పోలీస్‌ శాఖలో ఉద్యోగాల భర్తీకి తెలంగాణ కేబినెట్‌ ఆమోదం | Telangana Cabinet Approves Recruitments In Police Department | Sakshi
Sakshi News home page

పోలీస్‌ శాఖలో ఉద్యోగాల భర్తీకి తెలంగాణ కేబినెట్‌ ఆమోదం

Dec 10 2022 6:32 PM | Updated on Dec 10 2022 8:51 PM

Telangana Cabinet Approves Recruitments In Police Department - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పోలీసు శాఖలో నూతన ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని మొత్తం 3,966 పోస్టులను వివిధ కేటగిరీలలో భర్తీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నియామక ప్రక్రియ చర్యలు చేపట్టాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది. వీటితోపాటు.. మూడు కమిషనరేట్ల పరిధిలో.. శాంతిభద్రతలను మరింతగా మెరుగు పరిచేందుకు నూతన పోలీస్ స్టేషన్లు, నూతన సర్కిల్‌లు, నూతన డివిజన్ల ఏర్పాటుకు  ఆమోదం తెలిపింది.

అదే విధంగా శాంతిభద్రతల పరిరక్షణలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖను మరింత పటిష్టం చేయాలని కేబినెట్ నిర్ణయించింది పెరుగుతున్న సాంకేతికత, మారుతున్న సామాజిక పరిస్థితులలో, నేరాల తీరు కూడా మారుతున్న నేపథ్యంలో నేరాల అదుపునకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలనీ, అందుకు అనుగుణంగా సిబ్బందిని నియమించుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. 

నార్కోటిక్ డ్రగ్స్, గంజాయి తదితర మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్‌ను దెబ్బతీస్తూ శాంతిభద్రతల సమస్యగా పరిణమిస్తున్నాయని కేబినెట్‌ చర్చించింది. డ్రగ్స్ నేరాలను అరికట్టి  నిర్మూలించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. 
చదవండి: బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు కేటీఆర్‌ వరాల జల్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement