బజారుభాషతో రేవంత్‌ పైశాచిక ఆనందం | KTR Fires On Congress Govt After Announcement Fake Job Calendar In Assembly | Sakshi
Sakshi News home page

బజారుభాషతో రేవంత్‌ పైశాచిక ఆనందం

Published Sat, Aug 3 2024 2:08 AM | Last Updated on Sat, Aug 3 2024 2:08 AM

KTR Fires On Congress Govt After Announcement Fake Job Calendar In Assembly

ముఖ్యమంత్రి మగాడైతే సిటీ సెంట్రల్‌ లైబ్రరీకి రావాలి 

కాంగ్రెస్‌ నేతలను నిరుద్యోగులు తన్ని తరుముతారు 

ఒక్క ఉద్యోగం ఇచ్చినా మేమంతా రాజీనామా చేస్తాం 

గన్‌పార్క్‌ వద్ద బీఆర్‌ఎస్‌ ఆందోళనలో ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌  

సాక్షి, హైదరాబాద్‌: జాబ్‌ కేలండర్‌పై చర్చించాలని అడిగిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పార్టీ మారినవారితో బజారుభాషలో తిట్టిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నాడని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాడిస్ట్‌ సీఎం రేవంత్‌ అందరినీ ఉసిగొల్పుతూ దిగజారుడు..దివాలాకోరుతనంతో వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. శాసనసభలో ఇది చీకటిరోజు అని, అధికార పక్షం బజారుభాష వినలేక సభ నుంచి బయటకు వచ్చేశామన్నారు. బోగస్‌ జాబ్‌ కేలండర్‌ పేరిట మోసగిస్తున్న కాంగ్రెస్‌ నాయకులను యువత ఎక్కడికక్కడ నిలదీసి కొట్టాలన్నారు.

గన్‌పార్కు అమరుల స్తూపం వద్ద కేటీఆర్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందుకు హైదరాబాద్‌ అశోక్‌నగర్‌కు వచి్చన రాహుల్‌గాంధీ అధికారంలోకి వచ్చిన తొలిఏడాదే 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని డ్రామా చేశారన్నారు. దమ్ముంటే రాహుల్‌గాంధీ, రేవంత్‌ అశోక్‌నగర్‌కు వచ్చి ఒక్క ఉద్యోగం ఇచి్చనట్టు రుజువు చేసినా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలందరమూ రాజీనామా చేస్తామని చెప్పారు. 

రేవంత్‌ మగాడైతే సిటీ సెంట్రల్‌ లైబ్రరీకి రావాలంటూ సవాల్‌ చేశారు. మార్పు పేరిట నిరుద్యోగులను మభ్య పెట్టిన రేవంత్‌ను తన్ని తరమడం ఖాయమని కేటీఆర్‌ హెచ్చరించారు. జాబ్‌ కేలండర్‌పై అసెంబ్లీలో చర్చించకుండా ప్రభుత్వం పారిపోయినందునే గన్‌పార్క్‌ వద్ద నిరసన తెలుపుతున్నామన్నారు.  

శాసనసభ చరిత్రలో బ్లాక్‌ డే: హరీశ్‌రావు 
అసెంబ్లీ చరిత్రలో ఇది బ్లాక్‌ డే అని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఇందిరమ్మ రాజ్యంతో మహిళా ఎమ్మెల్యేలను అవమానించేలా సభా నాయకుడే తిట్టిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్‌ రౌడీïÙటర్‌ భాషతో కన్నతల్లులను అవమానించేలా మాట్లాడుతున్నాడని, ఉద్యమ సమయంలోనూ ఇలాగే మాట్లాడాడని చెప్పారు. 

హైదరాబాద్‌ ఏమైనా ఆయన జాగీరా అని ప్రశి్నస్తూ, దానం నాగేందర్‌ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ జాబ్‌ కేలండర్‌పై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం చేసిన ప్రకటన చిత్తు కాగితంలా ఉందన్నారు. అశోక్‌నగర్‌కు సమయం, తేదీ చెబితే..తామూ వస్తామని, కాంగ్రెస్‌ బెదిరింపులకు భయపడేది లేదని హరీశ్‌రావు స్పష్టం చేశారు. 

సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడిన దానం నాగేందర్‌పై స్పీకర్‌ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి డిమాండ్‌ చేశారు. అసెంబ్లీలో అసభ్యకరంగా మాట్లాడిన దానం నాగేందర్‌ రాజీనామా చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్‌ చేశారు. పోస్టులు పెంచాలని అడుగుతున్న నిరుద్యోగులపై లాఠీచార్జ్‌ చేస్తూ కేసులు పెడుతున్నారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ఎమ్మెల్యే దానం వ్యాఖ్యలతో... 
జాబ్‌ కేలండర్‌పై చర్చించాలంటూ స్పీకర్‌ పోడియం వద్ద నిరసన తెలుపుతున్న తమ పార్టీ ఎమ్మెల్యేలపై ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ మండిపడింది. అయితే దానం వ్యాఖ్యలపై స్పీకర్‌ స్పందించక పోవడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సమావేశ మందిరం నుంచి మూకుమ్మడిగా బయటకు వచ్చారు. లాబీలోని బీఆర్‌ఎస్‌ ఎల్పీ కార్యాలయంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆధ్వర్యంలో భేటీ అయ్యారు.

నిరుద్యోగులకు కాంగ్రెస్‌ ఇచి్చన హామీని ఉల్లంఘిస్తున్న తీరును ఎండగట్టాలని నిర్ణయించారు. దీంతో కేటీఆర్‌ నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేసుకుంటూ గన్‌పార్కుకు చేరుకున్నారు. బీఆర్‌ఎస్‌ ఆందోళన నేపథ్యంలో గన్‌పార్కు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. గన్‌పార్కు నుంచి వెళ్లాలని పోలీసులు కోరినా బీఆర్‌ఎస్‌ నేతలు నిరాకరించడంతో కేటీఆర్, హరీశ్‌రావు సహా ఆందోళన చేస్తున్న నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వారిని తెలంగాణ భవన్‌కు నేతలను తరలించే క్రమంలో గన్‌పార్కు వద్ద ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ భవన్‌కు చేరుకున్న బీఆర్‌ఎస్‌ నేతలను పలువురు నిరుద్యోగులు కలిసి ఉద్యోగాల భర్తీ జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement