తిరువొత్తియూరు: ప్రైవేటు సంస్థ విశ్రాంత ఉద్యోగి ఇంటిలో చెదలు పోగొట్టడానికి మందుకొట్టేందుకు వచ్చి 6 సవర్ల నగలను చోరీ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె కొలతూరు ప్రాంతానికి చెందిన నటరాజన్ (69) ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ విశ్రాంతి పొందాడు. ఇతని ఇంటిలో చెదలు నివారణకు కోడంబాక్కంలో వున్న ప్రైవేటు సంస్థకు సమాచారం ఇచ్చాడు.
మందుకొట్టేందుకు ఎన్నూర్ సునామీ క్వార్టర్స్‌కు చెందిన దయాలన్ (31) వచ్చాడు. ఈ క్రమంలో బెడ్ రూమ్‌లో ఉన్న ఆరు సవర్ల నగలు కనిపించకుండా పోయాయి. నటరాజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న దయాలన్ వద్ద పోలీసులు విచారణ చేశారు. అతను ఆరు సవర్ల నగను చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
రేషన్ దుకాణంలోకి చొరబడిన ఎలుగుబంటి
తిరువొత్తియూరు: నీలగిరి జిల్లా కున్నూరు ప్రాంతంలో ఇటీవల కాలంలో ఎలుగుబంటి, అడవి దున్నలు, చిరుత పులులు ఆహారం కోసం జానావాసాల్లోకి వస్తున్నాయి. కున్నూరు నగర ప్రాంతంలో అర్ధరాత్రి సమయంలో ఒక ఎలుగుబంటి రైల్వే క్రాసింగ్ ప్రాంతంలో ఉన్న రేషన్ దుకాణం తలుపులు పగలగొట్టింది. లోపలికి వెళ్లి గదిలో ఉన్న లోపల మరో గది తలుపు వేసి ఉండడంతో ఆహారం అవి తీసుకోవడానికి వీలు కాలేదు.
దీంతో ఎలుగుబంటి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఉదయం ఉద్యోగులు రేషన్ దుకాణానికి వచ్చిన సమయంలో తలుపులు పగలగొట్టబడి ఉండడం చూసి దిగ్భ్రాంతి చెందారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. దుకాణంలోకి ఎలుగుబంటి వచ్చినట్టు గుర్తించారు. దీనిపై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment