raghuveera
-
గవర్నర్లతో బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్: రఘువీరా
అమరావతి: గవర్నర్లతో బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడి రాజకీయాలు చేస్తోందని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆరోపించారు. మణిపూర్, గోవా రాష్ట్రాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్లు ఆహ్వానించకపోవడమే దీనికి నిదర్శనమన్నారు. హంగ్ వచ్చినప్పుడు గవర్నర్లు అతిపెద్ద పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించే ఆనవాయితీ 60 ఏళ్లుగా కొనసాగుతోందన్నారు. ఈనెల 11న ఐదు రాష్ట్రాల్లో కౌంటింగ్ తర్వాత వెంకయ్యనాయుడు, అమిత్‌షాలు బరితెగించి మణిపూర్, గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఎలా చెప్పగలరని ప్రశ్నించారు. ఇది అప్రజాస్వామికమన్నారు. బీజేపీ నేతలు మిగిలిన వారితో బేరసారాలు చేసుకునే వరకు ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించరా? అని ధ్వజమెత్తారు. తమిళనాడులో కూడా ఇదే జరిగిందని, అక్కడ అవినీతి ముసుగు అడ్డంపెట్టుకొని నాటకం ఆడారన్నారు. మణిపూర్, గోవా రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటుకు ముందుగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని, కాంగ్రెస్ పార్టీ బల నిరూపణ చేసుకోలేనప్పుడు ఇతర పార్టీలను ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. -
గవర్నర్ ప్రసంగం.. తేదేపా అబద్దాల కరపత్రం: రఘువీరా రెడ్డి
విజయవాడ: అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం తేలుగు దేశం పార్టీ తయారు చేసిన అబద్దాల కరపత్రమని ఏపీసీసీ అధ్యక్షలు ఎన్ రఘువీరారెడ్డి విమర్శించారు. సోమవారం గవర్నర్ ప్రసంగంపై ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గవర్నర్ ప్రసంగంలో పార్టీ ఫిరాయింపులు, ఓటుకు నోటు కేసు, టీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుల వివరాలు, అమెరికాలో ఆంధ్రులపై జరుగుతున్న దాడులు ప్రస్తావించకపోవడం శోచనీయమన్నారు. ప్రత్యేక హోదా విషయం ముగిసిన అధ్యాయం అని గవర్నర్ ప్రసంగంలో పేర్కొనడం రాష్ట్ర ప్రజలను దగా చేయడమేనని, ఈ విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు. ప్రజలు చంద్రబాబును 2019 వరకే ఎన్నుకున్నారని, అప్పటి వరకు ఏం చేస్తారో చెప్పకుండా 2022 ,2029 లో ఏం చేస్తామో చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తీరు అమ్మకు అన్నం పెట్టలేడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నట్లుందన్నారు. ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో నదుల అనుసంధానం జరిగిందని, తెలుగుదేశం అనుసంధానానికి నాందీ పలికినట్లు గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించడం విడ్డూరంగా ఉందన్నారు. మహిళా సాధికారత కోసం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం బంగారుతల్లి పథకాన్ని ప్రవేశ పెడితే ఆ బంగారు తల్లి గొంతు పిసికి మహిళా సాధికారత గురించి మాట్లాడడం విస్మయానికి గురి చేస్తోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దోమలు స్వైర విహారం చేస్తుంటే ప్రభుత్వం దోమలపై దండయాత్రలు చేసిందని చెప్పుకోవడం సిగ్గు చేటని విమర్శించారు. ప్రభుత్వం పట్ల 80 శాతం సానుకూలత ఉందని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. అదే నిజమైతే ఖాళీగా ఉన్న స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలచేత రాజీనామా చేయించి ఎన్నికలకు ఎందుకు వెళ్లడంలేదని ప్రశ్నించారు. రాష్ట్ర కరవు పరిస్థితులపై గవర్నర్ ప్రసంగం ప్రత్యేక శ్రద్ద వహించినట్లు లేదని, ఇప్పటికే రాష్ట్రమంతా కరవు విలయతాండం చేస్తోందని తెలిపారు. ఉపాథి హామి పథకం సక్రమంగా అమలుకాక పల్లెలకు పల్లెలు వలసపోతున్నాయన్నారు. పల్లెల్లో ప్రజలు బాబు వస్తే కరవు వస్తుందని చెప్పుకుంటున్నారని చెప్పారు. -
ప్రజల్లోకి వెళ్లని ఆయనకేమి తెలుసు..
-
ప్రజల్లోకి వెళ్లని ఆయనకేమి తెలుసు..
అమరావతి : ప్రత్యేక హోదాపై ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్షను కేంద్రమంత్రి సుజనా చౌదరి చెల్లని నోట్లతో పోల్చడం టీడీపీ దివాళా కోరుతనానికి నిదర్శనమని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. హోదా చెల్లదని రూ. 500, 1000ల నోట్లతో పోల్చుతూ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఏనాడూ ప్రజల్లోకి వెళ్లని సుజనా చౌదరికి హోదా గురించి ప్రజలు ఎంతగా కోరుకుంటున్నారో ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. కేంద్రం ప్రకటించిన చట్టబద్ధత లేని ప్యాకేజీ కోసం ప్రయత్నించడం టీడీపీ ఆడుతున్న మరో డ్రామా అని విమర్శించారు. హోదాపై ఇచ్చిన హామీని అమలు చేయకపోగా..చులకన చేయడం తగదన్నారు. చేతనైతే కాంగ్రెస్ చేస్తున్న హోదా ఉద్యమంలో భాగస్వాములు కావాలని రఘువీరా హితవు పలికారు. -
15న రాజమండ్రిలో కాంగ్రెస్ ప్రజా బ్యాలెట్
- ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి వెల్లడి అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్‌పై రాష్ట్ర ప్రజల మనోభావాలను అధికారంలో ఉన్న ప్రభుత్వానికి తెలియజేసేందుకు ఈ నెల 15న రాజమండ్రిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా బ్యాలెట్ నిర్వహించనున్నట్టు పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక హోదా దక్కకుంటే భవిష్యత్‌లో రాష్ట్ర యువత కోటి ఉద్యోగ అవకాశాలను కోల్పోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బ్యాంకులు, ఏటీఎం వద్ద పడగాపులు పడుతున్న ప్రజలకు సహాయ, సహకారాలు అందజేసేందుకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పిలుపు మేరకు 13 జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. కేంద్రం ప్రభుత్వం కొత్తగా రూ. 2000 నోట్లను చలామణీలోకి తీసుకరావాలన్న నిర్ణయాన్ని మోదీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆయన సూచించారు. బ్యాంకులు, ఏటీఎంలో రూ. 100 నోట్ల పెద్ద మొత్తంలో అందుబాటులో ఉంచాలని రఘువీరా డిమాండ్ చేశారు. -
బాబు వెంటే కరువు : రఘువీరా
అగళి : అవిభక్త కవలలైన వాణి, వీణలను విడగొట్టడం ఎలా సాధ్యం కాలేదో చంద్రబాబును, కరువును విడగొట్టడం కూడా అలాగే సాధ్యం కాదని, కరువు ఎల్లప్పుడూ ఆయన వెంటే ఉంటుందని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ వ్యంగ్య బాణాలు సంధించారు. సినిమా డైలాగుల తరహాలో ‘నన్ను చూసి కరువు పారిపోతుంది’ అనడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. వారు సోమవారం అగళి మండలంలోని పి.బ్యాడిగెర గ్రామ పరిధిలో ఎండిపోయిన వేరుశనగ పంటను పరిశీలించారు. అనంతరం హెచ్‌డీహళ్లి సబ్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ హయాంలో కరువొస్తే వెంటనే స్పందించి నష్టపరిహారం, బీమా అందించేవాళ్లమన్నారు. కానీ చంద్రబాబు పరిహారం రాకుండా చేసేందుకు రక్షక తడులు ఇచ్చినట్లు కేంద్రానికి నివేదిక పంపారన్నారు. కర్ణాటకలో ఇప్పటికే కరువు మండలాలు ప్రకటించారని, ఇక్కడ మాత్రం నేటికీ జాబితా విడుదల చేయలేదని విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి సీఎం ఉండటం మన రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమన్నారు. ఆయన వెంట కన్వీనర్ మహేంద్ర, మాజీ కన్వీనర్ సూర్యనారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ నరసింహయ్య, మాజీ సర్పంచు చిక్కవన్నప్ప, నాయకులు క్వారీ యజమానులు నవీన్, షరీఫ్, త్యాగరాజు తదితరులు ఉన్నారు. -
'బాబు స్వార్థ ప్రయోజనాల కోసమే ప్రత్యేక ప్యాకేజీ'
విశాఖపట్నం : సీఎం చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసమే ప్రత్యేక ప్యాకేజీ వైపు మొగ్గు చూపుతున్నారని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు విమర్శించారు. విశాఖలో గురువారం ఆయన మాట్లాడుతూ...ఏపీకి పదేళ్లు హోదా ఇస్తామని తిరుపతి సభలో మోదీ చెప్పారన్నారు. యూపీఏ హయాంలో ప్రత్యేక హోదా పదేళ్లు అడిగిన జైట్లీ, వెంకయ్య ఇప్పుడు ప్రైవేటు బిల్లు ఓటింగ్ కూడా రాకుండా చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీతో సీఎం చంద్రబాబు జేబులు నింపుకోవాలనుకుంటున్నారని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. ఏపీకి హోదాపై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ప్రజలను మోసగిస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా కల్పిస్తే నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు. విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. జాతీయ హోదాగా ప్రకటించిన పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదలలో ఆలస్యం జరుగుతుందని రఘువీరా అన్నారు. -
కుట్రలు మాని కలసిరా: రఘువీరా
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకీ ప్రత్యేక హోదా కోరుతూ శుక్రవారం రాజ్యసభలో కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లు విషయంలో ఎలాంటి కుట్రలు చేయకుండా ఓటింగ్‌కు సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి కోరారు.ఆయన గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. బిల్లు శుక్రవారం ఓటింగ్‌కు రాకుండా చేయడానికి చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బిల్లుకు మద్దతు ఇచ్చినందుకు వైఎస్సార్సీపీకి రఘువీరా కృతజ్ఞతలు తెలిపారు. సీపీఐ మద్దతు..: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తెచ్చిన బిల్లుకు సీపీఐ మద్దతు పలుకుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వెల్లడించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. -
'తండ్రీకొడుకులు రాష్ట్రాన్ని లూఠీ చేస్తున్నారు'
నక్కపల్లి (విశాఖ) : రాష్ట్రం కరవుతో అల్లాడుతుంటే సీఎం చంద్రబాబు కుటుంబంతో కలసి విహార యాత్రలు చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రఘువీరా మండిపడ్డారు. శనివారం విశాఖ జిల్లా నక్కపల్లి మండలం గోడిచర్లలో కరవు యాత్ర సందర్భంగా రఘువీరా సీఎం చంద్రబాబు పాలనపై విమర్శలు గుప్పించారు. కేంద్రం ఇస్తున్న నిధులను జన్మభూమి కమిటీల పేరుతో స్వాహా చేస్తున్నారని మండిపడ్డారు. ఉపాధి కూలీలకు మజ్జిగ పేరుతో హెరిటేజ్ మజ్జిగ సరఫరా చేసినట్టు దొంగ లెక్కలు చూపించి తండ్రీ కొడుకులు ఇద్దరూ రాష్ట్రాన్ని లూఠీ చేస్తున్నారని అన్నారు. మజ్జిగ కాదు కదా కనీసం మంచినీళ్లు కూడా అందించడం లేదన్నారు. రాష్ట్రంలో కరవు ఎక్కడుందని ప్రకటనలు చేస్తున్న సీఎం, మంత్రులకు దమ్ముంటే తమతో రావాలని, కరవును చూపిస్తామని సవాల్ విసిరారు. ప్రత్యేక హోదా రాకపోతే ఆ విషయంలో తొలి ముద్దాయి చంద్రబాబేనన్నారు. ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచైనా సరే దాన్ని సాధిస్తామన్నారు. -
ఉపాధి హామీ పేరిట రూ.5 వేల కోట్ల దోపిడీ: రఘువీరా
గోపాలపట్నం (విశాఖ) : రాష్ట్రంలో ఉపాధి హామీ పధకం పేరిట రూ.5 వేల కోట్ల దోపిడీ జరిగిందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఆరోపించారు. విశాఖ నగరంలోని గోపాలపట్నంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పధకాన్ని తుంగలో తొక్కేశారని, దాని ఫలాలు పేదలకు అందడం లేదని విమర్శించారు. జన్మభూమి కమిటీల సభ్యుల కూలీల డబ్బులు కైంకర్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ నిర్వాకంతో 20 లక్షల మంది గ్రామాల నుంచి వలసలు పోయారని అన్నారు. ఖరీఫ్ సమయం ముంచుకొస్తున్నా రుణమాఫీ చేయలేదని, దీని వల్ల రైతాంగం వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లో చిక్కుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గత మూడేళ్లుగా ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా నిధులు ఇవ్వలేదన్నారు. రైతాంగ సమస్యలపై క్షేత్రస్ధాయి పరిశీలన చేస్తున్నామని... ప్రతి జిల్లాలో కరువు తీవ్రత, రైతుల ఇబ్బందులు, ప్రభుత్వ వైఫల్యాలు గుర్తించడంతోపాటు రైతులను ఎలా ఆదుకోవాలన్న అంశాలను నమోదు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని రఘువీరా అన్నారు. -
కేసీఆర్ సంతకం పెడితే బాబు జైలుకే: రఘువీరా
అనంతపురం : 'ఓటుకు నోటు' కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంద శాతం దోషి అని స్పష్టంగా తేలిందని, సంబంధిత ఫైలు తెలంగాణ సీఎం కేసీఆర్ టేబుల్ వద్ద ఉందని, సంతకం పెట్టిన మరుక్షణమే చంద్రబాబు చేతులకు సంకెళ్లు పడటం ఖాయమని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ కేసు భయంతో చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి వెనకాడటం లేదని ఆయన ధ్వజమెత్తారు. అనంతపురంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రఘువీరారెడ్డి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. శ్రీశైలం డ్యాం నుంచి లిఫ్ట్ ద్వారా 160 టీఎంసీల నీటిని తరలించేందుకు కేసీఆర్ సర్కారు అనేక అక్రమ ప్రాజెక్టులను చేపట్టిందన్నారు. రూ.32 వేల కోట్ల ప్రాజెక్టులకు సంబంధించి టెండర్లు, భూసేకరణ జరుగుతున్నాయన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్త్తిగా చట్టవిరుద్ధమని, రాష్ట్ర విభజన చట్టానికి కూడా వ్యతిరేకమని పేర్కొన్నారు. వీటివల్ల రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలు భవిష్యత్తులో ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు సైతం తాగు, సాగునీటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. ఇలా ఎనిమిది జిల్లాల ప్రయోజనాలు దారుణంగా దెబ్బతినే పరిస్థితి ఉన్నా చంద్రబాబు మౌనం వహించడంపై రఘువీరా మండిపడ్డారు. చంద్రబాబు పలుమార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసినా ఏనాడూ తెలంగాణ చేస్తున్న అన్యాయంపై ఫిర్యాదు చేయలేదన్నారు. కాంగ్రెస్ హయాంలో మహారాష్ట్ర ప్రభుత్వం రెండు టీఎంసీల నీటిని అక్రమంగా వాడుకుంటోందని అక్కడికెళ్లి అరెస్టై నానాయాగీ చేసిన చంద్రబాబు.. ఇప్పుడు పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతున్నా మౌనం దాల్చడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసు భయంతోనే కేసీఆర్‌కు దాసోహమయ్యారని విమర్శించారు. రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యంపై శనివారం శ్రీశైలం డ్యాం వద్ద కాంగ్రెస్ ముఖ్య నాయకులు, రైతులతో కలిసి నిరసన చేపడుతున్నట్లు తెలిపారు. -
మోదీ మేకిన్ ఇండియా..బాబు మేకిన్ సింగపూర్: దిగ్విజయ్
విజయవాడ సెంట్రల్: ప్రధాని నరేంద్ర మోదీ మేకిన్ ఇండియా అంటుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు మేకిన్ సింగపూర్ అంటున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ ఎద్దేవా చేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వాలు ఎన్నికల హామీలను పూరి ్తగా విస్మరించాయని దిగ్విజయ్‌సింగ్ ధ్వజమెత్తారు. మోదీ, చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీల అమలు కోసం ప్రజల పక్షాన ఉద్యమిస్తామన్నారు. విజయవాడ రాష్ట్ర కార్యాలయం లో పీసీసీ సమన్వయ కమిటీ తొలి సమావేశం, కాంగ్రెస్ విస్తృత కార్యవర్గ సమావేశం, విలేకరుల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ప్రత్యేకహోదాపై నోరు మెదపకపోవడం సిగ్గుచేటని దిగ్విజయ్ ధ్వజమెత్తారు. దోపిడీ పాలనపై పోరాడదాం: రఘువీరా రాష్ట్రంలో టీడీపీ దోపిడీపాలనపై పోరాటాన్ని ఉధృతం చేయాలని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. మే నెల్లో పోరాటానికి రూపకల్పన చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రరత్న భవన్లో కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం 60 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం విజయవాడ కేంద్రంగా మళ్లీ కాంగ్రెస్ కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉండగా నగరం నుంచే కాంగ్రెస్ కార్యకలాపాలు సాగేవి. ఆ తరువాత తెలంగాణతో కలిసి రాష్ట్రం ఏర్పడ్డాక హైదరాబాద్‌కు మకాం మార్చారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రరత్న భవన్ రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంగా మారింది. దిగ్విజయ్‌సింగ్ శుక్రవారం ఉదయం ప్రారంభించారు. -
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం
హాజరైన దిగ్విజయ్, రఘువీరా,13 జిల్లాల డీసీసీ అధ్యక్షులు బెజవాడలో తొలి పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం ఇకపై ఆంధ్రరత్నభవన్ నుంచే పూర్తిస్థాయి పార్టీ వ్యవహారాలు విజయవాడ బ్యూరో : ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలకు కేంద్రంగా వెలుగొందిన విజయవాడ ఆంధ్రరత్న భవన్ మళ్లీ కొత్తరూపు సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంగా మారింది. శుక్రవారం ఉదయం ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన పార్టీ పతాకాన్ని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్రరత్న భవన్ ప్రాంగణం పార్టీ శ్రేణులు, నేతలతో కిటకిటలాడింది. జై కాంగ్రెస్ .. నినాదాలతో మార్మోగింది. ఇకపై ఇక్కడి నుంచే పార్టీ వ్యవహారాలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పటిష్టపరిచేందుకు అవసరమైన కార్యాచరణ రూపకల్పనతో పాటు ఇతరత్రా పార్టీ వ్యవహారాలన్నీ ఇకపై ఇక్కడి నుంచే నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. పార్టీ నేతల సమావేశాలకు అనుగుణంగా ఏసీ సమావేశ మందిరాన్ని, రెండు విశ్రాంతి గదులను నిర్మించారు. పీసీసీ అధ్యక్షుని కోసం ప్రత్యేకంగా ఏసీ గదిని ఏర్పాటు చేశారు. వెయిటింగ్ హాల్, కార్యకర్తల విశ్రాంతి గదులను కూడా ఏర్పాటుచేశారు. 200 మంది కంటే ఎక్కువ మంది విచ్చేసినపుడు సమావేశం నిర్వహించేందుకు వీలుగా ఆంధ్రరత్నభవన్‌కు తూర్పున ఉన్న ఖాళీ స్థలాన్ని ఉంచారు. గతంలో ఉత్తరాన ఉన్న మెట్లను తొలగించి ప్రత్యేకంగా నైరుతీ భాగాన ఐరన్మెట్లు ఏర్పాటు చేశారు. తొలి సమన్వయ కమిటీ సమావేశం.. శుక్రవారం దిగ్విజయ్‌సింగ్ ప్రారంభించిన పీసీసీ రాష్ట్ర కార్యాలయంలో తొలిసారిగా సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. దిగ్విజయ్‌తోపాటు రఘువీరా, కొప్పుల రాజు, తిరువనక్కరుసు, జేడీ శీలం, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, పళ్లంరాజు, కనుమూరి బాపిరాజు పాల్గొన్నారు. రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు అవసరమైన కార్యాచరణపై సమీక్షించారు. పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన వెంటనే తన ముందున్న కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డిని దిగ్విజయ్ పలకరించి నేతల సమక్షంలోనే క్షమాపణ కోరారు. ఇటీవల అనంతపురం జిల్లా బండ్లపల్లిలో జరిగిన రాహుల్‌గాంధీ సభలో కోట్లకు జరిగిన అవమానాన్ని, ఎదురైన ఇబ్బందిని ప్రస్తావించి పార్టీ పక్షాన సారీ చెప్పారు. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటలకు వరకూ జరిగిన పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో దిగ్విజయ్‌తో పాటు రఘువీరారెడ్డి నేతలనుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలోని ప్రజల హక్కుల కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరాయంగా పోరాడుతూనే ఉంటుందన్నారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై దిగ్విజయ్ ధ్వజమెత్తారు. మేడిన్ ఇండియా నినాదంతో ప్రధాని మోదీ అడుగులు వేస్తుంటే, మేడిన్ సింగపూర్ నినాదంతో చంద్రబాబు పరుగులు తీస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు మాట్లాడారు. ఏపీసీసీ అధికార ప్రతినిధులు కొలనుకొండ శివాజీ, మీసాల రాజేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కడియాల బుచ్చిబాబు, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు పరసా రాజీవ్త్రన్ తదితరులు పాల్గొన్నారు. పనితీరు భేష్ ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి పనితీరు భేషుగ్గా ఉందంటూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ కితాబిచ్చారు. అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలిరావడం శుభపరిణామం అన్నారు. నేడు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ.. సమ్మేళనం శనివారం ఉదయం 10 గంటల నుంచి విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విభాగాల ప్రత్యేక సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పీసీసీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన డీసీసీ అధ్యక్షులను కోరారు. పార్టీ రాష్ట్ర కార్యాలయ ప్రారంభ కార్యక్రమంలో నేతలు సాకే శైలజానాథ్, కనుమూరి బాపిరాజు, పళ్లంరాజు, నాదెండ్ల మనోహర్, సి.రామచంద్రయ్య, కేవీపీ రామచంద్రరావు, జేడీ శీలం, గంగాభవానీ పాల్గొన్నారు. -
కాంగ్రెస్ సంబరానికి పావురాలు ఆహుతి
-
రూ.5 వేల కోట్లు దోచుకున్నారు: రఘువీరా
కొవ్వూరు (పశ్చిమగోదావరి) : టీడీపీ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇసుక అక్రమ వ్యాపారం ద్వారా ఏడాదిన్నర కాలంలో రూ.5 వేల కోట్లు దోచుకున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు, తాళ్లపూడి, దేవరపల్లి, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో శనివారం పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో ఆయిల్‌పామ్, చెరకు, పొగాకు రైతులు, పింఛన్లు రాని వృద్ధులు, డ్వాక్రా మహిళలతో పీసీసీ బృందం సభ్యులు భేటీ అయ్యారు. రఘువీరా మాట్లాడుతూ.. డ్వాక్రా మహిళల పేరుచెప్పి సాగిస్తు న్న ఇసుక అక్రమాలపై అవసరమైతే మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. చెరకు తోలిన రైతులకు షుగర్ ఫ్యాక్టరీలు వారం, పది రోజు ల్లోగా డబ్బు చెల్లించకపోతే వారి తరఫున ఉద్యమం చేపడతామని హెచ్చరిం చారు. కాంగ్రెస్ సంబరానికి పావురాలు ఆహుతి స్వేచ్ఛకు, శాంతికి చిహ్నమైన తెల్లటి పావురాలను తమ సంబరాల కోసం కాంగ్రెస్ నాయకులు చంపేశారు. పావురాలను తారాజువ్వలో ఉంచి నిప్పుపెట్టి వినోదం చూశారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో శనివారం ఈ ఘటన జరిగింది. కొవ్వూరు రోడ్డు కమ్ రైలు బ్రిడ్జి దగ్గర రఘువీరాకు స్వాగతం పలికేందుకు వచ్చిన కార్యకర్తలు ఈ చర్యకు పాల్పడ్డారు. తారాజువ్వకు పైభాగంలో పావురాల్ని ఉంచగా అవి మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనపై కొవ్వూరుకు చెందిన గంధం పూజ్య బాపూజీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ పవన్‌కుమార్ తెలిపారు. దీనిపై అటవీ శాఖకు చెందిన సిబ్బంది విచారణ చేపట్టారు. -
వనజాక్షి ఘటనే కాదు.. ఇంకా అలంటావి ఎన్నో
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చిన సంక్షేమ పథకాలను టీడీపీ ప్రభుత్వం నీరుగారుస్తోందని ఆంధప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన ప్రభుత్వ నేతలు పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. ఏపీలో జరిగిన రైతు ఆత్మహత్యలన్నీ కూడా సర్కార్ హత్యలేనని ఆరోపించారు. తహశీల్దార్ వనజాక్షి ఘటన ఒక్కటే వెలుగులోకి వచ్చిందని, ఇంకా వెలుగులోకి రానీ ఎన్నో సంఘటనలు ఉన్నాయని చెప్పారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను కాపాడేందుకు సీఎం పదవిని దుర్వినియోగం చేస్తున్నారని రఘువీరా విమర్శించారు. -
'కేసు నుంచి తప్పించుకునేందుకే సెక్షన్ 8'
-
'ఆ రెండు పార్టీలు డ్రామాలు ఆపాలి'
నెల్లూరు :ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో టీడీపీ, బీజేపీలు పూర్తిగా విఫలమయ్యాయని, దీనిపై ఆ పార్టీలాడుతున్న డ్రామాలు ఆపాలని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. నెల్లూరులో డీసీసీ ఆధ్వర్యంలో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, దుగ్గరాజపట్నం పోర్టు సాధనపై మంగళవారం చర్చావేదిక నిర్వహించారు. దీనికి విచ్చేసిన రఘువీరా మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పార్టీ తప్పేమీ లేదని, రాష్ట్రంలోని అన్నీ పార్టీలు విభజన చేయాలని చెప్పిన తరువాతే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించిందన్నారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ నష్టపోకుండా రూ.5 లక్షల కోట్ల పధకాలు, ప్యాకేజీలు, ప్రత్యేకహోదా అంశాలు చట్టంలో పొందుపర్చారని తెలిపారు. అయితే ఈ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ వీటిని పట్టించుకోవడం లేదని, టీడీపీ కూడా బీజేపీపై ఒత్తిడి తేవడం లేదని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా మేనిఫెస్టోలో ఇచ్చిన 600 హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని టీడీపీని తూర్పారబట్టారు. దీనిని నిరసిస్తూ ఈనెల 8వ తేదీన అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ మేనిఫెస్టోను తగలబెట్టడం, మానవహారాలు ఏర్పాటు చేయడం తదితర కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. -
మీడియా ప్రతినిధుల నిరసన
-
'ఎన్నికల హామిలను తుంగలో తొక్కారు'
-
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
-
' అడ్రస్ లేని పార్టీకి ఆయన నాయకుడు'
హైదరాబాద్ : ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి పై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ అడ్రస్ లేని పార్టీకి రఘువీరా నాయకుడని విమర్శించారు. పట్టిసీమపై రఘవీరా రెడ్డి చేసిన విమర్శలను ఆయన ఖండించారు. చిన్నబాస్ కు రూ.500 కోట్లు ముట్టాయనడం కాదు..ఆధారాలు ఉంటే చూపాలన్నారు. విమర్శలు చేసే ముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని రఘువీరారెడ్డి కి ఆయన సూచించారు. -
రాజధాని భూముల పై అఖిలపక్ష సమావేశం
-
'ఇందిరమ్మ మాట - కాంగ్రెస్ బాట'
-
చంద్రబాబుకు రఘువీరా సవాల్
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన మేఘమథనంలో అవినీతి చోటు చేసుకుందంటూ చేసిన ఆరోపణలపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి సవాల్ విసిరారు. ఈ మేరకు చంద్రబాబుకు రఘువీరా లేఖ రాశారు. అనంతపురంలో ప్రముఖుల సమక్షంలో మేఘమథనంలో అవినీతి జరిగిందని చంద్రబాబు చేసిన ఆరోపణల్ని ఆయన ఖండించారు. ఆ వ్యవహారంలో సీబీఐ లేదా హైకోర్టు, సుప్రీం కోర్టు, సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని రఘువీరా డిమాండ్ చేశారు. -
కాంగ్రెస్‌కు కాయకల్ప చికిత్స
నేడు పార్టీ నేతలు రఘువీర, బొత్స, కేవీపీ, సీఆర్సీ రాక కడప అగ్రికల్చర్ : రాష్ట్ర విభజన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారింది. దీంతో జిల్లాలో పార్టీ ఉనికి కష్టంగా మారింది. ఈ తరుణంలో పార్టీకి జవసత్వాలు నింపేందుకు కాయకల్ప చికిత్సకు పార్టీ రాష్ట్ర నేతలు పూనుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం నగరంలోని ఇందిరా భవన్లో జిల్లాలోని పార్టీ ప్రతినిధులతో, శాసనసభకు పోటీచేసి ఓడిపోయిన అభ్యర్థులతోనూ, రాష్ట్ర నేతలు ప్రతినిధులతో, మండల, నియోజకవర్గ స్థాయి నాయకులు, పార్టీ కార్యవర్గంతోనూ సమీక్ష నిర్వహించనున్నారు. ఆ తర్వాత విడివిడిగా నియోజకవర్గాల నాయకులను పార్టీ కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తల, ద్వితీయ శ్రేణి నాయకుల బాగోగులు చూడని రాష్ట్ర నేతలు ఇప్పుడు తగుదునమ్మా అంటూ సమీక్షలు చేయడం ఎంతవరకు సమంజసమని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీ తనను విస్మరించిందని అధ్యక్షుడు మాకం అశోక్ కుమార్ పార్టీని వీడి వైఎస్సార్ సీపీలో చేరారు. అలాగే ఎమ్మెల్సీ షేక్ హుస్సేన్ కూడా పార్టీ వీడారు. అదే విధంగా ఎమ్మెల్యేలు వీరశివ, వరద రాజులరెడ్డి, శివరామకృష్ణయ్య పార్టీని వీడి టీడీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే డీఎల్ రవీంద్రారెడ్డి, ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు పార్టీలో అంటీముట్టనట్లు ఉంటున్నారు. పార్టీలో ప్రముఖులుగా ఉన్న వారెవరూ లేకపోవడంతో పార్టీకి కళ తప్పింది. పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు రాష్ట్రనేతలు ఆపసోపాలు పడుతున్నారు. ఎన్నికల సమయంలో కార్పొరేటర్ అభ్యర్థులుగా పోటీచేసిన వారికి నయాపైసా కూడా ఇవ్వకపోవడంతో పోటీలో ఉన్న తాము పరువు పోతుందని పార్టీ కోసం వైదొలగకుండా పోటీచేసినందుకు అప్పులు మిగిలాయని కొందరు బాహటంగా విమర్శిస్తున్నారు. ఈ విషయాలన్నింటిని ఈ సమీక్షలో చర్చించి నేతలను నిలదీస్తామని యువజన కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు. -
'చంద్రబాబు వీలైనంత త్వరగా రుణమాఫీ చెయ్యాలి'
-
"పవన్‌కు 'ఆ విషయం' పై అవగాహన ఉందో..? "
-
చిరంజీవి వచ్చాడు... జనం మాత్రం రాలేదు
-
'పీసీసీ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తా'
-
సీమాంద్రకు రఘువీరా,తెలంగాణకు పొన్నాల
-
'కాంగ్రెస్‌ను పనర్నిర్మిస్తా'
-
మూడోరోజూ మండలికి రాని మంత్రులు
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి సమావేశాలకు వరుసగా మూడోరోజు కూడా మంత్రులు హాజరుకాకపోవడం గొడవకు దారి తీసింది. మంత్రుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా బుధవారం సమావేశం ప్రారంభం కాగానే అన్ని పార్టీల సభ్యులు గళమెత్తారు. సమావేశం మొదలయిన సమయంలో సభానాయకుడు రామచంద్రయ్య సహా ఒక్క మంత్రి కూడా రాలేదు. టీడీపీ సభ్యులు నన్నపనేని రాజకుమారి, శమంతకమణిలు దీన్ని ప్రస్తావించారు. దీనికి అధికార కాంగ్రెస్‌తో సహా అన్ని పక్షాల సభ్యులు మద్దతిచ్చి మంత్రుల హాజరుపై రూలింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం సభకు వచ్చిన మంత్రి రఘువీరా మాట్లాడుతూ చిన్న పొరపాటు జరిగిందని, పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు.