అనంతపురం టౌన్ : 'ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమలు చేయలేదు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యపర్చండి' అని అనంతపురం జిల్లాలోని మండల పార్టీ కార్యవర్గ సభ్యులకు పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి సూచించారు. సభ్యత్వ నమోదును గ్రామ స్థాయి నుంచి చేయించాలన్నారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశానికి రఘువీరారెడ్డితో పాటు మాజీ మంత్రి శైలజానాథ్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రఘువీరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. రైతులకు రుణమాఫీ మొదలు ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. ఇలా దొంగ దెబ్బ తీయడం తెలుగుదేశం పార్టీకి అలవాటే అన్నారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చి నవమాసాలు కాకముందే ప్రజలతో పెట్టుకున్న బంధం తెగిపోతోందన్నారు. ప్రజలు ఆ పార్టీని విశ్వసించడం లేదన్నారు. ఆ పార్టీ కూడా ప్రజలను విశ్వసించడం లేదన్నారు. హామీలను అమలు చేయడంలో ఘోరం గా విఫలమైన ప్రభుత్వ తీరును ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యపర్చాలని సూచించారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
Published Wed, Feb 4 2015 4:17 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement