మోదీని విమర్శించే స్థాయి కాంగ్రెస్‌కు లేదు | congress in not at level to criticize modi | Sakshi
Sakshi News home page

మోదీని విమర్శించే స్థాయి కాంగ్రెస్‌కు లేదు

Jun 8 2015 2:56 AM | Updated on Mar 18 2019 7:55 PM

ప్రజలతో ఛీకొట్టించుకుని కనీసం డిపాజిట్లు కూడా దక్కని కాంగ్రెస్ పార్టీకి ప్రధాని నరేంద్రమోదీని విమర్శించే స్థాయి లేదని...

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్
కైకలూరు :
ప్రజలతో ఛీకొట్టించుకుని కనీసం డిపాజిట్లు కూడా దక్కని కాంగ్రెస్ పార్టీకి ప్రధాని నరేంద్రమోదీని విమర్శించే స్థాయి లేదని  రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ చెప్పారు. కృష్ణాజిల్లా కైకలూరులో ఆదివారం జరిగిన జన్మభూమి  ముగింపు సభకు ఆయన హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ.. బీజేపీపై విమర్శలు చేస్తున్న ఏపీసీసీ అధ్యక్షుడికి కనీసం డిపాజిట్లు కూడా రాలేదనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు.

వైఎస్ జగన్ రైతులకు అన్యాయం జరిగిందని అంటున్నారని, సీఎం చంద్రబాబు తగిన న్యాయం చేస్తారని వివరించారు. ఈ నెల 9న చంద్రబాబు చేతుల మీదుగా ఈ-ఔషధం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 1400 మంది డాక్టర్ల నియామకం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు మందులు లేవంటే సంబంధిత డాక్టర్లను సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు), మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు తదితరులు  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement