'బాబు స్వార్థ ప్రయోజనాల కోసమే ప్రత్యేక ప్యాకేజీ' | congress leaders kvp, raghuveera slams over cm chandrababu over special status | Sakshi
Sakshi News home page

'బాబు స్వార్థ ప్రయోజనాల కోసమే ప్రత్యేక ప్యాకేజీ'

Published Thu, Aug 18 2016 5:00 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

'బాబు స్వార్థ ప్రయోజనాల కోసమే ప్రత్యేక ప్యాకేజీ' - Sakshi

'బాబు స్వార్థ ప్రయోజనాల కోసమే ప్రత్యేక ప్యాకేజీ'

విశాఖపట్నం : సీఎం చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసమే ప్రత్యేక ప్యాకేజీ వైపు మొగ్గు చూపుతున్నారని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు విమర్శించారు.  విశాఖలో గురువారం ఆయన మాట్లాడుతూ...ఏపీకి పదేళ్లు హోదా ఇస్తామని తిరుపతి సభలో మోదీ చెప్పారన్నారు. యూపీఏ హయాంలో ప్రత్యేక హోదా పదేళ్లు అడిగిన జైట్లీ, వెంకయ్య ఇప్పుడు ప్రైవేటు బిల్లు ఓటింగ్ కూడా రాకుండా చేశారన్నారు.

ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్యాకేజీతో సీఎం చంద్రబాబు జేబులు నింపుకోవాలనుకుంటున్నారని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. ఏపీకి హోదాపై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ప్రజలను మోసగిస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా కల్పిస్తే నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు. విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. జాతీయ హోదాగా ప్రకటించిన పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదలలో ఆలస్యం జరుగుతుందని రఘువీరా అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement