సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీకి సరఫరా అవుతున్న నీటిలో అమ్మోనియా శాతం పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. హర్యానా నుంచి వస్తున్న కలుషిత నీటితో వజీరాబాద్ బ్యారేజీలో అమ్మోనియా శాతం పెరుగుతోందని వారు పేర్కొన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కొత్తఢిల్లీతోపాటు నార్త్‌ఈస్ట్ ఢిల్లీలోని ప్రాంతాలకు నీటి సరఫరాపై తీవ్ర ప్రభావం పడనుంది. యమునా నీటిని వజీరాబాద్ బ్యారేజీ నుంచి వజీరాబాద్, చంద్రవాల్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లకు సరఫరా చేస్తుంటారు. అక్కడ ఈ నీటిని శుద్ధి చేస్తారు. అధికారుల నుంచి అందుతున్న సమాచారం మేరకు గురువారం రాత్రి సరఫరా అయిన నీటిలో అమ్మోనియా శాతం ఆరు పీపీఎం వరకు చేరింది.
తాగునీటిలో అమ్మోనియా శాతం అసలు ఉం డకూడదు. అమ్మోనియా కలిసి ఉన్న నీటిని తాగేం దుకు వినియోగించకూడదు. అమ్మోనియాను తొల గించేందుకు నీటిలో క్లోరిన్‌ను అధిక శాతంలో కలుపుతున్నారు. దీంతో క్లోరోమిన్‌లు ఏర్పడి నీరు శుద్ధి అవుతుందని పేర్కొంటున్నా, ఆ నీరు తాగితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసం నీటిని ముం దుగా పరీక్షించి, దానిలోని క్లోరోమిన్‌ల శాతాన్ని తెలుసుకున్న తర్వాతే నీటిని సరఫరా చేయాల్సి ఉంటుందని వారు వాదిస్తున్నారు.
కాగా, ప్రస్తుతం జల్‌బోర్డు అధికారులు ఇలాంటి పరీక్షలేవి చేయకుండానే నీటిని సరఫరా చేస్తున్నార న్న విమర్శలున్నాయి. ఢిల్లీవాసులకు ఉచితంగా నీటిని సరఫరా చేయడంతోపాటు నీటి నాణ్యతను పెంతుతామని ఆమ్ ఆద్మీపార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా, అమ్మోనియా కారణంగా నీటిని పరీక్షించేందుకు ఎక్కువ సమయం పట్టే క్రమంలో అది రాజధానిలో నీటి సరఫరాపై ప్రభావం చూపుతుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అమ్మోనియా ఎందుకు పెరుగుతోంది?
హర్యానాలోని సోనిపట్, పానిపట్ ప్రాంతాల్లో ఎన్నో ఫ్యాక్టరీలు ఉన్నాయి. వీటి నుంచి వచ్చే వ్యర్థా లు నేరుగా యమునా నదిలో కలుస్తున్నాయి. దీం తో అమ్మోనియా శాతం పెరుగుతోంది.
‘జల’గలపై నజర్ 35 ప్రైవేట్ బోర్‌వెల్స్ మూసివేత
సాక్షి, న్యూఢిల్లీ : ప్రైవేటు ట్యాంకర్లతో నీటిని విక్రయిస్తూ రూ.కోట్లలో దండుకుంటున్న జలమాఫియాపై జల్‌బోర్డు అధికారులు కొరఢా ఝులిపిస్తున్నారు. రానున్న రోజుల్లో తాగునీటి ఎద్దడి ఎదుర్కొనేందుకు ఆప్ సర్కార్ ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకుంటోంది. దీనిలో భాగం గా ఢిల్లీలోని అనధికారిక బోర్‌వెల్స్‌ను మూయిం చే పనిలో జల్‌బోర్డు అధికారులు నిమగ్నమయ్యా రు. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో కలిపి రెండు రోజుల్లోనే 13 బోర్‌వెల్స్‌ను సీజ్ చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటివరకు మొత్తం 35 బోర్‌వెల్స్‌ను సీజ్ చేశారు. వీటి రక్షణ కోసం గార్డులను సైతం అధికారులు నియమిస్తున్నారు. ఇలా చేయడంతో ట్యాంకర్ మాఫియాను కట్టడి చేయవచ్చన్నది ఆప్ సర్కార్ వ్యూహం. వేసవి లోపే అనధికారిక బోర్‌వెల్స్‌ను, ట్యాంకర్ మాఫియాను కట్టడి చేస్తే ప్రజలకు సరిపడా నీరు అందించవచ్చని అధికారులు అంటున్నారు.
‘అమ్మో’నియా..!
Published Fri, Jan 10 2014 10:57 PM | Last Updated on Sat, Sep 2 2017 2:29 AM
Advertisement
Advertisement