notifications release
-
బజారుభాషతో రేవంత్ పైశాచిక ఆనందం
సాక్షి, హైదరాబాద్: జాబ్ కేలండర్పై చర్చించాలని అడిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీ మారినవారితో బజారుభాషలో తిట్టిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాడిస్ట్ సీఎం రేవంత్ అందరినీ ఉసిగొల్పుతూ దిగజారుడు..దివాలాకోరుతనంతో వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. శాసనసభలో ఇది చీకటిరోజు అని, అధికార పక్షం బజారుభాష వినలేక సభ నుంచి బయటకు వచ్చేశామన్నారు. బోగస్ జాబ్ కేలండర్ పేరిట మోసగిస్తున్న కాంగ్రెస్ నాయకులను యువత ఎక్కడికక్కడ నిలదీసి కొట్టాలన్నారు.గన్‌పార్కు అమరుల స్తూపం వద్ద కేటీఆర్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందుకు హైదరాబాద్ అశోక్‌నగర్‌కు వచి్చన రాహుల్‌గాంధీ అధికారంలోకి వచ్చిన తొలిఏడాదే 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని డ్రామా చేశారన్నారు. దమ్ముంటే రాహుల్‌గాంధీ, రేవంత్ అశోక్‌నగర్‌కు వచ్చి ఒక్క ఉద్యోగం ఇచి్చనట్టు రుజువు చేసినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరమూ రాజీనామా చేస్తామని చెప్పారు. రేవంత్ మగాడైతే సిటీ సెంట్రల్ లైబ్రరీకి రావాలంటూ సవాల్ చేశారు. మార్పు పేరిట నిరుద్యోగులను మభ్య పెట్టిన రేవంత్‌ను తన్ని తరమడం ఖాయమని కేటీఆర్ హెచ్చరించారు. జాబ్ కేలండర్పై అసెంబ్లీలో చర్చించకుండా ప్రభుత్వం పారిపోయినందునే గన్‌పార్క్ వద్ద నిరసన తెలుపుతున్నామన్నారు. శాసనసభ చరిత్రలో బ్లాక్ డే: హరీశ్‌రావు అసెంబ్లీ చరిత్రలో ఇది బ్లాక్ డే అని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఇందిరమ్మ రాజ్యంతో మహిళా ఎమ్మెల్యేలను అవమానించేలా సభా నాయకుడే తిట్టిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ రౌడీïÙటర్ భాషతో కన్నతల్లులను అవమానించేలా మాట్లాడుతున్నాడని, ఉద్యమ సమయంలోనూ ఇలాగే మాట్లాడాడని చెప్పారు. హైదరాబాద్ ఏమైనా ఆయన జాగీరా అని ప్రశి్నస్తూ, దానం నాగేందర్ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ జాబ్ కేలండర్పై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం చేసిన ప్రకటన చిత్తు కాగితంలా ఉందన్నారు. అశోక్‌నగర్‌కు సమయం, తేదీ చెబితే..తామూ వస్తామని, కాంగ్రెస్ బెదిరింపులకు భయపడేది లేదని హరీశ్‌రావు స్పష్టం చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడిన దానం నాగేందర్‌పై స్పీకర్ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీలో అసభ్యకరంగా మాట్లాడిన దానం నాగేందర్ రాజీనామా చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్ చేశారు. పోస్టులు పెంచాలని అడుగుతున్న నిరుద్యోగులపై లాఠీచార్జ్ చేస్తూ కేసులు పెడుతున్నారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దానం వ్యాఖ్యలతో... జాబ్ కేలండర్పై చర్చించాలంటూ స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలుపుతున్న తమ పార్టీ ఎమ్మెల్యేలపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మండిపడింది. అయితే దానం వ్యాఖ్యలపై స్పీకర్ స్పందించక పోవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశ మందిరం నుంచి మూకుమ్మడిగా బయటకు వచ్చారు. లాబీలోని బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో భేటీ అయ్యారు.నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచి్చన హామీని ఉల్లంఘిస్తున్న తీరును ఎండగట్టాలని నిర్ణయించారు. దీంతో కేటీఆర్ నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేసుకుంటూ గన్‌పార్కుకు చేరుకున్నారు. బీఆర్ఎస్ ఆందోళన నేపథ్యంలో గన్‌పార్కు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. గన్‌పార్కు నుంచి వెళ్లాలని పోలీసులు కోరినా బీఆర్ఎస్ నేతలు నిరాకరించడంతో కేటీఆర్, హరీశ్‌రావు సహా ఆందోళన చేస్తున్న నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వారిని తెలంగాణ భవన్‌కు నేతలను తరలించే క్రమంలో గన్‌పార్కు వద్ద ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ భవన్‌కు చేరుకున్న బీఆర్ఎస్ నేతలను పలువురు నిరుద్యోగులు కలిసి ఉద్యోగాల భర్తీ జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. -
‘స్థానిక’ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
అనంతపురం అర్బన్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం మంగళవారం విడుదల చేశారు. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 28 వరకు స్వీకరిస్తారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు దాఖలు చేయొచ్చు. మార్చి ఒకటిన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు మూడో తేదీ ఆఖరి గడువు. పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులు బీ ఫారం ఈ నెల 28వ తేదీ మూడు గంటల్లోగా చీఫ్ ఎలక్ట్రోరల్ అధికారి, రిటర్నింగ్ అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా పరిగణిస్తారు. అభ్యర్థి గానీ, వారి తరఫు పది మంది ప్రతిపాదకుల్లో ఒకరు గానీ నామినేషన్ దాఖలు చేయొచ్చు. ప్రతిపాదకులు స్థానిక సంస్థల ఓటర్ల జాబితాలో నమోదై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.5 వేలు, ఇతరులకు రూ.10 వేలు డిపాజిట్‌గా నిర్ణయించారు. అభ్యర్థి ఎలక్ట్రోరల్ జాబితా సర్టిఫైడ్ కాపీని సమర్పించాల్సి ఉంటుంది. కాగా.. తొలి రోజున ఒక నామినేషన్ కూడా దాఖలు కాలేదు. -
సీఎం చంద్రబాబు హామీలు అమలుచేయాలి
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఐక్యవేదిక డిమాండ్ గాంధీనగర్ : రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరుతూ ఏపీ నిరుద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్లో సోమవారం ధర్నా జరిగింది. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా నిరుద్యోగులు నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు లగుడు గోవిందరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి ఇస్తామని నమ్మబలికి, ఓట్లు వేయించుకుని నిరుద్యోగులకు మొండి చేయిచూపారని విమర్శించారు. ఏడాది కాలంలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో 1.38 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీకి నోచుకోవడం లేదన్నారు. నోటిఫికేషన్లు విడుదల కాక, వయోపరిమితి ముగుస్తుండటంతో నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని వివరించారు. తక్షణమే నిరుద్యోగ భృతి అందజేయాలని, ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రత్యక్ష ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మంత్రుల ఇళ్లు ముట్టడి కార్యక్రమం చేపట్టాలని నిర్ణయిం చినట్లు చెప్పారు. అనంతరం ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవనీతం సాంబశివరావు, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఆకారపు రవిచంద్ర మాట్లాడుతూ నోటిఫికేషన్లు జారీ చేయకుండా నిరుద్యోగుల వయోపరిమితి పెంచి ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. కొన్నేళ్లుగా నియామకాలు నిలిచిపోయాయన్నారు. ఎందరో నిరుద్యోగులు అర్హత ఉన్నా నోటిఫికేషన్లు రాకపోవడంతో వయోపరిమితి మించిపోయి దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి తానిచ్చిన హామీలను తక్షణమే అమలు చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొన్నారు. -
కదంతొక్కిన నిరుద్యోగులు
నాంపల్లి: తెలంగాణలో నిరుద్యోగుల అవస్థలు గమనించి వెంటనే ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు మానవతారాయ్ డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు సోమవారం నాంపల్లి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం ప్రధాన గేటును దాటుకుని లోనికి దూసుకెళ్లారు. చైర్మన్ కార్యాలయంలోనికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. నిరుద్యోగులు కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మానవతారాయ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిధులు, నీళ్లు, నియామకాలు అనే నినాదంతో జరిగిందన్నారు. కానీ ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయకుండా కాలయాపన చేస్తోందన్నారు. మన పక్కన ఉన్న ఏపీలో ఇప్పటికే డీఎస్సీని విడుదల చేసిందని గుర్తు చేశారు. తెలంగాణలో ఎంతో మంది నిరుద్యోగులు వయసు మీద పడి అవకాశాలను అందుకోలే తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని చెప్పారు. అలాగే కాంట్రాక్టు విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని కోరారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నెలరోజుల్లోగా అన్ని ఉద్యోగాలకూ ప్రకటనలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెంగాణ నిరుద్యోగ జేఏసీ నాయకులు జె.కళ్యాణ్, భీమ్రావ్ నాయక్, డోలంకి శ్రీనివాస్, శ్రీకాంత్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులపై కేసులు తగదు అఫ్జల్‌గంజ్: విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జీ, నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయడాన్ని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి జె.నిరంజన్ సోమవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడం మాని... శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జి చేయించడం.. నాన్‌బెయిల్‌బుల్ కేసులు బనాయించడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. సోమవారం విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠి చార్జి చేయడం, వరంగల్ ముఖ్యమంత్రికి సమస్యలను వివరించడానికి వెళ్లిన 12 మంది విద్యార్థులపై నాన్‌బెయిల్‌బుల్ కేసులు బనాయించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలు కొనసాగిస్తున్న ప్రభుత్వంపై ఉద్యమాలకు సిద్ధమవుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసి విద్యార్థి లోకానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.