అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవని ప్రభుత్వానికి హితవు పలికారు. మంగళవారం మీడియాతో విజయమ్మ చిట్చాట్ చేశారు. విభజన బిల్లుపై చర్చకు తాము వ్యతిరేకం కాదని, అయితే సమైక్య తీర్మానం ముందు ప్రవేశ పెట్టాలని అన్నారు. ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత మన మీదా లేదా అని ఆమె ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.
రాష్ట్ర విభజన విషయంలో బీహార్లో కూడా ముందు అసెంబ్లీలో తీర్మానం పెట్టారని విజయమ్మ గుర్తు చేశారు. ఆ విషయం కూడా మన నాయకులకు తెలియదా అని ఎద్దేవా చేశారు. బీహార్లో తీర్మానం పెట్టక ముందు వచ్చిన బిల్లును వెనక్కి పంపారని, బీహార్ అసెంబ్లీ తీర్మానం చేశాకనే రాష్ట్ర విభజన జరిగిందిని వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు.