
కోల్‌కతా : పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్నార్సీ)లపై ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన కొనసాగించాలంటూ పశ్చిమబంగ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ విద్యార్థులకు పిలుపునిచ్చారు. అంతకుముందు సిఎఎ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా రాజబజార్ నుంచి మల్లిక్ బజార్ వరకు మమతా బెనర్జీ బారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ''బీజేపీ ఛీ.. ఛీ.. సిఎఎ.. ఛీ.. ఛీ.. ఎన్నార్సీ.. నహీ చలేంగా'' అంటూ పెద్ద సంఖ్యలో హాజరైన నిరసనకారులతో కలిసి మమతా నినాదాలు చేశారు. (చదవండి : సీఏఏపై కేంద్రానికి మమత సవాలు)