కలుషిత నీరు తాగి 17మంది ఆస్పత్రిపాలు | 17 people seriously ill with drinking polluted water | Sakshi
Sakshi News home page

కలుషిత నీరు తాగి 17మంది ఆస్పత్రిపాలు

Published Sat, May 30 2015 4:34 AM | Last Updated on Sat, Sep 29 2018 5:21 PM

17 people seriously ill with drinking polluted water

బత్తలపల్లె(శ్రీకాళహస్తి రూరల్) : కలుషిత నీరు తాగి 17 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ  సంఘటన శుక్రవారం మండలంలోని యార్లపూడి పంచాయితీ, బత్తలపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. బత్తలపల్లెలో 30 కుటుంబాలు నివసిస్తున్నాయి. రక్షిత మంచినీటి పథకం ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అయితే ఓవర్ హెడ్ ట్యాంక్‌ను శుభ్రపరిచి ఏడాది గడచిపోవడంతో పాచిపట్టి పురుగులు పడ్డాయి. ట్యాంక్ పైభాగంలో మూత అమర్చకపోవడంతో తొండలు,బల్లులు పడి మృతి చెందాయి.

ఈ క్రమంలో కలుషితమైన ఆ నీటిని తాగడంతో 18 మందికి విరేచనాలు, వాంతులయ్యాయి. 108లో ఎంపేడు ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి  తరలించారు.అస్వస్థతకు గురైన వారిలో శంకరయ్య(37),వెంకటేశ్వరులు(27), మహాలక్ష్మి(28),సుబ్రమణ్యం(45), అమ్ములు(42), రేణుక(23),గురవమ్మ(60),గంగమ్మ(51), విజయమ్మ(55), వెంకటసుబ్బయ్య(52), సుబ్రమణ్యం (40), శంకరయ్య(37), జ్ఞానమ్మ(50), వనజ(18),ఇంద్రజ(15),రమాదేవి (21),సంపూర్ణమ్మ(40) ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement