అసెంబ్లీలో మాట్లాడుతున్న జలగం వెంకట్రావు
సాక్షి, కొత్తగూడెం: ప్రభుత్వాస్పత్రులపై నమ్మ కం కల్పించేందుకు, అందులో ప్రసవాల సంఖ్య ను పెంచేందుకుగాను ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకాన్ని సింగరేణి, ఆర్టీసీ ఆస్పత్రుల్లో కూడా అమలు చేయాలని కొత్తగూడెం ఎమ్మెల్యే జల గం వెంకటరావు అన్నారు. శాసనసభలో సోమ వారం ప్రశ్నోత్తరాల సమయంలో పలు అంశాలపై జలగం మాట్లాడారు. కేసీఆర్ కిట్ పథకం వల్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయన్నారు. సింగరేణి, ఆర్‌ర్టీసీ సంస్థల ఉద్యోగులు, కార్మికులు కూడా తెలంగాణ బిడ్డలేనని, వారికి కూడా పథకాన్ని వర్తింపజేయాలన్నారు.
స్పం దించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఈ విషయమై సీఎంతో చర్చిస్తానని సమాధానం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ కింద అందిస్తున్న ఆర్థికసాయాన్ని రూ.75,116 నుంచి రూ.1,00,116కు పెంచు తూ ముఖ్యమంత్రి చేసిన ప్రకటనపై ఎమ్మెల్యే జలగం వెంకటరావు హర్షం వ్యక్తం చేశారు. పెంచిన మొత్తంతో ఆడపిల్ల పెళ్లి చేయడం ఇంకా సులువు అవుతుందన్నారు. అంతేకాకుండా ఈ పథకం వర్తించాలంటే 18 సంవత్సరాలు నిండాలని నిబంధన ఉండటం వల్ల బాల్యవివాహాలు కూడా తగ్గుతాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment