15న రాజమండ్రిలో కాంగ్రెస్ ప్రజా బ్యాలెట్ | congress praja ballet in rajamundry over ap special status on november 15th | Sakshi
Sakshi News home page

15న రాజమండ్రిలో కాంగ్రెస్ ప్రజా బ్యాలెట్

Published Sun, Nov 13 2016 8:04 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

15న రాజమండ్రిలో కాంగ్రెస్ ప్రజా బ్యాలెట్ - Sakshi

15న రాజమండ్రిలో కాంగ్రెస్ ప్రజా బ్యాలెట్

- ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి వెల్లడి
అమరావతి:
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్‌పై రాష్ట్ర ప్రజల మనోభావాలను అధికారంలో ఉన్న ప్రభుత్వానికి తెలియజేసేందుకు ఈ నెల 15న రాజమండ్రిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా బ్యాలెట్ నిర్వహించనున్నట్టు పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రత్యేక హోదా దక్కకుంటే భవిష్యత్‌లో రాష్ట్ర యువత కోటి ఉద్యోగ అవకాశాలను కోల్పోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బ్యాంకులు, ఏటీఎం వద్ద పడగాపులు పడుతున్న ప్రజలకు సహాయ, సహకారాలు అందజేసేందుకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పిలుపు మేరకు 13 జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. కేంద్రం ప్రభుత్వం కొత్తగా రూ. 2000 నోట్లను చలామణీలోకి తీసుకరావాలన్న నిర్ణయాన్ని మోదీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆయన సూచించారు. బ్యాంకులు, ఏటీఎంలో రూ. 100 నోట్ల పెద్ద మొత్తంలో అందుబాటులో ఉంచాలని రఘువీరా డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement