సాక్షి, కరీంనగర్: ఉద్యోగ నియామకాలపై తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని బీజేపీ ఎమ్మెలే ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఈయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో 3,00,178 మంది ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారని, లక్షకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అన్నారు. నోటిఫికేషన్లు లేక ఉద్యోగాలు లేక పెళ్లిళ్లు కాకపోవడంతో యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో 1,32,299 ఉద్యోగాలు ఇచ్చినట్లు కేటీఆర్ ప్రకటించారని, టీఎస్‌పీఎస్‌సీ ద్వారా 31 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని మండిపడ్డారు.
టీఎస్‌ఆర్టీసీలో 4768 మందిని రిక్రూట్ చేశామని చెప్పారని, ఒక్క డ్రైవర్, కండక్టర్‌ని కూడా ఫిలప్ చేయలేదన్నారు. ఒక్క గ్రూప్ వన్ పరీక్ష కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించలేదని ధ్వజమెత్తారు. గెస్ట్ ఫ్యాకల్టీ పేరుతో గురుకులాల్లో బోధన చేయిస్తున్నారని, శ్రమ దోపిడీ ప్రభుత్వమే చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రజలు కేసీఆర్ మోసలని నమ్మె పరిస్థితి లేదని, ప్రతిపక్ష పార్టీలను సీఎం కేసీఆర్ ఏనాడు పరిగణలోకి తీసుకోలేదు విమర్శించారు. జిల్లాలు, డివిజన్లు, మండలాలు పెంచారని, సిబ్బందిని మాత్రం ఆ స్థాయిలో పెంచలేదన్నారు. తెలంగాణ ప్రజా ఆగ్రహం డైవర్ట్ చేయడానికే కేసీఆర్ పర్యటనలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీల కూటమి ముందట పడదని అన్నారు. మేడారం జాతరకు గవర్నర్ వెళ్తే.. కనీసం రిసీవ్ చేసుకోలేదని, ఇది తెలంగాణ ప్రభుత్వ సంస్కారమని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment