వీధికి చెందిన దాదాపు ఇరవై మంది వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. వారందరినీ వైరా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, పీహెచ్‌సీ సిబ్బంది గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.