నోట్ల రద్దు: సీఎం కేసీఆర్‌ విప్లవాత్మక​ నిర్ణయాలు | cm kcr talks about demonetisation | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 28 2016 8:40 PM | Last Updated on Thu, Mar 21 2024 7:53 PM

పెద్దనోట్ల రద్దు అనేది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అని, ఇందులో రాష్ట్రాల పాత్ర ఏమీలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. అయినా ఈ విషయంలో రాష్ట్రాలు ప్రేక్షకపాత్ర వహించరాదని పేర్కొన్నారు. కేంద్రం నిర్ణయంతో బిత్తరపోయి.. డంగైపోవాల్సిన అవసరంలేదని కేసీఆర్‌ స్పష్టం చేశారు. పెద్దనోట్ల రద్దుతో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పంచుకున్నట్టు తెలిపారు. పెద్దనోట్ల రద్దు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయమని కొనియాడారు. పెద్దనోట్ల రద్దు అనంతరం పరిణామాలపై తెలంగాణ కేబినెట్‌ సోమవారం భేటీ అయి సుదీర్ఘంగా చర్చించింది. అనంతరం సీఎం కేసీఆర్‌ మీడియాకు వివరాలు తెలిపారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో తెలంగాణలోని పరిస్థితిని అంచనా వేసేందుకు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటుచేసినట్టు తెలిపారు. నల్లధనం ఏ రూపంలో ఉన్నా.. దానిని అరికట్టవచ్చునని అన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement