ఓలా నుంచి 2వేల కొత్త ఉద్యోగాలు  | OLA Company Prepared To Give 2000 Jobs In next Six Months | Sakshi
Sakshi News home page

ఓలా నుంచి 2వేల కొత్త ఉద్యోగాలు 

Published Wed, Aug 26 2020 7:42 AM | Last Updated on Sun, Jul 18 2021 4:17 PM

OLA Company Prepared To Give 2000 Jobs In next Six Months  - Sakshi

న్యూఢిల్లీ : ఓలా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ వచ్చే ఆరు నెలల్లో  ప్రపంచవ్యాప్తంగా 2వేల కొత్త ఉద్యోగాల నియామకానికి సిద్ధమైంది. అలాగే కంపెనీ రూపొందించే ఎలక్ట్రిక్‌ టూ–వీలర్‌ మోడల్‌ను తర్వలో మార్కెట్‌కు పరిచయం చేస్తామని ఓలా సహ వ్యవస్థాపకుడు భవీశ్‌ అగర్వాల్‌ తెలిపారు. కరోనా నేపథ్యంలో ఓలా కంపెనీ ఈ మేనెలలో రైడ్స్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఫుడ్‌ వ్యాపారాలకు చెందిన 1400 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలి కింది. అదే మే నెలలో తన అనుబంధ సంస్థ ఓలా ఎలక్ట్రానిక్స్‌... అమ్‌స్టర్‌డామ్‌ ఆధారిత ఎటోర్గో బీవీని కొనుగోలు చేసింది. ‘‘బ్యాటరీ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌ రంగాలకు చెందిన 2000 మంది ఇంజనీర్ల నియామక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. తొలి ఎలక్ట్రానిక్‌ టూ–వీలర్‌ను లాంచ్‌ చేసేందుకు  నిరంతర కృషి చేస్తున్నారు’’అని అగర్వాల్‌ తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement