మహబూబ్‌నగర్ : కలుషిత నీరు తాగి 26 మంది విద్యార్థులు అస్వస్థత గురైయ్యారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్‌లోని వీపనగండ్ల కస్తుర్భాగాంధీ పాఠశాలలో బుధవారం జరిగింది. పాఠశాలలోని ట్యాంక్ లో నిల్వ చేసిన మంచినీటి తాగిన విద్యార్థుల్లో 26 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ట్యాంక్‌ను శుబ్రపరచకపోవడం వల్లనే ఈ సంఘటన జరిగిందని విద్యార్థుల తల్లి దండ్రులు ఆరోపిస్తున్నారు.