సాక్షి, హైదరాబాద్: మంత్రులు ఏం చెప్పినా అధికారపక్ష సభ్యులు సహజంగా విభేదించరు. కానీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో సొంత పార్టీ సభ్యులు విష్ణుకుమార్‌రాజు, ఆకుల సత్యనారాయణతో పాటు పలువురు టీడీపీ సభ్యులూ విభేదించారు. సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో.. ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో సిబ్బంది కొరత లేదని, సమస్యలూ లేవని మంత్రి సమాధానం ఇచ్చారు. మంత్రి వాస్తవాలు మాట్లాడితే బాగుంటుందని, ప్రైవేట్ కళాశాలల్లో తనిఖీలప్పుడు అద్దె డాక్టర్లను తీసుకొస్తారని బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్‌రాజు అన్నారు.
డీమ్డ్ యూనివర్సిటీ పేరుతో ‘గీతమ్’లో ఒక్కో సీటు రూ. కోటికి అమ్ముతారని, ప్రభుత్వం నుంచి స్థలం, రాయితీలు పొంది వ్యాపారం చేసుకోవడం తప్పని గట్టిగా చెప్పారు. బీజేపీకి చెందిన మరో సభ్యుడు ఆకుల సత్యనారాయణ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు టీడీపీ సభ్యులూ.. ఆసుపత్రుల్లో సమస్యలను ఏకరువు పెట్టారు. అందరూ విభేదించడంతో మంత్రి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మంత్రి కామినేనితో విభేదించిన బీజేపీ, టీడీపీ సభ్యులు
Published Tue, Dec 22 2015 2:33 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement