
అసెంబ్లీ తీర్మానంతో విభజన ఆగదు: శ్రీధర్ బాబు
హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లును తిరస్కరించాలంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీర్మానంపై బీఏసీలో చర్చించకుండా, అసెంబ్లీ ఎజెండాలో పెట్టకుండా అసెంబ్లీ ఆమోదించిన తీర్మానానికి విలువలేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ తీర్మానంతో రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగిపోతుందంటూ జరుగుతున్న ప్రచారంలో హేతుబద్ధత లేదని శ్రీధర్‌బాబు చెప్పారు.
ఆర్టికల్ 3కింది ఇచ్చిన విభజన బిల్లుకు, రూల్ 77కింద ఆమోదం పొందిన తీర్మానానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇలాంటి కుట్రలతో తెలంగాణ ఆగదని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.