న్యూఢిల్లీ : ప్రైవేట్ మెంబర్ బిల్లు చర్చకు రాకుండా కేంద్రం కుట్ర చేస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. దీనిపై చర్చ జరగకుండా రాజ్యసభను వాయిదా వేయాలని చూస్తోందని విమర్శించారు. గురువారం న్యూఢిల్లీలో దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ... ప్రత్యేక హోదాపై మన్మోహన్ సింగ్ కేబినెట్ నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు.
ప్రత్యేకంగా దీనిపై చట్టం చేయాల్సిన అవసరం లేదని దిగ్విజయ్ సింగ్ వెల్లడించారు. శుక్రవారం ప్రైవేట్ బిల్లుపై ఓటింగ్కు రాకుండా వెంకయ్య అడ్డుకుంటున్నారని చెప్పారు. ప్రత్యేక హోదాను కేంద్రం ఇవ్వమని చెబుతున్నా మంత్రివర్గంలో టీడీపీ కొనసాగడం సిగ్గు చేటు అని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు.