శాసనమండలి సమావేశాలకు వరుసగా మూడోరోజు కూడా మంత్రులు హాజరుకాకపోవడం గొడవకు దారి తీసింది.
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి సమావేశాలకు వరుసగా మూడోరోజు కూడా మంత్రులు హాజరుకాకపోవడం గొడవకు దారి తీసింది. మంత్రుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా బుధవారం సమావేశం ప్రారంభం కాగానే అన్ని పార్టీల సభ్యులు గళమెత్తారు.
సమావేశం మొదలయిన సమయంలో సభానాయకుడు రామచంద్రయ్య సహా ఒక్క మంత్రి కూడా రాలేదు. టీడీపీ సభ్యులు నన్నపనేని రాజకుమారి, శమంతకమణిలు దీన్ని ప్రస్తావించారు. దీనికి అధికార కాంగ్రెస్‌తో సహా అన్ని పక్షాల సభ్యులు మద్దతిచ్చి మంత్రుల హాజరుపై రూలింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం సభకు వచ్చిన మంత్రి రఘువీరా మాట్లాడుతూ చిన్న పొరపాటు జరిగిందని, పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు.