తిరువనంతపురం: పౌరసత్వ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేరళ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబాల్ కేరళలోని కొజికోడ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్‌ఆర్‌సీకి రాష్ట్రాలు సహకరించేది లేదని చెబుతున్నాయంటే కేంద్రప్రభుత్వానికి రాష్ట్ర అధికారులు సహకరించరని చెప్పడమేనని ఇది అంత సులువు కాదని ఆయన అన్నారు.
చదవండి: అహంకారం.. అనిశ్చితి.. డోలాయమానం!
రాజ్యాంగం ప్రకారం పార్లమెంటు చేసిన చట్టాలను రాష్ట్రాలు అనుసరించాల్సిందేనని.. కాదని చెప్పడం సాధ్యమయ్యే పని కాదని ఆయన పేర్కొన్నారు. సీఏఏ అనేది జాతీయ అంశమని.. దీన్ని జాతీయ స్థాయిలోనే ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని సిబాల్ అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోణంలో దీన్ని చూడరాదని కాంగ్రెస్ నేతృత్వంలో అన్ని పార్టీలు కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. సీఏఏ అనేది రాజ్యాంగ విరుద్ధమని ఈ ఉదయం ఆయన మరో ట్వీట్ చేశారు. సీఏఏను విరమించుకోవాలంటూ తీర్మానం చేసే రాజ్యాంగబద్దమైన హక్కు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఉంటుందని చెప్పారు. అయితే సీఏఏ రాజ్యాంగబద్దమైనదేనని సుప్రీంకోర్టు చెబితే మాత్రం దాన్ని వ్యతిరేకించడం అసాధ్యమవుతుందని సిబాల్ పేర్కొన్నారు.
I believe the CAA is unconstitutional
— Kapil Sibal (@KapilSibal) January 19, 2020
Every State Assembly has the constitutional right to pass a resolution and seek it’s withdrawal
When and if the law is declared to be constitutional by the Supreme Court then it will be problematic to oppose it
The fight must go on !
Comments
Please login to add a commentAdd a comment