ఖమ్మం: వరద నీటితో పొంగుతున్న గోదావరి కాస్త శాంతించింది. పరీవాహక ప్రాంతంలోని గ్రామాలను ముంచెత్తుతోంది. ఖమ్మం జిల్లా భద్రాచలం, పాల్వంచ డివిజన్‌లోని ఏజెన్సీ గ్రామాలు నీట మునిగాయి. భద్రాచలం వద్ద గోదావరి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. వరద ఉధృతి కాస్త శాంతించడంతో ఇప్పుడిప్పుడే అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఖమ్మం జిల్లాను గోదావరి వరదలు ముంచెత్తాయి. వందల గ్రామాలు వరద ముంపులో చిక్కుకొని అల్లాడుతున్నాయి. సాయం అందక లోతట్టు ప్రాంతాల ప్రజలు విలవిలలాడుతున్నారు. పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. గోదావరి వరద 62 అడుగులు చేరి ప్రవహించడంతో భద్రచలం, పాల్వంచ డివిజన్‌లు అతాలాకుతలం అయ్యాయి. గత రెండు రోజులుగా వరద ఉధృతి తగ్గుముకం పట్టింది. ప్రస్తుతానికి గోదావరి వరద ఉదృతి తగ్గి 48 అడుగులకు చేరింది. దీంతో అధికారులు 3వ ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకున్నారు.
కాస్త శాంతించిన గోదావరి
Published Tue, Aug 6 2013 7:50 PM | Last Updated on Wed, Aug 1 2018 3:59 PM