వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు తమకు చెప్పలేదని ఏపీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ అన్నారు.
వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు తమకు చెప్పలేదని ఏపీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ అన్నారు. దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దుచేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విసిరిన సవాలుకు వాళ్లు సమాధానం ఇచ్చారు.
ప్రభుత్వాన్ని రద్దు చేసే ప్రసక్తి లేదని, తాము ఐదేళ్లూ అధికారంలోనే ఉంటామని మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ వెల్లడించారు.