Termite
-
బ్యాంకు లాకర్లో రూ.18 లక్షలు చెదల పాలు: లాకర్ కొత్త నిబంధనలు తెలుసా?
బ్యాంకు నిబంధనలు తెలుసుకోకుండా సురక్షితంగా ఉంటాయనుకుని బ్యాంక్ లాకర్లో పెట్టుకున్న సొమ్ము చెదల పాలు కావడం తీవ్ర విషాదాన్ని నింపింది. కష్టపడి సంపాదించిన సొమ్ము సర్వ నాశనం కావడంతో బాధిత మహిళ ఆవేదనకు అంతులేకుండా పోయింది. అల్కా పాఠక్ తన కుమార్తె పెళ్లి కోసం దాదాపు ఒకటిన్నర సంవత్సరాల పాటు రూ. 18 లక్షల నగదు, కొన్ని ఆభరణాలను లాకర్లో దాచింది. అయితే ఆర్బీఐ నిబంధలన ప్రకారం KYC ధృవీకరణ , వార్షిక లాకర్ నిర్వహణ కోసం ఆమెను బ్యాంక్ అధికారులు పిలిచినప్పుడు ఈ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.బాధిత మహిళ ట్యూషన్లు చెబుతూ,చిన్న వ్యాపారం చేస్తూ, ఒక్కో రూపాయి పొదుపు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇండియా టుడే నివేదిక ప్రకారం లాకర్లో ఉంచిన రూ. 18 లక్షలను చెదపురుగులు తినేశాయి. ఈ విషయంపై స్పందించిన బ్యాంకు సిబ్బంది ఈ ఘటనను ఉన్నతాధికారులకు ఈ విషయం తెలియజేశామని అన్నారు. అల్కా పాఠక్‌కు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. ఆర్బీఐ తాజా నిబంధనల ప్రకారం బ్యాంకు లాకర్లలో నగదు భద్రపర్చడానికి వీల్లేదు. నగలు, డాక్యుమెంట్లు మాత్రమే భద్రపర్చుకోవాలి. ఈ నేపథ్యంలో ఆమెకు ఎలాంటి న్యాయం జరుగుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. (Today Gold and Silver: బంగారం నేలచూపులు, షాకిస్తున్న వెండి) లాకర్‌కు సంబంధించి తాజా నిబంధనలు బ్యాంకు లాకర్లలో నగదు నిల్వ చేయకూడదు. కేవలం నగలు, పత్రాలు వంటి విలువైన వస్తువులు నిల్వ చేసుకొనేందుకు, చట్టబద్ధమైన ప్రయోజనాల కోసమే మాత్రమే దీన్ని వినియోగించాలి. చట్టవిరుద్ధమైన ప్రమాదకర పదార్ధాలను అసలు ఉంచకూడదు. ఏదైనా అనుమానం వచ్చినప్పుడు, కస్టమర్‌పై 'తగిన చర్య' తీసుకునే హక్కు బ్యాంకులకు ఉంటుంది. అగ్నిప్రమాదం, దొంగతనం, దోపిడి, దోపిడీ, భవనం కూలిపోవడం మొదలైన వాటికి బ్యాంకుదే బాధ్యత. ఉద్యోగి మోసం చేయడం వల్ల నష్టం జరిగితే బ్యాంకు కూడా బాధ్యత వహిస్తుంది. ఇలాంటి కేసుల్లో 'సేఫ్ డిపాజిట్ లాకర్’ ప్రస్తుత వార్షిక ఫీజుకు వంద రెట్లు ఖాతాదారుడికి నష్టపరిహారంగా చెల్లించాలి. కానీ వరదలు, భూకంపాలు , ఇతర ప్రకృతి వైపరీత్యాల కారణంగా లాకర్ కంటెంట్‌కు ఏదైనా నష్టం లేదా నష్టానికి బ్యాంక్ బాధ్యత వహించదు. అలాగే లాకర్ అద్దెను మూడేళ్లపాటు చెల్లించకపోతే, కస్టమర్‌కు సమాచారం అందించి, కస్టమర్ అనుమతి తర్వాత బ్యాంక్ 'డ్యూ ప్రొసీజర్‌ను అనుసరించి' లాకర్‌ను తెరిచే అధికారం ఈ నిబంధనలు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. అలాగే ఇప్పటికే లాకర్ ఉన్న వినియోగదారులు బ్యాంకులకు కొత్త ఒప్పంద పత్రం సమర్పించాల్సి ఉంటుంది. దీనికోసం వినియోగదారుడు రూ. 200 స్టాంప్ పేపర్‌పై నోటరీ చేయించి బ్యాంకులో ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్బిఐ నిర్దేశించిన ఈ గడువు జూన్‌తో ముగిసిపోగా తాజాగా ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు దీన్ని పొడిగించింది. అంతేకాదు కొత్త నిబంధనల ప్రకారం నష్టపరిహారం పొందాలంటే గడువులోగా సెల్ఫ్ డిక్లరేషన్ పత్రాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లాకర్లలో ఉంచకూడని వస్తువులు , సెల్ఫ్ డిక్లరేషన్ కరెన్సీ నోట్లు, ఆయుధాలు, పేలుడు సామగ్రి, మాదక ద్రవ్యాలు రేడియేషన్ పరికరాలు చట్ట విరుద్ధమైన వస్తువులు ఉంచకూడదు. దీనికి సంబంధించి అక్రమ, నిషేధిత వస్తువులను లాకర్లో దాచిపెట్టనని ఖాతాదారుడు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. ప్రాథమిక నిబంధనలకు లోబడి లాకర్‌ను వినియోగిస్తానంటూ సంబంధిత ఒప్పంద పత్రంపై సంతకం చేయాలి. అలా బ్యాంకులో లాకర్ తీసుకున్న తరువాత ఈ అగ్రిమెంట్ కాపీని బ్యాంకు నుంచి తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. -
ఇంట్లో చెదలు పోగొడతామని బెడ్రూమ్లోకి వెళ్లి...
తిరువొత్తియూరు: ప్రైవేటు సంస్థ విశ్రాంత ఉద్యోగి ఇంటిలో చెదలు పోగొట్టడానికి మందుకొట్టేందుకు వచ్చి 6 సవర్ల నగలను చోరీ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె కొలతూరు ప్రాంతానికి చెందిన నటరాజన్ (69) ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ విశ్రాంతి పొందాడు. ఇతని ఇంటిలో చెదలు నివారణకు కోడంబాక్కంలో వున్న ప్రైవేటు సంస్థకు సమాచారం ఇచ్చాడు. మందుకొట్టేందుకు ఎన్నూర్ సునామీ క్వార్టర్స్‌కు చెందిన దయాలన్ (31) వచ్చాడు. ఈ క్రమంలో బెడ్ రూమ్‌లో ఉన్న ఆరు సవర్ల నగలు కనిపించకుండా పోయాయి. నటరాజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న దయాలన్ వద్ద పోలీసులు విచారణ చేశారు. అతను ఆరు సవర్ల నగను చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. రేషన్ దుకాణంలోకి చొరబడిన ఎలుగుబంటి తిరువొత్తియూరు: నీలగిరి జిల్లా కున్నూరు ప్రాంతంలో ఇటీవల కాలంలో ఎలుగుబంటి, అడవి దున్నలు, చిరుత పులులు ఆహారం కోసం జానావాసాల్లోకి వస్తున్నాయి. కున్నూరు నగర ప్రాంతంలో అర్ధరాత్రి సమయంలో ఒక ఎలుగుబంటి రైల్వే క్రాసింగ్ ప్రాంతంలో ఉన్న రేషన్ దుకాణం తలుపులు పగలగొట్టింది. లోపలికి వెళ్లి గదిలో ఉన్న లోపల మరో గది తలుపు వేసి ఉండడంతో ఆహారం అవి తీసుకోవడానికి వీలు కాలేదు. దీంతో ఎలుగుబంటి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఉదయం ఉద్యోగులు రేషన్ దుకాణానికి వచ్చిన సమయంలో తలుపులు పగలగొట్టబడి ఉండడం చూసి దిగ్భ్రాంతి చెందారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. దుకాణంలోకి ఎలుగుబంటి వచ్చినట్టు గుర్తించారు. దీనిపై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. -
బంగ్లాదేశీ ‘చెదల’ను పంపిస్తాం
జైపూర్: బంగ్లాదేశీ వలసదారులు చెదల వంటి వారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. వారందరినీ దేశం నుంచి వెళ్లగొడతామని ఆయన చెప్పారు. అస్సాంలో ఇటీవల ప్రచురించిన జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సీ) గురించి షా మాట్లాడుతూ ‘బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్ఆర్సీ ద్వారా అస్సాంలో 40 లక్షల మంది అక్రమ వలసదారులున్నట్లు ప్రాథమికంగా తేలింది. వారిలో ఏ ఒక్క చొరబాటుదారుడినీ వదిలిపెట్టం. అందరినీ పంపిస్తాం’ అని రాజస్తాన్‌లో చెప్పారు. చొరబాటుదారులను కాంగ్రెస్ ఓటుబ్యాంకుగా చూసిందనీ, వారందరినీ దేశం నుంచి వెళ్లగొట్టేందుకు బీజేపీ కట్టుబడి ఉందని షా పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గాలిలో మేడలు కడుతున్నారనీ, రాజస్తాన్‌లో బీజేపీ నుంచి అధికారం లాక్కోవడం ఎవ్వరికీ సాధ్యం కాదని షా విశ్వాసం వ్యక్తం చేశారు. -
చెదలు పట్టిన నోటరీలు!
దస్తావేజులను తినాలంటూ తాము చెదలను ఆహ్వానించలేదని, చెదల వల్ల రికార్డులు దెబ్బతినడం ఒక యాదృచ్ఛిక దైవఘటన అని నోటరీ అధికారులు వాదించారు. ఇది తీవ్ర నిరక్ష్యమేకాదు, నోటరీ చట్టాల ఉల్లంఘన కూడా. తన ఆస్తిని తనకు తెలియ కుండా న్యాయవాది ఎవరికో అమ్మేశాడని, ఆ కాగితాలను ధృవీకరించిన నోటరీ రిజిస్టర్ వివరాలు ఇవ్వాలని, 2008 నుంచి 2013 వరకు ప్రతి సంవత్సరం ధృవీకరించిన మొదటి, చివరి పత్రాల రిజిస్ట్రేషన్ వివరాలు కూడా సమా చార చట్టం కింద తనకు అందించాలని ఒక వ్యక్తి అడి గాడు. ఆ సమాచారం కలిగి ఉన్న నోటరీ న్యాయ వాది మీనా శర్మ దానిని ఇవ్వాలని చట్టాల వ్యవహారాల శాఖ సీపీఐఓ అడిగితే దాన్ని మూడో వ్యక్తి సమాచారం అని చెప్పి ఇవ్వడానికి నిరాకరించారు. ఇక రెండో అప్పీలులో నోటరీ రిజిస్టర్లను చెదలు తినేశాయని కనుక ఇవ్వజా లమని వివరించారు. మొదటి అప్పిలేట్ అధి కారి ముందు చెదల విషయం ప్రస్తావనే లేదు. మొదట మూడో వ్యక్తి సమాచారమనీ, తరువాత చెదలు తిన్న దనీ నిరాకరించడం అనుమానాస్పదం అంటూ సీపీఐఓ తో పాటు అన్ని రిజిస్టర్లతో నోటరీ కూడా తన ముందు హాజరు కావాలని కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. పనికిరాకుండా పోయిన రికార్డుల జాబితాను, మిగి లిన రికార్డుల జాబితాను, సెక్షన్ 4 కింద తమంత తామే ప్రకటించాలని, అప్పుడు ఏ రికార్డులు ఉన్నాయో లేవో పౌరులకు తెలుస్తుందని లేకపోతే అడిగిన ప్రతి కాగితం చెదలకు బలైందని చెప్పి పబ్బం గడుపు కుంటారని, కమిషన్ భావించింది. కనుక చెదలకు పూర్తిగా దెబ్బ తిన్న రిజిస్టర్ల జాబితా, మిగిలిన రిజిస్టర్ల జాబితా, కొంత భాగం దెబ్బతిన్న రిజిస్టర్లు తేవాలని ఆదేశించింది. అందుకు బాధ్యులైన వారిపై విచారణ జరపాలని కమి షన్ ఆదేశించింది. దీంతో సీపీఐఓ తోపాటు నోటరీ మీనా శర్మ కూడా కమిషన్ ముందు హాజరయ్యారు. దెబ్బతిన్న రిజిస్టర్లు, పూర్తిగా ధ్వంసం అయిన రికా ర్డులు, మిగిలినవి కూడా చూపారు. నోటరీ సమర్పించిన వార్షిక నివేదికల కాపీలను ఇచ్చినట్టు వివరించారు. మిగతా వివరాలు చెదలవల్ల ఇవ్వలేదన్నారు. కీలకమైన సాక్ష్య పత్రాలను ధృవీకరించిన వివ రాలను పుస్తకంలో నమోదు చేయవలసిన బాధ్యత నోటరీ న్యాయవాదిపైన ఉంటుంది. రికార్డులు నాశనం అయ్యాయి కనుక అవి లేనట్టేనని, కాబట్టి వాటిని ఇవ్వజాలమన్న వివరణను కమిషన్ అంగీకరించలేదు. రిజిస్టర్లు పాడైనాయని కనుక ఇవ్వలేమనే వాదాన్ని రికార్డుల చట్టం, సమాచార చట్టం, నోటరీ చట్టం అంగీకరించదు. ఆస్తి దస్తావేజులను తదితర కీలకమైన పత్రాలను అధికారికంగా ధృవీకరించే బాధ్యతను చట్టాల శాఖ నోటరీలకు అప్పగించింది. వృత్తిపర మైన అనుచిత ప్రవర్తనకు నోటరీలపై చర్య తీసుకోవ చ్చునని, ఆ నోటరీని తొలగించాలని సెక్షన్ 10 వివరిస్తున్నది. నోటరీలు ధ్రువీకరించడం, దస్తావేజులో నోటింగ్స్ చేయడం, నిరసనలు ఉంటే వాటిని కూడా నమోదు చేయాలని నియమాలు నిర్దేశిస్తున్నాయి. నోటేరియల్ రిజిస్టర్ వారు నిర్వహించాలి. జిల్లా జడ్జి లేదా ఎవరైనా నియమిత అధికారి ఈ రిజిస్టర్లను తనిఖీ చేయవచ్చు. అవి సరిగా లేకపోతే జిల్లా జడ్జి నోటరీపైన చర్య తీసుకోవాలని సంబంధిత అధికారిని కోరవచ్చు. ప్రతి జనవరి నెలలో ప్రభుత్వానికి తన నోటరీ కార్యక్రమాల వార్షిక నివేదిక ఇవ్వాలి. దీన్ని ఫారం 14 రిటర్న్ అంటారు. నోటరీ కార్యక్రమాలకు తగినంత ఫీజును వసూలు చేసే అధికారం నోటరీలకు ఉంది. ఈ ఫీజు లను మార్చి 2014లో పెంచుతూ భారత ప్రభుత్వం ఉత్త ర్వులు జారీ చేసింది. ప్రపంచంలో కొన్ని దేశాలు నోటరీ దస్తావేజుల రిజిస్టర్లను కంప్యూటరీకరించాయి. దానివల్ల నకిలీ పత్రాలను, అవినీతిని నివారించడానికి వీలుం టుంది. నోటరీలు రికార్డులను ఏ విధంగా కాపాడాలి, ఏ విధంగా తనిఖీకి అనుకూలంగా ఉంచాలి, ఏ విధంగా ప్రతులు ఇవ్వాలనే వివరాలను నోటరీ నమూనా చట్టం వివరించింది. నకిలీ దస్తావేజుల నివారణలో నోటరీలు ప్రభుత్వ ఏజెంట్లుగా న్యాయబద్దంగా వ్యవహరించాలి. రికార్డులు సత్యం ఆధారంగా ప్రమాణీకరించాలి. ఆ వివరాలను చిత్తశుద్ధితో రికార్డుకెక్కించాలి. అధికారులు తాము దస్తా వేజులు తినాలంటూ చెదలను ఆహ్వానించలేదని, చెదల వల్ల రికార్డులు దెబ్బతినడం ఒక యాదృచ్ఛిక దైవఘ టన అని వాదించారు. ఇది తీవ్రమైన నిర్లక్ష్యానికి ప్రతీక అని, నోటరీ రికార్డులను కాపాడడంలో విఫలమై, సమాచార హక్కు చట్టాన్ని, పబ్లిక్ రికార్డు చట్టాన్ని, నోటరీ చట్టాన్ని ఉల్లం ఘించారని కమిషన్ నిర్ధారించింది. నోటరీని పీఐఓగా భావించి 25 వేల రూపాయల జరిమానా విధించింది. నోటరీపైన ఏ చర్యా తీసుకోకపోగా నోటరీ నిర్లక్ష్యాన్ని సమర్థించి, సమాచార నిరాకరణ చేసినందుకు ఎందుకు జరిమానా విధించకూడదో చెప్పాలని చట్టాల శాఖ పీఐఓకు నోటీసు జారీ చేసింది. సమాచార అభ్యర్థికి వేయి రూపాయల పరిహారం నోటరీ న్యాయవాది చెల్లిం చాలని ఆదేశించింది. నోటరీ రికార్డుల రక్షణకు సరైన చర్యలు తీసుకొనేందుకు అంతర్జాతీయ పద్ధతులను అనుసరించి సమగ్ర నోటరీ చట్టాన్ని చేయాలని సిఫార్సు చేసింది. కీలకమైన రికార్డులను చెదలకు అప్పగించే నిర్లక్ష్యం దారుణమైన పాలనకు నిదర్శనమని సమాచార హక్కు చట్టానికి ఇది తీవ్రమైన ఉల్లంఘన అని విమర్శించింది. న్రందలాల్ వర్సెస్ లీగల్ ఐఫైర్స్ డిపార్ట్మెంట్ (CIC/SA/A/2015/001769) కేసులో మే 3న ఇచ్చిన తీర్పు ఆధారంగా వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ - మాడభూషి శ్రీధర్ professorsridhar@gmail.com