ఆంధ్రరత్న భవనంలో ఏపీ కాంగ్రెస్ కొత్త కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న దిగ్విజయ్
విజయవాడ సెంట్రల్: ప్రధాని నరేంద్ర మోదీ మేకిన్ ఇండియా అంటుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు మేకిన్ సింగపూర్ అంటున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ ఎద్దేవా చేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వాలు ఎన్నికల హామీలను పూరి ్తగా విస్మరించాయని దిగ్విజయ్‌సింగ్ ధ్వజమెత్తారు. మోదీ, చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీల అమలు కోసం ప్రజల పక్షాన ఉద్యమిస్తామన్నారు. విజయవాడ రాష్ట్ర కార్యాలయం లో పీసీసీ సమన్వయ కమిటీ తొలి సమావేశం, కాంగ్రెస్ విస్తృత కార్యవర్గ సమావేశం, విలేకరుల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఎన్‌డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ప్రత్యేకహోదాపై నోరు మెదపకపోవడం సిగ్గుచేటని దిగ్విజయ్ ధ్వజమెత్తారు.
దోపిడీ పాలనపై పోరాడదాం: రఘువీరా
రాష్ట్రంలో టీడీపీ దోపిడీపాలనపై పోరాటాన్ని ఉధృతం చేయాలని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. మే నెల్లో పోరాటానికి రూపకల్పన చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రరత్న భవన్‌లో కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం
60 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం విజయవాడ కేంద్రంగా మళ్లీ కాంగ్రెస్ కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉండగా నగరం నుంచే కాంగ్రెస్ కార్యకలాపాలు సాగేవి. ఆ తరువాత తెలంగాణతో కలిసి రాష్ట్రం ఏర్పడ్డాక హైదరాబాద్‌కు మకాం మార్చారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రరత్న భవన్ రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంగా మారింది. దిగ్విజయ్‌సింగ్ శుక్రవారం ఉదయం ప్రారంభించారు.