ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. ప్రత్యేక హోదా బిల్లుపై కాంగ్రెస్ ఎంపీలందరికీ విప్ జారీ చేస్తున్నామని చెప్పారు.
న్యూఢిల్లీ: ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. ప్రత్యేక హోదా బిల్లుపై కాంగ్రెస్ ఎంపీలందరికీ విప్ జారీ చేస్తున్నామని చెప్పారు.
మిగిలిన విపక్షాలతో మరో కాంగ్రెస్ పార్టీ నేత గులాం నబీ అజాద్ మాట్లాడుతున్నారని చెప్పారు. వచ్చే శుక్రవారం రాజ్యసభలో ప్రత్యేక హోదా బిల్లు పాసవుతుందని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం ఉదయం దిగ్విజయ్ సింగ్తో రఘువీరా, కేవీపీ, జేడీశీలం భేటీ అనంతరం దిగ్విజయ్ మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు.