రంగారెడ్డి జిల్లా బంట్వారం మండలంలో డయేరియా ప్రబలింది. బొపునారం గ్రామంలో డయేరియాతో గురువారం ఆశన్న(70)చనిపోగా, మరో ఇరవై మంది బాధితులు వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో కలుషిత నీరు తాగటం వల్లే డయేరియా ప్రబలిందని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యం వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది స్థానికంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
బంట్వారంలో పెరిగిన డయేరియా కేసులు
Published Thu, Sep 24 2015 12:27 PM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM
Advertisement
Advertisement