
జైపూర్: బంగ్లాదేశీ వలసదారులు చెదల వంటి వారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. వారందరినీ దేశం నుంచి వెళ్లగొడతామని ఆయన చెప్పారు. అస్సాంలో ఇటీవల ప్రచురించిన జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ) గురించి షా మాట్లాడుతూ ‘బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్‌ఆర్‌సీ ద్వారా అస్సాంలో 40 లక్షల మంది అక్రమ వలసదారులున్నట్లు ప్రాథమికంగా తేలింది. వారిలో ఏ ఒక్క చొరబాటుదారుడినీ వదిలిపెట్టం. అందరినీ పంపిస్తాం’ అని రాజస్తాన్‌లో చెప్పారు. చొరబాటుదారులను కాంగ్రెస్ ఓటుబ్యాంకుగా చూసిందనీ, వారందరినీ దేశం నుంచి వెళ్లగొట్టేందుకు బీజేపీ కట్టుబడి ఉందని షా పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గాలిలో మేడలు కడుతున్నారనీ, రాజస్తాన్‌లో బీజేపీ నుంచి అధికారం లాక్కోవడం ఎవ్వరికీ సాధ్యం కాదని షా విశ్వాసం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment