Job Recruitment
-
దరఖాస్తుల జోరు.. పరీక్షకు రారు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడగానే దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. వందల్లో పోస్టులు ఉంటే లక్షల మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. కానీ పెద్ద సంఖ్యలో అర్హత పరీక్షలకు గైర్హాజరవుతున్నారు. ఏళ్లుగా ఉద్యోగ నియామకాల కోసం ఎదురుచూస్తూ, సన్నద్ధమవుతున్నవారు కూడా ఇందులో ఉంటున్నారు. కనీసం హాల్‌టికెట్లు కూడా డౌన్లోడ్ చేసుకోనివారూ ఉన్నారు. భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో పోటీ విపరీతంగా ఉందనే ఆందోళనతో కొందరు పరీక్షలకు దూరమవుతుండగా.. నోటిఫికేషన్ నాటి నుంచి అర్హత పరీక్షలు పూర్తయ్యే నాటికి సుదీర్ఘకాలం పడుతుండటం.. కొన్ని సందర్భాల్లో పరీక్షలు వాయిదా పడుతుండటం.. ఆలోగా దరఖాస్తుదారులు ఏదో ఓ ఉద్యోగంలో చేరి బిజీ అయిపోవడం వంటివి దీనికి కారణంగా నిలుస్తున్నాయి. అత్యంత కీలకమైన కొలువులుగా భావించే గ్రూప్–1, 2, 3, 4 ఉద్యోగాల విషయంలోనూ పరిస్థితి ఇలాగే ఉండటం గమనార్హం. సాగదీతలు.. వాయిదాలతో.. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో దాదాపు 11 వేల గ్రూప్ ఉద్యోగాల భర్తీ కోసం 2022లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు జారీ చేసింది. 2022 ఏప్రిల్‌లో 503 గ్రూప్–1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీకాగా.. రెండు సార్లు ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించాక ఆ నోటిఫికేషన్ రద్దయింది. దాని స్థానంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో 563 పోస్టులతో మళ్లీ నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో దరఖాస్తు చేసుకున్న వారిని కొనసాగిస్తూనే... కొత్త అభ్యర్థుల నుంచి కూడా దరఖాస్తులను స్వీకరించింది. దాదాపు రెండున్నరేళ్ల పాటు సాగిన ఈ గ్రూప్–1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఇప్పుడు చివరిదశకు చేరింది. ఇక గ్రూప్–2, గ్రూప్–3, గ్రూప్–4 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు కూడా 2022 డిసెంబర్లో వెలువడ్డాయి. గ్రూప్–4 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఇటీవలే పూర్తికాగా.. గ్రూప్–2, 3 పరీక్షలు పూర్తయ్యాయి. ఇందులో గ్రూప్–2 అర్హత పరీక్షలు మూడుసార్లు వాయిదా పడగా.. గ్రూప్–3 పరీక్షలు రెండుసార్లు వాయిదా పడ్డాయి. ఇలా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఏళ్ల తరబడి సాగుతుండటంతో అభ్యర్థుల్లో ఉత్సాహం తగ్గిపోతుందని.. వాటికోసం వేచి చూసే బదులుగా ప్రత్నామ్నాయ ఉద్యోగాల వైపు చూస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. హాజరుశాతం.. క్రమంగా పతనం.. గత ఏడాది జూలైలో గ్రూప్–4 పరీక్షలు జరిగాయి. ఒకే రోజు రెండు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. హాజరైనవారు సుమారు ఏడున్నర లక్షల మంది మాత్రమే. అంటే 80 శాతం మందే పరీక్షలు రాశారు. ఇక గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షలకు హాజరైనవారు 74 శాతమే. ప్రిలిమినరీలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారిలో నుంచి.. ఒక్కో పోస్టుకు 50మంది చొప్పున మెయిన్స్‌కు 31,403 మందిని కమిషన్ ఎంపిక చేసింది. బాగా ప్రిపేరైన వారే మెయిన్స్‌కు ఎంపికవుతారు. అలాంటి మెయిన్స్‌కు కూడా 67.17శాతం మందే హాజరవడం గమనార్హం. గ్రూప్–3 పరీక్షలకు కేవలం 50.24 శాతం మంది, గ్రూప్–2 పరీక్షలకు మరీ తక్కువగా 45.57 శాతమే హాజరయ్యారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మారాలి ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ ఆశాజనకంగా ఉండటం లేదు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఉంటున్నా క్రమం తప్పకుండా భర్తీ చేయడం లేదు. ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులు నిరాశలో కూరుకుపోతున్నారు. పైగా నోటిఫికేషన్లు జారీ చేశాక పరీక్షల నిర్వహణ, వాయిదాలతో సుదీర్ఘ జాప్యం జరుగుతోంది. దరఖాస్తు చేసినవారు పరీక్షల నాటికి ఇతర ఉద్యోగాల వైపు వెళ్తున్నారు. దీనితో దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుండగా.. హాజరు అంతంత మాత్రంగానే ఉంటోంది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు జారీ చేస్తూ.. భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలి. – అబ్దుల్ కరీం, సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్ కాలయాపన వల్లే ఆసక్తి చూపడం లేదు ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో తీవ్ర కాలయాపన జరుగుతోంది. గతంలో ప్రైవేటు సెక్టార్లో అవకాశాలు తక్కువగా ఉన్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం లక్ష్యాన్ని నిర్దేశించుకుని సన్నద్ధమయ్యేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఒక ఉద్యోగం కాకుంటే మరో ఉద్యోగం వైపు పరుగెత్తాల్సి వస్తోంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడినప్పుడు వస్తున్న దరఖాస్తుల సంఖ్యతో పోలిస్తే.. పరీక్షలకు హాజరయ్యే వారి సంఖ్య భారీగా తగ్గుతోంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా ప్రభుత్వ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేస్తున్నారు. పరీక్షల నాటికి వారి లక్ష్యాలు మారిపోతున్నాయి. – భవాని శంకర్ కోడాలి, నిపుణులు, కెరీర్ గైడ్ -
ఇలా భర్తీ.. అలా ఖాళీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో నియామక సంస్థలు అనుసరిస్తున్న విధానం గందరగోళానికి కారణ మవుతోంది. నిరుద్యోగ అభ్యర్థులను తీవ్ర నిరా శకు గురిచేస్తోంది. ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియను క్రమపద్ధతిలో చేపట్టకపోవడం సమస్యగా మారు తోంది. ఓవైపు ఉద్యోగం వస్తుందన్న ఆశతో చివరి వరకు ఎదురుచూసిన వారికి చేదు అనుభవం మిగులుతుంటే.. మరోవైపు వేలకొద్దీ ఉద్యోగాలు ఖాళీగా ఉండిపోతున్నాయి. వేర్వేరు నియామక సంస్థలు చేపట్టిన అర్హత పరీక్షల్లో కొందరు అభ్యర్థులు రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపికవడం.. నియామక పత్రాలు స్వీకరించడం.. చివరికి వీటిలో చిన్న ఉద్యోగాలను వదులుకుని పెద్ద కేడర్ ఉద్యోగాన్ని ఎంపిక చేసుకోవడమే ఈ పరిస్థితికి దారితీస్తోంది. గత ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాల్లో దాదాపు 20 శాతం వరకు ఇలాంటి కారణాలతో మిగిలిపోయినట్టు అంచనా. రాష్ట్రంలో ఉద్యోగ నియామక సంస్థల మధ్య సమన్వయం లేకపోవడం, ఎవరికి వారే ఇష్టానుసారంగా భర్తీ ప్రక్రియను చేపడుతుండటమే దీనికి ప్రధాన కారణమని విమర్శలు వస్తున్నాయి.భర్తీ 53 వేలు.. ఖాళీ అయినవి 10 వేలు!రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు సుమారు 53 వేల ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. గ్రూప్–4 ఉద్యోగాలకు సంబంధించి నియామక పత్రాల పంపిణీ కొనసాగుతుండగా.. మిగతా కేటగిరీల్లో భర్తీ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ఇందులో అత్యధికంగా తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామకాల సంస్థ (టీజీఎస్ఎల్పీఆర్బీ) ద్వారా పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై కేటగిరీలలో 16,067 ఉద్యోగాలు భర్తీకాగా.. తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ద్వారా 11 వేల ఉద్యోగాలను, గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ద్వారా 8,304 గురుకుల టీచర్ పోస్టులను, తెలంగాణ వైద్యారోగ్య సేవల నియామకాల సంస్థ (టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ద్వారా 6,956 నర్సు ఉద్యోగాలను భర్తీ చేశారు. ఇవిగాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో 10,006 టీచర్ పోస్టులను డీఎస్సీ ద్వారా పాఠశాల విద్యాశాఖ భర్తీ చేసింది. మరో 441 ఉద్యోగాలను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లో కారుణ్య నియామకాల కింద భర్తీ చేశారు. మొత్తంగా వీటన్నింటిలో కలిపి సుమారు 10 వేల ఉద్యోగాలు భర్తీ అయి, ఆ వెంటనే ఖాళీ అయ్యాయి.అటకెక్కిన అవరోహణ విధానం..ప్రభుత్వ శాఖల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీ చేపట్టడంతో ఒక క్రమపద్ధతిలో ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. నోటిఫికేషన్లలో ప్రకటించిన ఖాళీలను నూరు శాతం భర్తీ చేసేలా అవరోహణ విధానాన్ని పాటించాలని భావించింది. అంటే తొలుత పెద్ద కేడర్ పోస్టులను భర్తీ చేసి.. తర్వాత క్రమంగా దిగువ కేడర్ల ఉద్యోగాలను భర్తీ చేయాలి. ఉదాహరణకు తొలుత గ్రూప్–1 ఉద్యోగాలను భర్తీ చేసి... తర్వాత గ్రూప్–2, గ్రూప్–3, చివరగా గ్రూప్–4 ఉద్యోగాలను భర్తీ చేయాలి. కానీ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తొలుత గ్రూప్–4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి తుది ఫలితాలను ప్రకటించగా.. నియామక ఉత్తర్వులు కూడా జారీ అవుతున్నాయి. త్వరలో గ్రూప్–1, 2, 3 ఉద్యోగాలను భర్తీ చేస్తే.. ఇప్పటికే గ్రూప్–4 ఉద్యోగాలు సాధించినవారు వాటిలో ఎంపికైతే, గ్రూప్–4 ఉద్యోగాన్ని వదులుకుంటారు. అంటే భర్తీ అయిన పోస్టు ఖాళీ అయినట్టే.కానరాని సమన్వయం..రాష్ట్రంలో నాలుగు రిక్రూట్మెంట్ బోర్డులున్నాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో గత ప్రభుత్వం కొత్తగా రిక్రూట్మెంట్ బోర్డులను ఏర్పాటు చేసింది. పోలీసు నియామకాలు, గురుకుల కొలువులు, మెడికల్ సర్వీసులకు వేర్వేరుగా బోర్డులు ఏర్పాటు చేసింది. సంబంధిత శాఖలకు సంబంధించిన పోస్టులను ఆయా బోర్డుల ద్వారా భర్తీ చేసేలా చర్యలు చేపట్టింది. కొత్త బోర్డుల ఏర్పాటు ఉద్దేశం మంచిదే అయినా.. ఎవరికివారే అన్నట్టుగా నిర్ణయాలు తీసుకోవడంతో గందరగోళంగా మారింది. వాస్తవానికి కీలకమైన పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను అనుసరిస్తూ ఇతర బోర్డులు కార్యాచరణ అమలు చేయాలి. ఇందుకు అన్ని నియామక సంస్థల మధ్య సమన్వయం అవసరం. కానీ ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ మొదలు, తుది ఫలితాల ప్రకటన వరకు ఒక్కసారి కూడా నియామక సంస్థల మధ్య ఎలాంటి భేటీ జరగకపోవడం గమనార్హం.నియామక పత్రాల జారీ ఇలా..ఈ ఏడాది జనవరి నుంచి ఉద్యోగ నియామక పత్రాల జారీ సాగింది. ప్రధానంగా ఎల్బీ స్టేడియం వేదికగా పంపిణీ ప్రక్రియ నిర్వహించారు. జనవరి 31న వైద్యారోగ్య శాఖ పరిధిలో నర్సింగ్ ఆఫీసర్, స్టాఫ్ నర్సు పోస్టులకు ఎంపికైన 6,959 మందికి నియామక పత్రాలు ఇచ్చారు.⇒ ఫిబ్రవరి 7న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లో 441 కారుణ్య నియామకాలు చేపట్టారు.⇒ ఫిబ్రవరి 14న పోలీసు, ఫైర్, ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్, జైళ్ల శాఖలో 13,444 కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చారు.⇒ ఫిబ్రవరి 15న గురుకులాల్లో లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్, పీజీటీలు కేటగిరీలలో 1,997 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు.⇒ మార్చి 4న గురుకులాల్లో లెక్చరర్, టీచర్, మెడికల్ ఎంప్లాయీస్ కేటగిరీల్లో 5,192 మందికి నియామకపత్రాలు అందించారు.⇒ సెప్టెంబర్ 26న వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో 687 మంది అపాయింట్ అయ్యారు. ⇒ తర్వాత గురుకులాల్లోని లైబ్రేరియన్, పీఈటీ, ఇంజనీరింగ్ కేటగిరీలో ఏఈఈ, అగ్రికల్చర్ ఆఫీసర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ కేటగిరీలకు సంబంధించి 1,635 మందికి నియామకపత్రాలు అందించారు.⇒ దసరా సందర్భంగా అక్టోబర్ 9న 10,009 మంది టీచర్లకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు.⇒ ప్రజాపాలన ఏడాది ఉత్సవాల్లో భాగంగా వేర్వేరు రోజుల్లో ఇప్పటివరకు 8,143 మందికి నియామక పత్రాల పంపిణీ జరిగింది.అన్ని రకాల పోస్టుల్లో అదే ఖాళీలు..⇒ గురుకుల విద్యా సంస్థల్లో కూడా తొలుత పీజీటీ (పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్) ఫలితాలను ప్రకటించి, నియామక ఉత్తర్వులు జారీ చేశాక.. అంతకంటే పెద్ద కేటగిరీలైన జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీ చేపట్టడంతో వేలాది ఖాళీలు ఏర్పడ్డాయి. గురుకుల విద్యా సంస్థల్లో మొత్తంగా 8,304 ఉద్యోగాలు భర్తీ చేయగా... విధుల్లో చేరింది సుమారు 6 వేల మందే. ఇలా గురుకుల పోస్టుల్లోనే 20శాతానికిపైగా ఖాళీలు ఏర్పడ్డాయి.⇒ ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ ఉద్యోగాల భర్తీలోనూ ఇదే పరిస్థితి. స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పోస్టులు మొదట భర్తీ చేసి, తర్వాత సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ)ను భర్తీ చేస్తే నియామకాలు నూరుశాతం జరిగేవి. కానీ రెండు కేటగిరీల ఫలితాలు ఒకేసారి విడుదల చేసి, నియామక ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో వెయ్యికి పైబడి ఉద్యోగాలు ఖాళీ అయ్యాయి.⇒ పోలీస్ శాఖలో జరిగిన నియామకాల్లోనూ రెండున్నర వేలకు పైగా ఖాళీలు ఏర్పడ్డాయి.⇒ ఇప్పుడు గ్రూప్–4 ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు విధుల్లో చేరేనాటికి మొత్తం 53వేల ఉద్యోగాల్లో 10 వేల వరకు ఖాళీగా ఉండిపోవచ్చని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
బజారుభాషతో రేవంత్ పైశాచిక ఆనందం
సాక్షి, హైదరాబాద్: జాబ్ కేలండర్పై చర్చించాలని అడిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీ మారినవారితో బజారుభాషలో తిట్టిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాడిస్ట్ సీఎం రేవంత్ అందరినీ ఉసిగొల్పుతూ దిగజారుడు..దివాలాకోరుతనంతో వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. శాసనసభలో ఇది చీకటిరోజు అని, అధికార పక్షం బజారుభాష వినలేక సభ నుంచి బయటకు వచ్చేశామన్నారు. బోగస్ జాబ్ కేలండర్ పేరిట మోసగిస్తున్న కాంగ్రెస్ నాయకులను యువత ఎక్కడికక్కడ నిలదీసి కొట్టాలన్నారు.గన్‌పార్కు అమరుల స్తూపం వద్ద కేటీఆర్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందుకు హైదరాబాద్ అశోక్‌నగర్‌కు వచి్చన రాహుల్‌గాంధీ అధికారంలోకి వచ్చిన తొలిఏడాదే 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని డ్రామా చేశారన్నారు. దమ్ముంటే రాహుల్‌గాంధీ, రేవంత్ అశోక్‌నగర్‌కు వచ్చి ఒక్క ఉద్యోగం ఇచి్చనట్టు రుజువు చేసినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరమూ రాజీనామా చేస్తామని చెప్పారు. రేవంత్ మగాడైతే సిటీ సెంట్రల్ లైబ్రరీకి రావాలంటూ సవాల్ చేశారు. మార్పు పేరిట నిరుద్యోగులను మభ్య పెట్టిన రేవంత్‌ను తన్ని తరమడం ఖాయమని కేటీఆర్ హెచ్చరించారు. జాబ్ కేలండర్పై అసెంబ్లీలో చర్చించకుండా ప్రభుత్వం పారిపోయినందునే గన్‌పార్క్ వద్ద నిరసన తెలుపుతున్నామన్నారు. శాసనసభ చరిత్రలో బ్లాక్ డే: హరీశ్‌రావు అసెంబ్లీ చరిత్రలో ఇది బ్లాక్ డే అని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఇందిరమ్మ రాజ్యంతో మహిళా ఎమ్మెల్యేలను అవమానించేలా సభా నాయకుడే తిట్టిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ రౌడీïÙటర్ భాషతో కన్నతల్లులను అవమానించేలా మాట్లాడుతున్నాడని, ఉద్యమ సమయంలోనూ ఇలాగే మాట్లాడాడని చెప్పారు. హైదరాబాద్ ఏమైనా ఆయన జాగీరా అని ప్రశి్నస్తూ, దానం నాగేందర్ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ జాబ్ కేలండర్పై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం చేసిన ప్రకటన చిత్తు కాగితంలా ఉందన్నారు. అశోక్‌నగర్‌కు సమయం, తేదీ చెబితే..తామూ వస్తామని, కాంగ్రెస్ బెదిరింపులకు భయపడేది లేదని హరీశ్‌రావు స్పష్టం చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడిన దానం నాగేందర్‌పై స్పీకర్ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీలో అసభ్యకరంగా మాట్లాడిన దానం నాగేందర్ రాజీనామా చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్ చేశారు. పోస్టులు పెంచాలని అడుగుతున్న నిరుద్యోగులపై లాఠీచార్జ్ చేస్తూ కేసులు పెడుతున్నారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దానం వ్యాఖ్యలతో... జాబ్ కేలండర్పై చర్చించాలంటూ స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలుపుతున్న తమ పార్టీ ఎమ్మెల్యేలపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మండిపడింది. అయితే దానం వ్యాఖ్యలపై స్పీకర్ స్పందించక పోవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశ మందిరం నుంచి మూకుమ్మడిగా బయటకు వచ్చారు. లాబీలోని బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో భేటీ అయ్యారు.నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచి్చన హామీని ఉల్లంఘిస్తున్న తీరును ఎండగట్టాలని నిర్ణయించారు. దీంతో కేటీఆర్ నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేసుకుంటూ గన్‌పార్కుకు చేరుకున్నారు. బీఆర్ఎస్ ఆందోళన నేపథ్యంలో గన్‌పార్కు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. గన్‌పార్కు నుంచి వెళ్లాలని పోలీసులు కోరినా బీఆర్ఎస్ నేతలు నిరాకరించడంతో కేటీఆర్, హరీశ్‌రావు సహా ఆందోళన చేస్తున్న నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వారిని తెలంగాణ భవన్‌కు నేతలను తరలించే క్రమంలో గన్‌పార్కు వద్ద ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ భవన్‌కు చేరుకున్న బీఆర్ఎస్ నేతలను పలువురు నిరుద్యోగులు కలిసి ఉద్యోగాల భర్తీ జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. -
నేడే జాబ్ కేలండర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగులంతా ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురుచూస్తు న్న జాబ్ కేలండర్ మరికొన్ని గంటల్లో వెలువడనుంది. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచి్చన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం శాసనసభ వేదికగా జాబ్ కేలండర్‌ను ప్రకటించనుంది. ఇకపై ఏటా యూపీఎస్సీ తరహాలో ప్రణాళికాబద్ధంగా తేదీలవారీగా ఉద్యోగ నియామకాల ప్రకటనలు జారీ చేయనుంది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో జాబ్ కేలండర్‌ను ప్రకటించనున్నారు. సీఎం రేవంత్ అధ్యక్షతన గురువారం సాయంత్రం అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో జాబ్ కేలండర్ సహా కొత్త రేషన్‌కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల జారీ, మూసీ నది ప్రక్షాళన, గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం తదితర అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాకు వివరాలను వెల్లడించారు.మేని ఫెస్టోలో ప్రకటించిన జాబ్ కేలండర్‌కు చట్టబద్ధత కల్పించడానికి శాసనసభలో ప్రకటిస్తున్నామని పొంగులేటి తెలిపారు. ఈ అంశంపై చర్చలో ప్రతిపక్షాలు చేసే సూచనలను పరిగణనలోకి తీసుకొని తగిన మార్పులు చేసేందు కు సిద్ధమన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు జారీ చేసిన తీర్పును ఇప్పటికే ప్రకటించిన గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3 నోటిఫికేషన్లకు వర్తింపజేసేందుకు త్వరలో ఆర్డినెన్స్ తీసుకురావాలని సీఎం నిర్ణయించినట్లు చెప్పారు. త్వరలో తెల్లరేషన్‌కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు ఎన్నికల్లో ఇచి్చన మరో హామీ మేరకు త్వరలో అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల (హెల్త్ ప్రొఫెల్ కార్డులు)ను విడివిడిగా జారీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. విధివిధానాలు రూపొందించి సత్వరమే ప్రభుత్వానికి నివేదిక సమర్పించడానికి పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రెవెన్యూ మంత్రి పొంగులేటితో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఉపసంఘం నెలలోగా నివేదిక ఇస్తుందని పొంగులేటి చెప్పారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా మళ్లీ కోదండరాం, అమేర్ అలీఖాన్ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమేర్ అలీఖాన్‌ల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో గవర్నర్ గతంలో ప్రభుత్వానికి తిప్పిపంపడం తెలిసిందే. దీంతో వారి పేర్లనే మళ్లీ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పోస్టులకు సిఫారసు చేస్తూ గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపించాలని మంత్రివర్గం నిర్ణయించింది. మరికొన్ని కేబినెట్ నిర్ణయాలు ⇒ కేరళలోని వయానాడ్‌లో ప్రకృతి ప్రకోపానికి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగిన నేపథ్యంలో కేరళ ప్రభుత్వానికి అవసరమైన ఆర్థిక, వైద్య, సహకారం అందించాలి. ⇒ షూటర్ ఈషా సింగ్, బాక్సర్ నిఖత్ జరీన్, టీం ఇండియా క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్‌కు హైదరాబాద్‌లో 600 చదరపు గజాల చొప్పున ఇంటి స్థలంతోపాటు నిఖత్ జరీన్, సిరాజ్‌కు గ్రూప్–1 స్థాయి ఉద్యోగాలు ఇవ్వాలనే ప్రతిపాదనకు ఆమోదం. ⇒ ఇటీవల విధి నిర్వహణలో మరణించిన విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం డీజీ రాజీవ్ రతన్ కుమారుడు హరి రతన్‌కు మున్సిపల్ కమిషనర్‌గా విధినిర్వహణలో మరణించిన అదనపు డీజీ పి.మురళి కుమారుడికి డిప్యూటీ తహశీల్దార్ ఉద్యోగం ఇవ్వాలన్న ప్రతిపాదనకు ఓకే. ⇒ 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో 2007లో దివంగత సీఎం వై.ఎస్. రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 437 కోట్లతో సవరించిన అంచనాలకు ఆమోదం. ⇒ ఖాయిలాపడిన నిజాం షుగర్స్ కర్మాగారాన్ని పునరుద్ధరించాలి. మంత్రి శ్రీదర్‌బాబు నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం నివేదిక ప్రకారం రెండు విడతలుగా ఆర్థిక సాయం చేయాలి. ⇒ మూసీ నది ప్రక్షాళనలో భాగంగా మల్లన్నసాగర్ నుంచి 15 టీఎంసీల గోదావరి జలాలను హైదరాబాద్ శివారులోని శామీర్‌పేట చెరువుకు తరలించి అక్కడి నుంచి ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలకు తరలించాలనే ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్. 10 టీఎంసీలను హైదరాబాద్ తాగునీటికి, మిగిలిన 5 టీఎంసీలను నగర పరిసర ప్రాంతాల్లోని చెరువుల్లో నింపడంతోపాటు మూసీలో నిరంతరం స్వచ్ఛమైన నీళ్లు ఉండేలా వదలాలన్న ప్రతిపాదనకు ఓకే. ⇒ ధరణి సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమరి్పంచిన నివేదికపై శుక్రవారం శాసనసభలో లఘు చర్చ నిర్వహణకు నిర్ణయం. -
ఉద్యోగంలోనే కాదు.. ఉద్యోగుల ఎంపికలోనూ ఏఐ - ఎలా అంటే?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజ్యమేలుతున్న తరుణంలో చాలా కంపెనీలు ఈ టెక్నాలజీని విరివిగా ఉపయోగించుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఏఐను ఉద్యోగాలలో ఉపయోగించుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఉద్యోగులను ఎంపిక చేసే విషయంలో కూడా వినియోగించుకోవడం మొదలుపెట్టారు.సాధారణంగా ఏదైనా సంస్థలో ఉద్యోగం కావాలంటే రెస్యూమ్స్ పంపిస్తారు. వీటిని ఆ కంపెనీ రిక్రూట్మెంట్ పరిశీలించి, అర్హత ఉన్నవారిని ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఆ తరువాత ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఇది అసలైన ప్రక్రియ. కానీ ఏఐ వాడకంలోకి వచ్చిన తరువాత ఇంటర్వ్యూల విషయంలో కూడా టెక్నాలజీని వాడేస్తున్నారు.GenAI బాట్లు మేనేజర్లకు ఇంటర్వ్యూలు నిర్వహించడంలో సహాయపడుతున్నాయి. సరైన క్వాలిఫికేషన్స్ ఉన్న వారిని ఎంపిక చేయడంలో ఏఐ చాలా అద్భుతంగా ఉపయోగపడుతోంది హెచ్ఆర్ అధికారులు చెబుతున్నారు. దీంతో ఉద్యోగుల ఎంపిక కూడా చాలా వేగంగా జరుగుతుందని పేర్కొంటున్నారు.కొత్త నియామకాలలో దాదాపు 40 శాతం అభ్యర్థులను ఏఐ ద్వారానే ఎంచుకున్నట్లు, దీంతో ఇంటర్వ్యూలు చాలా వేగంగా జరుగుతున్నాయని జెన్‌ఫ్యాక్ట్ గ్లోబల్ హైరింగ్ లీడర్ రీతు భాటియా పేర్కొన్నారు. ఒకేసారి నియమాలకు చేపట్టడానికి 63 రోజులు పట్టేది, అయితే ఏఐ సాయం వల్ల ఇది 43 రోజుల్లోనే ముగిసిందని కూడా భాటియా పేర్కొన్నారు.రిక్రూట్మెంట్ సర్వీసెస్ ప్రొవైడర్ పీపుల్‌ఫై చీఫ్ ఎగ్జిక్యూటివ్ 'రాజేష్ భారతీయ' ప్రకారం.. జెన్ఏఐ ఉద్యోగులను ఇంటర్వ్యూలు చేసే సమయంలో చాలా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. మాన్యువల్‌గా రెస్యూమ్ పరిశీలన చేపడితే ఎక్కువ సమయం పడుతుంది. ఆ పనిని ఏఐ చాలా వేగంగా చేస్తుంది. తద్వారా ఇంటర్వ్యూ చాలా వేగంగా ముగుస్తుందని పేర్కొన్నారు. -
ఈ పరీక్షలు ఎప్పుడు?
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాల భర్తీ ప్రకటనలిచ్చి నెలలు గడుస్తున్నా అర్హత పరీక్షలు నిర్వహించకపోవడంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంటోంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడి ఏడాది గడిచింది. అదేవిధంగా గ్రూప్–3, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాల ప్రకటనలు వెలువడి కూడా దాదాపు ఏడాది కావొస్తోంది. కానీ ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత పరీక్షలు ఇంతవరకు నిర్వహించలేదు. వాస్తవానికి డీఏఓ పరీక్ష ఈ ఏడాది జనవరిలో నిర్వహించారు. అయితే ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో రద్దు చేసి మళ్లీ నిర్వహిస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటికీ ముహూర్తం ఖరారు కాలేదు. దీంతో పాటు ఇతర పరీక్షల నిర్వహణపై స్పష్టత లేకపోవడంతో దీర్ఘకాలంగా వీటి కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు ఎన్నికలు ముంచుకొస్తుండడంతో పరీక్షలు ఇంకెప్పుడు జరుగుతాయనే అయోమయానికి గురవుతున్నారు. సన్నద్ధతకు సంకటం ఏదైనా పరీక్ష తేదీని ప్రకటిస్తే అభ్యర్థులు సన్నద్ధతకు ఒక ప్రణాళికను రూపొందించుకుంటారు. ప్రభుత్వ శాఖల్లో వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పూనుకోవడం, తదనుగుణంగా నోటిఫికేషన్లు ఇవ్వడంతో నిరుద్యోగ అభ్యర్థులు కఠోర దీక్షతో ప్రిపరేషన్లో పడ్డారు. కొందరు ప్రైవేటు ఉద్యోగాలను వదిలేసి మరీ సిద్ధమవుతున్నారు. మరికొందరైతే పనిచేస్తున్న ఉద్యోగాలకు దీర్ఘకాలిక సెలవులు పెట్టుకుని టీఎస్పీఎస్సీ ఉద్యోగాలు సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో పరీక్షల తేదీలను ప్రకటించకుండా కమిషన్ కాలయాపన చేస్తుండటంతో సన్నద్ధత గాడి తప్పుతోందని అభ్యర్థులు వాపోతున్నారు. ఈ నెలంతా ప్రభుత్వ కాలేజీల్లో లెక్చరర్ ఉద్యోగాలకు అర్హత పరీక్షలు కొనసాగుతుండగా.. వచ్చే నెలలో సైతం పలు పరీక్షలకు కమిషన్ తేదీలు ఖరారు చేసింది. ఆగస్టు నెలలో నిర్వహించాల్సిన గ్రూప్–2 పరీక్ష నవంబర్ నెలకు వాయిదా పడింది. ఈ విధంగా పలు పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్పీఎస్సీ.. డీఏఓ, హెచ్‌డబ్ల్యూఓ, గ్రూప్–3 పరీక్షలపై తేల్చకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. -
నెలాఖరులోగా గురుకుల పరీక్షల తుది ‘కీ’లు!
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగ నియామకాల ప్రక్రియ వడివడిగా సాగుతోంది. తొలిసారిగా ఆన్లైన్ పద్ధతిలో అర్హత పరీక్షలను కేవలం మూడు వారాల వ్యవధిలో నిర్వహించి రికార్డు సృష్టించిన తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ).. చివరి పరీక్ష రోజునే ప్రాథమిక కీలను విడుదల చేసింది. తాజాగా ‘ఫైనల్ కీ’(తుది జవాబు పత్రం) తయారీలో గురుకుల బోర్డు నిమగ్నమైంది. దాదాపు 56 కేటగిరీలకు సంబంధించి 19 రోజుల పాటు రోజుకు మూడు సెషన్లలో పరీక్షలు నిర్వహించిన టీఆర్‌ఈఐఆర్‌బీ.. ప్రాథమిక కీలను విడుదల చేసి అభ్యంతరాలను కూడా ఆన్లైన్ పద్ధతిలో స్వీకరించింది. శనివారంతో అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసింది. ఆన్లైన్లో వచ్చిన అభ్యంతరాలను పరిశీలించేందుకు బోర్డు ప్రత్యేకంగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అభ్యర్థుల అభ్యంతరాలను తగిన ఆధారాలతో పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. రెండ్రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. నిపుణుల కమిటీ సూచనలకు అనుగుణంగా ఫైనల్ కీలను తయారుచేసి వెబ్సైట్లో అందుబాటులో ఉంచేందుకు టీఆర్‌ఈఐఆర్‌బీ కసరత్తు వేగవంతం చేసింది. ఈనెలాఖరులోగా ఈ ప్రక్రియను పూర్తి చేసేలా గురుకుల బోర్డు కసరత్తు చేస్తోంది. అవరోహణ క్రమంలో నియామకాలు గురుకుల విద్యా సంస్థల్లో వివిధ కేటగిరీల్లో 9,231 ఉద్యోగాలకు వెబ్‌నోట్ జారీ చేసిన టీఆర్‌ఈఐఆర్‌బీ.. ఆ తర్వాత జారీ చేసిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ల ప్రకారం 9,210 పోస్టులకు మాత్రమే ప్రకటనలను పరిమితం చేసింది. ఇందులో భాగంగా ఈనెల 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అర్హత పరీక్షలు జరిగాయి. సగటున 75 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ కేటగిరీలు మినహా మిగతా అన్ని కేటగిరీల్లోని అర్హత పరీక్షల ప్రాథమిక కీలను వెబ్సైట్లో అందుబాటులో పెట్టారు. కోర్టు కేసుల నేపథ్యంలో ఈ మూడు కేటగిరీల కీలను విడుదల చేయలేదు. ఈ నెలాఖరులో తుది కీలను ఖరారు చేసి, అదేరోజున అభ్యర్థులు సాధించిన మార్కులను కూడా వెబ్సైట్లో పెడతారు. గురుకుల సొసైటీల్లో ఉద్యోగాల భర్తీకి బోర్డు అవరోహణ విధానాన్ని ఎంచుకుంది. ముందుగా పైస్థాయి పోస్టులను భర్తీ చేస్తూ క్రమంగా కింది స్థాయిలో పోస్టుల నియామకాలను ముగిస్తుంది. ఈ క్రమంలో తొలుత డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, పీజీటీ, టీజీటీ పోస్టులను భర్తీ చేస్తారు. ప్రస్తుతం తుది కీలను విడుదల చేసి మార్కులు ప్రకటించిన తర్వాత అర్హతల ఆధారంగా డీఎల్, జేఎల్ పోస్టులకు డెమో పరీక్షలు సైతం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి అతి త్వరలో తేదీలను ఖరారు చేసే దిశగా గురుకుల బోర్డు చర్యలు వేగవంతం చేసింది. -
తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష.. పోలీసుల నిఘా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష కొనసాగుతోంది. చివరి నిమిషంలో అభ్యర్థులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఐడీ కార్డుతో పాటు గుర్తింపు పత్రాలు తీసుకురాని అభ్యర్థులను పోలీసులు బయటికి పంపించారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)లో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో గత అక్టోబర్ 16న నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష రద్దయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రిలిమినరీ పరీక్షను తిరిగి నిర్వహించనున్నట్లు వెల్లడించిన టీఎస్పీఎస్సీ... ఈనెల 11న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరగనుంది. పోటీ తీవ్రమే.. వివిధ ప్రభుత్వ శాఖల్లో 503 ఉద్యోగ (గ్రూప్–1) ఖాళీలున్నాయి. వీటికి 3,80,081 మంది దరఖాస్తు చేసుకోగా, గత అక్టోబర్ 16న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 2,86,051 మంది హాజరయ్యారు. అనంతరం మెయిన్ పరీక్షలకు అర్హత సాధించిన వారి వివరాలను టీఎస్పీఎస్సీ వెల్లడించింది. కానీ ప్రశ్నపత్రాల లీకేజీతో ఈ పరీక్షను రద్దు చేయాల్సి వచ్చింది. చెప్పులు వేసుకొస్తేనే అనుమతి అభ్యర్థులు ఒరిజినల్ హాల్‌టికెట్‌తో హాజరుకావాలి. హాల్‌టికెట్‌పై ఫొటో సరిగ్గా లేకుంటే మూడు ఫొటోలపై గెజిటెడ్ అధికారి సంతకంతో కూడిన హాల్‌టికెట్‌తో హాజరుకావాలి. అభ్యర్థులు తప్పకుండా గుర్తింపు కార్డు (పాన్, ఆధార్, ఓటర్ ఐడీ తదితరాలు)ను వెంట తెచ్చుకోవాలి. పరీక్షా హాల్లోకి అభ్యర్థులను అనుతించే విషయంలో కమిషన్ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. పరీక్షా సమయానికి 15 నిమిషాల ముందే గేట్లు వేసేస్తారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. అభ్యర్థులు కేవలం చెప్పులు మాత్రమే ధరించాలి. బూట్లు ధరించకూడదు. బెల్టు ధరించిన అభ్యర్థులను సైతం పక్కాగా పరిశీలించిన తర్వాతే అనుమతిస్తారు. పరీక్ష తీరును పరిశీలించేందుకు టీఎస్పీఎస్సీ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సైతం ఏర్పాటు చేసినట్లు కమిషన్ వెల్లడించింది. -
ఐటీ దిగ్గజాల రిక్రూట్మెంట్లు అంతంత మాత్రమే! రానున్న రోజుల్లో..
ముంబై: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో కోవిడ్ కాలంలో ఒక్క సారిగా వెల్లువెత్తిన నియామకాలు ఆ తర్వాత నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ అనిశ్చితుల మధ్య కంపెనీలు హైరింగ్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. దీంతో ఈసారి నియామకాల పరిస్థితి కోవిడ్ పూర్వ స్థాయిలో (2018 - 19 ఆర్థిక సంవత్సరం) దాదాపు 70 శాతానికి పరిమితం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఐటీ దిగ్గజాల ఇటీవలి ప్రకటనలు ఈ అభిప్రాయాలకు ఊతమిస్తున్నాయి. వీటి ప్రకారం దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కోవిడ్ పూర్వ స్థాయిలో నియామకాలను చేపట్టనుంది. సుమారు 40,000 గ్రాడ్యుయేట్లను రిక్రూట్ చేసుకోనుంది. అలాగే హెచ్‌సీఎల్‌టెక్ ఈసారి దాదాపు 30,000 మందిని తీసుకోనున్నట్లు డిసెంబర్లో ప్రకటించినా.. ఇటీవల 2022 - 23 నాలుగో త్రైమాసిక ఫలితాల వెల్లడి సందర్భంగా దాన్ని సగానికి పైగా తగ్గించేసింది. 13,000 - 15,000 మందిని మాత్రమే తీసుకునే యోచనలో ఉన్నట్లు పేర్కొంది. దేశీయంగా రెండో అతి పెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ 2023 - 24కు గాను తమ రిక్రూట్మెంట్ లక్ష్యాలను ఇంకా వెల్లడించనే లేదు. 2019 ఆర్థిక సంవత్సరంతో తాజా గణాంకాలను పోల్చి చూస్తే.. అప్పట్లో ఇన్ఫోసిస్ 20,000 మందిని తీసుకోగా, హెచ్‌సీఎల్ టెక్, విప్రో తక్కువ స్థాయిలో క్యాంపస్ రిక్రూట్మెంట్లు జరిపాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో రిక్రూట్మెంట్పరంగా కన్సాలిడేషన్ చోటు చేసుకునే అవకాశం ఉందని నియామకాల సేవల సంస్థ హైర్‌ప్రో వర్గాలు వెల్లడించాయి. 2019 - 20ని బేస్‌లైన్‌గా తీసుకుంటే ఆ తర్వాత కొద్ది రోజుల పాటు హైరింగ్ జరిగిన తీరు అసాధారణమని, అప్పటితో పోలిస్తే ఇప్పుడు మాత్రం నియామకాలు దాదాపు 70 శాతానికి పరిమితం కావొచ్చని పేర్కొన్నాయి. కంపెనీలకు సవాళ్లు.. దేశీ ఐటీ కంపెనీలు పలు సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే అవసరమైన దానికంటే ఎక్కువగా నియమించుకోవడం, భారీ సంఖ్యలో తీసుకునే క్రమంలో నాణ్యమైన అభ్యర్థులను రిక్రూట్ చేసుకోలేకపోవడం వంటివి వీటిలో ఉన్నాయ. కోవిడ్ సంవత్సరంలో అట్రిషన్ (ఉద్యోగుల వలసలు) పెరిగిపోయింది. దీంతో తగినంత మంది సిబ్బందిని తమ దగ్గర ఉంచుకునేందుకు కంపెనీలన్నీ జోరుగా నియామకాలు జరిపాయి. విపరీతంగా క్యాంపస్ రిక్రూట్మెంట్లు జరిపాయి. ఆఫర్ లెటర్లు ఇచ్చినా నికరంగా ఎంత మంది చేరతారనే దానిపై స్పష్టత లేకపోవడంతో హైరింగ్ లక్ష్యాలను గణనీయంగా పెంచుకున్నాయి. తర్వాత పరిస్థితులు మారాయి. వివిధ కారణాల వల్ల 2022, 2023 బ్యాచ్ గ్రాడ్యుయేట్ల చేరిక ప్రక్రియ ఇంకా అసంపూర్తిగానే ఉంది. కొత్త బ్యాచ్‌లపై ఈ ప్రభావాలు మరింతగా ఉండవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇక హైరింగ్ హడావిడిలో పడి ఐటీ సంస్థలు నాణ్యతను పక్కన పెట్టాయని హెచ్ఆర్ కంపెనీలు చెబుతున్నాయి. మదింపు ప్రక్రియ కఠినతరం.. ఏటా దేశీయంగా 10 - 12 లక్షల మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు కళాశాలల నుండి బైటికి వస్తుండగా వారిలో కేవలం మూడు నుంచి మూడున్నర లక్షల మంది మాత్రమే ఉద్యోగార్హులుగా ఉంటున్నారని అంచనా. దీంతో ప్రస్తుతం రిక్రూట్‌మెంట్‌ను క్రమబద్ధీకరించుకునే క్రమంలో ఐటీ కంపెనీలు నైపుణ్యాల మదింపు ప్రక్రియను కఠినతరం చేయడం మొదలుపెట్టాయి. తద్వారా అర్హత లేని అభ్యర్ధులను వడగట్టే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఉద్యోగార్థుల అర్హతలను మదింపు చేసేందుకు, శిక్షణనిచ్చేందుకు వెలాసిటీ అనే ప్రోగ్రాంను నిర్వహిస్తున్న విప్రో కొత్తగా దానికి తోడుగా మరో పరీక్ష కూడా క్లియర్ చేయాలంటూ గ్రాడ్యుయేట్లకు సూచించింది. అందులో ఉత్తీర్ణులు కాకపోతే తొలగించాల్సి వస్తుందని పేర్కొన్నట్లు సమాచారం. అలాగే మధ్య స్థాయి ఐటీ సర్వీసుల కంపెనీ ఎల్‌టీఐమైండ్‌ట్రీ కూడా ఆన్‌బోర్డింగ్‌కు సిద్ధంగా ఉన్న తాజా గ్రాడ్యుయేట్లు.. కొత్త శిక్షణా ప్రోగ్రామ్‌ను కూడా క్లియర్ చేయాలని షరతు విధించింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా స్థూల ఆర్థిక పరిస్థితులు అంత సానుకూలంగా లేనందున ఐటీ కంపెనీలకు వచ్చే ప్రాజెక్టులు, హైరింగ్‌పైనా ప్రభావం పడనుందని హెచ్ఆర్ సర్వీసుల సంస్థలు తెలిపాయి. ముందుగా 2022 బ్యాక్‌లాగ్‌ల భర్తీని పూర్తి చేయడంపై ఐటీ కంపెనీలు దృష్టి పెట్టొచ్చని పేర్కొన్నాయి. తిరస్కరించేందుకు మరింత బలమైన కారణాలు చూపేందుకు మదింపు ప్రక్రియకు మరిన్ని దశలను జోడించవచ్చని తెలిపాయి. -
పేపర్ లీక్ ఘటన.. అప్రమత్తమైన తెలంగాణ సర్కార్, ఏ బోర్డు ఎంత భద్రం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)లో కంప్యూటర్ల నుంచి ప్రశ్నపత్రాల తస్కరణ వ్యవహారంతో రాష్ట్ర సర్కారు అప్రమత్తమైంది. ఈ వ్యవహారం ప్రభుత్వానికి మచ్చగా మారుతుందేమోనన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా వాస్తవ పరిస్థితుల విశ్లేషణకు ఉపక్రమించింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 80 వేలకు పైగా ఉద్యోగ ఖాళీల భర్తీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం.. ఆ మేరకు నియామక సంస్థలకు బాధ్యతలు అప్పగించింది. రాష్ట్రంలో నాలుగు నియామక సంస్థలున్నాయి. టీఎస్పీఎస్సీ, తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ), తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ), తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎంఎచ్‌ఎస్‌ఆర్‌బీ)ల ద్వారా ఉద్యోగ నియామకాలు కొనసాగుతున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో వాటి పనితీరును సమీక్షించాలని, ఏ బోర్డు..ఎంత భద్రమో క్షుణ్ణంగా పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మంగళవారం నియామక సంస్థల చైర్మన్లు, సంబంధిత ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధ్యక్షతన సమావేశం జరగనుంది. మానవ వనరులపై నిఘా...? ప్రస్తుతం చాలా ఉద్యోగ ప్రకటనలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ పూర్తికాగా, కొన్నింటికి ప్రాథమిక పరీక్షలు నిర్వహించడంతో తదుపరి దశకు చేరుకున్నాయి. నియామక సంస్థల్లో మానవ వనరులు, సాంకేతిక పరిజ్ఞానం, గోప్యత అనేవి అత్యంత కీలకం. ఆయా అంశాల్లో ఎలాంటి పొరపాట్లు జరిగినా నియామక సంస్థల ప్రతిష్ట దెబ్బతినడంతో పాటు, ఎన్నో ఆశలతో, కఠోర దీక్షతో సన్నద్ధమైన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది. తాజాగా టీఎస్పీఎస్సీ ఉద్యోగులే కంప్యూటర్లు హ్యాక్ చేయడంతో పాటు ప్రశ్నపత్రాన్ని బయటకు లీక్ చేశారనే అభియోగాలున్నాయి. ఈ నేపథ్యంలో మిగతా బోర్డుల్లో మానవ వనరుల పరిస్థితి, సాంకేతిక పరిజ్ఞానం తీరును సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది. బోర్డుల వారీగా ఉద్యోగులు, వారి అర్హతలు, బాధ్యతలు, అధికారాలపై పూర్తిస్థాయి నివేదికలు తెప్పించుకోవాలని నిర్ణయించింది. ప్రస్తుతం టీఎస్పీఎస్సీలో శాశ్వత ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉండటంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించుకున్నట్లు తెలుస్తోంది. ఇతర బోర్డుల పరిస్థితిని కూడా సమీక్షించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తగిన సూచనలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు నియామక సంస్థలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కడ్నుంచి తీసుకుంటున్నాయి? బయటి నుంచి ఈ మేరకు సహకారం తీసుకుంటున్నాయనే కోణంలో ప్రభుత్వం పరిశీలించనుంది. -
2022 REWIND: ఉద్యోగాల జాతర.. ఆరోగ్యానికి ఆసరా..
రాష్ట్రంలో 2022 ఏడాది ఎన్నో కీలక పరిణామాలకు సాక్షిగా నిలిచింది. పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ, వైద్యారోగ్య రంగంలో కీలక పథకాలు, మార్పులతో సానుకూలతలు కనిపించగా.. పోడు భూముల వివాదం, ఉపాధ్యాయుల సమస్యలు వంటివి నిరసనలు, ఆందోళనలకు తెరలేపాయి. ఒక్క ఏడాదిలోనే ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలు రావడం రాష్ట్ర విద్యార్థులకు ప్రయోజనకరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలను ఏర్పాటు చేసే అంశంలో ఈ ఏడాది ముందడుగు పడింది. రాష్ట్ర ఏర్పాటు నాటి నుంచి పెండింగ్‌లో ఉన్న గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చాయి. రాష్ట్రంలో పలు రంగాల్లో 2022 తెచ్చిన ప్రత్యేకతలేమిటో చూద్దాం.. – సాక్షి, హైదరాబాద్ అడవి పెరిగింది.. ‘పోడు’గొడవ పెరిగింది! రాష్ట్రంలో పోడు భూముల సమస్య మరోసారి చర్చనీయాంశమైంది. ఈ సమస్యపై ప్రభుత్వపరంగా పరిశీలన జరుగుతున్నపుడే గొత్తికోయల చేతుల్లో ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు హత్యకు గురికావడం కలకలం రేపింది. అటవీశాఖ అధికారులు, సిబ్బందిలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. పోడు సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కచ్చితమైన విధానాన్ని రూపొందించాలనే డిమాండ్లు వచ్చాయి. మరోవైపు తెలంగాణకు హరితహారం ఎనిమిదో ఏడాదిలోకి అడుగిడింది. ఈ ఏడాది హరితహారం లక్ష్యం 19.54 కోట్ల మొక్కలుకాగా 20.25 కోట్ల మొక్కలు నాటారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నిరకాల రహదారుల వెంట సుమారు లక్ష కిలోమీటర్ల మేర రహదారి వనాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ట్రీ సిటీ ఆఫ్ వరల్డ్‌గా హైదరాబాద్‌కు గుర్తింపు వచ్చింది. రాష్ట్రంలో పులుల సంచారం పెరిగింది. ఆసిఫాబాద్‌లో ఒకరు పులి దాడిలో మృతి చెందారు. వైద్య విద్యలో రికార్డు.. ఆరోగ్యానికి తోడ్పాటు రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దే క్రమంలో ప్రభుత్వం 2022లో కీలక ముందడుగు వేసింది. ఒక్క ఏడాదిలోనే ప్రభుత్వ రంగంలో ఎనిమిది మెడికల్ కాలేజీలను స్థాపించడం, తద్వారా రాష్ట్రంలో 1,150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రావడం, తొమ్మిది జిల్లాల్లో గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు అందించే పథకాన్ని ప్రారంభించడం ప్రశంసలు పొందాయి. మిగతా జిల్లాల్లోనూ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తామని, సమాంతరంగా నర్సింగ్, పారామెడికల్ కళాశాలల ఏర్పాటుకు చర్యలు చేపడతామని ప్రభుత్వం ప్రకటించింది. ఇక వైద్యారోగ్య మంత్రిగా హరీశ్‌రావు బాధ్యతలు చేపట్టి ఏడాది గడిచింది. ఆయన ఆధ్వర్యంలో అన్ని విభాగాలపై నెలవారీ సమీక్షలు జరుగుతున్నాయి. సంస్కరణలకూ తెరలేచింది. దారిన పడిన ఆర్టీసీ దివాలా అంచుకు చేరిన ఆర్టీసీని ఈ ఏడాది చిన్న ఆలోచన మళ్లీ నిలిపింది. డీజిల్ సెస్ పేరుతో చార్జీల సవరణ చేపట్టి ఆదాయాన్ని పెంచుకుని.. నష్టాల ఊబి నుంచి కొంతమేర బయటపడింది. సెస్‌ల రూపంలో టికెట్ చార్జీలను పెంచి ధైర్యం చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. ప్రయాణికుల నుంచి వ్యతిరేకత రాకుండా పలు చర్యలు చేపట్టడం కలసివచ్చింది. ఇదే సమయంలో డిపో స్థాయి నుంచి ప్రధాన కార్యాలయం దాకా సిబ్బంది పనితీరును సమీక్షించి మెరుగుపర్చేందుకు ప్రయత్నాలు చేశారు. ఓరియంటేషన్లు, ప్రత్యేక శిక్షణలు, స్టడీ టూర్లు, వ్యక్తిగత పనితీరు మెరుగుపడటం, 100 డేస్ చాలెంజ్, శ్రావణమాసం చాలెంజ్, దసరా పండుగ చాలెంజ్, హెల్త్ చాలెంజ్, ఫిట్నెస్ చాలెంజ్ వంటి కార్యక్రమాలతో సిబ్బంది పనితీరు సమూలంగా మారింది. గత దశాబ్దకాలంలో ఎన్నడూ లేనట్టుగా 45 డిపోలు లాభాల్లోకి వచ్చాయి. కొత్త కొలువుల జాతర.. రాష్ట్రంలో 2022 ఏడాది కొలువుల జాతరను తీసుకువచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేనంతస్థాయిలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 80వేల మేర ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేస్తామని ప్రకటించడంతో నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) 503 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. గ్రూప్–4 కేటగిరీలో 9 వేల కొలువులు, ఇంజనీరింగ్ విభాగాలు, ఇతర శాఖల పరిధిలో మరో 5వేల కొలువులకు ప్రకటనలు విడుదలయ్యాయి. రాష్ట్రస్థాయి పోలీస్ నియామకాల బోర్డు ద్వారా దాదాపు 17 వేల ఉద్యోగాలకు ప్రకటనలు వెలువడ్డాయి. వైద్య విభాగాల్లోనూ ఖాళీల భర్తీ చేపట్టారు. గురుకుల విద్యా సంస్థల్లోనూ 12 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతులు కూడా ఇచ్చింది. ‘రోడ్ల’కు మంచి రోజులు తెలంగాణ వచ్చిన తర్వాత తొలిసారిగా రాష్ట్ర రహదారులకు పూర్తిస్థాయి నిర్వహణ పనులకు ఈ ఏడాదే గ్రీన్‌సిగ్నల్ పడింది. ఈ మేరకు ప్రభుత్వం రూ.2,500 కోట్లు మంజూరు చేసింది. కనీసం నాలుగు వేల కిలోమీటర్ల పొడవైన రోడ్లను పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక రోడ్లు భవనాల శాఖలో ఈ ఏడాది భారీ మార్పులు జరిగాయి. కొత్తగా 472 అదనపు పోస్టులు మంజూరు చేయడంతోపాటు 3 సీఈ, 10 సర్కిల్, 13 డివిజన్, 79 సబ్‌డివిజన్ కార్యాలయాలను కొత్తగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలగిన సవాళ్లు.. కోవిడ్ మహమ్మారి ప్రభావం తగ్గడంతో 2022లో విద్యా సంస్థల్లో పునరుత్తేజం కనిపించింది. అదే సమయంలో ఎన్నో సవాళ్లూ ఎదురయ్యాయి. కార్పొరేట్‌కు దీటుగా సర్కారీ బడులను తీర్చిదిద్దుతామంటూ ‘మన ఊరు–మనబడి’పథకాన్ని ప్రారంభించినా ఆచరణలో నిరాశే ఎదురైంది. తొలి విడతగా 9 వేలకుపైగా బడుల్లో మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా పెట్టుకోగా 1,200 స్కూళ్లలోనే పూర్తయ్యాయి. ప్రభుత్వ స్కూళ్లలో బదిలీలు, ప్రమోషన్లు, 317 జీవో వల్ల ఏర్పడ్డ సమస్యలపై ఉపాధ్యాయులు ఆందోళనలు చేశారు. టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా అడుగు ముందుకు పడలేదు. మరోవైపు ఇంజనీరింగ్, ఇతర కోర్సుల ఫీజుల పెంపు వంటివి విద్యార్థులపై భారం వేశాయి. ఇక ఈ ఏడాది కొత్తగా 33 బీసీ గురుకుల పాఠశాలలు, 15 బీసీ డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయడం, పలు మైనారిటీ గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయడం పెద్ద సంఖ్యలో విద్యార్థులకు లబ్ధి చేకూర్చింది. కేంద్రంతో తప్పని ‘పంచాయితీ’! 2022 ఏడాది మొదట్లోనే కేంద్ర, రాష్ట్రాల మధ్య వివిధ అంశాలపై మొదలైన ‘పంచాయితీ’చివరికి మరింత ముదిరింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, గ్రాంట్లు తగ్గాయని, శాఖల వారీగా వచ్చే నిధుల జాడేలేకుండా పోయిందని రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు గుప్పించింది. తెలంగాణ చేపట్టిన పలు పథకాలకు నిధులివ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా కేంద్రం మొండిచేయి చూపుతోందని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు బహిరంగంగానే ఆరోపించారు. పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో ఉపాధి హామీ పథకం కింద నిబంధనలకు విరుద్ధంగా రైతు కల్లాలు నిర్మించారంటూ కేంద్రం పేర్కొనడం, అందుకు సంబంధించిన రూ.150 కోట్లను తిరిగివ్వాలని పట్టుపట్టడం అగ్నికి ఆజ్యం పోసింది. కేంద్రం తీరు సరిగా లేదని, రాష్ట్రానికి రావాల్సిన రూ.1,100 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలంటూ బీఆర్ఎస్ ధర్నాలు, నిరసనలు నిర్వహించింది. ఇక వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసు 57 ఏళ్లకు తగ్గింపు ఈ ఏడాదే అమల్లోకి వచ్చింది. డయాలసిస్ బాధితులకు పింఛన్ల మంజూరు కూడా మొదలైంది. ఈ ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో రాష్ట్రం సత్తా చాటింది. -
పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి తెలంగాణ కేబినెట్ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖలో నూతన ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని మొత్తం 3,966 పోస్టులను వివిధ కేటగిరీలలో భర్తీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నియామక ప్రక్రియ చర్యలు చేపట్టాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది. వీటితోపాటు.. మూడు కమిషనరేట్ల పరిధిలో.. శాంతిభద్రతలను మరింతగా మెరుగు పరిచేందుకు నూతన పోలీస్ స్టేషన్లు, నూతన సర్కిల్లు, నూతన డివిజన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అదే విధంగా శాంతిభద్రతల పరిరక్షణలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖను మరింత పటిష్టం చేయాలని కేబినెట్ నిర్ణయించింది పెరుగుతున్న సాంకేతికత, మారుతున్న సామాజిక పరిస్థితులలో, నేరాల తీరు కూడా మారుతున్న నేపథ్యంలో నేరాల అదుపునకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలనీ, అందుకు అనుగుణంగా సిబ్బందిని నియమించుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. నార్కోటిక్ డ్రగ్స్, గంజాయి తదితర మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్‌ను దెబ్బతీస్తూ శాంతిభద్రతల సమస్యగా పరిణమిస్తున్నాయని కేబినెట్ చర్చించింది. డ్రగ్స్ నేరాలను అరికట్టి నిర్మూలించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. చదవండి: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు కేటీఆర్ వరాల జల్లు -
AP: వైద్య శాఖలో కొలువుల జాతర
వైద్య, ఆరోగ్య శాఖలో ఒక్క పోస్టు భర్తీ చేయాలంటే గతంలో సంవత్సరాల కాలం పట్టేది. వైద్య విద్య పూర్తి చేసుకున్న వారు, నర్సింగ్ శిక్షణ పొందిన వారు, వివిధ టెక్నీషియన్లు నోటిఫికేషన్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసేవారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు లేవు. రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల నుంచి వైద్యశాఖలో కొలువుల జాతర కొనసాగిస్తోంది. మరీ ముఖ్యంగా ఆరోగ్యరంగంలో ఎక్కువగా నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించాయి. వైద్య ఆరోగ్యశాఖలో నిత్యం ఏదో ఒక పోస్టుకు నోటిఫికేషన్ వస్తోంది. కర్నూలు (హాస్పిటల్): వైద్యరంగంలో ఏ ఒక్క పోస్టు ఖాళీగా ఉండకూడదన్న ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికితోడు అవసరమైన అదనపు పోస్టులనూ సృష్టించి మరీ భర్తీ చేసింది. ముందుగా జిల్లాలో వెయ్యికి పైగా ఉన్న వార్డు, గ్రామ సచివాలయాల్లో ఏఎన్ఎంలను నియమించి వైద్య ఆరోగ్యశాఖకు అప్పగించింది. వీరు సచివాలయాల పరిధిలో ఆరోగ్య కార్యక్రమాలను పర్యవేక్షించడమే గాక ప్రాథమిక చికిత్సను సైతం అందిస్తున్నారు. గ్రామాల్లో వారి పరిధిలోకి వచ్చే ఫ్యామిలీ ఫిజీషియన్ సేవలు, ఆరోగ్యశ్రీ సేవలు దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. విలేజ్ హెల్త్ క్లినిక్‌లలో 600 మందికి పైగా బీఎస్సీ నర్సింగ్ విద్యను పూర్తి చేసిన నర్సులు మిడ్‌లెవెల్ హెల్త్ ప్రొవైడర్లుగా వైద్యుల పాత్ర పోషిస్తున్నారు. ఆయా గ్రామాలకు వైద్యపరంగా వారే పెద్ద దిక్కుగా మారారు. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే గ్రామస్తులు వారి వద్దకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారు. ఆరోగ్య సమస్య వారి పరిధిలో లేకపోతే టెలీమెడిసిన్ ద్వారా పీహెచ్సీ లేదా జిల్లా కేంద్రంలోని టెలీమెడిసిన్ హబ్‌కు వీడియోకాల్ చేసి మరీ వైద్యం అందేలా చేస్తున్నారు. దీనివల్ల చిన్న చిన్న జబ్బులకు జిల్లా కేంద్రాలకు వెళ్లి వైద్యం చేయించుకునే వ్యయప్రయాసలను తగ్గించారు. గతంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 24 మాత్రమే అర్బన్‌హెల్త్ సెంటర్లు ఉండేవి. వాటిని 40కి పెంచడమే గాక అందులో పోస్టులను సైతం ప్రభుత్వమే భర్తీ చేసి నిర్వహిస్తోంది. గ్రామాల్లో పీహెచ్‌సీల మాదిరిగా పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల్లో అర్బన్‌హెల్త్ సెంటర్లలో ప్రాథమిక వైద్యాన్ని ప్రజలకు అందిస్తున్నారు. ఆయా పీహెచ్‌సీలు, అర్బన్‌హెల్త్ సెంటర్లు, విలేజ్‌హెల్త్ క్లినిక్‌లు ఇలా అన్ని ఆరోగ్య కేంద్రాలకు కలిపి గత రెండేళ్ల నుంచి 600లకు పైగా స్టాఫ్‌నర్సులను నియమించారు. దాంతో పాటు మరో 200 మంది ల్యాబ్టెక్నీషియన్లు, ఫార్మాసిస్టుల పోస్టులను భర్తీ చేశారు. 200లకు పైగా నాల్గవ తరగతి ఉద్యోగులనూ నియమించారు. వీరితో పాటు మరో 200 మంది దాకా పారామెడికల్ ఉద్యోగుల నియామకాలు చేపట్టారు. పెద్దాసుపత్రిలో భారీగా నియామకాలు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే ఏడాదిలో 385 పోస్టులు వివిధ కేడర్లలో భర్తీ అయ్యాయి. అందులో స్టాఫ్‌నర్సులు 298, గ్రేడ్–2 ఫార్మాసిస్టు 15, రిసెప్షనిస్టు కమ్ క్లర్క్ 3, చైల్డ్ సైకాలజిస్టు 1, ఫిజియోథెరపిస్ట్ 2, థియేటర్ అసిస్టెంట్ 6, గ్రేడ్–2 ల్యాబ్‌టెక్నీషియన్ 19, రేడియోగ్రాఫర్ 1, డేటా ఎంట్రీఆపరేటర్స్ 3, బయోమెడికల్ ఇంజనీర్ 1, రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్స్ 1, కార్డియాలజి టెక్నీషియన్ 1, డెంటల్ టెక్నీషియన్ 1, డార్క్‌రూమ్ అసిస్టెంట్ 4, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ 1, ఎక్స్‌రే అటెండెంట్ 1, ఆప్టోమెట్రిస్ట్ 1, కేథలాబ్ టెక్నీషియన్ 2, స్పీచ్‌థెరపిస్ట్ 2, ఎంఆర్ఐ టెక్నీషియన్ 2, సీటీ టెక్నీíÙయన్ 2, డయాలసిస్ టెక్నీషియన్ 5, ఆడియోమెట్రి టెక్నీషియన్ 1, మేల్ నర్సింగ్ ఆర్డర్లీ 4, స్ట్రెచ్చర్ బేరర్ 6, అటెండర్ 2 పోస్టులున్నాయి. కేఎంసీలో భారీగా వైద్యుల నియామకం కర్నూలు మెడికల్ కాలేజీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైద్యుల నియామకాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ముందుగా దీర్ఘకాలంగా ఒకేచోట ఉన్న వైద్యులను బదిలీ చేసింది. అనంతరం అర్హులైన వైద్యులకు పదోన్నతులు కల్పించింది. ఇందులో భాగంగా 32 మందిని అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి అసోసియేట్ ప్రొఫెసర్లుగా, 22 మందిని అసోసియేట్ ప్రొఫెసర్ నుంచి ప్రొఫెసర్లుగా పదోన్నతులు ఇచ్చింది. ఈ మేరకు ఖాళీగా ఉన్న స్థానాల్లో వారిని భర్తీ చేసింది. ఈ క్రమంలో గతంలో కర్నూలు నుంచి బదిలీ అయిన వారు తిరిగి పదోన్నతిపై ఇక్కడికే వచ్చారు. దీంతో పాటు ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసింది. ఈ ఏడాది ఏకంగా 123 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నూతన వైద్యులు కర్నూలు మెడికల్ కాలేజిలో అడుగు పెట్టారు. దీంతో ప్రస్తుతం వైద్యుల సంఖ్య ప్రొఫెసర్లు 73, అసోసియేట్ ప్రొఫెసర్లు 69, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 224 మంది ఉన్నారు. దీంతో కళాశాలలో ఎన్నడూలేని విధంగా ఒకేసారి ఆయా విభాగాలకు 41 పీజీ సీట్లు అదనంగా మంజూరయ్యాయి. ఇందులో రెండు సూపర్‌స్పెషాలిటీ విభాగాలు కూడా ఉన్నాయి. ఎంతో ఆనందాన్ని ఇస్తోంది నేను కర్నూలు వాసినే. జనరల్ మెడిసిన్‌ను 2019లో బెంగళూరులోని వైదేహి యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ ఇన్స్టిట్యూట్లో పూర్తి చేశాను. ఎండీ పూర్తి చేసినప్పటి నుంచి ప్రభుత్వ సరీ్వసులో చేరాలన్నది ఆశ. ఇందుకోసం అప్పటి నుంచి మూడుసార్లు ప్రయత్నం చేశాను. అయితే మెరిట్ ఉన్నా నాకు సీటు రాలేదు. ఈసారి పోస్టులు ఎక్కువగా ఉండటంతో నాకు అవకాశం దక్కింది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఎంతో గొప్పది. ఎంతో మంది సీనియర్ వైద్యులు, ఎక్కువ మంది స్టాఫ్ ఉన్నారు. వీరి మధ్య పనిచేయడం ఎంతో ఆనందాన్నిస్తోంది. – డాక్టర్ కె. దివ్యశ్రీ హర్షల, అసిస్టెంట్ ప్రొఫెసర్, జనరల్ మెడిసిన్, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల మంచి పరిణామం ప్రజలకు మంచి చేయాలన్న తలంపుతో రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగంలో భారీ ఎత్తున నియామకాలు చేపడుతోంది. ఇది వైద్యరంగానికి మంచి పరిణామం. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఏర్పాటు చేసి ఒక్కరోజులో వందలాది మందిని నియామకం చేయడం చాలా ఖర్చు, కష్టంతో కూడుకున్న పని. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉంది. నాది వైఎస్సార్ జిల్లా బద్వేలు. బెంగళూరులోని నారాయణ హృదయాలయలో డీఎన్బీ ఆరేళ్లు పూర్తి చేశాను. 2020 నుంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తుండగా ఇప్పటికి కలనెరవేరింది. ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో ఉండి వైద్యం చేయడం కన్నా మన రాష్ట్రంలో మన ప్రజల మధ్య ఉండి వారికి సేవలందించడం ఎంతో ఆనందంగా ఉంది. – డాక్టర్ కె. రవీంద్ర, అసిస్టెంట్ ప్రొఫెసర్, కార్డియోథొరాసిక్ సర్జరీ, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల రోగులకు ఎంతో మేలు జరుగుతోంది కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో గతంలో ఎప్పుడూ ఇన్ని పోస్టులు ఒకేసారి భర్తీ కాలేదు. ఎన్నో సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న పోస్టులు సైతం భర్తీ అయ్యాయి. ఈ కారణంగా రోగులకు ఆయా విభాగాల్లో ఉత్తమ వైద్యసేవలు అందించేందుకు వీలు కలుగుతోంది. ఎక్కడా ఖాళీలు ఉండకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పేదరోగులకు మేలు జరుగుతోంది. – డాక్టర్ జి. నరేంద్రనాథ్‌రెడ్డి, సూపరింటెండెంట్, జీజీహెచ్, కర్నూలు వైద్యరంగంలో విప్లవాత్మక నిర్ణయాలువైద్యరంగంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడా పోస్టులు ఖాళీగా ఉండకూడదన్న ఉద్దేశంతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టారు. వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో దాదాపుగా అన్ని పోస్టులు భర్తీ అయ్యాయి. గత రెండేళ్లుగా మా శాఖలోని ఉద్యోగులు వరుసగా వస్తున్న నోటిఫికేషన్లలోనే ఎక్కువశాతం బిజీగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. – డాక్టర్ బి. రామగిడ్డయ్య, డీఎంహెచ్‌వో, కర్నూలు -
ట్విట్టర్ లో భారీగా ఉద్యోగాలు
-
3,432 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
సాక్షి, అమరావతి: అటు హైకోర్టుతోపాటు ఇటు జిల్లా కోర్టుల్లో సుదీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి హైకోర్టు చర్యలు చేపట్టింది. ప్రధానంగా హైకోర్టులో పెద్ద సంఖ్యలో పోస్టుల ఖాళీలతో ప్రస్తుతమున్న ఉద్యోగులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇది హైకోర్టు పాలనపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో ఖాళీల భర్తీపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా దృష్టిసారించారు. ఇందులో భాగంగా ఇటీవల ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించి తద్వారా ఏర్పడిన ఖాళీలను సైతం ఇప్పటికే ఉన్న ఖాళీలతో కలిపి భర్తీచేయాలని నిర్ణయించారు. జిల్లా కోర్టుల్లో వివిధ కేటగిరీల్లో.. అందుకనుగుణంగా హైకోర్టులో వివిధ కేటగిరీల్లో 241 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేసింది. అలాగే, జిల్లా కోర్టులు కూడా ఉద్యోగుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఆ వివరాలన్నింటినీ ఆయా కోర్టుల నుంచి తెప్పించుకున్న ప్రధాన న్యాయమూర్తి అక్కడ ఖాళీల భర్తీకీ ఆదేశాలిచ్చారు. వీటి ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా కోర్టుల్లో వివిధ కేటగిరీల్లో 3,432 పోస్టుల భర్తీకి హైకోర్టు వర్గాలు నోటిఫికేషన్లు జారీచేశాయి. అటు హైకోర్టు, ఇటు జిల్లా కోర్టుల్లో పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లను హైకోర్టు వెబ్సైట్ http://hc.ap.nic.inలో పొందుపరిచారు. దరఖాస్తు చివరి తేదీ ఇదే.. ఇక హైకోర్టు ఉద్యోగాల దరఖాస్తులను హైకోర్టు వెబ్సైట్లో, జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల దరఖాస్తులను హైకోర్టు, ఆయా జిల్లాల ఈ–కోర్టు వెబ్సైట్లలో అందుబాటులో ఉంచారు. హైకోర్టు ఉద్యోగాలకు ఈ నెల 29 నుంచి నవంబర్ 15వరకు అందుబాటులో ఉంటాయి. దరఖాస్తులను నవంబర్ 15 రాత్రి 11.59లోపు ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది. జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలకు ఈనెల 22 నుంచి నవంబర్ 11 వరకు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. దరఖాస్తులను నవంబర్ 11 రాత్రి 11.59 లోపు ఆన్లైన్ ద్వారానే సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుల పరిశీలన తరువాత పరీక్షా షెడ్యూల్‌ను తెలియజేస్తారు. దరఖాస్తు ఫీజు ఇలా.. : ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ అభ్యర్థులు రూ.800, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగుల అభ్యర్థులు రూ.400లను ఫీజుగా చెల్లించాలి. ప్రతీ పోస్టుకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. కానీ, హైకోర్టులో సెక్షన్ ఆఫీసర్ (ఎస్ఓ), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్ఓ) పోస్టులను పదోన్నతుల ద్వారా కాకుండా ప్రత్యక్షంగా భర్తీచేస్తున్నారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ ఆలపాటి గిరిధర్ వేర్వేరు నోటిఫికేషన్లు జారీచేశారు. హైకోర్టులో పోస్టుల ఖాళీల వివరాలు ఇలా.. ► ఆఫీస్ సబార్డినేట్–135 ►కాపీయిస్టు–20 ►టైపిస్ట్–16 ►అసిస్టెంట్–14 ►అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్–13 ►ఎగ్జామినర్–13 ►కంప్యూటర్ ఆపరేటర్లు–11 ►సెక్షన్ ఆఫీసర్లు–9 ►డ్రైవర్లు–8 ►ఓవర్సీర్–1 ►అసిస్టెంట్ ఓవర్సీర్–1 ►మొత్తం 241 పోస్టులు. జిల్లా కోర్టుల్లో పోస్టుల ఖాళీల వివరాలు ఇవే.. ►ఆఫీస్ సబార్డినేట్–1,520 ►జూనియర్ అసిస్టెంట్–681 ►ప్రాసెస్ సర్వర్–439 ►కాపీయిస్టు–209 ►టైపిస్ట్–170 ►ఫీల్డ్ అసిస్టెంట్–158 ►స్టెనోగ్రాఫర్ (గ్రేడ్–3)–114 ►ఎగ్జామినర్–112 ►డ్రైవర్(ఎల్వీ)–20 ►రికార్డ్ అసిస్టెంట్–9 ►మొత్తం 3,432 పోస్టులు. -
కన్సల్టెన్సీలకు అనుమతులు ఉన్నాయా
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: విదేశాలకు పంపుతామంటూ కరీంనగర్లో ఇష్టానుసారంగా కన్సల్టెన్సీలు వెలుస్తున్నాయి. తాజాగా కంబోడియాలో ఐదుగురు యువకులను సైబర్ స్కాం ముఠా చేతిలో బందీలుగా చిక్కడంతో ఈ కన్సెల్టెన్సీల విశ్వసనీయతపై ఇప్పుడు సందేహాలు మొదలయ్యాయి. విదేశాల్లో చదువుకోవడం, కొలువులు చేయడం కొన్నేళ్లుగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా విద్యార్థులు, నిరుద్యోగులకు సాధారణ విషయం. ఇలాంటి వ్యవహారాల్లో విద్యార్థులకు పెద్దగా ఇబ్బందులేమీ ఉండవు. అడ్మిషన్ ఖరారయ్యాక నేరుగా వర్సిటీకి వెళ్లి చదువుకుంటారు. కానీ.. ఉపాధి చూపిస్తామని వెలిసే కన్సల్టెన్సీలకు అన్ని అనుమతులు ఉన్నాయా? కేంద్ర ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నాయా? అంటే ఈ విషయానికి సమాధానం నిర్వాహకులే చెప్పాలి. మరోవైపు ఐదుగురు యువకుల క్షేమంపై వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అప్పులు చేసి వారిని కాంబోడియాకు పంపామని, మరోసారి రూ.3 లక్షలు చెల్లించే స్థోమత లేదని వాపోతున్నారు. వీలైనంత త్వరగా వారిని క్షేమంగా ఇండియాకు తీసుకురావాలని వేడుకుంటున్నారు. ● నగరంలో ఇష్టానుసారంగా వెలుస్తున్న కన్సల్టెన్సీలు ● నిరుద్యోగులకు ఉపాధి ఆశచూపి విమానమెక్కిస్తున్న ఏజెంట్లు ● వెళ్లినవారిలో షాబాజ్‌ఖాన్‌ది దయనీయ గాధ ● పెళ్లైన వారానికే కంబోడియాకు ప్రయాణం ● తమవారి క్షేమంపై కుటుంబసభ్యుల ఆందోళన భారతీయ నిరుద్యోగులను విదేశాలకు పంపి ఉపాధి చూపించే కన్సెల్టెన్సీలు విధిగా పాటించాల్సిన నిబంధనలను కేంద్ర విదేశాంగశాఖ తన వెబ్సైట్లో స్పష్టంగా పేర్కొంది. 1. ఇమిగ్రేషన్ యాక్ట్ 1983 (సెక్షన్ 10) ప్రకారం.. ఎవరైతే భారతీయులకు విదేశాల్లో ఉపాధి కల్పన చేయాలనుకునే రిక్రూటింగ్ ఏజెన్సీలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసు కోవాలి. 2. ఐదు సంవత్సరాల కాలపరిమితితో కూడిన సర్టిఫికెట్ కోసం రూల్.నెం.7 ప్రకారం.. రూ.25 వేలు చెల్లించాలి. 3. ఈ దరఖాస్తు ఫారాలు emigrate.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. 4. ఈ క్రమంలో ప్రతీ రిక్రూట్మెంట్ ఏజెన్సీ గ్యారెంటీ కింద రూ.50 లక్షలు బ్యాంకులో జమచేయాలి. 5. రిక్రూటింగ్ ఏజెన్సీ నిర్వాహకుడి వ్యక్తిగత ప్రవర్తన, ఇతర విషయాల్లో పోలీసులు విచారణ జరిపి ఉండాలి. 6. అయితే.. చేతిలో రూ.నాలుగైదు లక్షలు ఉన్న ప్రతీవారు కన్సెల్టెన్సీలు, రిక్రూట్మెంట్ ఏజెన్సీ పెళ్లైన వారానికే విమానమెక్కిన కంబోడియాలో చిక్కుకున్న ఆరుగురిలో షాబాజ్‌ఖాన్‌ది అత్యంత దయనీయ పరిస్థితి. షాబాజ్‌కు ఇటీవలే వివాహం అయింది. తన మేనమామకు ఆరోగ్యం బాగాలేదని అతను ఉండగానే వివాహం చేసుకోవాలని.. పెద్దలు హడావిడిగా పెళ్లి చేశారు. ఆగస్టు 25 తేదీన రిసెప్షన్ జరిగింది. ఓ వైపు రిసెప్షన్ జరుగుతుండగానే.. షాబాజ్ మేనమామ మరణించారు. వారంతా ఈ బాధలో మునిగిపోయారు. వీసా వచ్చిందన్న సమాచారంతో వెంటనే నూతన వధువైన తన భార్య, కుటుంబ సభ్యులను వదిలి ఆగస్టు 31వ తేదీన కంబోడియా విమానమెక్కాల్సి వచ్చింది. తాను అక్కడ చైనా వారు చెప్పే సైబర్ నేరాలు చేయలేకపోతున్నానని.. వెంటనే ఇంటికి తీసుకువచ్చే ఏర్పాటు చేయాలని కుటుంబీకులకు ఫోన్లో విలపిస్తూ వేడుకుంటున్నాడు. మా సోదరుడిని కాపాడండి మా సోదరుడు షాబాజ్ ఖాన్‌కు వీసా ఇప్పిస్తానని మేనాజ్ అలీ నమ్మబలికాడు. కెసీనోలో మంచి జీతం (800 డాలర్లు) వస్తుందని, ప్రతిరోజూ టిప్పులు కూడా దొరుకుతాయని ఆశపెట్టాడు. అందుకే.. మేము రూ.2 లక్షలు ఖర్చు అయినా పంపేందుకు వెనకాడలేదు. షాబాజ్‌కు ఆగస్టులో నెలలో వివాహమైంది. వీసా రావడంతో రిసెప్షన్ అయిన నాలుగైదురోజుల అనంతరం విదేశాలకు పంపాం. తీరా అక్కడికెళ్లాక మావాడిని బందించారు. రూ.3 లక్షలు లేదా 3,000 డాలర్లు ఇవ్వాలంటున్నారు. – అఫ్జల్, షాబాజ్ సోదరుడు, మానకొండూరు మా తమ్ముడిని అమ్ముకున్నరు కంబోడియా వీసా సిద్ధంగా ఉందని ఏజెంట్లు మేనాజ్ అలీ, అబ్దుల్ రహీం మా తమ్ముడు నవీద్ అబ్దుల్‌కు చెప్పారు. అందరికీ చెప్పినట్లుగా కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగమని, రూ.2 లక్షలు సిద్ధం చేసుకోవాలన్నారు. ఎలాంటి సమస్య రాదని, అన్ని బాధ్యతలు తీసుకుంటామన్నారు. తీరా ఇప్పుడు మా తమ్ముడికి ఇబ్బందులు వస్తున్నాయంటే.. తనకేం సంబంధం లేదన్నట్లుగా మాట్లాడుతున్నాడు. రూ.3 లక్షలు చెల్లిస్తే తాను విడిపిస్తానని చెబుతున్నాడు. – అబ్దుల్ ముహీద్, నవీద్ సోదరుడు, సిరిసిల్ల ముందే అంతా వివరించా కంబోడియాకు వెళ్లిన ఆరుగురి యువకుల విషయంలో నా తప్పిదమేమీ లేదు. నేను వారికి ఉద్యోగం ఎలా ఉంటుంది? అన్న విషయం స్పష్టంగా వివరించాను. కెసెనీలో కంప్యూటర్ ఆపరేటర్ జాబ్ అని చెప్పాను. వారూ అంగీకరించే వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లాక.. వారు ఇలా ఎందుకు చెబుతున్నారో అర్థం కావడం లేదు. – మేనాజ్ అలీ, కన్సల్టెన్సీ నిర్వాహకుడు -
ఉద్యోగ నియామకాలు వేగవంతం చేయండి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు నియామక సంస్థలను ఆదేశించారు. దాదాపు 80 వేల ఉ ద్యోగ ఖాళీలను నోటి ఫై చేసిన ప్రభుత్వం ఇప్పటికే సగానికిపైగా కొలువులను భర్తీ చేసేందుకు అనుమతులు సైతం ఇచ్చిందన్నారు. ఈ ప్రక్రియ పూర్తయి నెలలు కావస్తున్నా కేవలం పోలీసు, ఇంజనీరింగ్ కొలువులకు సంబంధించిన నోటిఫికేషన్లు మాత్రమే వెలువడ్డాయంటూ, ఇతర ఉద్యోగాలకు సంబంధించి ప్రకటనలు ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం బీఆర్కేఆర్ భవన్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, నియామక సంస్థలైన టీఎస్పీఎస్సీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, గురుకుల నియామకాల బోర్డులతో పాటు నియామకాలకు సంబంధించిన శాఖలతో హరీశ్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. నోటిఫికేషన్ల జారీలో ఆలస్యమెందుకు? ఉద్యోగాల భర్తీపై ఆర్థిక శాఖ రూపొందించిన నోట్ ఆధారంగా మంత్రి సమీక్ష జరిపారు. ప్రభుత్వం అనుమతులు జారీ చేసిన ఉద్యోగాలు, వెలువడిన ప్రకటనలను నిశితంగా పరిశీలించారు. కొన్నిటికి అనుమతులు ఇచ్చినా ప్రకటనలు వెలువడకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నియామకాల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని భావించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిన విషయం గుర్తు చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా నియామకాల ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. గురుకుల ఉద్యోగాల సంఖ్య పెద్ద మొత్తంలో ఉందని చెబుతూ.. అన్ని రకాల అనుమతులు ఇచ్చినప్పటికీ జాప్యం జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రకాల అంశాలను పరిశీలించుకుని నోటిఫికేషన్లు ఇవ్వాలని, సమస్యలు ఎదురైతే ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చించాలని సూచించారు. సర్వీసు నిబంధనలు, నూతన జోనల్ విధానంలో సందేహాలుంటే ప్రభుత్వానికి నివేదిస్తే వేగంగా వివరణ వస్తుందని చెప్పారు. -
తెలంగాణలో 30,453 ప్రభుత్వ ఉద్యోగాలు.. శాఖల వారీగా పోస్టుల వివరాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్ల జారీకి సమయం ఆసన్నమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 30,453 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతులిచ్చింది. శాఖల వారీగా ఈ ఉద్యోగాలను ఏయే సంస్థలు భర్తీ చేస్తాయో స్పష్టం చేస్తూ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 80,039 ఉద్యోగాలను నేరుగా భర్తీ(డైరెక్ట్ రిక్రూట్మెంట్) చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ఈ నెల 10న అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు. వీటిని అత్యంత త్వరితంగా భర్తీ చేసి నిరుద్యోగుల ముఖాల్లో చిరునవ్వులు చూస్తానని ఆయన ఇచ్చిన హామీ కార్యరూపంలోకి వచ్చింది. ఉద్యోగ ఖాళీలను నోటిఫై చేసిన వెంటనే ప్రభుత్వ శాఖలు చర్యలు వేగవంతం చేస్తూ వచ్చాయి. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రులు హరీశ్, శ్రీనివాస్‌గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, ఇతరులతో పాటు సీఎస్ సోమేశ్‌కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆయా శాఖల అధికారులతో పలు ధపాలుగా చర్చించారు. 80,039 ఉద్యోగాలకుగాను తొలి విడతగా 30,453 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు అనుమతులిస్తూ బుధవారం జీవోలు జారీ చేసింది. ఇతర ఖాళీలపైనా త్వరలోనే హరీశ్, ఆయా శాఖల మంత్రులు సమీక్షలు నిర్వహించ నున్నారు. వీలైనంత వేగంగా వీటికి అనుమతులు జారీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. తొలిసారిగా గ్రూప్–1...: ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి అనుమతులు రావడం, అందులోనూ పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయనుం డటంతో నిరుద్యోగుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.రాష్ట్ర ప్రభుత్వం తాజాగా భర్తీకి అనుమతిచ్చిన వాటిలో అత్యధికంగా పోలీస్ ఉద్యోగాలే ఉన్నాయి. పోలీస్ విభాగానికి సంబంధించి నాలుగు కేటగిరీల్లో 17,003 ఉద్యోగాలు, వైద్య, ఆరోగ్య శాఖలో మూడు కేటగిరీల్లో 12,735 ఉద్యోగాలు, రవాణా శాఖలో 212 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రోస్టర్ ఫిక్స్ అయ్యాక..: వివిధ ప్రభుత్వ శాఖల్లో 30,453 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతివ్వడం, నియామక సంస్థలను కూడా ఖరారు చేయడంతో ఉద్యోగ నోటిఫికేషన్లకు మార్గం సుగమమైంది. ఆర్థిక శాఖ అనుమతిచ్చిన మేరకు ఆయా శాఖలు ఉద్యోగాల వారీగా రోస్టర్‌ను ఖరారు చేయాల్సి ఉంటుంది. రోస్టర్ ప్రకారం ఉద్యోగాల ఇండెంట్లు నియామక సంస్థలకు సమర్పించిన తర్వాత ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. టీఎస్పీఎస్సీ ద్వారా గ్రూప్ –1 పోస్టులు జిల్లా బీసీ అభివద్ధి అధికారి–2 అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్–40 అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్–38 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(వైద్యారోగ్యశాఖ)–20 డీఎస్పీ– 91 జైల్స్ డిప్యూటీ సూపరిండెంట్–2 అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్–8 డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్–2 జిల్లా మైనారీటీ వెల్ఫేర్ ఆఫీసర్–6 మునిసిపల్ కమిషనర్ గ్రేడ్–2(35) ఎంపీడీవో(121) డీపీవో(5) కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్(48) డిప్యూటీ కలెక్టర్(42) అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్(26) జిల్లా రిజిస్ట్రార్(5) జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్(3) ఆర్టీవో(4) జిల్లా గిరిజన సంక్షేమాధికారి(2) మొత్తం 503 జైళ్ల శాఖ: డిప్యూటీ జైలర్ (8), వార్డర్ (136), వార్డర్ ఉమెన్ (10) మొత్తం 154 పోలీసు శాఖ: కానిస్టేబుల్ సివిల్ (4965), ఆర్మడ్ రిజర్వ్(4423), టీఎస్ఎస్పీ(5704), కానిస్టేబుల్ ఐటీ అండ్ సీ(262), డ్రైవర్లు పిటీవో(100), మెకానిక్ పీటీవో(21), సీపీఎల్(100), సబ్ ఇన్స్పెక్టర్ సివిల్(415), ఎస్ఐ ఏఆర్(69), ఎస్ఐ టీఎస్ఎస్పీ(23), ఎస్ఐ ఐటీ అండ్ సీ(23), ఎస్ఐ పీటీవో(3), ఎస్ఐ ఎస్ఏఅర్ సీపీఎల్(5) ఏఎస్ఐ(ఎఫ్‌బీబీ–8), సైంటిఫిక్ ఆఫీసర్(ఎఫ్ఎస్ఎల్–14), సైంటిఫిక్ అసిస్టెంట్(ఎఫ్ఎస్ఎల్–32), ల్యాబ్‌టెక్నిషీయన్ (ఎఫ్ఎస్ఎల్–17), ల్యాబ్ అటెండెంట్(1), ఎస్పీఎఫ్ కానిస్టేబుల్స్(390), ఎస్ఐ ఎస్పీఎఫ్(12) మొత్తం: 16,587 డీజీపీ ఆఫీస్: హెచ్ఓ (59), జూనియర్ అసిస్టెంట్ ఎల్సీ(125), జూనియర్ అసిస్టెంట్ టీఎస్ఎస్పీ(43), సీనియర్ రిపోర్టర్(ఇంటెలిజెన్స్–2), డీజీ ఎస్పీఎఫ్ (2) మొత్తం: 231 రవాణా శాఖ: అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్సెక్టర్స్(113), జూనియర్ అసిస్టెంట్ హెడ్ ఆఫీస్(10), జూనియర్ అసిస్టెంట్ ఎల్సీ(26), మొత్తం: 149 వైద్యారోగ్య శాఖ: మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమెల్(1520), వైద్య విద్య హెచ్ఓడీ: అసిస్టెంట్ ప్రొఫెసర్ (1183), స్టాఫ్ నర్స్ 3823, ట్యూటర్ 357, డైరెక్టర్ పబ్లిక్ హెల్త్: సివిల్ అసిస్టెంట్ సర్జన్ (751), ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ హెచ్ఓడీ : సివిల్ అసిస్టెంట్ సర్జన్ (7) ఎంఎస్‌జె క్యాన్సర్ ఆసుపత్రి: స్టాఫ్ నర్స్(81) తెలంగాణ వైద్య విధాన పరిషత్: సివిల్ అసిస్టెంట్ సర్జన్ (211), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్(బయోకెమిస్ట్రి– 8), సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఈఎన్టీ(33), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టు ఫోరెన్సిక్ మెడిసిన్ (48), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ జనరల్ మెడిసిన్ (120), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ జనరల్ సర్జరీ(126), సి విల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ గైనకాలజీ (147), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ (24), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ మైక్రోబయోలజీ(8), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ ఆప్తామాలజీ(8), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ ఆరోథపెడిక్స్(53), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పీడియాట్రిక్స్(142), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ సైక్రియాట్రి(37), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ రేడియోలజీ(42), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ అనస్తీషియా(152), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ డెర్మటాలజీ(9), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పాథలోజీ(78), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పల్మనరీ మెడిసిన్ (38), మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమెల్/ఎఎన్ఎం(265), స్టాఫ్ నర్స్(757) మొత్తం: 10,028 ఆయుష్ విభాగం హెచ్ఓడీ: ఆక్సిలరీ నర్స్ మిడ్–వైఫ్(ఎ ఎన్ఎమ్–26), జూనియర్ అసిస్టెంట్ లోకల్(14), జూనియర్ అసిస్టెంట్ స్టేట్(3), ల్యాబ్ అసిస్టెంట్(18), ల్యాబ్ టెక్నీషీయన్ (26), లెక్చరర్ ఆయుర్వేద(29), లెక్చరర్ హోమియో(4), లెక్చరర్ యునాని(12), లైబ్రెరీయన్ (4), మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేద(54), మెడికల్ ఆఫీసర్ హోమియో(33), మెడికల్ ఆఫీసర్ యునానీ(88), ఫార్మాస్యూటికల్ కెమిస్ట్(9), ఫార్మాసిస్ట్ ఆయుర్వేద(136), ఫార్మాసిస్ట్ హోమియో(54), ఫార్మాసిస్ట్ యునానీ(118), స్టాఫ్ నర్స్(61) మొత్తం: 689 డీఎంఈ హెచ్ఓడీ: అనస్తీషీయా టెక్నినీషియన్ (93), ఆడియో వీడియో టెక్నినీషియన్ (32), ఆడియో మెట్రీ టెక్నినీషియన్ (18), బయోమెడికల్ ఇంజనీర్(14), బయోమెడికల్ టెక్నీషీయన్ (11), కార్డియోలజీ టెక్నిషీయపన్ (12), సీటీ స్కాన్ టెక్నీషీయరన్ (6), డార్క్ రూమ్ అసిస్టెంట్(36), డెంటల్ హైజెనీస్ట్(3), డెంటల్ టెక్నీషీయన్ (53), ఈసీజీ టెక్నిషీయన్ (4), ఈఈజీ టెక్నీషీయన్ (5), జూనియర్ అసిస్టెంట్ లోకల్(172), ల్యాబ్ టెక్నీషీయన్ గ్రేడ్02(356), ఫార్మాసిస్ట్ గ్రేడ్–2(161), ఫీజియోథెరెపిస్ట్(33), రేడియోగ్రాఫర్(55), రేడియోగ్రఫీ టెక్నీషియన్ (19), ఆప్టోమెటరిస్ట్(20), స్టెరిలైజేషన్ టెక్నీషీయన్ (15) మొత్తం: 1118 డైరెక్టర్ పబ్లిక్ హెల్త్: అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్(2), డార్క్‌రూమ్ అసిస్టెంట్(30), జూనియర్ అసిస్టెంట్ లోకల్(42), జూనియర్ అసిస్టెంట్ స్టేట్(4), ల్యాబ్ టెక్నీషీయన్ గ్రేడ్–2(119), ఫార్మాసిస్ట్ గ్రేడ్02(160) మొత్తం: 357 డ్రగ్స్ కంట్రోలర్: డ్రగ్స్ ఇన్స్పెక్టర్(18), జూనియర్ అనాలిస్ట్(9), జూనియర్ అసిస్టెంట్ లోకల్94), జూనియర్ అసిస్టెంట్ స్టేట్ట్(2) మొత్తం: 33 ఐపీఎమ్(హెచ్ఓడీ): ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (24), జూనియర్ అనలిస్ట్ స్టేట్(9), జూనియర్ అనలిస్ట్ జోనల్(2), జూనియర్ అసిస్టెంట్ స్టేట్(1), జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ లోకల్(5), లాబోరేటరీ అటెండెంట్ స్టేట్ క్యాడర్(6), లాబోరేటరీ టెక్నీషీయన్ గ్రేడ్ –2 స్టేట్ క్యాడర్(6), శాంపిల్ టేకర్ లోకల్ క్యాడర్(3) మొత్తం: 56 ఎమ్ఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి: అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ అనస్తీషియా 1, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ గైనిక్ ఆంకాలజీ–2, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ పెయిన్ అండ్ పల్లియేటివ్ కేర్–2, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ రేడియో థెరపీ–3, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ సర్జికల్ అంకాలజీ–3, బయోమెడికల్ ఇంజనీర్–1, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పాథాలోజీ–1, సివిల్ అసిస్టెంట్ సర్జన్ అనస్తీషీయా–1, డెంటల్ టెక్నిషీయన్ –1, ఈసీజీ టెక్నీషీయన్ –2, జూనియర్ అసిస్టెంట్ స్టేట్–5, ల్యాబ్ అసిస్టెంట్–8, ల్యాబ్ టెక్నీషీయన్ గ్రేడ్–2(5), లెక్చరర్ ఇన్ న్యూక్లియర్ మెడిసిన్ –1, మెడికల్ ఫిజిసిస్ట్–5, మెడికల్ రికార్డ్ టెక్నీషీయన్ –3, ఫార్మాసిస్ట్ గ్రేడ్–2(2), రేడియో గ్రాఫర్(సీటీ టెక్నీషీయన్ –2), రేడియోగ్రాఫర్ మమోగ్రఫీ–1, రేడియోగ్రాఫర్ ఎంఆర్ఐ టెక్నీషీయన్ –2, రేడియో గ్రాఫర్ ఆర్టీ టెక్నీషీయన్ –5, రేడియోగ్రాఫర్స్–6, సోషల్ వర్కర్–6, మొత్తం: 68 నిమ్స్: జూనియర్ అసిస్టెంట్ స్టేట్–20, టీఎస్ఎంఎస్ఐడీసీ: ఏఈఈ/ఏఈ(11), జూనియర్ అసిస్టెంట్ స్టేట్–1, జూనియర్ టెక్నీకల్ ఆఫీసర్–1, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్–1, మొత్తం: 13 వైద్య విధాన పరిషత్: డెంటల్ అసిస్టెంట్ సర్జన్ (36), జూనియర్ అసిస్టెంట్ లోకల్(63), ల్యాబ్ టెక్నీషీయన్ (47), ఫార్మాసిస్ట్ గ్రేడ్–2(119), రేడియోగ్రాఫర్(36) మొత్తం: 301 కాలోజీ యూనివర్సీటీ: అసిస్టెంట్ ఇంజనీర్/సెక్షన్ ఆఫీసర్–1, అసిస్టెంట్ లైబ్రేరియన్ –2, జూనియర్ అసిస్టెంట్ స్టేట్–1, లైబ్రేరియన్ –1, ప్రోగ్రామర్–1, సీనియర్ సిస్టమ్ అనలిస్ట్–1 మొత్తం: 7 మొత్తం: 2662 ఉద్యోగాల భర్తీలో కొత్త రోస్టర్ నూతన జోనల్ విధానంతో మారిన రోస్టర్ పట్టిక క్రమసంఖ్య ఒకటి నుంచి మొదలు కానున్న నియామకాల ప్రక్రియ బ్యాక్లాగ్ పోస్టులు కొత్త జిల్లాలకు సమాన ప్రాతిపదికన కేటాయింపు ఉద్యోగ నియామకాలపై సాధారణ పరిపాలన విభాగం ఉత్తర్వులు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించి కీలక అడుగు పడింది. మొత్తంగా 80 వేల ఉద్యోగాలను నేరుగా భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అసెంబ్లీ వేదికగా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఇప్పటికే శాఖల వారీగా ఉద్యోగ ఖాళీలను నోటిఫై చేసింది. అయితే ఈ నియామకాలను ఏవిధంగా చేపడతారనే సందిగ్ధానికి రాష్ట్ర సాధారణ పరిపాలన విభాగం స్పష్టతనిచ్చింది. రాష్ట్రంలో ఆగస్టు–2018 నుంచి నూతన జోనల్ విధానం అమల్లోకి వచ్చింది. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. కానీ అప్పటినుంచి కొత్తగా ఉద్యోగ నియామకాలేవీ జరగలేదు. తాజాగా ముఖ్యమంత్రి ప్రకటన నేపథ్యంలో ఉద్యోగఖాళీల భర్తీపై ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా కొత్త ఉద్యోగ నియామకాలకు నూతన రోస్టర్ ప్రాతిపదిక కానున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 19వ తేదీతో ఈ ఉత్తర్వులు జారీ అయినప్పటికీ, ప్రభుత్వం వీటిని బుధవారం విడుదల చేసింది. రోస్టర్దే కీలక పాత్ర.. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి రిజర్వేషన్ల అమలులో రోస్టర్దే (రిజర్వేషన్ల క్రమ పట్టిక) కీలక పాత్ర. అన్ని వర్గాలకు న్యాయం చేయాలనే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం రోస్టర్ పాయింట్లతో పట్టికను తయారు చేసింది. ఇందులో క్రమ సంఖ్య ఒకటి నుంచి వంద వరకు ప్రాధాన్యత క్రమంలో రిజర్వేషన్ల కూర్పు చేసి ఉంచింది. జనరల్, జనరల్ ఉమెన్, ఎస్సీ, ఎస్టీ ఉమెన్, ఎస్టీ, ఎస్టీ ఉమెన్, బీసీ, బీసీ ఉమెన్, డిజేబుల్, డిజేబుల్ ఉమెన్ కేటగిరీలను ఒక్కో క్రమ సంఖ్య వద్ద ఫిక్స్ చేశారు. తాజాగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు సైతం అమల్లోకి రానుండడంతో ఈడబ్ల్యూఎస్ జనరల్, ఈడబ్ల్యూఎస్ ఉమెన్ రిజర్వేషన్లను రోస్టర్ పాయింట్ల వద్ద ఫిక్స్ చేస్తారు. సాధారణంగా ఒక నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ ఖాళీల భర్తీ చేపడితే.. ఖాళీల భర్తీ పూర్తయ్యే నాటికి ఉన్న రోస్టర్‌ను తదుపరి నోటిఫికేషన్‌కు కొనసాగింపుగా భావిస్తారు. కానీ రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి రావడంతో రోస్టర్ కొనసాగింపునకు బదులుగా.. రోస్టర్ పాయింట్లను ఒకటో క్రమ సంఖ్య నుంచి కొనసాగించాలని సాధారణ పరిపాలన శాఖ తాజాగా స్పష్టం చేసింది. సమంగా క్యారీ ఫార్వర్డ్ ఉద్యోగ ఖాళీలు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల కేటాయింపులు పూర్తయిన తర్వాత మిగులు ఖాళీ ఉద్యోగాలను జనాభా ప్రాతిపదికన సమానంగా నూతన జిల్లాలకు కేటాయించారు. ఈ క్రమంలో రిజర్వేషన్లను సైతం సమ ప్రాతిపదికను అవలంభిస్తూ కేటాయింపులు జరిపారు. ఇక కొన్నిచోట్ల బ్యాక్లాగ్ ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టకపోవడంతో వాటిని క్యారీ ఫార్వర్డ్ కేటగిరీలోకి మార్చారు. తాజాగా ఈ ఉద్యోగాలను కూడా నూతన జిల్లా యూనిట్ల ప్రకారం పంపిణీ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల్లో కూడా రోస్టర్‌ను పాటించాలి. ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతులు కల్పించే విషయంలో రోస్టర్ పాయింట్లకు విఘాతం కలగకుండా శాఖాపరంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ఈ బాధ్యతల్ని పూర్తిగా నెరవేర్చాలని జీఏడీ స్పష్టం చేసింది. -
నిరుద్యోగులకు శుభవార్త.. 30,453 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. 30 వేల 453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం శాఖల వారీగా ఉద్యోగ నియామకాలకు అనుమతిస్తూ జీవోలు విడుదల చేసింది. శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ 80,039 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. దీనిపై ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, ఆర్థిక శాఖ అధికారులు సమీక్షించి వీలైనంత ఉద్యోగాలకు అనమతులు ఇవ్వాలని సీఎం శాసనసభలోనే చెప్పడం జరిగింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక మంత్రి హరీశ్ రావు, ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇతర మంత్రులతో పాటు సీఎస్ సోమేష్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆయా శాఖల అధికారులతో పలు ధపాలుగా చర్చించారు. 80,039 ఉద్యోగాలకుగాను, తొలి విడతగా 30,453 ఉద్యోగాలకు ఇవాళ(బుధవారం) ఆర్థిక శాఖ పచ్చా జెండా ఊపింది. ఈ మేరకు అనుమతులిస్తూ జీవోలు జారీ చేసింది. ఇతర శాఖల్లోని ఖాళీలపై త్వరలోనే ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, ఆయా శాఖల మంత్రులు, ఆయా శాఖ అధికారులు, ఆర్థిక శాఖ అధికాలుతో చర్చించి మిగతా ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రవ్యాప్త నిరసనలకు సీఎం కేసీఆర్ పిలుపు రేపు(గురువారం) రాష్ట వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని టీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ పిలునిచ్చారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రదర్శనలు చేపట్టాలని పేర్కొన్నారు. -
ఉద్యోగాల ప్రకటనతో కాంగ్రెస్, బీజేపీల్లో వణుకు పుడుతోంది: హరీష్ రావు
అప్డేట్స్: ►సీఎం కేసీర్ చేసిన ఉద్యోగాల ప్రకటనతో కాంగ్రెస్, బీజేపీల్లో వణుకు పడుతోందని ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ నేతలు అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. 60 ఏళ్లలో కాంగ్రెస్ చేయలేనిది కేసీఆర్ చేసి చూపించారని, తెలంగాణలోని పల్లెలు అత్యద్భుతంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో గ్రామ స్వరాజ్యం సాకారం అయ్యిందన్నారు. కాంగ్రెస్ హయాలంలో ఒక్క గ్రామమైనా అభివృద్ధి చెందిందా అని హరీష్ రావు ప్రశ్నించారు. ప్రభుత్వంపై విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలన్నారు. గ్రామాభివృద్ధిపై చర్చకు కాంగ్రెస్ నేతలు సిద్ధమా అని ప్రశ్నించారు. ►బడ్జెట్ ప్రకటనలకే పరిమితం అవుతోందని కాంగ్రెస్ శాసనసభా పక్షనేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలు, ఆశలు తీర్చేలా అమలు జరగడం లేదని మండిపడ్డారు. ప్రతీ ఏడాది బడ్జెట్పెంచుకుంటూ పోతున్నారని, అమలు విషయంలో మాత్రం కోతలు పెడుతూ వస్తున్నారని విమర్శించారు. పెరిగిన ధరలను బట్టి డబుల్ బెడ్రూం ఇళ్లకు రూ. 8 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే 8 ఏళ్లలో గజం స్థలం కూడా పేదలకు ఇవ్వలేదని, పేదలు ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. కార్పొరేట్ బడ్జెట్ కాదన్నారు.. బడ్జెట్ ద్వారా పేదలకు ఏం దక్కిందని ప్రశ్నించారు. మల్టీజోన్ వారీగా మొత్తం ఖాళీలు: 13, 170 ► మల్టీ జోన్-1: 6,800 ► మల్టీ జోన్-2: 6,370 ఉద్యోగ అభ్యర్థుల వయోపరిమితి వివరాలు: ► ఉద్యోగ అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి పెంచిన ప్రభుత్వం ► ఓసీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లు ► ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల వయోపరిమితి 49 ఏళ్లు ► దివ్యాంగ అభ్యర్థుల వయోపరిమితి 54 ఏళ్లు ► ఎక్స్ సర్వీస్మెన్లకు వయోపరిమితి 47 ఏళ్లు ► హోంశాఖలో వయోపరిమితి మినహాయింపు లేదు జోన్ల వారీగా ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీలు (18,866) జోన్-1 కాళేశ్వరం: ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు. - 1,630 జోన్-2 బాసర: ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల. - 2,328 జోన్-3 రాజన్న-సిరిసిల్ల: కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి. - 2,403 జోన్-4 భద్రాద్రి: కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ. - 2,858 జోన్-5 యాదాద్రి: సూర్యాపేట, నల్లగొండ, భువనగిరి, జనగామ. - 2,160 జోన్-6 చార్మినార్: మేడ్చల్-మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్. - 5,297 జోన్-7 జోగులాంబ: మహబూబ్‌నగర్, నారాయణపేట, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూలు. - 2,190 ► వైద్య ఆరోగ్య శాఖ- 12,755, బీసీ సంక్షేమ శాఖ- 4,311 ► నీటిపారుదల శాఖ-3,692, ఎస్సీ సంక్షేమ శాఖ-2,879 ► ట్రైబల్ వెల్ఫేర్-2,399 పోస్టుల భర్తీ ► రాష్ట్ర ప్రభుత్వంపై రూ. 7వేల కోట్ల అదనపు భారం పడనుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ► ఉన్నత విద్యాశాఖ -7,878, రెవిన్యూ శాఖ-3,560 ► పోలీసు శాఖలో 18,344 పోస్టుల భర్తీ ► విద్యాశాఖలో 13,086 పోస్టుల భర్తీ ► అన్ని పోస్టుల్లో స్థానికులకు 95 శాతం రిజర్వేషన్ ► అటెండర్ నుంచి ఆర్డీవో పోస్టు వరకు స్థానికులకే వర్తింపు ► 5 శాతం ఓపెన్ కోటలో పోటీ పడొచ్చు: సీఎం కేసీఆర్ ► 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల రైగ్యులరైజ్: సీఎం కేసీఆర్ ►విద్యాశాఖలో 25 నుంచి 30వేల వరకు పోస్టులు తెలంగాణలో ఉద్యోగ ఖాళీలు 91,142 ► తెలంగాణలో ఉద్యోగ ఖాళీలు 91,142 ఉన్నాయని.. వాటికి నేటి నుంచి నోటిఫికేషన్లు వస్తాయని సీఎం కేసీఆర్ తెలిపారు. ► జోనల్ స్థాయిలో 18,866 ఉద్యోగాల ఖాళీలు, మల్టీజోన్ స్థాయిలో 13,170 ఉద్యోగాల ఖాళీలు, ఇతర కేటగిరీ, వర్సిటీల్లో 8174 ఉద్యోగాల ఖాళీలు నోటిఫైచేశామని చెప్పారు. తెలంగాణలో గుర్తించిన ఖాళీలు 80,039 అని కేసీఆర్ తెలిపారు. ఇప్పటి వరకు లక్షా 30వేల పోస్టులు భర్తీ చేశామని తెలిపారు. ► గ్రూప్-1పోస్టులు 503, గ్రూప్-2 పోస్టులు 582, గ్రూప్-3 పోస్టులు 1373, గ్రూప్-4 పోస్టులు 9168, జిల్లా స్థాయిలో 39829 ఉద్యోగాల ఖాళీలు, లక్ష 56 వేల ఉద్యోగాలు నోటిఫై చేశామని సీఎం కేసీఆర్ తెలిపారు. ► తెలంగాణ ఏర్పాటు చరిత్రలో ప్రత్యేక ఘట్టమని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. రాజకీయాలంటే వేరే పార్టీలకు గేమ్.. టీఆర్ఎస్కు ఒక టాస్క్ అని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఉద్యమం చేపట్టామని చెప్పారు. ► తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ కోసం విద్యార్థులు ఉద్యమం చేశారని తెలిపారు. ఉద్యమ సమయంలో తాను పోలీసు లాఠీ దెబ్బలు తిన్నానని చెప్పారు. ► రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సీఎం కేసీఆర్ ప్రసంగిస్తున్నారు. ► ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అసెంబ్లీకి చేరుకున్నారు. కాసేపట్లో అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేయనున్నారు. అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగులకు శుభవార్త వినిపిస్తానన్నారు. లక్ష ఉద్యోగాలకు పైగా ఖాళీల భర్తీ ప్రకటించే అవకాశం ఉంది. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ 2022–23 రెండోరోజు సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ నెల 7న అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత.. స్పీకర్ సభను బుధవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. మంగళవారం సమావేశాలకు విరామం ప్రకటించారు. కాగా బుధవారం ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే సీఎం కె.చంద్రశేఖర్‌రావు కీలక ప్రకటన చేస్తారు. అనంతరం ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ చేపట్టకుండానే నేరుగా బడ్జెట్‌పై సాధారణ చర్చ ప్రారంభం అవుతుంది. ఇలావుండగా బిజినెస్ అడ్వైజరీ కమిటీలో తీసుకున్న నిర్ణయాలను సోమవారం సభకు సమర్పిస్తారు. -
సీఎం కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు..? కీలక ప్రకటనపై ఉత్కంఠ..
సాక్షి, హైదారబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్ర బడ్జెట్ 2022-2023 రెండోరోజు సమావేశాల్లో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేయనున్నారు. జాబ్ క్యాలెండర్‌ను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేస్తానని సీఎం కేసీఆర్ మంగళవారం వనపర్తి జిల్లా పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పేర్కొన్న విషయం తెలిసిందే. వేతన సవరణ సంఘం నివేదిక ప్రకారం 1,92,800 ఉద్యోగాల ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గడిచిన మూడేళ్ల కాలంలో ఎలాంటి నోటిఫికేషన్లు జారీ కాలేదు. కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం పోస్టుల పునర్విభజన పూర్తైన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 85 వేల వరకు ఖాళీలను గుర్తించినట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. చదవండి: ఇప్పటికే 1.32 లక్షల కొలువులు భర్తీ చేశామన్న సర్కారు -
బీఈ/బీటెక్ 60 శాతం మార్కులతో పాసయ్యారా? ఈ జాబ్‌కు అప్లై చేశారా?
ఇండియన్ నేవీలో 155 ఎస్ఎస్సీ ఆఫీసర్ పోస్టులు ఇండియన్ నేవీ 2023 జనవరి(ఎస్టీ 23) కోర్సు.. వివిధ విభాగాల్లో షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ల భర్తీకి అవివాహితులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. » మొత్తం పోస్టుల సంఖ్య: 155 » బ్రాంచ్‌ల వారీగా ఖాళీలు: ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్–93, ఎడ్యుకేషన్ బ్రాంచ్ (ఎడ్యుకేషన్)–17, టెక్నికల్ బ్రాంచ్–45. » ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్: విభాగాలు:జనరల్ సర్వీస్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, అబ్జర్వర్, పైలట్, లాజిస్టిక్స్. అర్హత: కనీసం 60శాతం మార్కులతో ఏదైనా విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత టెక్నికల్ నైపుణ్యాలు ఉండాలి. » ఎడ్యుకేషన్ బ్రాంచ్(ఎడ్యుకేషన్): అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎంఏ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి. » టెక్నికల్ బ్రాంచ్: విభాగాలు: ఇంజనీరింగ్ బ్రాంచ్(జనరల్ సర్వీస్), ఎలక్ట్రికల్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్). అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. » వయసు: 02.01.1998 నుంచి 01.07.2003 మధ్య జన్మించి ఉండాలి. » ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఎస్ఎస్బీ ఇంటర్వ్యూలు, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. » దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. » ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 12.03.2022 » వెబ్సైట్: joinindiannavy.gov.in -
ప్రజా ఆగ్రహం డైవర్ట్ చేయడానికే కేసీఆర్ పర్యటనలు: ఈటల
సాక్షి, కరీంనగర్: ఉద్యోగ నియామకాలపై తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని బీజేపీ ఎమ్మెలే ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఈయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో 3,00,178 మంది ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారని, లక్షకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అన్నారు. నోటిఫికేషన్లు లేక ఉద్యోగాలు లేక పెళ్లిళ్లు కాకపోవడంతో యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో 1,32,299 ఉద్యోగాలు ఇచ్చినట్లు కేటీఆర్ ప్రకటించారని, టీఎస్పీఎస్సీ ద్వారా 31 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని మండిపడ్డారు. టీఎస్ఆర్టీసీలో 4768 మందిని రిక్రూట్ చేశామని చెప్పారని, ఒక్క డ్రైవర్, కండక్టర్ని కూడా ఫిలప్ చేయలేదన్నారు. ఒక్క గ్రూప్ వన్ పరీక్ష కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించలేదని ధ్వజమెత్తారు. గెస్ట్ ఫ్యాకల్టీ పేరుతో గురుకులాల్లో బోధన చేయిస్తున్నారని, శ్రమ దోపిడీ ప్రభుత్వమే చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ మోసలని నమ్మె పరిస్థితి లేదని, ప్రతిపక్ష పార్టీలను సీఎం కేసీఆర్ ఏనాడు పరిగణలోకి తీసుకోలేదు విమర్శించారు. జిల్లాలు, డివిజన్లు, మండలాలు పెంచారని, సిబ్బందిని మాత్రం ఆ స్థాయిలో పెంచలేదన్నారు. తెలంగాణ ప్రజా ఆగ్రహం డైవర్ట్ చేయడానికే కేసీఆర్ పర్యటనలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీల కూటమి ముందట పడదని అన్నారు. మేడారం జాతరకు గవర్నర్ వెళ్తే.. కనీసం రిసీవ్ చేసుకోలేదని, ఇది తెలంగాణ ప్రభుత్వ సంస్కారమని ఎద్దేవా చేశారు. -
ఫ్రెషర్లకు గుడ్‌న్యూస్ ! ఈ కార్పోరేట్ కంపెనీలో 45,000 ఉద్యోగాలు.. ఎప్పుడంటే?
న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ కంపెనీ, అమెరికా కేంద్రంగా పనిచేసే కాగ్నిజంట్ సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో మెరుగైన పనితీరు చూపించింది. సంస్థ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 56 శాతం పెరిగి 544 మిలియన్ డాలర్లు (రూ.4,080 కోట్లు)గా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో (2020 సెప్టెంబర్ త్రైమాసికం) నికర లాభం 348 మిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. కంపెనీ ఆదాయం 12 శాతం పెరిగి 4.7 బిలియన్ డాలర్లుగా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం 4.2 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. రూ.4.69–4.74 బిలియన్ డాలర్ల మధ్య ఆదాయం ఉండొచ్చన్న గత అంచనాలకు అనుగుణంగానే సంస్థ పనితీరు ఉంది. ఫ్రెషర్లకు గుడ్‌న్యూస్: అక్టోబర్–డిసెంబర్ కాలంలో భారత్‌లో కొత్తగా 45,000 మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు కాగ్నిజంట్ ప్రకటించింది. నిపుణులకు డిమాండ్– సరఫరా మధ్య అంతరం చాలా ఎక్కువగా ఉన్నట్టు పేర్కొంది. వార్షికంగా చూస్తే స్వచ్చంద అట్రిషన్ (ఉద్యోగి స్వయంగా సంస్థను వీడడం) రేటు 33 శాతానికి పెరిగినట్టు తెలిపింది. ఈ సంస్థ జనవరి–డిసెంబర్‌ను వార్షిక సంవత్సరంగా పరిగణిస్తుంటుంది. భారత్‌లో కాగ్నిజంట్‌కు 2 లక్షల మంది ఉద్యోగులున్నారు. సెప్టెంబర్ త్రైమాసికంలో డిజిటల్ విభాగం ఆదాయం 18 శాతం వృద్ధిని చూపించినట్టు సీఈవో హంఫైర్స్ తెలిపారు. క్యూ4లో 4.75 డాలర్ల స్థాయిలో.. నాలుగో త్రైమాసికంలో (2021 అక్టోబర్–డిసెంబర్) ఆదాయం 4.75–4.79 బిలియన్ డాలర్ల మేర ఉండొచ్చన్న అంచనాను కాగ్నిజంట్ ఫలితాల సందర్భంగా వ్యక్తం చేసింది. ఇది వార్షికంగా చూస్తే 13.5–14.5 శాతం వృద్ధికి సమానమని వివరించింది. 2021 పూర్తి సంవత్సరానికి ఆదాయం 11 శాతం మేర వృద్ధి చెంది 18.5 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని ప్రకటించింది. సంస్థ ఉద్యోగుల సంఖ్య 3,01,300 నుంచి 3,18,400కు పెరిగింది. -
Andhra Pradesh: భారీ రిక్రూట్మెంట్.. కొలువుల జాతర
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ గ్రామ స్థాయిలో వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ నుంచి మండల స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు జిల్లా, ఏరియా, బోధనాస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో భారీ రిక్రూట్మెంట్కు ఆమోదం తెలిపారు. ఒకేసారి ఏకంగా 11,775 వైద్య పోస్టుల భర్తీకి సీఎం అంగీకారం తెలిపారు. పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆమోదం తెలిపిన ఆర్థిక శాఖ నేడో రేపో ఉత్తర్వులు జారీ చేయనుందని, ఆ వెంటనే నోటిఫికేషన్ ఇస్తామని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ వెల్లడించారు. మరోవైపు వీటికి అదనంగా కొత్త పీహెచ్‌సీల నిర్మాణం కొనసాగుతున్నందున మరో 3,176 పోస్టులను కూడా తరువాత భర్తీ చేయనున్నట్లు వివరించారు. గత సర్కారు ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోగా రద్దు చేసి ఔట్‌సోర్సింగ్‌కు అవకాశం కల్పించింది. ఇందుకు భిన్నంగా ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలందించేందుకు డాక్టర్లతో పాటు నర్సులు, పారామెడికల్ సిబ్బంది సహా ఇతర ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించారు. ఏటా వేతనాలకు అదనంగా రూ.726.34 కోట్లు ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికి ఏటా వేతనాల రూపంలో రూ.2,753.79 కోట్లు చెల్లిస్తుండగా కొత్తగా భర్తీ చేసే పోస్టులకు ఏటా అదనంగా రూ.726.34 కోట్ల వ్యయం కానుందని అధికారులు అంచనా వేశారు. వైద్య శాఖలో అతి పెద్ద భర్తీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో పోస్టుల భర్తీకి సంబంధించి ఇది అతి పెద్ద ప్రక్రియ కావడం విశేషం. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు కోవిడ్ సమయంలో మెరుగైన వైద్య సేవలందించేందుకు గతంలోనే 9,700 రెగ్యులర్ పోస్టులను భర్తీ చేశారు. ఇప్పుడు అంతకు మించి పోస్టుల భర్తీ చేపడుతున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలకు ఒకరు చొప్పున దాదాపు 15,000 మంది ఏఎన్ఎంలు, 7 వేల మందికిపైగా మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ల సేవలు అందుబాటులోకి వచ్చేలా ప్రభుత్వం గతంలోనే చర్యలు చేపట్టింది. గతంలో మండల స్థాయిలో పీహెచ్‌సీల్లో ఏఎన్ఎంలు సేవలు అందిస్తుండగా వాటిని గ్రామాలకు విస్తరించారు. సచివాలయాల వ్యవస్థ ప్రవేశపెట్టిన తరువాత గ్రామ, వార్డు సచివాలయాలకు ఒకరు చొప్పున ఏఎన్ఎంల సేవలు అందుబాటులోకి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గ్రామీణ వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రతి వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లోనూ బీఎస్సీ నర్సింగ్ అర్హతతో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్‌ను ప్రభుత్వం నియమిస్తోంది. హెల్త్ అసిస్టెంట్‌తో పాటు ఆశా వర్కర్లు కూడా క్లినిక్‌లో సేవలందిస్తారు. క్లినిక్‌లో నిరంతరం ఏఎన్ఎంలు అందుబాటులో ఉంటూ 12 రకాల వైద్య సేవలు అందిస్తారు. 14 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. 65 రకాల మందులను సమకూర్చడంతోపాటు 57 రకాల బేసిక్ మెడికిల్ ఎక్విప్మెంట్లను అందుబాటులో ఉంచుతారు. విలేజ్ క్లినిక్స్‌ను పీహెచ్‌సీలు, ల్యాబ్స్‌తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానించడంతోపాటు టెలిమెడిసిన్ సదుపాయాలను కల్పించారు. మండలానికి రెండు పీహెచ్‌లను అందుబాటులోకి తేవడమే కాకుండా ఒక్కో పీహెచ్సీలో ఇద్దరు చొప్పున డాక్టర్లు సేవలందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.