హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శుక్రవారం వ్యవసాయ బడ్జెట్ సమర్పించారు. అలాగే శాసనమండలిలో కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కాగా వ్యవసాయ బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యాంశాలు:
2015-16 వ్యవసాయ బడ్జెట్ అంచనా రూ.14,184 కోట్లు
మొదటి దశ రుణమాఫీకి 40.50 లక్షల ఖాతాలకు రూ.4,689 కోట్లు ఖర్చు చేశాం
రెండో దశ కింద 42.16 లక్షల ఖాతాలకు వర్తింపు
ప్రయివేటు భాగస్వామ్యంతో ప్రాథమిక రంగ మిషన్
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు నష్టపరిహారం పెంపు రూ.1.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు
భూసార పటిష్టతకు రూ.905 కోట్లు
విత్తన మార్పిడికి రూ.80 కోట్లు
ఎస్సీ, ఎస్టీ రైతులకు సబ్సిడీ 50 శాతం నుంచి 70 శాతానికి పెంపు
యాంత్రీకరణకు రూ.141.63 కోట్లు
శాటిలైట్ ఇమేజనరీకి రూ.81.21 కోట్లు
పొలం బడి కార్యక్రమానికి రూ.1.46 కోట్లు
వడ్డీలేని రుణాల కోసం రూ.172 కోట్లు
పావలా వడ్డీకి రూ.10 కోట్లు
రాష్ట్ర కృషి వికాస్ యోజనకు రూ.513.21 కోట్లు
ఎన్టీ రంగా విశ్వవిద్యాలయానికి రూ.367.73 కోట్లు
ఉద్యాన శాఖకు రూ.210 కోట్లు
ఉద్యాన అభివృద్ధి మిషన్కు రూ.100 కోట్లు
క్షేత్రస్థాయి నీటి నిర్వహణకు రూ.144 కోట్లు
పట్టు పరిశ్రమకు రూ.93.61 కోట్లు
వైఎస్ఆర్ హార్టీ కల్చర్ యూనివర్శిటీకి రూ.53.01 కోట్లు
పశు సంవర్థక శాఖకు రూ.672.73 కోట్లు
ఉపాధి హామీకి నిధులు పెంపు
వ్యవసాయరంగంలో ప్రయివేటుకు పెద్దపీట
త్వరలో వ్యవసాయ విస్తరణాధికారులుగా 6,354 మంది నియామకం
ఉచిత విద్యుత్కు భారీగా తగ్గిన నిధులు,
రూ.3,000 కోట్లు కేటాయింపు...గత ఏడాదితో పోల్చితే రూ.188 కోట్లు తగ్గింపు
హుద్హుద్ తుపానులో నష్టపోయిన రైతులకు రూ.140 కోట్లు
వెంకటేశ్వర పశువైద్య కళాశాలకు రూ.124 కోట్లు
మత్స్యశాఖకు రూ.187 కోట్లు
భూసార పటిష్టత మ్యాపుల తయారీ
గత ఏడాదితో పోలిస్తే తగ్గిన వడ్డీ రాయితీ
గతేడాది రూ.230 కోట్లు కేటాయింపు, ఈసారి రూ.182 కోట్లు
సహకార శాఖకు రూ.7.88 కోట్లు
సౌర విద్యుత్ తో నడిచే 10వేలు పంపుసెట్లు
రైతులు మెరుగైన ధరలు పొందేందుకు చర్యలు
అనంతపురంలో వేరుశెనగ పంటను కాపాడేందుకు సామూహిక స్ప్రింక్లర్ల ఏర్పాటు
సేద్యపు ఖర్చులు తగ్గించడానికి చర్యలు
ఎరువుల సరైన సరఫరాకు రూ.60 కోట్లు
లక్షలోపు రుణాలకు వడ్డీ రాయితీ
లక్ష నుంచి 3లక్షల లోపు రుణాలకు పావలా వడ్డీ
పావలా వడ్డీ రుణాలకు రూ.10 కోట్లు
మార్క్ఫెడ్కు రూ.60 కోట్లు
గోదాముల నిర్మాణానికి రూ.56 కోట్లు
నూతన వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ.367.70 కోట్లు
రైతు సంఘాలకు వాహనాలు
7 జిల్లాల్లో 238 కరువు మండలాలుగా గుర్తింపు
అనంతపురం జిల్లాలోని మొత్తం మండలాలు
పశ్చిమ గోదావరిలో 24 మండలాలు
బిందు, తుంపర్ల సేద్యానికి రూ.144 కోట్లు
ముడిపత్తి ఉత్పత్తికి రూ. 93 కోట్లు
పట్టు పురుగుల పెంపకాన్న ప్రోత్సహిస్తాం
మేలైన మామిడి, జీడిమామిడి ఉత్పత్తులకు ప్రాధాన్యం
ఈ పాలన ద్వారా జిల్లా కార్యాలయాలు అనుసంధానం
పశువైద్యశాల ఆధునికీకరణకు రూ.50 కోట్లు
రూ.5 కోట్లతో పశు వసతి గృహాలు
కూరగాయలు, రైతుల ప్రోత్సాహకానికి రూ.53 కోట్లు
చెరకు, వరి పంటలకు అధిక ప్రాధాన్యం
మన రాష్ట్రం పట్టు ఉత్పత్తిలోనే దేశంలోనే రెండో స్థానం
చేపల ఉత్పత్తికి అనేక పథకాలు
చేపలు, రొయ్యల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ మొదటిస్థానం
మత్య్య పరిశ్రమను వృద్ధికారకంగా గుర్తించాం
విజయవాడను ప్రపంచ ఆక్వా కల్చర్ రాజధానిగా చేస్తాం
షెడ్యూల్ కులాల మత్య్సకారుల కోసం అనేక పథకాలు
అనంతపురం, రాయలసీమ జిల్లాల్లో వేరుశెనగపంటకు ప్రత్యామ్నయంగా గోరుచిక్కుడు
ఇందుకోసం రూ.8కోట్లు
రాష్ట్రంలో 190 వ్యవసాయ మార్కెట్ కమిటీలు
రైతుబంధు పథకం ద్వారా రూ.17కోట్లు రుణాలు రైతులు పొందారు
26,830 సహకార సంఘాలున్నాయి
భూగర్భ జలమట్టం పెంచేందుకు చర్యలు
వ్యవసాయ బడ్జెట్ ముఖ్యాంశాలు
Published Fri, Mar 13 2015 12:53 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement