రుణమాఫీలో జరిగిన అవినీతిపై సీఐడీతో దర్యాప్తు చేపడతామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.
శ్రీకాకుళం : రుణమాఫీలో జరిగిన అవినీతిపై సీఐడీతో దర్యాప్తు చేపడతామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. శనివారం శ్రీకాకుళం జిల్లా రాజాం మండలంలో ఎమ్మెల్యే కళావెంకట్రావును ఆయన కలిశారు. ఈ సందర్భంగా మంత్రిని కలిసేందుకు వచ్చిన నాయకులు రుణమాఫీకి సంబంధించిన పేర్ల సేకరణలో అవినీతి జరిగిందని వివరించారు. దీంతో స్పందించిన మంత్రి ఈ వ్యవహారంపై విచారణ జరిపిస్తామని హామి ఇచ్చారు.
(రాజాం)